నాటు తుపాకీతో యువకుడు హల్‌చల్‌! | Incident Involving Youth Creating Stir With Country Made Gun In Hyderabad Saroornagar | Sakshi
Sakshi News home page

నాటు తుపాకీతో యువకుడు హల్‌చల్‌!

Jul 28 2026 8:13 AM | Updated on Jul 28 2026 8:13 AM

Incident Involving Youth Creating Stir With Country Made Gun In Hyderabad Saroornagar

నిందితుడు ఇమ్రాన్‌, నాటు తుపాకీ

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ పరిధి భగత్‌సింగ్‌నగర్‌ బస్తీలో కంట్రీమేడ్‌ తుపాకీతో హల్‌చల్‌ చేస్తున్న ఇమ్రాన్‌ అలియాస్‌ ఇబ్బు అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్‌ఓటీ, సరూర్‌నగర్‌ పోలీసులు దాడి చేయగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్‌ వద్ద నాటు తుపాకీ, ఒక లైవ్‌ రౌండ్‌ లభించాయి.

అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇతడి స్వస్థలం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం జంపాక గ్రామం అని తేలింది. నగరానికి వచ్చి చెడు అలవాట్లకు బానిసై నేరాల బాటపట్టాడని తెలిసింది. రాజేంద్రనగర్‌లోని ఓ స్క్రాప్‌ దుకాణంలో పని చేసిన సమయంలో బిహార్‌కు చెందిన షకీర్‌ వద్ద కంట్రీమేడ్‌ తుపాకి, ఒక లైవ్‌రౌండ్‌ రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇమ్రాన్‌పై ఇప్పటికే పలు పోలీస్‌ స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement