హైదరాబాద్: హాయ్.. నా పేరు డా.సూరి శ్రీమతి. నా వయసు 92 ఏళ్లు. నేను ఓటేసేందుకు ఆసక్తిగా ఉంటాను. అందుకే ఈ వయసులోనూ ఎన్యూమరేషన్ ఫారం నింపి అందజేశాను. అందరూ నాలాగే ‘సర్’లో పాల్గొనండి. ఓటు మీ హక్కుగా గుర్తించండి’ అంటూ సందేశమిచ్చారు సీనియర్ గైనకాలజిస్ట్ సూరి శ్రీమతి. ఆమె సోమవారం సీతాఫల్‌మండిలోని తన నివాసంలో ఎన్యూమరేషన్ ఫారం నింపి 141వ బూత్ బీఎల్‌ఓ లీలావతి, బీఎల్‌ఏ నాగమణికి అందచేశారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నందుకు ఆనందంగా ఉందని, అందరూ ఓటును పరిరక్షించుకోండని చెప్పారు.


