పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌ | Choutuppal Swamiji Murder Incident | Sakshi
Sakshi News home page

పూజారి దారుణ హత్య!.. 130 తులాల బంగారంతో పరార్‌

Nov 2 2026 8:37 AM | Updated on Nov 2 2026 9:03 AM

Choutuppal Swamiji Murder Incident

యాదాద్రి భువనగిరి జిల్లా: శిష్యులుగా నమ్మించి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఓ పూజారిని దారుణంగా హత్య చేశారు. అనంతరం బంగారం, వెండి ఆభరణాలు, నగదు, కారుతో ఉడాయించారు. అయితే కారులో ఉన్న జీపీఆర్‌ఎస్‌ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులకు పట్టుబడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 

భూదాన్‌పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన రాళ్లబండి సుధాకర్‌స్వామి (50) కొన్నేళ్ల క్రితం చౌటుప్పల్‌కు వచ్చి బీసీ కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. గ్రామ దేవతల పండుగలు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. పూజలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకునేందుకు తన అక్క కుమారుడైన సురేశ్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. 

కామాఖ్య దేవాలయం వద్ద పరిచయం.. 
సుధాకర్‌స్వామి తరచూ అస్సాంలోని కామాఖ్య దేవాలయానికి వెళ్తుండేవాడు. అక్కడ అతడికి ఒడిశా రాష్ట్రానికి చెందిన పవన్‌ పరిచయమయ్యాడు. పవన్‌ను నమ్మిన సుధాకర్‌స్వామి తన వ్యక్తిగత విషయాలు పవన్‌తో పంచుకున్నాడు. శనివారం సాయంత్రం తర్వాత సుధాకర్‌స్వామి ఇంటికి పవన్‌తో పాటు అతడి మిత్రుడు హర్‌  వచ్చారు. రాత్రికి సుధాకర్‌స్వామి మేనల్లుడు సురేశ్, అతడి భార్య, అందరూ కలిసి భోజనం చేశారు.

ఆ తర్వాత సురేశ్‌ భార్యతో కలిసి వారుంటున్న ఇంటి ముందున్న మరో ఇంట్లోకి వెళ్లారు. అర్ధరాత్రి సురేశ్‌కు మెలకువరాగా, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా అప్పటికే సుధాకర్‌స్వామి హత్యకు గురై మంచంపై పడి ఉన్నాడు. నిందితులు 130 తులాల బంగారు, 250 తులాల వెండి ఆభరణాలు, రూ.9 లక్షల నగదు తీసుకుని సుధాకర్‌స్వామికి చెందిన కారులోనే పరారయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్, డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐ సతీశ్‌రెడ్డి, ఎస్‌ఐ యాదగిరి ఘటనా స్థలాన్ని సందర్శించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement