లా విద్యార్థిని ఆత్మహత్య | Law Student Chandrakala Ends Life | Sakshi
Sakshi News home page

లా విద్యార్థిని ఆత్మహత్య

Nov 2 2026 8:44 AM | Updated on Nov 2 2026 9:07 AM

Law Student Chandrakala Ends Life

కరీంనగర్‌ సిటీ/ షాద్‌నగర్‌: ఉత్తమ భవిష్యత్‌ లక్ష్యంతో.. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థిని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో కలకలం రేపింది. షాద్‌నగర్‌లోని ఫరూక్‌నగర్‌కు చెందిన డాకూరి చంద్రకళ(30) ఎస్‌యూ వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం చదువుతూ, వర్సిటీ వసతిగృహంలోనే ఉంటోంది. కొద్ది రోజల క్రితం దసరా సెలవులకు ఇంటికి వెళ్లివచి్చన ఆమె రెండు రోజులుగా ఎక్కువ సేపు ఫోన్‌ మాట్లాడుతూ, ముభావంగా ఉంటోందని స్నేహితులు తెలిపారు. 

ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు స్నేహితులు వెళ్లి లంచ్‌కు పిలిచారు. తనకు తలనొప్పిగా ఉందని, విశ్రాంతి తీసుకుంటానని చెప్పడంతో వెళ్లిపోయిన వారు తిరిగి 3.30గంటల రూమ్‌కు రాగా, లోపలి వైపు గడియపెట్టి ఉండడంతో పలుమార్లు పిలిచారు. స్పందన లేకపోవడంతో కిటికిలోంచి చూడగా చంద్రకళ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. సెక్యూరిటీ సహాయంతో తలుపులు తీసి వర్సిటీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్‌ మృతురాలి వివరాలు సేకరించారు. 

ఎంతో ఇష్టంతో ఎల్‌ఎల్‌బీకి.. 
షాద్‌నగర్‌కు చెందిన చంద్రకళ మూడేళ్ల కోర్సులో భాగంగా 2025లో శాతవాహన వర్సిటీలో ఎల్‌ఎల్‌బీలో చేరారు. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఎంతో ఇష్టంతో ఎల్‌ఎల్‌బీలో చేరినట్లు తన సేహ్నితుల వద్ద తరచూ ప్రస్తావించేదని తెలిపారు. ఆమె ఎనిమిదేళ్ల వయస్సులో తన ఇంటి సమీపంలో జరిగిన ఓ నేరానికి సంబంధించి పోలీసుల విచారణ చూసిన ఆమె ఎప్పటికైనా లాయర్‌ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పేదని సన్నిహితులు తెలిపారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి, పేద ప్రజలకు సేవ చేస్తానని చెప్పిందని వాపోయారు. వర్సిటీ పోటీల్లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేదని, తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎన్‌సీసీ క్యాంప్‌ ఎంపిక కోసం కూడా ప్రయత్నించిందని తెలిసింది. అప్పటివరకూ తమతో ఎంతో సరదాగా ఉన్న చంద్రకళ ఆత్మహత్య చేసుకోవడంతో వసతిగృహం నిశ్శబ్దంగా మారింది 

తల్లిదండ్రుల ఆశలు ఆవిరి 
పట్టణానికి చెందిన డాకూరి చిన్నయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఏకైక కుమార్తె చంద్రకళ. వీరిది నిరుపేద కుటుంబం. ప్రస్తుతం పట్టణంలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నివాసం ఉంటున్నారు. చిన్ననాటి నుంచి చంద్రకళ చదువుల్లో ఎంతో చురుగ్గా ఉండేది. ఆమె విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే సాగింది. లాయర్‌ లేదా కానిస్టేబుల్‌ కావాలనే కోరికతో చంద్రకళ పరీక్షలు కూడా రాసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిత్యం తమ బాగోగుల గురించి ఆరా తీసే కూతురు విగత జీవిగా మారడాన్ని బాధిత తల్లిదండ్రులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. విద్యారి్థని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement