breaking news
Election Commission of India
-
స్థానిక ఎన్నికలు.. ఈసీకి వైఎస్సార్సీపీ 3 కీలక లేఖలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్ధులకు తగినంత భద్రత ఇవ్వాలని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అలాగే వీటి కాపీల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.కేంద్ర సాయుధ పోలీసు బలగాలను తగిన సంఖ్యలో మోహరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర బలగాల మోహరింపు ఎన్నికల సంఘం సమర్థవంతమైన పర్యవేక్షణలో జరగాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల భద్రత బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే నిష్పక్షపాత వాతావరణం ఉంటుందన్న నమ్మకం తమకు లేదన్నారు. కూటమి పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు, రాజకీయ కార్యకలాపాలకు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని లేఖలో వెల్లడించారు.ఈ పరిస్థితులు ఎన్నికల సమయంలో మరింత తీవ్రమై, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ప్రచారాన్ని నిరోధించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క పోలింగ్ రోజు మాత్రమే భద్రత కల్పించడం సరిపోదని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే కేంద్ర బలగాలను మోహరించి, ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ప్రతిపాదకులు, మద్దతుదారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాలు, వార్డుల వంటి సన్నిహిత సమాజాల్లో బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిపక్ష అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు తమ చట్టబద్ధమైన ఎన్నికల బాధ్యతలను నిర్వహించకుండా పోలీసు అధికారాలను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల్లో ఎవరు పాల్గొనాలి, ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలను అధికార పార్టీ ప్రభావం లేదా ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం నిర్ణయించకూడదని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి దృశ్యాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి కోరారు.సున్నితమైన ప్రాంతాల్లో స్వతంత్ర పరిశీలకులు, మొబైల్ పర్యవేక్షణ బృందాలను నియమించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వివక్ష లేకుండా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యర్థులు భయం, బెదిరింపులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ సదుపాయం కల్పించాలని కోరారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ, సంబంధిత అధికారులకు పత్రాల బదిలీ ప్రక్రియలో స్పష్టమైన విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ -
దేశ వ్యాప్తంగా పెను సంచలనం!
తీగ లాగితే డొంక కదిలిందన్నది సామెత. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకం అలాగే ఉంది. ఇంతకాలం ఏ రాష్ట్రం నుంచి ఎన్నికలలో అవకతవకాలు జరిగాయని , ఓటర్ల నమోదు, తొలగింపు తదితర అంశాలలో అక్రమాలు జరిగాయని ఎవరు ఆరోపణలు చేసినా, ఎన్నికల సంఘం ఏమీ జరగలేదన్నట్లు ఎన్నికల సంఘం నటించిందనిపిస్తుంది. అయితే ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ఎన్నికల సంఘం ప్రత్యేకించి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మూలాలను కదిలించిందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఇది పెను సంచలనం అయింది. దేశంలో ఈవీఎంల పైనే అనేక అనుమానాలు వస్తుంటే, ఇప్పుడు ఏకంగా ఓట్ల నమోదు, తొలగింపులలో వచ్చిన ఆరోపణలు దేశ ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు కలిగిస్తున్నాయి.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, సమాజవాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరుల నేతృత్వంలో వివక్ష ఎంపీలు ఎన్నికల సంఘం వద్ద చేసిన ధర్నా ఒకరకంగా చారిత్రాత్మకమైనదని చెప్పాలి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా ఆందోళన చేసిన సందర్భం ఇదేనేమో! అలాగే బీజేపీ ఈ స్థాయిలో ఆత్మరక్షణలో పడడం కూడా ఇదే మొదటిసారి కావచ్చు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అయితే 2024 లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సాధారణ ఎన్నికలతో పాటు జరిగి ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిని విస్తుపరిచాయి. ఏదో మోసం జరిగిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అప్పుడే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ మోసం ఏమిటో బహిర్గతం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. 2024 ఎన్నికల తర్వాత జరిగిన మహారాష్ట్ర, హరియాణా, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కూడా మోసాలు జరిగాయంటూ విపక్షం ఆరోపణలు చేస్తోంది. రాహుల్ గాంధీ ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ఆధారాలతో ఆరోపణలు చేశారు. అయినా ఈసీ, బీజేపీ కొట్టిపారేస్తూ వచ్చాయి.సర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చేపట్టిన వైనం, కోట్ల మంది ఓట్లను తొలగిస్తున్న పద్దతి తీవ్ర అలజడి రేపింది. మహారాష్ట్రలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు లక్షల ఓట్లు కొత్తగా చేరడం ఏమిటి? పశ్చిమబెంగాల్లో లక్షల ఓట్లు పోవడం ఏమిటి? వాటిలో 27 లక్షల ఓట్లు నిజమైనవా, కాదా? అన్నది నిర్దారించకుండా ఎన్నికలు జరిపేయడం ఏమిటి? దీనిపై సుప్రీంకోర్టు కూడా తగు రీతిలో స్పందించలేదన్న భావన న్యాయవాద వర్గాలలో ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జి ఉజ్వల్ బుయాన్ ఓట్ల గల్లంతు అంశంపై మాట్లాడుతూ దేశంలో ఓట్లు కలిగినవారు. ఓట్లు లేనివారు అని రెండు రకాల పౌరులు ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు.సుప్రీంకోర్టులో కేసు ఉండగా బుయాన్ ఇలా మాట్లాడడంపై మరో మాజీ చీఫ్ జస్టిస్ గవాయ్ అభ్యంతరం తెలిపారు. చిత్రమేమంటే హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలంలో చెట్లు కొడుతుంటే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన గవాయ్ ఇన్ని కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన అంశంలో మాత్రం విభిన్నంగా మాట్లాడడం చిత్రం అనిపిస్తుంది. ఓటర్ల జాబితా రివిజన్ అధికారం ఢిల్లీలోని కార్యాలయంలో పెట్టుకోవడం ఏమిటి? ఫారం 6లో మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని ఈసీ తెలిపితే, తమ అంగీకారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసలు ఈ మార్పులు పార్లమెంటు చట్టం ప్రకారం జరగవలసి ఉండడగా, జ్ఞానేష్ కుమార్ తనే ఎందుకు స్వతంత్రంగా నిర్ణయం చేశారు. సీఈసీ ఎంపికలో సీజేఐని తప్పించి, కేంద్ర మంత్రిని పెట్టడం.. ఆయనకు జీవితాంతం కేసులు రాకుండా రక్షణ కల్పించడం వంటివి అనేక సందేహాలకు తావిచ్చాయి.ఓటు హక్కును రక్షించాల్సిందేస్థూలంగా చెప్పాలంటే రెండు అంశాలను గమనించాలి. కొన్ని రాష్ట్రాలలో బోగస్ ఓట్లు, మరికొన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఒరిజినల్ ఓట్ల తొలగింపు వంటి ప్రక్రియ జరిగినట్లు ఆరోపణలన్నమాట. దేశంలో దొంగ ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నమాట నిజమే. వాటిని నిరోధించవలసిందే. అదే టైంలో పౌరుల ఓటు హక్కును పరిరక్షించవలసిన బాధ్యత ఈసీపై ఉంటుంది. ఉదాహరణకు ఏపీలో కుప్పం వంటి కొన్ని సరిహద్దు నియోజకవర్గాలలో పొరుగు రాష్ట్రాలకు చెందినవారిని వేలమందిని ఓటర్లుగా చేర్పిస్తుంటారట. అలాగే హైదరాబాద్‌లో నివసించే లక్షల మందికి ఏపీలోను, తెలంగాణ జిల్లాలలోను ఓట్లు ఉన్నాయి. రాజకీయ పార్టీలు తద్వారా దొంగ ఓట్లు వేయించుకుంటుంటాయన్నమాట. వాటిని ఈసీ ఎంతవరకు నియంత్రించిందన్నది చర్చనీయాంశం.అసలు సర్ ప్రక్రియకుగాను ఈసీ తయారు చేసిన దరఖాస్తులో ఎప్పుడో 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లు ఉండాలని చెప్పడం, తండ్రి, తాత వంటివారి ఆరాలు తీయడం తదితర అంశాలన్ని ప్రజలకు విసుగు తెప్పించాయి. అయినా ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టు రితిక చోప్రా ఈసీలో దీనిపై వ్యక్తం అయిన బేదాభిప్రాయాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆమె లాగిన తీగతో డొంక కదిలినట్లయింది. దీంతోనే వివిధ అంశాలతో పాటు జ్ఞానేష్ కుమార్ కెరీర్ లో పలు వివాదాస్పద ఘట్టాలు, ఆరోపణలు అన్ని బయటపడుతున్నాయి. కేరళం రాష్ట్రం అయితే ఈయనకు సంబంధించిన 2006 కేసును విజిలెన్స్ విచారణకు అప్పగించింది.జవాబు లేని ప్రశ్నలు!ఏపీలో 2024లో జరిగిన లోక్ సభ, శాసనసభ ఎన్నికల తీరు కూడా ఒక కేస్ స్డడీ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రముఖ మేధావులు పరకాల ప్రభాకర్, ఉండవల్లి అరుణకుమార్ తదితరులు ఏపీ ఎన్నికలలో ఏభై లక్షల ఓట్లు అదనంగా ఎక్కడ నుంచి లెక్కించారని వేస్తున్న ప్రశ్నకు ఎన్నికల సంఘం జవాబు ఇవ్వలేకపోయింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏభై లక్షల మంది సుమారు 3500 పోలింగ్ బూత్‌లలో తెల్లవారుజాము రెండు గంటలవరకు నిలబడి ఓట్లు వేసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం అందుకు సాక్షాధారాలు చూపడంలో విఫలం అయిందన్న అభిప్రాయం కలిగింది. ఎందుకంటే అదేదో బ్రహ్మరహస్యం అన్నటు సీసీ టీవీ ఫుటేజీని ఈసీ దాచేసుకోవడమే సంశయాత్మకంగా ఉంది. అంటే ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ప్రజలకు ఈసీ చెప్పలేకపోయిందన్నమాట.ఇదీ చదవండి: కలరింగ్ ఇస్తే సరిపోతుందా?ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన వివిపాట్ స్లిప్ లను ఈవీఎంలతో పోల్చి లెక్కవేయాలని కొందరు అభ్యర్దులు కోరినా, తమకు కొన్ని బూత్‌లలో వచ్చిన ఓట్లను ఈవిఎంను ఓపెన్ చేసి చూపాలని అడిగినా, అందుకు అవసరమైన ఫీజ్ కట్టినా ఎన్నికల అధికారులు ఎందుకు తోసిపుచ్చారు? అంతకాడికి వివి పాట్ స్లిప్‌ల మిషన్ల కోసం కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? నలభై ఐదు రోజులపాటు జాగ్రత్తపరచవలసిన ఈ స్లిప్‌లను పది రోజులలోనే దగ్దం చేయాలని ఆనాటి ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ఎందుకు ఉత్తర్వులు ఇచ్చి హడావుడిగా తగులపెట్టించారన్న ప్రశ్నకు ఇప్పటికీ, ఆయన నోరు తెరిచిన దాఖలా కనిపించలేదు. పైగా ఆయనకు 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం మంచి పోస్టింగ్ ఇచ్చి కీలకమైన స్థానంలో పెట్టి, వైఎస్సార్సీపీపై కల్పిత స్కామ్‌లను సృష్టించుకోవడానికి వాడుకుంటున్నదన్న అభియోగాలను వైఎస్సార్సీపీ నేతలు చేస్తుంటారు? మరో సంగతి ఏమిటంటే ఈవిఎంలలో నమోదైనా ఓట్లను చూపించం లేదని హైకోర్టుకు వెళితే, అంత సింపుల్ కేసులో తీర్పు ఇవ్వడానికి అక్కడ మూడు నెలలు తీసుకున్నారు. ఈ లోగా సంబంధిత పిటిషనర్ వైఎస్సార్సీపీ నుంచి జనసేనకు వెళ్లారు.ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?ఏపీలో పారం 20 ని పూర్తి చేసి అప్లోడ్ చేయవలసిన ఈసీ నెలల తరబడి ఎందుకు జాప్యం చేసిందని, సర్వే నిపుణులు మస్తాన్ వంటివారు ప్రశ్నిస్తున్నారు. అన్నిటిని మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఈ ఎన్నికల అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణల జోలికి వెళ్లకుండా ఉండడం కూడా ఆసక్తికరమైనదే. టీడీపీ ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై అంతెత్తున ఎగిరిపడిన చంద్రబాబు ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. ఏపీలో గెలిచింది జగనే తాజాగా తెలంగాణ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఏపీలో గెలిచింది జగనే అని, చంద్రబాబు గెలవలేదని, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని సంచలన వ్యాఖ్య చేశారు. అలాగే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఏపీకి సంబంధించి ఎన్నికల అక్రమాలపై స్టడీ చేస్తున్నానని, త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడ్డాక కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన అధికారులను బదిలీ చేయడం నుంచి కూటమి నేతలు ఏది కోరితే అది చేశారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇంత తీవ్రమైన అభియోగాలకు గతంలో ఎన్నడూ గురి కాలేదు. ఆయా వ్యవస్థలు సజావుగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నిజమే! వీళ్లను కలవడమే ఈజీ.. ఓటు కోల్పోయిన ప్రతి ఒక్కరినీ కలవాలంటే ఈ జన్మ సరిపోదు!
నిజమే! వీళ్లను కలవడమే ఈజీ.. ఓటు కోల్పోయిన ప్రతి ఒక్కరినీ కలవాలంటే ఈ జన్మ సరిపోదు! -
ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన కొనసాగింపు...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఙానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీల ఆందోళనలు నేడు కూడా కొనసాగనున్నాయి. ‘ఓట్ చోరీ’ ఆరోపణలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై ప్రతిపక్షాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో.. ఈరోజు (శుక్రవారం) కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇండియా కూటమి ఎంపీలు సిద్ధమయ్యారు. ఙానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలను కొనసాగించనున్నట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ (సంవిధాన్ సదన్)లో ఇండియా కూటమి ఎంపీలు సమావేశం కానున్నారు. దీంతో సమావేశం అనంతరం తదుపరి నిరసన కార్యక్రమంపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లే అవకాశం ఉన్నట్లు కూటమి నేతలు తెలిపారు.అయితే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు ఇండియా కూటమి ఇప్పటికే సమయం కోరింది. అక్టోబర్ 2న తొలిసారి లేఖ పంపగా, అనంతరం అక్టోబర్ 5న నేతల పేర్లతో మరోసారి అభ్యర్థన పంపినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా సమాధానం రాలేదని ఆయన చెప్పారు. అలాగే ఇండియా కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఙానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, SIR అంశంపై తమ తదుపరి కార్యాచరణను నేతలు ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. గురువారం రాజ్‌ఘాట్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంతకుముందు రెండు రోజులుగా జరిగిన ఆందోళనల్లో పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో శుక్రవారం జరగనున్న సెంట్రల్ హాల్ సమావేశం, అనంతరం చేపట్టే నిరసన కార్యక్రమాలపై ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్! -
సీఈసీ జ్ఞానేశ్‌కు మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు, మాజీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న అధికారులు లేఖ రాశారు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ వంటి రాజ్యాంగ సంస్థలపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.‘ఓట్ చోరీ’ ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలన్న మాజీ న్యాయమూర్తులు.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) చట్టపరమైన నిబంధనల ప్రకారమే జరుగుతోందన్నారు. రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను మీడియా వేదికల కంటే చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని లేఖలో మాజీ న్యాయమూర్తులు పేర్కొన్నారు.కాగా, ‘సర్’పై దేశ రాజధానిలో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ భద్రతను మరింత పెంచారు. ఆయనకు ఇప్పటికే జెడ్ ప్లస్ భద్రత అందించగా, ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఆయన నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జ్ఞానేశ్ కుమార్‌కు ముప్పు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఇదీ చదవండి: ఫారమ్-6పై సుప్రీంకోర్టు మొట్టికాయలు.. వెనక్కి తగ్గిన కేంద్ర ఎన్నికల సంఘం! -
నెక్లెస్ రోడ్డు వద్ద వైరల్ అవుతున్న పోస్టర్
-
ఓటు హక్కును హరించే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పౌరుల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం అధికారులు పనిచేస్తున్నా రని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో తప్పు లు చేసిన వారిని వదిలేసి, ఆ తప్పు లను సరిదిద్దాలని డిమాండ్ చేసిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లి కార్జున ఖర్గేలతో పాటు ఇండియా కూటమి నేతలను అరెస్టు చేయడం ప్రజా స్వామ్యాన్ని అపహా స్యం చేయడమేనని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాహుల్, ప్రియాంకలపై పోలీసుల దాడి మోదీ, అమిత్ షాల అసహ నానికి నిదర్శన మని విమర్శించారు. దేశంలో ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దాడులు జరగ డం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అభి వర్ణి ంచారు. బుధవారం ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌చేస్తూ.. జంతర్‌మంతర్ వద్దకు బయలుదేరిన రాహుల్, ప్రియాంక తదితరు లను పోలీసులు అరెస్టు చేసి బారఖంబా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. కేరళ సీఎం వీడీ సతీషన్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలతో కలిసి వారిని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గేల అరెస్టు దారుణమని మండిపడ్డారు. ప్రజలను రెండు వర్గాలుగా విభజించే యత్నందేశ ప్రజలను రెండు వర్గాలుగా విభజించేందుకు కేంద్రం ప్రమాదకర క్రీడకు తెరలేపిందని సీఎం విమర్శించారు. ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేని పౌరులుగా దేశాన్ని విడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వ్యవహరి స్తున్నారని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘సైమన్ గో బ్యాక్’ తరహాలోనే నాడు స్వాతంత్య్ర పోరాటంలో ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం ఏవిధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందో, నేడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ చేస్తున్న ఈ ఆందోళన కూడా భవిష్యత్తులో నరేంద్ర మోదీని అధికారంలో నుంచి దించడానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ను వాడుకుని ఓట్లను తొలగించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అప్రజాస్వామిక విధా నాలపై దీర్ఘకాలిక కార్యాచరణతో పోరాడతా మని, ప్రజలందరినీ ఏకం చేసి ఈ కుట్ర లను మూకుమ్మడిగా తిప్పికొడతామన్నారు.రఘురాంరెడ్డికి గాయాలురాహుల్గాంధీకి సంఘీభావంగా రాష్ట్ర ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాం రెడ్డి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి జంతర్ మంతర్‌వైపు వస్తున్న ఎంపీలను పోలీసులు అడ్డుకున్నా రు. ఈ సందర్భంగా పోలీసులు ఎంపీలపై లాఠీలు ఝుళిపించారు. దీంతో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డికి గాయాలయ్యాయి. -
కాంగ్రెస్ ఒంటెత్తుపోకడ
ఎన్నికల సంఘం(ఈసీ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మాటున చేసిన నిర్వాకంపైనా, ఈ విషయంలో మరో ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరు చేసినట్టు బయటపడిన వైనంపైనా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఒకపక్క కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఇతర సంఘాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ రోజూ ఆందోళన నిర్వహిస్తుండగా మంగళవారం ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన సుమారు 300మంది ఎంపీలు 9 గంటలపాటు సెంట్రల్ ఢిల్లీలోని పార్లమెంటు నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం నిర్వాచన్ సదన్ వరకూ...ఆ తర్వాత ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోనూ ర్యాలీ, ధర్నా నిర్వహించాయి. విపక్షాలన్నీ ఏకంకావటం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. వ్యవస్థలు వ్యవహరించే తీరుపై కావొచ్చు, వాటి విధాన నిర్ణయాలపై కావొచ్చు... నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని విపక్షాలు నిర్వర్తించటం హర్షించదగిందే. కానీ నిరుడు నిరసనల్లో పాల్గొన్న తమిళనాడుకు చెందిన డీఎంకే ఎందుకు దూరమైంది? మధ్యలో కొన్నాళ్లు ఇండియా కూటమితో చెలిమి చేసినట్టే కనిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సైతం ఈసారి ఎందుకు మాయమైంది? ఆ రెండు పార్టీల వైఖరులూ మారడానికి కారణం ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ వ్యవహార శైలే కారణమన్నది రహస్యమేమీ కాదు. ఎక్కడిదాకానో అవసరం లేదు. మంగళవారంనాటి నిరసనలో తొలుత ఉత్సాహంగా పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కొన్ని ఇతర పార్టీలు సైతం మధ్యలో హఠాత్తుగా అలిగి, దానికి దూరం కావటం కాంగ్రెస్ ఒంటెత్తు పోకడల పర్యవసానమే. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ, సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న బీజేపీని ఢీకొనటం తనవల్లే సాధ్యమని కాంగ్రెస్ నమ్ముతోంది. మంచిదే. కానీ తాను బాధ్యతాయుతంగా మెలగాలని అది భావించటంలేదు. తమిళనాడు ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్యపక్షం డీఎంకేతో కలిసి పోటీచేసి, అది ఓడిపోగానే ప్లేటు ఫిరాయించి ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని టీవీకేతో చేతులు కలపటం సూత్రబద్ధ రాజకీయమేనా? తమకు మద్దతు పలికే వర్గాల ఓట్లు ఈసీ అక్రమంగా తొలగించటంవల్లే ఓడిపోయామని ఒకపక్క డీఎంకే చెబుతుండగా, మద్దతుగా నిలవాల్సిన మిత్రధర్మాన్ని కాంగ్రెస్ ఎలా విస్మరించింది? ఆప్ విషయంలోనూ అంతే. కేంద్రంలో తన పాలనలోని అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి ఆప్ ఆవిర్భవించింది. కాంగ్రెస్‌కు లోలోన ఆ దుగ్ధ ఉంటే ఉండొచ్చు. పైగా ఢిల్లీలోనూ, పంజాబ్‌లోనూ తన వర్గాల ఓట్లే అది కొల్లగొడుతున్నదన్న ఆగ్రహం సరేసరి. అందుకే దాన్ని బీజేపీ–బీ టీంగా చిత్రిస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో తాను చేస్తున్నదేమిటి? అక్కడ ఎన్డీయే కూటమిలోని టీడీపీతో లాలూచీ పడటాన్ని ఎలా చూడాలి? 2024 ఎన్నికలనాటి అవకతవకలపై పార్లమెంటులో రాహుల్ మాటమాత్రంగానైనా ప్రస్తావించారా? ఈ మౌనం సీఎం చంద్రబాబు కోసం కాదా?ఒకపక్క ఇండియా కూటమికి నాయకత్వం వహించే అర్హత తనకే ఉన్నదంటూ ఇలాంటి తెరచాటు వ్యవహారాలు నడపటం అనైతికమని, తన ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న తీరు కూడా ఈ కోవలోకే వస్తుందని అది గుర్తించటం లేదు. మంగళవారంనాటి ఉదంతంలో నిర్వాచన్ సదన్ దగ్గర ధర్నాకు ముందుగా నిర్ణయించుకున్నాక, చెప్పాపెట్టకుండా ఆకాశవాణి ప్రాంగణంలోకి దూసుకెళ్లటం, ఇతర పక్షాలకు చెప్పకపోవటం ఉద్దేశపూర్వకంగా చేసిందేనని టీఎంసీ, ఇతర పక్షాలూ భావించటంలో తప్పేం లేదు. తాను మాత్రమే బీజేపీపై పోరాడుతున్నానన్న అభిప్రాయం కలిగించటానికే ఇలా చేసిందని ఆ పార్టీలు అలిగాయి. ఈ దశలో చీలిక జాడలు కనబడకూడదని మళ్లీ సర్దుకున్నాయి. పుట్టింది కొన్ని నెలలే అయినా...సంస్థాగతంగా పటిష్టంగా లేకున్నా సీజేపీ పిలుపిస్తే వేలకొలదీ జనం రావటమైనా, ఆప్‌లో కొన్నాళ్లు పనిచేయటం మినహా పెద్దగా రాజకీయ నేపథ్యంలేని అభిజిత్ దీప్కేకు జనం నీరాజనాలు పలకడమైనా ఎందుకో రాహుల్ గ్రహించాలి. సూత్రబద్ధమైన రాజకీయానికి కట్టుబడకపోతే తన మాటెలావున్నా, విపక్షాల ఉద్యమస్ఫూర్తి దెబ్బతింటుందని గుర్తించాలి. -
ఉప-ఎన్నిక పెట్టలేం..! హైకోర్టుకు తెలిపిన ECI
-
ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియపై స్పష్టత కోసం అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు లేఖలు రాశారు.ఎన్నికల సన్నాహక చర్యలు, ఏర్పాట్లపై రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు స్పష్టమైన, ఏకరీతి సమాచారం అవసరమని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా అవసరమైన సర్టిఫికెట్ల జారీ ఆలస్యం, వార్డుల డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలు, అధికార యంత్రాంగం ద్వారా బెదిరింపులు లేదా దుర్వినియోగం జరుగుతుందన్న ఆందోళనలపై సకాలంలో చర్చ జరగాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల్ని కోరారు.అలాగే కుల/కమ్యూనిటీ, నో-డ్యూస్/ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీకి రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్యలను కారణంగా చూపుతూ ఎదురవుతున్న అడ్డంకులపై చర్చించాలని వైఎస్సార్సీపీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరింది. సీనియర్ గ్రామ, వార్డు సచివాలయ అధికారుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరపాలని, సంబంధిత న్యాయ ఆదేశాలకు లోబడి చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది.అలాగే రిజర్వేషన్లు, సీట్ల రొటేషన్, ఎన్నికల షెడ్యూల్, దశలవారీగా ఎన్నికల నిర్వహణ, నామినేషన్లు, పరిశీలన ప్రక్రియ, మేయర్లు-చైర్పర్సన్ల ఎన్నిక, ఓటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అధికారుల తటస్థత, పోలింగ్-కౌంటింగ్ సమయంలో భద్రత, ఫిర్యాదుల సకాలంలో పరిష్కారం వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీని, ఈసీఐని కోరింది.ప్రతి అర్హత కలిగిన అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఓటరు ఎన్నికల్లో పాల్గొనే హక్కును పరిరక్షించేందుకు సమగ్ర సంప్రదింపులు అవసరమని లేఖలో పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందే, చట్టపరమైన, న్యాయపరమైన గడువులకు అనుగుణంగా వీలైనంత త్వరగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.ఈ సమావేశానికి ముందుగానే అజెండాను అన్ని పార్టీలకు పంపించాలని, సమావేశం అనంతరం స్పష్టమైన లిఖితపూర్వక మార్గదర్శకాలు జారీ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ఏకరీతిగా అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరింది.ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూకుడు.. తొలి అభ్యర్థి ప్రకటన -
చెవిలో గుసగుసలు.. నెటిజన్ల ప్రశంసల వర్షం!
సాక్షి,న్యూఢిల్లీ: చేసే పని చిన్నదైనా సంయమనం పాటిస్తే ఫలితం పెద్దగా ఉంటుందని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన తాజా ఘటనే నిరూపించింది. ఢిల్లీలో నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఐపీఎస్ మహిళా పోలీస్ అధికారి చూపిన సంయమనం, హుందాగా వ్యవహరించిన తీరుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ ఏడాది జులై నెలలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సమయంలో ఆందోళనకారుల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేస్తూనే, నిరసనలను అదుపు చేసే క్రమంలో పోలీసులు అత్యంత సంయమనంతో, చట్టబద్ధంగా వ్యవహరించాలని తేల్చి చెప్పింది.ఈ క్రమంలో తాజాగా న్యూఢిల్లీలో ఎస్ఐఆర్ రద్దు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ యువత పెద్దఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్న చందంగా వ్యవహరించారు.జంతర్ మంతర్ వద్ద ఏం జరిగింది?జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. భారీగా మోహరించిన ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఓ ట్రాన్స్ జెండర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోబోతుండగా.. మేడం మీరు నన్ను నిర్బంధించలేరు. నేనొక జర్నలిస్టును. నా దగ్గర ఐడీ కార్డు కూడా ఉంది అని చెప్పారు.అక్కడ ఆ మహిళా పోలీసు అధికారి అత్యంత సంయతనంతో, ఎంతో గౌరవప్రదంగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ వ్యక్తి జెండర్ గుర్తింపును గౌరవిస్తూ, ఎంతో హుందాగా ఆయన చెవిలో వంగి.. మేం మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాలని అనుకుంటున్నాం. మిమ్మల్ని అదుపులోకి తీసుకునేందుకు మగ పోలీసు కావాలా?.. ఆడ పోలీస్ కావాలా?’ అని అడిగిన తీరు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.వైరల్ వీడియో వెనుక ఈ సంభాషణ కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే సాగింది. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నిరసనకారులను అక్కడి నుంచి సురక్షితంగా దూరంగా తరలించారు. నిరసనకారుడి గుర్తింపును బహిరంగంగా ఇబ్బంది పెట్టకుండా, అత్యంత విచక్షణతో ఆ మహిళా అధికారి వ్యవహరించిన తీరును నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు . అయితే ఆ వీడియోలో ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఎక్కడికి తరలించారు. సదరు పోలీస్ అధికారి పేరు, వివరాల్ని తెలియరాలేదు. Chad Delhi Police came, asked his name, whispered “You’ve been detained” then asked “Do you need a male or female police officer?” Bro panicked so hard he became transgender journalist in seconds 😭 https://t.co/hdnOYreoxP— Hindutva Vigilant (@Viglnthindutva) October 6, 2026 -
ఫారమ్-6పై సుప్రీంకోర్టు మొట్టికాయలు .. వెనక్కి తగ్గిన కేంద్ర ఎన్నికల సంఘం!
సాక్షి,న్యూఢిల్లీ : ఎస్ఐఆర్ రద్దు, కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ముఖ్యంగా 13.39 కోట్ల ఓట్ల తొలగింపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. మరోవైపు, కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ‘ఫారం-6’లో నిబంధనల మార్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ వివాదంపై మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ పోర్టల్‌లో ఫారం-6తో పాటు అదనపు డిక్లరేషన్‌ను (పూర్వీకుల వివరాలు తదితర షరతులు) తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన ఈ ఫారమ్‌లో మార్పులు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దీని వెనుక ఎవరున్నారు? అంటూ నిలదీసింది.అయితే, ఎస్ఐఆర్ నిబంధనల ప్రకారమే ఆ అదనపు వివరాలు కోరామని ఈసీ వాదించినప్పటికీ.. వివాదం ముదరడంతో కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ పోర్టల్ నుంచి ఆ అదనపు డిక్లరేషన్ ఆప్షన్‌ను ఈసీ వెనక్కి తీసుకుంది. ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నవారందరూ తొలగించినట్లేనా? ఈసీ వర్గాల సమాచారం ప్రకారం.. ముసాయిదా జాబితాలో గుర్తించిన సుమారు 13.39 కోట్ల ఎంట్రీలను వివిధ కారణాల రీత్యా 'ఏఎస్‌డీడీ' కింద వర్గీకరించారు. ఇందులో ఒక్కో వర్గానికి సంబంధించిన లెక్కలు ఇలా ఉన్నాయి.శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు : 6.30 కోట్లు గైర్హాజరైనవారు,ఆచూకీ లభించని ఓటర్లు : 3.01 కోట్లుమరణించిన ఓటర్లు: 2.80 కోట్లుడూప్లికేట్ (నకిలీ) ఓటర్లు: 1.02 కోట్లుఇతర కేటగిరీలకు చెందిన ఓటర్లు : 0.26 కోట్లు. అయితే, ఈ ఓటర్లను ఓట్ల జాబితా నుంచి తొలగించినట్లు భావించరాదని, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన తదనంతరం నిబంధనల ప్రకారమే తుది చర్యలు ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. ఈసీఓటర్ల జాబితా రూపకల్పనలో ఎటువంటి ఏకపక్ష ధోరణి లేదని, పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో మొత్తం 95.40 కోట్ల మంది ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పక్కాగా జాబితాలు సిద్ధం చేసేందుకు 10 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) శ్రమించారు. అలాగే, పూర్తి పారదర్శకత కోసం 22 లక్షలకు పైగా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులకు (బీఎల్ఏలు) జాబితాలను అందజేశారు.ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు,పేర్ల నమోదు కోసం ప్రత్యేకంగా ఒక నెల రోజుల గడువు ఇవ్వడం జరిగిందని ఈసీ గుర్తుచేసింది. ఈ ప్రత్యేక పరిశీలన, సవరణ ప్రక్రియలో ఎవరి పేరైనా పొరపాటున జాబితా నుంచి తొలగించినా, కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును పునరుద్ధరించుకోవచ్చు. లేదంటే కొత్తగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదీ చదవండి : SIR పేరుతో అసలేం జరుగుతోంది? -
జ్ఞానేశ్ కుమార్ టూర్‌కు మళ్లీ బ్రేక్!
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మరో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆయనతో పాటు ఈసీ ఉన్నతాధికారులు ఇవాళ, రేపు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించాల్సి ఉండగా.. ‘‘అనివార్య కారణాల’’తో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఫామ్-6లో మార్పులపై విపక్షాల ఆందోళనలు ఉద్ధృతమైన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసీలో అభిప్రాయబేధాలు, సర్ వివాదాల నేపథ్యం తర్వాత.. మీరట్, వారణాసి, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఆ జాబితాలో చేరింది. అయితే ఆయన పర్యటనల్లో నిరసనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే చర్చా జోరందుకుంది.ఛత్తీస్‌గఢ్ పర్యటనలో జ్ఞానేశ్ కుమార్ దంతేవాడలోని దంతేశ్వరి ఆలయం, బస్తర్‌లో చిత్రకూట్ జలపాతం, కబీర్‌ధామ్‌లో భోరమ్‌దేవ్ ఆలయాన్ని సందర్శించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘స్టేట్ గెస్ట్’ హోదా కల్పించి భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో ఈసీ వర్గాలు పర్యటనను రద్దు చేసినట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై బుధవారం కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగనున్నాయి. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి నిరసనలో పాల్గొంటామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అంతకు ముందు.. మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష ఎంపీలు ఈసీ కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆకాష్వాణి భవన్ వద్ద ఎనిమిది గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. సర్ రద్దు, జ్ఞానేశ్వర్ రాజీనామా, ఎన్నికల సంఘంలో సంస్కరణలు కోరుతూ ఈ నెల 10వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ కూడా దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. ఇదీ చదవండి: ఈసీ కోసం నెక్స్ట్ లెవల్ పోరాటం! -
ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్
-
ఈసీపై రాహుల్ గాంధీ నెక్స్ట్ స్టెప్ ఇదేనా?
ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల పోరు మరింత ఉధృతమవుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి వారిని విడుదల చేశారు. దీంతో ఇవాళ ఉద్యమం తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల సంఘంపై అదే పోరును దేశవ్యాప్త ఆందోళనగా మలిచేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరడంతో పాటు.. నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ సభకు కూటమి సన్నద్ధమవుతోంది. నిన్నటి ఘటనకు కొనసాగింపుగా కాంగ్రెస్ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో ఎన్నికల సంఘం కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఢిల్లీలోనూ ఆందోళనలు కొనసాగనున్నాయి. ఎన్నికల జాబితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.ఆకాశవాణి భవన్ వద్ద..మంగళవారం ఉదయం పార్లమెంట్ మకర్ ద్వార్ నుంచి దాదాపు 200 మంది ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ ప్రారంభించారు. అఖిలేశ్ యాదవ్, అభిషేక్ బెనర్జీ, మనోజ్ ఝా, డెరెక్ ఓబ్రెయిన్ తదితర విపక్ష నేతలు పాల్గొన్నారు. పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు.రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి జాతీయ జెండాను ఊపారు. అనంతరం పలువురు నేతలను పోలీసులు బస్సుల్లోకి ఎక్కించారు. రాహుల్ మాత్రం ఆకాశవాణి భవన్ వైపు వెళ్లారు. ప్రియాంక గాంధీ కూడా ఆయనతో చేరారు. కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగిన అనంతరం వారిని ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి అనుమతించారు. అక్కడే ఇద్దరూ బైఠాయించి నిరసన చేపట్టారు.రాత్రి హైడ్రామాఆకాశవాణి భవన్ ప్రాంగణంలో కొనసాగిన నిరసన అనంతరం రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని కింగ్స్‌వే క్యాంప్ న్యూ పోలీస్ లైన్స్‌కు తరలించారు. రాత్రి 10 గంటల తర్వాత వారిని విడుదల చేశారు. దీంతో ఇవాళ రాహుల్, ప్రియాంకలు స్వేచ్ఛగా ఉండగా.. తదుపరి నిరసన కార్యక్రమాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది.రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నంఇండియా కూటమి తమ పోరును మరో స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను రాష్ట్రపతికి వివరించేందుకు సమయం కోరింది. అక్టోబర్ 7, 8 లేదంటే 9 తేదీల్లో భేటీకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ బృందంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్ తదితరులు ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల సంఘాన్ని కలవాలన్న ప్రయత్నమూ నిన్న ఫలించలేదు. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే అభ్యంతరం లేదని ఈసీ వర్గాలు అంటున్నాయి. నవంబర్ 1న భారీ సభమరోవైపు ఈసారి బిజూ జనతాదళ్ (బీజేడీ) కూడా ఇండియా కూటమికి మద్దతుగా వీధుల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు బీజేడీ ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో బీజేడీ దూరంగా ఉండేది. ఇక ఇవాళ్టి నిరసనలతోనే ఉద్యమాన్ని ముగించకుండా.. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ సభ నిర్వహించేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. అప్పటివరకు రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో నిరసనలు, సభలు, మార్చ్‌లు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదీ చదవండి: ఒక దేశం.. ఒకే పార్టీ అనే కుట్రా? -
రేపు స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక భేటీ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మరింత ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్రపునేఠ ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగర పోలీసు కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, నగర, పట్టణ మున్సిపల్ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. బుధవారమే ఈ సమావేశం నిర్వహణకు ఏర్పాటు చేయగా, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడింది. -
దద్దరిల్లిన ఢిల్లీ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) మాటున కోట్ల ఓట్లను రద్దుచేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ తక్షణం పదవికి రాజీనామాచేయాలన్న ఏకైక ప్రధాన డిమాండ్‌తో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు చేపట్టిన ర్యాలీ హస్తినలో అత్యంత ఉద్రిక్తతలకు దారితీసింది. విపక్ష పార్టీల అగ్రనేతలు పార్లమెంట్ వీధిలో కదంతొక్కారు. మోదీ సర్కార్‌కు లబ్ధిచేకూరుస్తున్న జ్ఞానేశ్ ఇకనైనా గద్దె దిగాలంటూ నేతలు చేసిన నినాదాలతో దేశ రాజధాని హోరెత్తింది. భారీ సంఖ్యలో విపక్షపార్టీల కార్యకర్తలు సైతం తోడవడంతో అత్యంత సున్నితమైన పార్లమెంట్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తమయ ఉద్యమవేదికగా మారిపోయింది. పలువురు ముఖ్య నేతలు అరెస్ట్‌లు, తర్వాత విడుదలతో విపక్షాల ర్యాలీ ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. నూతన ఓటర్లు సమర్పించాల్సిన ఫారమ్6కు అనుబంధంగా ఈసీ తీసుకొచి్చన డిక్లరేషన్‌కు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన మరుసటి రోజే ‘ఇండియా’ కూటమి పార్టీలు ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని ఉధృతంచేయడం గమనార్హం. పార్లమెంట్ నుంచి ఆరంభమై.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ప్రధాన భవనం మకర ద్వారం వద్ద కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సీపీఐ, సీపీఎం తదితర విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఒక్కచోటకు చేరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’కు ర్యాలీగా బయల్దేరారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డిరెక్ ఒబ్రియాన్, సాగరికా ఘోష్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఇలా దాదాపు 300 మంది ఎంపీలు ర్యాలీగా బయల్దేరారు. ఆర్ఎస్ఎస్ ఆహార్యంలో ఉన్న జ్ఞానేశ్ కటౌట్లను ప్రదర్శిస్తూ ‘ఓటు దొంగలు గద్దె దిగాలి’, ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ఆపండి’ అంటూ ఈసీ, కేంద్రప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కూటమిలోలేని బిజూ జనతాదళ్ పార్టీ ఎంపీలు సైతం ర్యాలీలో పాల్గొనడం విశేషం. మధ్యలోనే అడ్డగింత.. వాగ్వాదం.. నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా పావు కిలోమీటర్ ముందుకెళ్తే ఎలక్షన్ కమిషన్ హెడ్ఆఫీస్ వస్తుందనగా నేతలు నీతి ఆయోగ్ కార్యాలయం వద్దకు రాగానే బారికేడ్లు అడ్డంగాపెట్టి వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను నెట్టేసి ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో రాహుల్ బారికేడ్‌ను ఎక్కేశారు. త్రివర్ణ పతాకం చేతబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. తోటి ఎంపీలు సైతం ముక్తకంఠంతో నినదించడంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. తర్వాత నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ర్యాలీని కొనసాగనివ్వాలని డిమాండ్‌చేశారు. ‘‘జ్ఞానేశ్ జీ ఇప్పటికే ఎన్నికల వ్యవస్థను నాశనంచేశారు. చేసింది చాలు. ఇకనైనా రాజీనామా చేయండి’’ అని ఇదే సమయంలో రాహుల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. నేతలంతా బైఠాయించడంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు వెంటనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఓబ్రియాన్, అభిషేక్ బెనర్జీ, సాగరికా ఘోష్, మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ సహా పలువురు ఎంపీలను నిర్బంధించి బస్సుల్లోకి ఎక్కించారు. అయితే బస్సులు కొంతదూరం కదిలినా చుట్టూతా కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో నేతలను విడిచిపెట్టారు. ఇదే సమయంలో ప్రియాంకాగాంధీ ఎలాగోలా బస్సు నుంచి బయటపడి తిరిగి ధర్నాలో కూర్చున్నారు.50 మంది ఎంపీలు సహా 250 మంది అరెస్ట్చెట్టు కింద దాదాపు తొమ్మిది గంటలపాటు కొనసాగిన ధర్నాను రాత్రి వేళ పోలీసులు హఠాత్తుగా భగ్నంచేశారు. ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో చుట్టుముట్టి కీలక నేతలందర్నీ లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లు, బస్సుల్లోకి ఎక్కించారు. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, కె.సురేశ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, చరణ్‌జీత్‌సింగ్ ఛన్నీ, దీపేందర్ హూడా, ప్రణీతి షిండే, వర్షా గైక్వాడ్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మనీశ్ ఛాత్రా తదితర నేతలందరిన్నీ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న విపక్ష పార్టీల మద్దతుదారుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.50 మంది ఎంపీలుసహా మొత్తంగా 250 మందిని అరెస్ట్‌చేశారు. రాహుల్‌ను కింగ్స్‌వే క్యాంప్ న్యూ పోలీస్‌లైన్స్ స్టేషన్‌కు తరలించారు. ఇతర నేతలను వేర్వేరు వాహనాల్లో అక్కడి నుంచి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు. విడుదలైన ప్రియాంక తర్వాత రాహుల్‌ను నిర్బంధించిన పోలీస్‌స్టేషన్‌కు వచ్చి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 2 గంటల నిర్బంధం తర్వాత రాహుల్‌సహా నేతలందర్నీ విడిచిపెట్టారు. నేతల అరెస్ట్‌పై విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అయితే ధర్నా నుంచి డీఎంకే, ఆప్ పార్టీలు దూరంగా ఉండిపోయాయి.అపాయింట్ కోసం లేఖ రాశాకే, సీఈసీని కలిసేందుకే ర్యాలీగా వెళ్లామని ఎంపీలు చెబుతుండగా ముందస్తు అపాయింట్మెంట్ కోసం సాయంత్రందాకా ఎలాంటి అభ్యర్థన రాలేదని ఈసీ వర్గాలు స్పష్టంచేశాయి. పార్లమెంట్ అనుబంధ భవనంలో 240 మంది ఎంపీలు తమతో భేటీకి సిద్ధంగా ఉన్నట్లు పోలీసుల నుంచి సమాచారం అందిందని, ఇలాంటి భేటీకి ఈసీ నిబంధనలను ఒప్పుకోవని ఈసీ పేర్కొంది. ముందస్తు అనుమతితో ఈసీ కార్యాలయంలోనే రాజకీయపార్టీల ప్రతినిధులతో ఎలక్షన్ కమిషనర్లు భేటీ అయ్యేందుకే నిబంధనలు అనుమతిస్తాయని ఈసీ ఆ ప్రకటనలో పేర్కొంది. ధర్నాను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కొత్త ‘వీధి నాటకం’గా అభివరి్ణంచారు. రహదారి నుంచి ఆకాశవాణిలోకి..ఎంపీలందరినీ పోలీసులు నిర్బంధించే అవకాశం ఉండటంతో రాహుల్, ప్రియాంక, దీపేందర్ హూడా తదితర ఎంపీలు మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో వెంటనే ఎదురుగా ఉన్న ఆకాశవాణి(ఆలిండియా రేడియో కార్యాలయం) ప్రాంగణంలోకి పరుగెత్తారు. మూడో నంబర్ గేటు వద్ద ఉన్న రిసెప్షన్ ఏరియా నుంచి సమీపంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అయినాసరే రాహుల్, ప్రియాంక, తదితరులు లోపలికి చొరబడ్డారు.తర్వాత కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, ప్రణీతి షిండే, చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ, సేవాదళ్ చీఫ్ బీవీ శ్రీనివాస్ తదితరులూ లోపలికొచ్చారు. నాలుగో నంబర్ గేటు సమీప భారీ మర్రిచెట్టు కింద నేతలంతా భైఠాయించి ధర్నా కొనసాగించారు. వెంటనే అక్కడికొచి్చన పోలీసు ఉన్నతాధికారులు నేతలకు ధర్నా విరమించాలని నచ్చజెప్పారు. ధర్నా చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతం చూపిస్తే అక్కడికే వెళ్తామని నేతలు తెగేసిచెప్పారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇక్కడి నుంచే పోరాటం కొనసాగిస్తాం. ఎన్డీఏ సర్కార్ ప్రజాస్వామ్యవ్యతిరేక నిర్ణయాలు అమలుచేస్తోంది.ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్, జ్ఞానేశ్ వీళ్లలో ఎవరినీ వదిలిపెట్టేది లేదు. కూటమి ఎంపీలతో ఎన్నికల సంఘం భేటీకి ఒప్పుకునేదాకా మేం వెనక్కితగ్గం’’ అని రాహుల్ మీడియాతో అన్నారు. మధ్యాహ్నం హఠాత్తుగా కాంగ్రెస్ ముఖ్యనేతలంగా లోపలికిరావడంతో ఆలిండియా రేడియో ఉద్యోగులంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో బయటకు పరుగెత్తారు. రాహుల్‌తో సెల్పిలు దిగారు. కొందరు కిటికీల నుంచి తొంగిచూస్తూ, మరికొందరు గోడలెక్కి మరీ నేతల ధర్నాను చూసేందుకు ఎగబడ్డారు. వాళ్లను పోలీసులు వారించారు. ధర్నాచేస్తున్న నేతలు నేలపై కూర్చునేందుకు చాపలు, దుప్పట్లు, ఆరుబయట దోమలు కుట్టకుండా మస్కిటో క్రీమ్‌లు, తినేందుకు చిరుతిండ్లు, తాగడానికి నీరు కార్యకర్తలు ఆగమేఘాల మీద ఏర్పాటు చేశారు. -
ఎస్ఐఆర్ పేరుతో అసలు ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితాయే పునాది. దేశంలో పారదర్శకమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు జరగాలంటే ఓటరు జాబితా దోషరహితంగా ఉండటం అత్యంత ముఖ్యం. ఈ నేపథ్యంలోనే భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్) అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఏడాదో రెండేళ్లకో జరిగే సాధారణ వార్షిక సవరణలకు భిన్నంగా, ఏకంగా ఇంటింటి సర్వేతో కూడిన ఈ భారీ కసరత్తును ఇప్పుడు తెరపైకి తీసుకురావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార, విపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం నడుస్తోంది.సాధారణంగా ప్రతి ఏటా ఓటరు జాబితా సవరణ తంతు నామమాత్రంగా సాగిపోతుంటుంది. కొత్త ఓటర్ల చేరిక, చనిపోయిన వారి తొలగింపు ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియే. అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా దశలవారీగా ‘ఇంటెన్సివ్ రివిజన్’ పేరుతో కఠిన నిబంధనలను అమలు చేయడంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయికాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్షాలు ఈ ఎస్ఐఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు బడుతున్నాయి. ఓటర్ల జాబితాల ప్రక్షాళన ముసుగులో పేదలు, వలస కార్మికులు, మైనారిటీలు, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే వర్గాల పేర్లను నియోజకవర్గాల వారీగా తొలగించేందుకు ఈ కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పత్రాల పేరుతో నిబంధనలు కఠినతరం చేసి, అర్హులైన సామాన్యులను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు,ఈ విమర్శలను ఈసీ పూర్తిగా తోసిపుచ్చుతోంది. కాలం మారుతున్న కొద్దీ దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉండటం భారీగా పెరిగిపోయాయని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ఈ ప్రక్షాళన అత్యంత అనివార్యమని ఈసీ స్పష్టం చేస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే పారదర్శకత కోసం దీన్ని చేపట్టినట్లు చెబుతోంది.అసలేమిటీ ఎస్ఐఆర్ ?ఎస్ఐఆర్ అనగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’. ఇది భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రక్షాళన చేయడానికి చేపట్టే సమగ్ర ప్రక్రియ. దీని ద్వారా బూత్ లెవల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు, సరి చూస్తారు.ఓటరు జాబితాలు ఎందుకు సవరిస్తారు?ఓటరు జాబితాలను ఎల్లప్పుడూ ఖచ్చితంగా, పారదర్శకంగా ఉంచడానికి ఈ సవరణ చాలా ముఖ్యం. ఒకే వ్యక్తి పేరు వేర్వేరు చోట్ల ఉండటం లేదా మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో కొనసాగడం వంటి లోపాలను సరిదిద్దడానికి.ఉద్యోగాలు, ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను పాత జాబితా నుంచి తొలగించడానికి.18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడానికి.ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హులైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లతో జాబితా అస్తవ్యస్తం కాకుండా కాపాడడం దీని ముఖ్య ఉద్దేశం.దీనికి సమాచారాన్ని ఎవరు ఇవ్వాలి?బూత్ లెవల్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి యజమాని లేదా అర్హులైన ఓటర్లు తమ సరైన వివరాలను, పౌరసత్వాన్ని, నివాసాన్ని నిర్ధారించే పత్రాలను (ఎన్యుమరేషన్ ఫారంలో) అందించాలి. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల్లో నివసిస్తుంటే, ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా ఆన్లైన్లో కూడా తమ సమాచారాన్ని సమర్పించవచ్చు.ఈసీ ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?కాలం మారుతున్న కొద్దీ ఉపాధి కోసం ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు. దీనివల్ల పాత ఓటరు జాబితాలలో చిరునామాలు తప్పుగా మారడం లేదా ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం జరుగుతోంది. వీటిని సరిచేయడం ఈసీ ప్రధాన విధి.సాధారణ వార్షిక సవరణల ద్వారా కేవలం దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే మారుస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి అప్డేట్ కాని లోపాలను సరిదిద్దడానికి ఇంటింటి సర్వేతో కూడిన ఈ సమగ్ర సవరణ అత్యంత అవసరమని ఈసీ భావించింది. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలకుండా ఉండాలంటే ఓటరు జాబితా దోషరహితంగా ఉండాలి. అక్రమంగా చొరబడిన విదేశీ వలసదారులు లేదా అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా నిరోధించడానికి ఈ ప్రక్షాళన దోహదపడుతుంది. ఎలాంటి తప్పులు లేని పవిత్రమైన ఓటరు జాబితా ఉంటేనే దేశంలో స్వేచ్ఛా యుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది. అందుకే ఈసీ దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
‘జ్ఞానేశ్ బ్రో’ ఎపిసోడ్.. కేంద్రం వైఖరిపై ఉత్కంఠ!
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఇప్పటివరకు రాజకీయ విమర్శలు, నిరసనలకే పరిమితమైన వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప దాటింది. జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్రం, ఎన్నికల సంఘం నుంచి సమాధానం కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం కీలక పరిణామంగా మారింది. అదే సమయంలో.. సోమవారం సుప్రీంకోర్టులో ఫామ్-6పై వచ్చిన వ్యాఖ్యలు, మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీల ఆందోళన.. ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించాయి.జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీ పోస్టు నుంచి తక్షణం సస్పెండ్ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అయితే కేసును విచారణకు స్వీకరించి.. కేంద్రం, ఈసీతో పాటు జ్ఞానేశ్ కుమార్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తదితరులకు నోటీసులు ఇచ్చింది. ఎస్ఐఆర్కు సంబంధించిన 14 నిర్ణయాలు ఇతర కమిషనర్ల అభ్యంతరాలను పక్కనపెట్టి తీసుకున్నారన్నది పిటిషన్లో ప్రధాన ఆరోపణ. అలాగని ఇప్పటికిప్పుడు జ్ఞానేశ్ కుమార్ పదవికి ముప్పు వచ్చిందని చెప్పలేం. కానీ ఆయన నిర్ణయాలపై న్యాయపరీక్ష మొదలైందన్నది మాత్రం స్పష్టం.అసలు చిక్కు ఆ ఫామ్‌తోనే!ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం ఫామ్-6. కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే ఈ ఫామ్‌కు ఎస్ఐఆర్ సమయంలో అదనపు డిక్లరేషన్ జతచేశారు. దాని విషయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.“మార్చిన ఫామ్-6ను మేం ఆమోదించలేదు. రికార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఏం మార్చారో చూస్తాం” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీంతో ఈ మార్పులకు అసలు అధికారం ఎవరిది? ఏ ప్రక్రియలో జరిగాయి? అన్నది ఇప్పుడు కోర్టు పరిశీలనలోకి వచ్చింది.ఇదే అంశంపై ఎన్నికల సంఘం మాత్రం ఇంతకు ముందు తన వివరణ ఇచ్చింది. బిహార్‌లో ఎస్ఐఆర్ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నామని, సుప్రీంకోర్టు కూడా ఆ ఎస్ఐఆర్ అధికారాన్ని సమర్థించిందని పేర్కొంది. ఫామ్-6 విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిగా ఈసీ అభివర్ణించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం తన ముందు ఉన్న రికార్డులను పరిశీలించి ఎవరు ఏ మార్పు చేశారో తెలుసుకుంటామని చెప్పడం.. ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లైంది.జ్ఞానేశ్ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే..ఇక జ్ఞానేశ్ కుమార్ ముందున్న అసలు పరీక్ష.. రాజకీయ విమర్శలకు సమాధానం ఇవ్వడం కాదు. సుప్రీంకోర్టుకు రికార్డులు సమర్పించి.. నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారో వివరించడం. ముఖ్యంగా 14 నిర్ణయాలపై మిగిలిన ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న ఆరోపణలపై ఈసీ వద్ద ఉన్న పూర్తి రికార్డులు కీలకం కానున్నాయి. నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని ఈసీ చెబుతున్న నేపథ్యంలో.. ఆ నిర్ణయ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.మరి కేంద్రం ఏం చేయబోతోంది?ఇక్కడే రాజకీయ ఉత్కంఠ మొదలవుతోంది. విపక్షాలు మాత్రం జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ సీఈసీని కేంద్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనా ఉత్తర్వుతో తొలగించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత దశలో కేంద్రం ముందున్న తక్షణ మార్గం సుప్రీంకోర్టుకు సమగ్ర సమాధానం ఇవ్వడం, ఎన్నికల సంఘం వైఖరిని చట్టపరంగా సమర్థించడం. అదే సమయంలో విపక్షాల తీరును ఎండగట్టడం. కోర్టు రికార్డులను పరిశీలించిన తర్వాత ఏదైనా నిర్ణయం చట్టానికి విరుద్ధంగా ఉందని తేలితే.. దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు కేంద్రం వైఖరి అత్యంత కీలకంగా మారింది.రోడ్డెక్కిన విపక్షాలు.. ‘జ్ఞానేశ్ బ్రో.. ఇట్స్ డన్’సుప్రీంకోర్టు పరిణామాల మరుసటి రోజే ఢిల్లీలో విపక్షాలు భారీ ఆందోళనకు దిగాయి. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో పార్లమెంట్ స్ట్రీట్ వద్దే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. “జ్ఞానేశ్.. ఇట్స్ డన్ బ్రో. టైమ్ టు రిజైన్” అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆందోళనకు నినాదంగా మారింది. సీఈసీ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్, ఫామ్-6 వ్యవహారంపై సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ఈసీ కార్యాలయం చుట్టూ భారీగా భద్రత ఏర్పాటు చేయడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎంపీలను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో నిరసన మరింత ఉధృతమైంది.మరోవైపు సీజేపీ.. దేశవ్యాప్త ఉద్యమానికి రెడీఇదంతా జరుగుతుండగానే సీజేపీ కూడా జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ, విద్యార్థి బృందాలు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాయి. ఎన్నికల జాబితా ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఒకవైపు పార్లమెంటరీ విపక్షాల నిరసనలు.. మరోవైపు యువత ఆధారంగా సాగే సీజేపీ ఉద్యమం.. ఇంకోవైపు సుప్రీంకోర్టు విచారణ. మూడు దారుల్లో ఒత్తిడి పెరుగుతోంది.అసలు ఉత్కంఠ ఇక్కడే..ఇప్పటివరకు ఎస్ఐఆర్ వివాదం ప్రధానంగా “ఎన్నికల సంఘం వర్సెస్ విపక్షాలు” అన్నట్టుగా కనిపించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులతో వ్యవహారం “ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్టబద్ధంగానే జరిగాయా?” అనే ప్రశ్నకు చేరింది. కేంద్రం కూడా ఇప్పుడు రెండు విషయాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఒకటి.. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటం. రెండోది.. సుప్రీంకోర్టు అడిగిన రికార్డులు, వివరణలను సమర్థంగా సమర్పించడం.అందుకే ఇప్పుడు అందరి చూపూ ఒక్కచోటే.. సుప్రీంకోర్టు తదుపరి అడుగు ఏంటి? దానికి కేంద్రం ఇచ్చే సమాధానం ఏంటి? జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంలో అసలు ట్విస్ట్ అక్కడే ఉండబోతోంది.ఇదీ చదవండి: జ్ఞానేశ్వర్ దిష్టిబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్ -
నేటి నిరసనలో మేం పాల్గొనం: ఆప్
న్యూఢిల్లీ: సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఈ నెల 6వ తేదీన ఇండియా కూటమి పక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమంలో తాము పాలుపంచుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సోమవారం మీడియాకు ఈ విషయం తెలిపారు. ‘ఓటరు జాబితా సర్‌కు వ్యతిరేకంగా వామపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ సహా వివిధ సంఘాలు, సంస్థలు నిత్యం దేశంలో ఏదో ఒక చోట ఆందోళనలు చేపడుతున్నాయి. మంగళవారం ఇండియా కూటమి నిరసనలకు దిగుతోంది. ఇది ఇండియా కూటమి ఆందోళన. అందుకే, ఇందులో ఆప్ పాల్గొనదు. మేం సొంతంగా నిరసనలు నిర్వహిస్తాం’అని ఆయన వివరించారు. ప్రతిపక్ష డీఎంకే సైతం 6న జరిగే ఆందోళనలో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించింది. ఈసీ కార్యాలయం వద్ద నిరసన అనంతరం ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతిని కలవాలని సెపె్టంబర్ 30న జరిగిన భేటీలో ఇండియా కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. -
నేడు సీఈసీ జ్ఞానేశ్‌పై విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ!
సాక్షి, ఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తీసుకున్న చర్యలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.పిటిషనర్ల ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని.. SIR ప్రక్రియకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు సుమారు 14 వరకు తీసుకున్నట్లు పిటిషన్లలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మాత్రం తమ నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ధారణకు రాలేదు.సిట్ కోసం డిమాండ్.. అంతేకాకుండా.. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కూడా పిటిషనర్లు కోరారు. SIR సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వివాదాస్పదంగా పేర్కొన్న 14 నిర్ణయాలను రద్దు చేయాలని, సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ విధులు నిర్వహించకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా పిటిషన్లలో కోరారు.ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు, పలు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. అక్టోబర్ 7న ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద సంయుక్త నిరసనకు కూడా ఇండియా కూటమి పిలుపునిచ్చింది.మరోవైపు.. ఎన్నికల సంఘం మాత్రం SIRకు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో సీఈసీ నిర్ణయాల చట్టబద్ధత, ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియ, SIRపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది. అయితే పిటిషన్లలో చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయని, వాటిపై కోర్టు తుది నిర్ణయం ఇవ్వాల్సి ఉంది.ఇదీ చదవండి: బెంగాల్లో ట్విస్ట్.. తిరుగుబాటు నేతలకు మమత గట్టి వార్నింగ్ -
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై అఫిడవిట్ వేయండి
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారా.. లేదా.. అనే దానిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఆపాలని కోరుతూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023, నవంబర్‌లో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ) పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నిక ప్రకటించేందుకు ఎన్నికల సంఘానికి అధికారం లేదన్నారు. గురువారం ఉదయం ఈ పిటిషన్ విచారణకు విజ్ఞప్తి చేయడంతో.. మధ్యాహ్నం విచారణకు సీజే ధర్మాసనం అనుమతించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈపీ ఫలితం తేలే వరకు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్.. పార్టీ మారడంతో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర్హతకు గురయ్యారని చెప్పారు. దీంతో ఏర్పడిన ఖాళీని ‘క్యాజువల్ వేకెన్సీ’గా పరిగణించరాదన్నారు. ఎన్నికల పిటిషన్ (ఈపీ) ఇప్పటికే హైకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నందున, దాని తుది ఫలితం వెలువడే వరకు ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రకటించకూడదని కోరారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 84, 98, 101 నిబంధనలను ప్రస్తావిస్తూ.. ఈపీలో ఫలితం తేలే వరకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను సమర్పించారు. ఎన్నికల సంఘం తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను వివరించారు. పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్ ఫలితం తేలే వరకు ఎలక్షన్ నిర్వహణ సాధ్యం కాదన్నారు. దీంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు బ్రేక్ పడనుంది. తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ తేలే వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వొద్దని 2023 ఎన్నికల నాటి కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నిక ఆపేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆమె కోరారు. ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఈసీ కూడా అంగీకరించడంతో ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదని నిపుణులు అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో దానం విజయం సాధించారు. అనంతరం ఎన్నికల అఫిడవిట్లో భార్యతోపాటు తనపై ఆధారపడిన వారి ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ విజయారెడ్డి 2024, జనవరి 20న ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. నాగేందర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ పిటిషన్ 2024, డిసెంబర్ తర్వాత విచారణకు రాలేదు. 2 న్యాయపర అంశాలు.. 2 వేర్వేరు కేసులు నాగేందర్‌పై ఇటీవల వచ్చిన అనర్హత తీర్పు, విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ వేర్వేరు న్యాయ ప్రక్రియలు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడని ఓ కేసులో తేలింది. హైకోర్టు సెప్టెంబర్ 18న నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించగా, సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఉపశమనం లభించలేదు. అనంతరం ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యదర్శి సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.దీంతో ఉపఎన్నికకు మార్గం సుగమమైందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్‌తో ఉప ఎన్నికపై సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు, 2023లో ఆయన సాధించిన ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా? లేదా? అన్నది ఎన్నికల పిటిషన్లో తేలాల్సి ఉంది. ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు గత తీర్పులు ఏమిచ్చాయో పరిశీలించాల్సి ఉంది. సుప్రీంకోర్టు సూత్రం ప్రకారం ఎన్నికల సంఘం వర్సెస్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కేసులో.. ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సందర్భంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించిన అంశాన్ని కోర్టు పరిశీలించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ ప్రకారం సాధారణంగా ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నా, ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ ఇంకా తుది పరిష్కారం కాకపోతే ఆ ఖాళీని వెంటనే భర్తీ చేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీ (క్యాజువల్ వేకెన్సీ)గా పరిగణించలేమని పేర్కొంది. ఎన్నికల పిటిషన్లో గెలిచిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలని మాత్రమే కాకుండా, పిటిషనర్ లేదా మరో అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని కూడా కోరితే.. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. అదే స్థానానికి ఉపఎన్నిక నిర్వహిస్తే, ఒకే నియోజకవర్గానికి ఇద్దరు వ్యక్తులు ఎన్నికయ్యే పరిస్థితి ఉత్పన్నమవ్వొచ్చని పేర్కొంది. అందువల్ల అటువంటి పిటిషన్ పెండింగ్‌లో ఉన్న స్థానాన్ని సాధారణ ఖాళీగా పరిగణించి ఉపఎన్నిక నిర్వహించలేమనే న్యాయ సూత్రాన్ని స్పష్టం చేసింది. ప్రమోద్ లక్ష్మణ్ గుడాధే వర్సెస్ ఎన్నికల సంఘం కేసులోనూ ఇదే న్యాయ సూత్రాన్ని ప్రస్తావించింది. ఖైరతాబాద్ విషయంలోనూ.. ఖైరతాబాద్ వ్యవహారంలోనూ ఇది కీలకంగా మారనుంది. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్లో దానం ఎన్నికను రద్దు చేయడంతోపాటు తనను శాసనసభ్యురాలిగా ప్రకటించాలని కోరారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయ సూత్రాన్ని ఇక్కడ కూడా వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల్లో చర్చించిన అంశాలు, ప్రస్తుత ఖైరతాబాద్ స్థానంలో ఖాళీ ఏర్పడిన విధానం, విజయారెడ్డి పాత ఎన్నికల పిటిషన్.. అన్ని అంశాలను హైకోర్టు విడిగా పరిశీలించాల్సి ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం ఖైరతాబాద్ స్థానాన్ని ఖాళీగా ప్రకటించినందున ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. విజయారెడ్డి తాజా పిటిషన్ నేపథ్యంలో ఎన్నికలు నిలిచినట్లేనని చెబుతున్నారు. కాగా, రిట్ పిటిషన్ విచారణ తర్వాత సీజే ధర్మాసనం ఏ తీర్పునిస్తుందా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. -
Danam Nagender: ఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్ ను తగలబెడతాం.. సంచలన కామెంట్స్
-
ఈసీ కార్యాలయం తగలబడిపోతుంది..!
సాక్షి, హైదరాబాద్: ‘‘తన నియోజకవర్గంలో 20 వేల ఓట్లు తొలగించారని.. ఈసీ అధికారులు బీజేపీతో కుమ్మక్కై వారికి అనుబంధంగా పనిచేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మాత్రం మామూలుగా ఉండదు. ఎన్నికల కమిషనర్ కార్యాలయం తగలబడిపోతుంది’’ ఆయన అంటూ వ్యాఖ్యానించారు.ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నేతలు వ్యవస్థీకృతమైన ఓట్ చోరీకి పాల్పడుతున్నారని.. ఈసీ తక్షణమే స్పందించి, తొలగించిన ఓట్లను యథావిధిగా పునరుద్ధరించాలని దానం డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలంటూ ఆమె దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో, పిటిషన్ తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ‘దానం వికెట్ పడింది.. రెండో వికెట్ ఎవరంటే..?’ -
ఈసీకి రాహుల్ గాంధీ బిగ్ క్వశ్చన్
కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఆన్లైన్ ఫామ్–6లో మార్పులు అక్రమంగా జరిగాయంటూ శుక్రవారం తన ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇలా చేశారో చెప్పాలంటూ వరుస ప్రశ్నలు సంధించారాయన. ఎన్నికల సంఘం (ECI) సూచనల మేరకు టీసీఎస్ (TCS) తన డిజిటల్ పోర్టల్‌లో మార్పులు చేసిందా? ఒకవేళ చేస్తే.. ఆ మార్పులకు టీసీఎస్‌లో ఎవరు ఆమోదం తెలిపారు? వారిపై ఒత్తిడి ఏమైనా ఉందా? అంటూ రాహుల్ గాంధీ ఈసీని వరుస ప్రశ్నలు సంధించారు.‘‘ఆన్లైన్ ఫామ్–6ను అక్రమంగా మార్చారు. ఈ మార్పుపై ఈసీలోని కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీసీఎస్‌ను ఈ మార్పు చేయాలని ఈసీలో ఎవరు ఆదేశించారు?’’ అని అని ప్రశ్నించారు. ఈ మార్పులకు టీసీఎస్‌లో ఎవరు ఆమోదం తెలిపారో, ఆ నిర్ణయం తీసుకునేలా వారిపై ఒత్తిడి తెచ్చారా? అని అడిగారు.The online Form 6 was changed illegally - as the EC's own Commissioners have recorded.Who at the ECI ordered Tata Consultancy Services to make that change?Who at TCS signed off on it? And were they pressured into doing it?— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2026ఫామ్–6లో ఏం మారిందంటే..కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫామ్–6ను ఉపయోగిస్తారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) సమయంలోనూ ఇది కీలకమైన ఫామ్. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిపోయిన పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవడానికి కూడా దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ ఫామ్‌కు అదనంగా ఓ డిక్లరేషన్ జత చేశారు. గతంలో జరిగిన ఎస్ఐఆర్ సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారుడి పేరు ఉందా? లేక వారి తల్లిదండ్రులు లేదా తాత, నానమ్మ/అమ్మమ్మ పేర్లు ఉన్నాయా? అనే వివరాలను ఇందులో కోరారు.ఇద్దరు ఈసీల అభ్యంతరాలు..ఈ మార్పుపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ సంచలనాత్మక కథనం ఇచ్చింది. 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్‌లో నిర్దేశించిన ఫామ్‌ను నిబంధనలను సవరించకుండా మార్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదని వారు అభిప్రాయపడినట్లు ఆ కథనం పేర్కొంది. ఇలాంటి మార్పులను సూచించే లేదంటే అమలు చేసే అధికారం న్యాయశాఖకు మాత్రమే ఉందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఈసీ వివరణ ఏంటి?అయితే ఫామ్–6ను తాము మార్చలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అసలు చట్టబద్ధమైన ఫామ్–6 యథాతథంగానే ఉందని.. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం దానికి కేవలం ‘అనెక్సర్–డి’ అనే అదనపు డిక్లరేషన్‌ను జత చేశామని వివరించింది. మే 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ డిక్లరేషన్ జత చేసే అంశానికి సమర్థన లభించిందని కూడా ఈసీ పేర్కొంది. ఎస్ఐఆర్కు సంబంధించిన నిర్ణయాలకు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదం ఉందని తెలిపింది.ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తొలగింపుఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో ఫామ్–6కు జత చేసిన అదనపు డిక్లరేషన్‌ను సెప్టెంబర్ 30 నుంచి ఈసీఐనెట్(ECINET) పోర్టల్ నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు సాధారణ ఫామ్–6తోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న 13 రాష్ట్రాల్లో ఈ అదనపు డిక్లరేషన్ అందుబాటులోనే ఉంటుంది. ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో మాత్రమే ఈ అదనపు ఫామ్ అవసరం ఉండదని ఈసీ స్పష్టం చేసింది.ఆందోళనలకు సిద్ధమవుతున్న విపక్షాలుఫామ్–6 వివాదంతోపాటు ఎస్ఐఆర్పై విపక్షాలు ఎన్నికల సంఘంపై విమర్శలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలకు నిర్ణయించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 8వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అక్టోబర్ 6న విపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు.ఫామ్–6లో మార్పులపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న మాత్రం ఇదే. ఈ మార్పు చేయాలని టీసీఎస్‌ను ఆదేశించింది ఈసీలో ఎవరు? ఆ నిర్ణయానికి ఎవరు ఆమోదం తెలిపారు?. ఈ ప్రశ్నలపై ఎన్నికల సంఘం, టీసీఎస్ నుంచి వచ్చే తదుపరి వివరణ కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: ఆఫ్రికా నుంచి సీబీఐ ఆఫీసర్లా? -
రేవంత్ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనంతట తాను కొన్ని అనవసర అంశాలను ప్రస్తావిస్తున్నారా? లేక సలహాదారులు , పీఆర్ టీమ్ రాసి ఇస్తున్న వాటిని పాలో అవుతున్నారో తెలియదు. కాని ఆయన చేస్తున్న ప్రసంగాలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని వ్యాఖ్యలు హేతుబద్దంగా కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో అస్సాం చెందిన ఒక మీడియా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒటర్ల జాబితా ప్రత్యేక సవరణను బ్రిటిష్ హయాం నాటి సైమన్ కమిషన్‌తో పోల్చారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ శ్రీరాముడు ఉత్తరాది దేవుడు, ఉన్నవారి దేవుడు, శివుడు దక్షిణాది దేవుడు అంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ముందు ఆయన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే బాగుంటుంది. అలాకాకపోతే ఆయన విమర్శలకు గురి అవుతారు. ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలను నిర్వహిస్తున్న తీరుపై , ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ అంశంలో అనుసరిస్తున్న విధానాలపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈసీలో జరిగిన పరిణామాలపై ఇచ్చిన సంచలన కధనంతో ఆ సంస్థ ఆత్మరక్షణలో పడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఆందోళనలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనలలో పాల్టొంటోంది. హైదరాబాద్ లో పీసీసీ అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు నిరసనలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణపై గత కొన్ని నెలలుగా రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో దీని పరిస్థితిపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈసీ పనితీరును ఉతికి ఆరేస్తున్నారు. దానికి ప్రతిగా బీజేపీ జవాబు ఇస్తోంది. ఇదంతా వేరే కధ. తాజాగా ఢిల్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు బహుశా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించడానికి చేశారా అన్న సందేహం కలుగుతుంది.ఆనాటి భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించడానికి, రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడానికి సైమన్ కమిషన్ ఏర్పడింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ పై ఆందోళనకు పిలుపు ఇచ్చింది. సైమన్ కమిషన్ లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నది ఈ నిరసనకు ప్రధాన కారణం. దీనిని ప్రస్తుత భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్కు పోలిక ఏమిటో తెలియదు. ఓటర్ల జాబితా సవరణ లో వివక్ష జరుగుతోందని, విపక్షం అదికారంలో ఉన్న రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు అవుతున్న వైనంపై పలు అభియోగాలు వచ్చాయి.అసలు చట్టం లేకుండానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం, ఓటర్ నమోదుకు అవసరమయ్యే ఫామ్ 6 లో పలు మార్పులు పార్లమెంటుతో సంబంధం లేకుండా చేయడం, ఓట్ల తొలగింపు ప్రక్రియను డిల్లీ లో కేంద్రీకృత విధానంలో చేయడం వంటివాటిపై అనుమానాలు వచ్చాయి. ఈ విషయాలను వివరించడం తప్పు కాదు.కాని తెలిసి,తెలియని రీతిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రసంగం చేస్తే అది ఆయనకు అంత ప్రతిష్టనివ్వదు. 13 కోట్ల ఓట్లను తొలగించిన వైనం, జనాభా పెరుగుతుంటే, ఓట్లు ఎలా తగ్గుతున్నాయని ప్రశ్నించడం వంటివి సమంజసమే. తమాషా అంశం ఏమిటంటే దేవుళ్లకు కూడా ఉత్తరాది, దక్షిణాది అని పేర్లు పెట్టడం. బహుశా దేశంలో ఏ రాజకీయ నేత ఇలాంటి విశ్లేషణ గతంలో చేసి ఉండరు.పైగా శివుడు పేదల దేవుడని, రాముడు సంపన్నుల దేవుడని ఆయన వర్గీకరించారు. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్,బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు తదితరులు దేవుళ్లను కూడా చీల్చుతారా? అని విమర్శిస్తూ కాంగ్రెస్ ది ఎప్పుడూ విభజించే విధానమే అని ధ్వజమెత్తారు.ఆ రకంగా బీజేపీకి ఈయన అవకాశం ఇచ్చినట్లయింది కదా! రేవంత్ చేసిన ఈ వాదనలో హేతుబద్దత కూడా కనిపించదు. నిజానికి ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా భక్తులు శ్రీరాముడు, శివుడులను కొలుస్తారు. శ్రీరామ నవమి వస్తే శ్రీరాముడిని, శివరాత్రి వస్తే శివుడికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో రాముడి గుడి లేని గ్రామం ఉండదంటే ఆశ్యర్యం కాదు. అదే విధంగా శ్రీశైలంతో సహా పలు చోట్ల శివాలయాలు ఉంటాయి. భద్రాద్రిలో అదికారికంగా శ్రీరామనవమి చేస్తారు. ఎపీలో ఒంటిమింట, రామతీర్ధంలలో ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. ఉత్తరాదిలో శివాలయాలు పెద్ద ఎత్తునే కనిపిస్తాయి. ఉదాహరణకు వారణాసిలో ఉన్నది శివలింగమే కదా! కేదార్ నాద్, బదరీనాద్, అమరనాద్ వంటి ప్రముఖ క్షేత్రాలలో శివార్చనలు జరుగుతుంటాయి. అంతేకాదు.. లక్షల సంఖ్యలో ఉండే దేవుళ్లను ఆయా ప్రాంతాలలో ఆచారాలను బట్టి పూజిస్తారు. దీనికి ప్రాంతీయత ఆపాదించడం ఏమిటో! అయోధ్యలో రాముడికి బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రహ్మండమైన రీతిలో గుడి కట్టించిన నేపధ్యంలో ఆయన సంపన్నుల దేవుడని అన్నారో, లేక బీజేపీ సంపన్నుల పార్టీ అని చెప్పడానికి ఈ ఉపమానం వాడారో తెలియదు కాని అంత అర్దవంతంగా కనిపించదు.ఇదీ చదవండి: గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?సాధారణంగా ఒక మాట చెబుతారు. విష్ణువు ధనికుడుగాను, శివుడు తిరిపమెత్తే దేవుడుగాను ప్రాచుర్యంలో ఉంటారు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ అన్నారేమో కాని, దానిని సరిగా చెప్పలేకపోయారనిపిస్తుంది. ధనిక, పేద తేడా లేకుండా హిందూ భక్తులు అంతా ఈ దేవుళ్లను పూజిస్తుంటారు. బీజేపీ వారు హరహర మహాదేవ అనరని రేవంత్ వ్యాఖ్యానించగానే, ప్రధాని మోడీ శివరాత్రినాడు అవే పదాలు వాడుతూ ప్రార్దనలుచేసిన వీడియోలు వచ్చేశాయి. అంటే సి.ఎమ్. స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచేస్తుంది. తన గురువు చంద్రబాబు మాదిరే ఏది పడితే అది మాట్లాడితే రేవంత్ కే నష్టం అని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటాయి. ప్రధాని మోడీ తెలంగాణతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా అన్యాయం చేస్తున్నారని, అంతా గుజరాత్ కే చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించడం విచిత్రమే. బీజేపీ పాలిత రాష్ట్రాల తరపున ఈయన వకల్తా తీసుకోవడం ఏమిటో తెలియదు. అందుకు ఏమైనా ఉదహరణలు ఇచ్చారా అంటే అదీ కనబడదు. తాను కాంగ్రెస్ లోకి ఎందుకు రావల్సి వచ్చింది తదితర విశేషాలు చెప్పారు. వాటిలో అభ్యంతరాలు ఏమి లేవు. సహజంగానే బీఆర్ఎస్ పైన, కేసీఆర్‌పైన విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఆంధ్రవాళ్ల పెత్తనంపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని రేవంత్ చెబుతున్నారు. మరి ఇప్పటికీ ఆయన ఆంధ్రా నాయకుడైన చంద్రబాబు నాయుడుకే శిష్యుడుగా ఉంటున్నారన్న విమర్శ ఎందుకు వస్తోంది? టీడీపీ ఎంపీ ఒకరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డా, అలాగే మరో ఎంపీ కుమారుడు చేసిన కారు ప్రమాదంలో ఒక మహిళ మరణించినా అరెస్టు చేయకపోవడం, ఏపీకి చెందిన కొందరు నేతలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా చట్టాన్ని అమలు చేయకుండా, చూసిచూడనట్లు పోవడం వంటివాటిని గమనిస్తే ఇంకా వారి పెత్తనానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గి పనిచేస్తున్నదన్న భావన కలగదా! ఏది ఏమైనా రేవంత్ జాతీయ స్థాయిలో ప్రొజెక్టు కావాలన్న ఆలోచనలో తప్పు లేదు. కాని ఆ క్రమంలో చేసే ప్రసంగాలు, వ్యాఖ్యల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై ఏపీ CJP సంచలన వ్యాఖ్యలు
-
గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?
రాజకీయ ప్రయోజనాలకోసం ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీయడం విచారకరం.. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్య.2019లో చంద్రబాబే చేసిన ఇంకో వ్యాఖ్యను గమనించండి. మోదీ దేశంలోని ప్రతిష్టాత్మక వ్యవస్థలను ధ్వంసం చేశారు. బీజేపీ పాలనలో వ్యవస్థల స్వతంత్రత, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయి. సీబీఐ మొదలు ఆర్బీఐ వరకు... ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను కూడా వదలిపెట్టడం లేదు.ఈ రెండు వ్యాఖ్యలను చదివితే ఏమనిపిస్తుంది? చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నేతల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటోందా? లేక బలపడుతోందా? అన్న భావన కలగదా! తాను అధికారంలో ఉంటే అంతా సజావుగా ఉన్నట్లు, అధికారంలో లేకపోతే వ్యవస్థలన్నీ పాడైనట్లు జనం అనుకోవాలన్నమాట. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్ నియమితులైనప్పటి నుంచి వివాదాలు మరీ తీవ్రమైనట్లు అనిపిస్తుంది. గతంలో కూడా కొందరు సీఈసీలపై విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి వచ్చినవి తీవ్రమైన అభియోగాలు.గతంలో టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని గడగడలాడించారంటే అతిశయోక్తి కాదు. కాస్త దుందుడుకు అన్న విమర్శ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడాలంటే, అదికారులు రాజకీయ నేతలకు సహకరించాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. చివరికి గోడలపై ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకునేవారు. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విబేధాలు రావడంతో, ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా మార్చారు. ఆయన తనకు సన్నిహితుడైన జీవీజీ కృష్ణమూర్తిని నియమించారని అంటారు. శేషన్‌కు చెక్ పెట్టడానికి ఈ ఏర్పాటు జరిగిందన్న భావన అప్పట్లో ఉండేది. ఆనాటి నుంచి త్రిసభ్య కమిషనే కొనసాగుతోంది. కొన్నిసార్లు విమర్శలు వచ్చేవి.కేంద్రంలో శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కొందరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేసి వెళ్లిపోయిన ఘట్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా, బీజేపీ అదికారంలోకి వచ్చాక కొన్ని ఇలాంటివి జరిగాయి. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఒకరి కుటుంబ సభ్యులపై ఈడీని ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎంపిక కమిటీలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బదులుగా కేంద్ర మంత్రిని ఒకరిని నామినేట్ చేసే పద్దతిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. లోక్‌సభలో విపక్ష నేతకు ఇందులో స్థానం ఉన్నా ఆ పాత్రను నామమాత్రం చేశారన్నమాట.గత 2024 ఎన్నికలకు ముందు జ్ఞానేశ్‌కుమార్‌ను ఎంపిక చేసుకున్న వైనం, అంతకుముందు కేంద్రంలో ఈయన కీలక పాత్ర పోషించిన తీరు, గతంలో కేరళలో పనిచేసినప్పుడు వచ్చిన విమర్శలు, ప్రధాని, హోం మంత్రులకు ఈయన సన్నిహితుడన్న ప్రచార నేపథ్యం వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే సహజంగానే ఆయా వర్గాలకు అనుమానాలు కలుగుతాయి. దానికి తోడు పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో 2024 ఎన్నికలు జరిగిన తీరుతెన్నులపై ఎన్నో సంశయాలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షల ఓట్ల తొలగింపు, లేదా పెండింగులో పెట్టడం, పోలింగ్ జరిగేనాటికి కూడా ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించకపోవడం, ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు, అర్ధరాత్రి దాటిన తర్వాత లక్షల ఓట్లు పోలైనట్లు చూపించడం, వీటిపై ఆధార సహితంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వంటివి ఎన్నికల సంఘంలో పారదర్శత లేదన్న అభిప్రాయం కలిగించింది.కొన్ని ఉదాహరణలు చూడండి.. పశ్చిమబెంగాల్లో 27 లక్షల ఓట్లను పెండింగ్‌లో ఉంచారట. వాటి సంగతి తేల్చకుండా ఎన్నికలు పూర్తి చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వాటిని పరిశీలిస్తుంటే 97 శాతం ఓట్లు నిజమైనవేనని తేలుతోందట. ఏపిలో సాయంత్రం ఆరు తర్వాత ఏభై లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? అందులోను అర్దరాత్రి 12 గంటల నుంచి రెండుగంటల వరకు 17 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎన్నికల సంఘం మౌనముద్ర దాల్చింది. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసినా కిమ్మనలేదు. పరకాల ప్రభాకర్ వంటి వారు పరిశోధన చేసి సదస్సులు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నా, జవాబు ఇవ్వడం లేదు. ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేస్తారా అని కూడా అడగలేకపోయింది.ఇదీ చదవండి: బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?విశేషం ఏమిటంటే 2009లో కాని, 2019లో కాని ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎంల పైన తీవ్ర విమర్శలు చేసి, అవి మానిప్యులేషన్‌కు గురి అవుతున్నాయని ఆరోపించారు. నిజానికి అప్పట్లో ఈవీఎంలపై ఈ స్థాయిలో సందేహాలు రాలేదు. అయినా వాటి ద్వారా అక్రమాలు చేయవచ్చని ఆయన అనేవారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడేమో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా విమర్శలు చేయరాదని సుద్దులు చెబుతున్నారు. 2019లో ఆనాటి ప్రధాని మోదీపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది ఆయన ట్వీట్లే తెలియచేస్తాయి. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను ధ్వంసం చేశారని కూడా ఆనాడు ఆరోపించారు. ఇప్పుడేమో ఇలా అమాయకంగా మాట్లాడుతున్నారు. అవే ఆయన తెలివితేటలు.చంద్రబాబు వ్యూహాత్మకంగా, ఎలాగొలా బతిమలాడి 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల కమిషన్ పూర్తిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆనాటి బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమకు ఏ ఏ అధికారి కావాలో చెబుతూ జాబితాను సమర్పిస్తే, చాలావరకు ఎన్నికల సంఘం అమలు చేసిందని చెబుతారు. సీసీ టీవీ ఫుటేజీ ఒకసారి లీక్ అయింది. దానిని టీడీపీ ప్రచారం చేసింది. అయినా అదెలా జరిగిందని ఈసీ అడగలేదు. ఎన్నికలయ్యాక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్దిష్ట గడువుతో సంబందం లేకుండా వివిపాట్ స్లిప్‌లను దగ్దం చేసేయడం పలు సందేహాలకు అవకాశం ఇచ్చింది.కొందరు వైఎస్సార్సీపీ నేతలు కొన్ని బూత్‌లలో ఓట్లను తిరిగి లెక్క వేయాలని కోరుతూ దరఖాస్తు చేసినా అందుకు ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దపడలేదు. దీనిపై న్యాయవ్యవస్థ వద్దకు వెళ్లినా ప్రయోజనం కలగకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన వ్యవస్థలు ఇలా వ్యవహరిస్తున్నాయేమిటా అని చాలామంది బాధపడ్డారు. కాని జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నికల కమిషన్‌లో జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం చెప్పిన విధానం.. అన్నిటిని జర్నలిస్టు రితిక చోప్రా వెలుగులోకి తీసుకువచ్చిన కథనం సంచలనం అయింది. ఇందుకు ఆమె చేసిన కృషిని అంతా అభినందించాలి. ఎన్నికల కమిషన్‌లోని డొల్లతనం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు ఇలా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు చట్టంలో ఎక్కడా అవకాశం లేదని, మాజీ ఎన్నికల ముఖ్య కమిషన్ ఖురేషి వెల్లడించారు. అయినా జ్ఞానేశ్‌కుమార్ ఎలా చేశారంటే ఏమి చెబుతాం. కేవలం బీజేపీ, దానికి మద్దతు ఇచ్చే పార్టీల కోసమే పనిచేస్తున్నారని, విపక్ష పార్టీల వాదనలను పెడచెవిన పెడుతున్నారన్న భావన కలిగితే వ్యవస్థకు ఎంత నష్టం. ఎవరు ఫిర్యాదు చేసినా అందులోని వాస్తవాలను విచారించి న్యాయం ఏమిటో తేల్చవలసిన ఎన్నికల వ్యవస్థే ఏకపక్షంగా మారితే ఎన్నికలు జరిగి ఏమి ఉపయోగం? ఇదంతా నియంతృత్వానికి దారితీయదా? అందువల్లే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలవరం సృష్టిస్తోంది.జ్ఞానేశ్ రాజీనామాకు విపక్షంలోని కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, సమాజవాది, తదితర పార్టీలతో పాటు యువతకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంపై పునఃసమీక్ష జరగాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో తాము మద్దతు ఇచ్చినప్పటికీ, జరిగిన పరిణామాల రీత్యా దీనిలో మార్పు రావాలని ఆయన కోరారు. ఈ అంశంపై కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా జాగ్రత్తగా స్పందించాయి. వాటిలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈసీ వివరణ ఇవ్వాలని తొలుత సూచించారు. దానికి టీడీపీ అధినాయకత్వం కంగారుపడినట్లు ఉంది. తదుపరి ఈసి ఇచ్చిన వివరణ అంత సంతృప్లిగా లేనప్పటికీ, చంద్రబాబు నాయుడు బీజేపీకి కోపం రాకుండా వెంటనే స్పందించారు.ఇంతకాలం ఏపిలో జరిగిన ఎన్నికల ప్రహసనంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మాట్లాడని చంద్రబాబు దీనిపై మాట్లాడుతూ వ్యవస్థల విశ్వసనీయత గురించి ధర్మోపదేశం చేశారు. ఏపిలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అవకతవకలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం జరగలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివి లేకుండా ఓటర్ల జాబితాలను తయారు చేయాలన్న చిత్తశుద్ది ఉంటే, ఆధార్ కార్డుకు లింక్ పెట్టి ఓట్లను ఖరారు చేస్తే సరిపోతుందని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. అది చేయకుండా ఎన్నో విన్యాసాలను ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ చేస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఎలా కుదురుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫార్మ్-6పై ఈసీ కీలక నిర్ణయం, కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
-
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద ఫారం-6లో మార్పులను ఎన్నికల సంఘం తొలగించింది. మార్పులను చట్ట విరుద్ధం అంటూ గతంలో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఎస్ఐఆర్ ముగిసిన రాష్ట్రాల్లో పాత ఫారం-6 మళ్ళీ అమల్లోకి తెచ్చారు. ‘సర్’ డిక్లరేషన్‌పై ఈసీ కీలక మార్పు చేసింది.ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లోని అదనప ‘సర్’ డిక్లరేషన్‌ను ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసీ తొలగిస్తూ నిర్ణయం తీసకుంది. ఆయా ప్రాంతాల్లో కొత్త ఓటర్లు సాధారణ ఫారం-6 మాత్రమే సమర్పించాలి. ‘సర్’ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ అదనపు డిక్లరేషన్ కొనసాగించనున్నారు.గతంలో ఈ డిక్లరేషన్ ద్వారా దరఖాస్తుదారులు, వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గతంలో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాల్లో ఉన్నట్లు వివరాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సెప్టెంబర్ 26న సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది.ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ‘ఇరుముడి’ సీన్ రిపీట్! -
అధికారం మారితే ప్రమాణం మారేనా?
ఎన్నికల సంఘం సాధారణ ప్రభుత్వ విభాగం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల నిర్వహణకు సర్వా ధికారం కలిగిన రాజ్యాంగ సంస్థ. అందువల్ల దాని నిర్ణయాలపై ప్రజలకు విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యవసరం. ఇటీవల ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు కొన్ని నిర్ణయాలు, విధానాలపై అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తం చేసి నట్లు వచ్చిన వార్తలను ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి దాదాపు పది నెలల వ్యవధిలో అనేక సందర్భాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్), ఫారం–6, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ, సాంకేతిక వ్యవస్థ, అప్పీళ్ల వంటి అంశాలపై అభ్యంతరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం–6లో సర్‌కు సంబంధించిన ప్రశ్నలను చేర్చడంపై చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న భిన్నాభిప్రాయం ఉన్నదా లేదా అన్నది కాదు. ఆ చర్యకు చట్టబద్ధమైన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అనేదే.సమస్య ‘మెజారిటీ’ కాదు!ఎన్నికల సంఘం తన చర్యలన్నీ చట్టం, నిబంధనలకు అను గుణంగానే జరిగాయనీ, పది నెలల కాలంలోని కొన్ని అంతర్గత నోట్లను మాత్రమే చూపడం ద్వారా మొత్తం వ్యవహారంలో ఒక భాగాన్ని మాత్రమే చూపుతున్నారనీ చెబుతోంది. అంతర్గత చర్చలో భిన్నాభిప్రాయాలు ఉండటం అసాధారణం కాదు. ఒక కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారనే కారణంతో ఆ నిర్ణయం వెంటనే చట్టవిరుద్ధం కాదు. అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. ‘తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయి’ అనే ప్రకటన ఒక్కటే, ప్రతి చర్యకు చట్టబద్ధమైన అధికారం ఉందని నిరూపించదు. అందుకే మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఎస్.వై. ఖురేషీ, ఓ.పి. రావత్ సూచించినట్లు, ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన రికార్డు లను– ఎవరు ఏమి ప్రతిపాదించారు, ఎవరు అభ్యంతరం తెలి పారు, తుది నిర్ణయం ఏమిటి, అది ఏకగ్రీవమా లేక మెజారిటీ తోనా– ప్రజలకు అందు బాటులో ఉంచడం మంచిది. ఇక్కడ ఒక చట్టపరమైన స్పష్టత అవసరం. ప్రతి నిర్ణయం ఏకగ్రీవంగా ఉండాల్సిందేనని చెప్పడం సరైంది కాదు. వర్తించే చట్టపరమైన విధానాన్ని అనుసరించి అవసరమైనప్పుడు మెజా రిటీతో నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ప్రశ్న ‘అందరూ అంగీకరించారా?’ అనేది మాత్రమే కాదు; ‘చట్టబద్ధమైన విధానాన్ని అనుస రించి నిర్ణయం తీసుకున్నారా?’ అనేదే.ఇంకా తీవ్రమైన ప్రశ్న ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణకు సంబంధించినది. ఎన్నికల నమోదు అధికారులకు చట్టం ఇచ్చిన అధికా రాలను ఏదైనా కేంద్ర సాంకేతిక వ్యవస్థ అధిగమిస్తే, అది కేవలం సాంకేతిక సమస్య కాదు; అది చట్టపరమైన సమస్య. సాఫ్ట్‌వేర్‌కు స్వయంగా చట్టబద్ధమైన అధికారం ఉండదు. అది చట్టబద్ధమైన అధికారికి సహాయపడాలి కానీ అతని స్థానాన్ని ఆక్రమించకూడదు. అందువల్ల ఓటర్ల డేటాబేస్‌పై స్వతంత్ర సాంకేతిక ఆడిట్ అవసరం. ఎవరు డేటాను మార్చగలరు? ఏ అధికారి ఆదేశంతో మార్పు జరుగుతుంది? స్థానిక ఎన్నికల నమోదు అధికారి నిర్ణయాన్ని కేంద్ర వ్యవస్థ మార్చగలదా? ప్రతి మార్పుకు డిజిటల్ రికార్డు ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలి.నిష్పాక్షికంగా ఉండటమే కాదు, కనిపించాలి!పశ్చిమ బెంగాల్లో తొలగించిన ఓటర్లకు సంబంధించిన భారీ సంఖ్యలో అప్పీళ్ల విషయంలో కూడా ఇదే పారదర్శకత అవసరం. ఎన్నికల సంఘం తరఫున అప్పీళ్లు దాఖలు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ చట్టం కింద ఇచ్చారు? ఆ నిర్ణయాన్ని ఎవరు అమలు చేశారు? అన్నది రికార్డులతో స్పష్టమవ్వాలి. ఈ వివాదానికి మరో రాజ్యాంగపరమైన నేపథ్యం ఉంది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టం– ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి నియమించే కేంద్ర కేబినెట్ మంత్రిని ఉంచింది. ఇటీవల జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ మార్పు కేంద్ర ప్రభుత్వానికి ప్రభావవంతమైన వీటో లభించే పరిస్థితిని సృష్టిస్తుందనీ, ఇది ‘పర్సెప్షన్ టెస్ట్’ పరంగా ప్రశ్నలు లేవ నెత్తుతుందనీ వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా కనిపించాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్య స్పష్టం చేస్తుంది. ఇక్కడే నవీన్ చావ్లా వ్యవహారం గుర్తుకు వస్తుంది.కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, 2006లో ఎన్డీఏ 205 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు వినతిపత్రం సమర్పించి, ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని కోరింది. ఆయనకు కాంగ్రెస్ నాయకులతో రాజకీయ, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయనీ, అవి ఎన్నికల కమిష నర్ నిష్పాక్షికతపై సందేహాలు కలిగిస్తున్నాయనీ ఎన్ డీఏ ఆరోపించింది. ఆ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ సమయంలో బీజేపీ ముందుకు తెచ్చిన ప్రధాన సూత్రం– ఎన్నికల కమిషనర్ నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా, ఉన్నట్టు కనిపించాలి కూడా.అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ2006 పరిస్థితిని 2026 పరిస్థితితో పూర్తిగా సమానం చేయడం సరైంది కాదు. అప్పటి ఆరోపణలు ఒక కమిషనర్ రాజకీయ సంబంధాలపై ఉండగా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విధానాలు, ఫారాలు, డేటాబేస్, అంతర్గత నిర్ణయ ప్రక్రియపై కమిషనర్ల అభ్యంతరాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ రాజ్యాంగ సూత్రం మాత్రం ఒకటే– ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం ఉండాలి. 2006లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి, పార్లమెంటు, న్యాయస్థానం వంటి సంస్థాగత మార్గాలను ఉపయోగించింది. నేడు ప్రతిపక్ష పార్టీలూ అదేస్థాయి ఆధారాలతో ముందుకు రావాలనుకుంటే, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అధికారిక రికార్డులు కోరాలి, నిర్దిష్ట చర్యలను న్యాయపరంగా సవాలు చేయాలి, అవసరమైతే స్వతంత్ర ఆడిట్ కోరాలి.మరి బీజేపీ ఏం చేయాలి? 2006లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోరిన అదే ప్రమాణాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పాటించాలి. ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను రాజకీయ దాడిగా కొట్టిపారేయకుండా రికార్డులను బహిర్గతం చేయాలి. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏదైనా చర్య జరిగినట్లు నిర్ధారణ అయితే దానిని సరిచేయాలి. ఓటర్ల హక్కులకు నష్టం జరిగితే పరిహార మార్గం కల్పించాలి. తప్పు చేసిన వ్యక్తి ఎవరు అనేకంటే, తప్పు ఎలా జరిగింది, దాన్ని ఎలా నిరోధించాలి అన్నది చూడాలి. ఇది బీజేపీకే కాదు, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలకూ వర్తించే ప్రమాణం కావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రమాణం, అధికా రంలో ఉన్నప్పుడు మరో ప్రమాణం ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాదకరం. ఎన్నికల సంఘం బీజేపీ వైపుందా, కాంగ్రెస్ వైపుందా అనేది ప్రశ్న కాదు. ఎన్నికల సంఘం రాజ్యాంగం వైపు ఉందని ప్రజ లకు స్పష్టంగా కనిపించేలా పనిచేస్తున్నదా? అదే అసలు పరీక్ష. గెలిచినవారికీ, ఓడిపోయినవారికీ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేంత విశ్వాసం కలిగించగలిగితేనే ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించినట్లవుతుంది.ఆచార్య మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు: ఖర్గే ఫైర్
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మగా మారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వీధి పోరాటాల నుంచి పార్లమెంట్ వరకు పోరాడతామని స్పష్టం చేశారు.గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కును విస్తరించారని పేర్కొన్న ఖర్గే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘ఓటు రద్దు’ కుట్రలతో ప్రజల హక్కును లాక్కుంటోందని ఆరోపించారు. పదేళ్ల క్రితం ‘నోట్ల రద్దు’తో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, ఇప్పుడు ‘ఓట్ల రద్దు’తో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఫారమ్-6 నిబంధనలను అక్రమంగా మార్చడం ద్వారా ‘జెన్ జీ’ యువతను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని కూడా ఖర్గే ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.News Alert! Political parties must be provided with electoral rolls, relevant data in simple format, in a timely manner: Kharge.News Alert! Independent, time-bound inquiry must be conducted wherever evidence of serious discrepancies emerge: Kharge.News Alert! Kharge seeks… pic.twitter.com/m9kMBUFpyf— Press Trust of India (@PTI_News) September 29, 2026ఓటర్ల జాబితాపై ఐదు డిమాండ్లు..ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ CWC సమావేశంలో ఐదు కీలక డిమాండ్లతో తీర్మానం ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఓటర్ల జాబితాలో చేపట్టే మార్పులకు సంబంధించిన డేటాను తక్షణమే బహిరంగపరచాలని డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించే ముందు సంబంధిత ఓటర్లకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు.. అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. ఎన్నికల నిర్వహణలో తీవ్ర అక్రమాలు వెలుగుచూసిన ప్రాంతాల్లో స్వతంత్ర విచారణ జరిపించాలని సూచనలు చేసింది.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ ఎపిసోడ్.. ఇండియా కూటమి సంచలన నిర్ణయం -
కాంగ్రెస్ VS ఈసీ CEC జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలి
-
ఈసీ వివాదం.. అదే డిమాండ్ చేసిన మహారాష్ట్ర సీఈవో!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో మహారాష్ట్ర నుంచి కీలక ప్రతిపాదన వచ్చింది. ఓటర్ల వివరాల్లో సాఫ్ట్వేర్ గుర్తించే చిన్నపాటి వ్యత్యాసాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు మరింతగా ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. చోక్కలింగం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే..ఇందుకోసం ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌లో నాలుగు మార్పులు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ముఖ్యంగా ‘లాజికల్ డిస్క్రెపెన్సీ’గా గుర్తించిన కేసుల్లో.. ఓటరు సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ERO) సంతృప్తి చెందితే, ఆ కేసును స్వయంగా పరిష్కరించే అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే అవసరమైన ఆధారాలు ఉన్నప్పుడు సంబంధిత ఓటరును వ్యక్తిగత విచారణకు పిలవకుండా మినహాయించే ఆప్షన్ కూడా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో ఈఆర్వో వద్ద ఆధారాలు ఉన్నా.. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న పరిమితుల కారణంగా కేసును ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదే అంశం.. ఈసీ వివాదానికి కేంద్రబిందువుమహారాష్ట్ర సీఈవో ఇప్పుడు లేవనెత్తిన అంశం ఇక్కడే కీలకంగా మారింది. ఎందుకంటే ఈఆర్వోల అధికారాలు, ఈసీఐనెట్‌లో వారి యాక్సెస్‌పై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా గతంలో పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా తయారీ, పేర్లు చేర్చడం, తొలగించడం, అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవడం వంటి బాధ్యతలు చట్టపరంగా ఈఆర్వోలకే ఉన్నప్పటికీ.. సాఫ్ట్‌వేర్‌లో కొన్ని నిర్ణయాలు లేదంటే మార్పులకు అవసరమైన యాక్సెస్ కేంద్రీకృత నియంత్రణలో ఉండటంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు.అసలు ఈసీఐనెట్ ఏం చేస్తోంది?సర్‌లో ప్రస్తుత ఓటరు వివరాలను గత సర్‌లోని తల్లిదండ్రులు, తాతముత్తాతల వివరాలతో సాఫ్ట్వేర్ సరిపోల్చుతుంది. పేరు, వయసు వంటి వివరాల్లో తేడా కనిపిస్తే దాన్ని ‘లాజికల్ డిస్క్రెపెన్సీ’గా గుర్తిస్తుంది. అయితే ఇలాంటి మిస్ మ్యాచ్ రావడం అంటే ఆ వ్యక్తి ఓటరు కాదని తేల్చినట్లు కాదు. కేవలం పాత రికార్డులతో వివరాలు సరిపోలలేదన్నమాట.ఇక్కడే ఈఆర్వోల పాత్ర కీలకం. ఓటరు ఇచ్చిన పత్రాలను పరిశీలించి, అవసరమైతే విచారణ జరిపి.. ఆ వ్యక్తి పేరు జాబితాలో ఉండాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన ఆప్షన్లు, యాక్సెస్ కూడా ఉండాలన్నది మహారాష్ట్ర సీఈవో తాజా డిమాండ్ సారాంశం.అందుకే ‘ఫ్రీ హ్యాండ్’ డిమాండ్మహారాష్ట్ర సీఈవో ప్రతిపాదన వెనుక ఉన్న అసలు విషయం ఇదే. సాఫ్ట్వేర్ ఒక వ్యత్యాసాన్ని గుర్తించడం ఒక అంశం. ఆ వ్యత్యాసానికి ఓటరు ఇచ్చిన వివరణ, పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మరో అంశం. రెండో విషయంలో ఈఆర్వోకు మరింత వెసులుబాటు ఉండాలని ఆయన కోరుతున్నారు. ఇదే అంశంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా గతంలో ఈఆర్వోల చట్టపరమైన అధికారాలను సాఫ్ట్వేర్ పరిమితం చేయకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో మహారాష్ట్ర సీఈవో తాజా లేఖతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.ఇప్పటికే కొన్ని మార్పులుఈ వివాదం నేపథ్యంలో సెప్టెంబర్ 26న ఎన్నికల సంఘం ఈసీఐనెట్పై సమీక్షకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే సర్ నోటీసులు అందుకున్నవారి విషయంలో విధానాన్ని సులభతరం చేసింది. అవసరమైన పత్రాలను బీఎల్వోలు ఓటర్ల ఇళ్ల వద్దే సేకరించి ఈసీఐనెట్‌లో అప్లోడ్ చేయవచ్చని, సంతృప్తికరమైన పత్రాలు ఉంటే ఈఆర్వో వ్యక్తిగత విచారణ నుంచి మినహాయించవచ్చని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి అధికారులకు మరింత వెసులుబాటు అవసరమైతే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామని కూడా ఈసీ తెలిపింది.అందుకే ఇప్పుడు మహారాష్ట్ర సీఈవో లేవనెత్తిన డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది. సర్‌లో సాఫ్ట్వేర్ గుర్తించే మిస్‌మ్యాచ్ ఒకటైతే.. దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్వోది. ఆ నిర్ణయాన్ని తీసుకునేందుకు ఈఆర్వోకు సాఫ్ట్‌వేర్‌లో ఎంత స్వేచ్ఛ ఉండాలి? అనేదే ఈ మొత్తం వివాదంలో కీలకమైన ప్రశ్న.ఇదీ చదవండి: సీఈసీకి చుక్కలు చూపించాలని నిర్ణయం! -
సీఈసీ జ్ఞానేశ్ ఎపిసోడ్.. ఇండియా కూటమి సంచలన నిర్ణయం?
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి గళం విప్పేందుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో.. ఇండియా కూటమి నేతలు రేపు (సెప్టెంబర్ 30) ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే ఈ భేటీలో జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంటులో మరోసారి అభిశంసన/రిమూవల్ మోషన్ తీసుకొచ్చే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.సీఈసీపై తాజా రాజకీయ దుమారం మధ్య ఇండియా కూటమి పార్టీల మధ్య సమన్వయం పెరుగుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) తదితర పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే డీఎంకే హాజరుపై ఇంకా స్పష్టత లేదు.మళ్లీ అభిశంసన తీర్మానం?కాగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై మరోసారి తొలగింపు తీర్మానం తీసుకొచ్చే దిశగా ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, తాజా నోటీసును లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంతకాల సేకరణపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇది ప్రతిపక్షాల నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ చేపట్టే మూడో ప్రయత్నం కావచ్చని వార్తలు వెలువడ్డాయి.సీఈసీని తొలగించే ప్రక్రియ సాధారణ తీర్మానంతో పూర్తయ్యేది కాదు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీలు తొలగింపు తీర్మానానికి నోటీసుపై సంతకం చేయాలి. తీర్మానం స్వీకరించిన తర్వాత ఆరోపణలపై విచారణ జరుగుతుంది. అనంతరం రెండు సభల్లోనూ మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు, హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.‘సర్’పైనే ప్రధాన ఫోకస్ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఉంది. సర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు, అభిప్రాయాల నమోదు సంస్థాగత ప్రక్రియలో సాధారణమేనని, తుది నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని చెబుతోంది.ఇటీవల ఎన్నికల కమిషన్‌లోని ఇతర కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. SIRకు సంబంధించిన కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికలు వెలువడ్డాయి. ఈ పరిణామాల తర్వాతే ప్రతిపక్షాలు తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశాయి.దేశవ్యాప్త ఆందోళనలపై చర్చరేపటి సమావేశంలో అభిశంసన తీర్మానంతో పాటు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్, ఎన్నికల సంఘం నిర్ణయాలపై స్వతంత్ర విచారణ, దేశవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ వంటి అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంపైనా నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. వామపక్ష పార్టీలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. మరోవైపు ఇండి కూటమి సమావేశం అనంతరం ప్రతిపక్ష నేతలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉందని సమాచారం.బీజేపీ, ఈసీ వాదన ఏంటి?ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తిరస్కరిస్తోంది. సర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎన్నికల పరాజయాల నుంచి దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా SIRకు సంబంధించిన తుది నిర్ణయాలు చట్టబద్ధమైన విధానాలను అనుసరించి, ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగా తీసుకున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న జరిగే ఇండియా కూటమి భేటీ కీలకం కానుంది. ఇదీ చదవండి: వాహనదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కఠిన ఆంక్షలు! -
నేడు సీడబ్ల్యూసీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మంగళవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం ‘ఇందిరాభవన్’లో జరిగే ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీ, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, పార్టీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కమిటీ సభ్యులతో పాటు సీనియర్ నేతల హాజరు కానున్నారు. ఎన్నికల కమిషనర్ల మధ్య తలెత్తిన అభ్యంతరాలు, ఫామ్–6లో మార్పులు, ‘ఓటు చోరీ’ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. తదుపరి రాజకీయ, న్యాయపరమైన కార్యాచరణకు సమావేశం దిశానిర్దేశం చేయనుంది. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సందూ, వివేక్ జోషి గత పది నెలల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. ఓటర్ల జాబితాల సవరణ, ఎస్ఐఆర్, ఓటర్ల నమోదుకు సంబంధించిన విధానాలు తదితర అంశాలు ఈ అభ్యంతరాల్లో ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో సీడబ్ల్యూసీ సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది.ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకం సీడబ్ల్యూసీ భేటీ అంశంపై ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘ఇష్టారీతిగా ఎస్ఐఆర్ పేరిట ఓట్లను తొలగిస్తూపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఎస్ఐఆర్ విషయంలో పార్టీ తీసుకోబోయే చర్యలు, వ్యూహాలపై మంగళవారం జరగబోయే సమావేశంలో పార్టీ ముఖ్యుల నుంచి సలహాలు,సూచనలు తీసుకుంటాం. ఎస్ఐఆర్ అంశంలో పోరాటం తీవ్రతరంకానుంది. ఈ అంశం యావత్ భారతదేశానికిది. ఇది ప్రజాస్వామ్యం ఉనికికి, దేశ అíస్తిత్వానికి సంబంధించిన అంశం. అందుకే ఈ అంశంలో ఇంత సీరియస్‌గా ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘంలో జరుగుతున్న అక్రమాలను స్వయంగా కమిషన్‌లోని వ్యక్తులే బట్టబయలుచేస్తున్నారు’’ అని ఖర్గే తెలిపారు. ‘‘జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేశాక కూడా ఆయనపై చర్యలకు పట్టుబడతాం’’అని ఖర్గే స్పష్టం చేశారు. ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం ఈ భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహా, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు తదితరులు మంగళవారం ఉదయానికి ఢిల్లీ చేరుకోనున్నారు. పార్టీ భేటీకి సీనియర్ నేతలైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితర నేతలను ఆహా్వనించారు. -
ముక్త(సరి) కంఠం!
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు శనివారం సమావేశమై ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనని ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య విభేదాలున్నాయన్న కథనాలను తోసిపుచ్చారు. అలా ప్రకటించటానికి రెండు రోజులు పట్టిందంటేనే గృహచ్ఛిద్రాలు దండిగా వున్నాయని అర్థం. మీడియాతో నేరుగా మాట్లాడితే దొరికిపోతామన్న బెరుకు వారిలో ఉన్నదని తాత్పర్యం. దేశవ్యాప్తంగా ప్రజల్లో, పార్టీల్లో ఎన్నో సందేహాలూ, భయాందోళనలూ రేకెత్తించిన వ్యవహారం నాలుగు పేజీల ప్రెస్ నోట్‌తో, ముగ్గురు కమిషనర్ల గ్రూప్ ఫొటోతో సరిపెట్టుకోమంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. వ్యవస్థలు అంతర్గత కలహాల్లో కొట్టుమిట్టాడాలని ఎవరూ కోరుకోరు. కానీ మీడియా కథనాలకు స్పష్టమైన వివరణ ఉండాలా, వద్దా? పారదర్శకంగా, ప్రామాణికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన సంస్థ దాపరికంతో ఉందంటే దాని విశ్వసనీయత, కార్యకలాపాలూ ప్రశ్నార్థకం కావా? ఇద్దరు కమిషనర్లూ లేవనెత్తిన ప్రశ్నలు వారి వ్యక్తిగత తగవు కాదు. అది ఓటు హక్కు కోల్పోయిన కోట్లాదిమంది పౌరుల జీవన్మరణ సమస్యతో ముడిపడి వున్నది. ఈసీ వంటి ఒక కీలక వ్యవస్థలో నిబంధనలు బేఖాతరవుతూ ఇష్టారాజ్యం నడుస్తున్నదన్న అభిప్రాయం కలిగించిన ప్రశ్నలవి.ఈసీ ప్రకటన తీర్చిన సందేహాలకన్నా, రేకెత్తించిందే అధికం. సంధూ, వివేక్ జోషిలిద్దరూ పది నెలల వ్యవధిలో ఏకంగా 14 సార్లు రికార్డుపూర్వకంగా అభ్యంతరం చెప్పారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం అంటున్నది. ఎందుకలా జరిగిందో, వారి అభ్యంతరాలేమిటో ఈసీ చెప్పొద్దా? ఈసీఐనెట్ పోర్టల్‌లో ఫామ్–6కి చేసిన సాంకేతిక మార్పులకు చట్టబద్ధత లేదంటూ వారిద్దరూ వేలెత్తిచూపారని కథనం. అది జరగనేలేదని ఈసీ ప్రకటన ఎక్కడా పేర్కొనలేదు. ఫామ్–6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ప్రకటన చెబుతోంది. అది బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సాగుతున్న సందర్భం వరకూ వాస్తవం. కానీ అటుపై చేసిన మార్పులపై కదా రగడ! దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత లేదా? ఢిల్లీలో సాగిన ‘సర్’పై సమాచార హక్కు కార్యకర్త అంజలీ భరద్వాజ్, అమృత జోహ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై గత మంగళవారం విచారణ సందర్భంగా ఆ ప్రక్రియ యాంత్రికంగా సాగిందన్న అభిప్రాయం కలుగుతున్నదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్కడున్న 97 లక్షల మందికి పైగా ఓటర్లలో 47 లక్షలమంది పేర్లు జాబితాల నుంచి తొలగించారు. ఇందులో 33 లక్షలకుపైగా మందికి ‘తార్కిక వ్యత్యాసాల’ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. ఇదంతా ఈ ముగ్గురి సమష్టి నిర్వాకమో... లేక మీడియా కథనం అంటున్నట్టు మైనారిటీ నిర్ణయం పర్యవసానమో సంజాయిషీ ఇవ్వొద్దా? డేటా నిర్వహణ విషయంలోనూ, కేంద్ర కేబినెట్ కార్యదర్శికి రాసిన లేఖ విషయంలోనూ ఇదే దాపరికం! జాతీయ మీడియాలో కథనాలు వెలువడి అల్లరైంది గనుక ఈమాత్రం వివరణైనా ఇచ్చారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ) ఫిర్యాదుచేసినా, ప్రతినిధి బృందం కలిసినా జవాబు లేదు. ఆ ఎన్నికలు ఆద్యంతమూ బరితెగింపే. ఎన్నికలకు ముందు కూటమి సలహాతో అధికారుల్ని మార్చడం మొదలుకొని వేకువజామువరకూ పోలింగ్ సాగటం, అర్ధరాత్రి లక్షలమంది ఓటేయటం, నిబంధనలకు విరుద్ధంగా వీవీ ప్యాట్ స్లిప్‌లు, సీసీ కెమెరా ఫుటేజ్‌లు ధ్వంసం చేయడంవరకూ ఈ దుర్నీతి యథేచ్ఛగా సాగింది. అదేమంటే మౌనమే సమాధానం. ఇందువల్ల టీడీపీ దండిగా లాభపడింది. అందుకే ‘ఎక్స్‌ప్రెస్’ కథనాల తర్వాత అపోహలు తొలగించాలంటూ ఒక మాయదారి ప్రకటన చేసి... ఈసీ ‘వివరణ’ వెలువడిన మరుక్షణమే సందేహనివృత్తి అయిందంటూ ఆ పార్టీ కొనియాడింది. ఆ వివరణ రాజ్యాంగ సంస్థల నిజాయతీ, విశ్వసనీయతల్ని పునరుద్ఘాటించిందంటూ సీఎం చంద్రబాబు సిగ్గుమాలిన ప్రకటనొకటి చేశారు. అవేమిటో అంశాల వారీగా చెబితే అందరూ విని తరిస్తారు. మౌనంతోనో, అరకొర వివరణతోనో వంచించటం ఎల్లకాలమూ సాగదనీ, తీరు సరిగా లేనపుడు జనం నిలదీస్తారనీ ఈసీ తెలుసుకోవాలి. -
48 గంటల్లో రాజీనామా చేయాలి.. CEC జ్ఞానేష్ కుమార్ కు CPడెడ్‌లైన్..
-
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ అక్టోబర్ 2న ముంబైలో CJP ఆందోళన
-
జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణలు.. థామ్సన్‌కు బీజేపీ నేత కౌంటర్
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై మాజీ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీజీ థామ్సన్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని, గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని జ్ఞానేశ్ కుమార్ తనకు సూచించారని థామ్సన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నేత జోసెఫ్ స్పందించారు. 2017లోనే థామ్సన్ బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి తానే ఆయనను ఆహ్వానించానని జోసెఫ్ వెల్లడించారు.థామ్సన్ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో విమాన ప్రయాణంలో జ్ఞానేశ్ కుమార్ తనను కలిశారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని ఆయన సూచించినట్లు తెలిపారు. కేరళలోని పతనంతిట్ట నుంచి పోటీ చేసి గెలిస్తే ఎంపీగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా అవకాశం లభిస్తుందని చెప్పినట్లు థామ్సన్ పేర్కొన్నారు. అయితే తాను ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని తెలిపారు.థామ్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత జోసెఫ్ ఫేస్బుక్ ద్వారా థామ్సన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా రాజకీయ కార్యకర్తలు తమ మధ్య జరిగిన వ్యక్తిగత చర్చలు, సమావేశాల వివరాలను బహిరంగంగా వెల్లడించరని.. అయితే థామ్సన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తాను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోందని పేర్కొన్నారు. 2017లో తాను బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంఘ్ పరివార్‌కు చెందిన ఓ సీనియర్ నేత తనను సంప్రదించారని జోసెఫ్ తెలిపారు. థామ్సన్‌ను కొచ్చిలో నిర్వహించనున్న మైనారిటీ మోర్చా కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆ నేత తనను కోరినట్లు చెప్పారు. థామ్సన్ తమతో కలిసి రావడానికి ఆసక్తి చూపుతున్నారని కూడా అప్పట్లో తనకు చెప్పినట్లు జోసెఫ్ పేర్కొన్నారు.2017 జూన్ 26న మార్ క్రిసోస్టమ్ను సన్మానించేందుకు నిర్వహించిన కార్యక్రమానికి థామ్సన్ హాజరయ్యారని జోసెఫ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పెట్టారు. వాటిలో థామ్సన్ వేదికపై ఉండటంతో పాటు ప్రసంగిస్తున్న దృశ్యాలు ఉన్నాయని చెప్పారు. అప్పటి యూడీఎఫ్ నేత, మాజీ మంత్రి కేఎం మాణి కూడా కార్యక్రమంలో పాల్గొన్నట్లు జోసెఫ్ పేర్కొన్నారు. బీజేపీ కార్యక్రమానికి హాజరైన థామ్సన్ అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారని జోసెఫ్ తెలిపారు. అనంతరం 2017 నుంచి 2020 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో థామ్సన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే జోసెఫ్ చేసిన ఈ ఆరోపణలకు థామ్సన్ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. అలాగే థామ్సన్ చేసిన బీజేపీ టికెట్ ఆఫర్ ఆరోపణలపై జ్ఞానేశ్ కుమార్ కూడా బహిరంగంగా స్పందించలేదు.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం -
‘సర్’పై అరకొర చర్యలేనా?
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు సంబంధించి ఎన్నికల సంఘం తాజాగా ప్రతిపాదించిన చర్యలు ఆ ప్రక్రియ ఒక వైఫల్యమేనని నిరూపిస్తున్నాయని చెప్పారు. ప్రజలు ఓటు హక్కును కోల్పోతుండగా, ఎన్నికల సంఘం మాత్రం అరకొర చర్యలతో చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం శనివారం జారీ చేసిన ప్రకటన నష్ట నివారణకు చేసే ఒక నిస్సహాయ ప్రయత్నమేనని చెప్పారు. తొలగించే జాబితాలో ఉన్న 5.43 కోట్ల మంది ఓటర్ల కోసం బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓ) ఇప్పుడు వారి ఇళ్లకు వెళ్తారని ఈసీ హామీ ఇచ్చిందని అన్నారు. బీఎల్ఓలు ఇప్పటికే ఇంటింటికీ వెళ్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని తేల్చిచెప్పారు. వారు ఓటర్ల ఇంటికి వెళ్తారన్న నమ్మకం లేదన్నారు. ఇప్పటివరకు దాదాపు 14 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఎన్నికల సంఘంపై జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఓటు హక్కు కోల్పోయినవారు మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని ఈసీ అధికారులపై మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా ఓటు హక్కును తొలగించి, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఏమిటని నిలదీశారు. జ్ఞానేశ్ రాజీనామా చేయాలి: ప్రియాంక సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారని, ఆయన నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహించగలరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అందుకే జ్ఞానేశ్ తక్షణమే రాజీనామా చేఆయలని డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం కేరళంలో మీడియాతో మాట్లాడారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కేరళం మాజీ ప్రధాన కార్యదర్శి జి.జి.థామ్సన్‌ను జ్ఞానేశ్ కోరారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఎన్నికల వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పూర్తిగా చట్టవిరుద్ధం, అనైతికం అని తేల్చిచెప్పారు. ఓటర్ల జాబితాను సరిచేస్తే భయమెందుకు?: బీజేపీ ఎస్ఐఆర్ ప్రక్రియ కింద 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాల నుంచి కోటికి పైగా డూప్లికేట్ ఎంట్రీలు, 2.8 కోట్ల మంది మరణించిన ఓటర్ల పేర్లను తొలగించినట్లు బీజేపీ వెల్లడించింది. ఇన్నాళ్లూ తప్పుల తడకల ఓటర్ల జాబితాలతో లబ్ధి పొందిన వారే ఇప్పుడు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారని విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌పై పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. వివిధ ఎన్నికల్లో ఓటమికి అబద్ధాలతో కాకుండా, ప్రజాస్వామ్య తీర్పును గౌరవించి స్పందించాలని కాంగ్రెస్‌కు సూచించింది. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లతో ప్రయోజనం పొందింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించింది. ఓటర్ల జాబితాలను సరిచేస్తే ఎందుకు భయపడుతున్నారని నిలదీసింది. ఓటర్ల జాబితాల నుండి 9.43 కోట్ల పేర్లను(అక్కడ నివసించని లేదా వేరే ప్రాంతానికి మారిన వారివి) గుర్తించి తొలగించినట్లు పేర్కొంది. ఓటర్ల జాబితాల ప్రక్షాళన ప్రక్రియను విపక్ష ‘ఇండియా’కూటమి ఎందుకు వ్యతిరేకిస్తోందో చెప్పాలని బీజేపీ ప్రశ్నించింది. ఓటర్ల జాబితా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను ప్రశ్నించడం సరైంది కాదని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది తేల్చిచెప్పారు. -
ఓట్ల చోరీతో బీజేపీ పట్టుబడింది
హుజూర్నగర్, నేరేడుచర్ల: కేంద్రంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతూ పట్టుబడిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థ కాదని.. ఓటు హక్కు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఆస్తి కాదన్నారు. ఓటర్ల జాబితా సవరణ, డేటా నిర్వహణ, పేర్ల తొలగింపు–చేర్పులకు సంబంధించి తలెత్తిన సందేహాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను, స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. అలాగే నేరేడుచర్లలో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు.ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్వయంగా ఎన్నికల సంఘంలోని మిగిలిన ఇద్దరు కమిషనర్లే సీఈసీ పక్షపాత వైఖరిని తప్పుబట్టారని చెప్పారు. ఇది తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారు నేడు ఆధారాలతో సహా పట్టుబడ్డారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్నేళ్లుగా నిరుపేదల కోసం దేశాన్ని కాపాడేందుకు నిరంతరం కష్టపడుతున్నారని.. కాబట్టి ఆయన్ను దేశ ప్రధానిని చేయాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని.. ఈ స్మార్ట్ రేషన్‌కార్డులు పేదోడి ఆత్మగౌరవం అని మంత్రి ఉత్త మ్ చెప్పారు. గత ప్రభుత్వం రూ. 10,500 కోట్లు ఖర్చు చేసి ఇచ్చిన రేషన్ దొడ్డు బియ్యం ప్రజలు తినేందుకు పనికిరాకుండా ఉండేదని.. కోళ్ల ఫారాలకు, బీర్ల కంపెనీలకు, రైస్ మిల్లుల దందాలకుమాత్రమే ఉపయోగపడేదని విమర్శించారు. -
ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?
-
ఈసీపై విపక్షాల ఉమ్మడి పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ అంశంపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు ఇండియా కూటమి పార్టీలు 30న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. ఈసీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, సర్ విషయంలో జారీ చేసిన ఆదేశాల విషయంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌తో, ఇద్దరు ఈసీలు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి విభేదించారంటూ మీడియాలో వ చ్చిన కథనాలు తీవ్ర దుమారం రేపడం తెల్సిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్న విపక్ష ఇండియా కూటమి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఏకమైన వైరి పక్షాలు ఈసీ వ్యవహారంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఈ నెల 29న సమావేశం కానుంది. మరుసటి రోజే ఇండియా కూటమి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఈసీ వైఖరి, సర్‌లో అవకతవకలు వంటి అంశాలపై ఉమ్మడి వైఖరి, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, న్యాయపరమైన మార్గాలపై ఈ పార్టీలు చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌తోపాటు సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)–లిబరేషన్ పార్టీలు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని ఇప్పటికే డిమాండ్ చేశాయి. ఈ విషయంలో జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు కూడా. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తొలినుంచీ ఈసీ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఆమె కూడా ఇండియా కూటమితో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు. టీఎంసీ గుర్తింపు, పార్టీ గుర్తు విషయంలో ఏసీ ఏకపక్ష వైఖరిని ఆమె తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులైన టీఎంసీ, సీపీఎం ఈసీ విషయంలో ఒకే వైఖరితో ముందుకు రావడం మరో కీలక పరిణామం. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విపక్ష నేతలకు ఈసీ వ్యవహారంపై లేఖ రాయడంతోపాటు మమతా బెనర్జీతో మాట్లాడినట్లు సమాచారం. ఈ అంశంలో సమన్వయంతో కూడిన చర్యలు అవసరమని మమత అంగీకరించినట్లు సీపీఎం వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలుపార్టీలు ఈ అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా మారేందుకు ఇతర పక్షాలు సైతం సిద్ధమవుతున్నాయి. కూటమి భేటీ అనంతరం అక్టోబర్ 2న అంతా కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
ఏకాభిప్రాయంతోనే ‘సర్’ నిర్ణయాలు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొనడంతోపాటు ఎన్నికల సంఘం సభ్యుల మధ్య విభేదాలు ఉన్నట్లువార్తలు వెలువడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం కీలక ప్రకటన చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఇద్దరు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే ‘సర్’కు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో భేదాభిప్రాయాలేవీ లేవని పేర్కొంది. అలాగే ఓటర్ల నమోదుకు సంబంధించిన ‘ఫారం–6’లో చేసిన మార్పులను సుప్రీంకోర్టు సమర్థించినట్లు స్పష్టంచేసింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలతో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ 10 నెలల్లో 14 సార్లు విభేదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ కేంద్ర కేబినెట్ సెక్రెటరీకి వేర్వేరుగా పంపిన లేఖలు డిప్యూటేషన్‌పై ఉన్న ఒక అధికారికి సంబంధించినవని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ లేఖలు విధానపరమైన లేదా ఐటీ విభాగానికి సంబంధించినవి కావని వివరణ ఇచ్చింది. సంస్థాగత చర్చల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడం సాధారణమేని తెలియజేసింది. తమ ఆదేశాలకు పూర్తిగా చట్టపరమైన ఆమోదం ఉందని తేల్చిచెప్పింది. ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందే ఎలక్షన్ కమిషన్‌లో పనిచేసే అధికారులు కమిషనర్ల నుంచి వచ్చే అన్ని ఆదేశాలనూ కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. అధికారుల విదేశీ పర్యటనల కోసం కమిషన్ అనుమతి తీసుకోవాలని తెలిపింది. శనివారం ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. సీఈసీ, ఇద్దరు కమిషనర్లు హాజరయ్యారు. తాజా పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. అనంతరం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. అన్ని సమావేశాలకు ఎజెండాను ముందుగానే విడుదల చేయడం, మినిట్స్ జారీ చేయడం, అధికారులందరి వార్షిక పనితీరు మదింపు నివేదికలను నిర్దేశిత కాలపరిమితిలోగా, అంటే ప్రతి ఏడాది డిసెంబర్ 31లోగా పూర్తి చేయడం జరుగుతుందని వెల్లడించింది. ఐటీ విభాగంపై డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పర్యవేక్షణను ఎప్పుడూ ఉపసంహరించుకోలేదని పేర్కొంది. ఇకపై ఐటీ మాడ్యూల్స్, పోర్టల్స్‌కు సంబంధించిన అన్ని కొత్త కార్యక్రమాలపై కమిషన్ ఆమోదానికి ముందే కమిటీ ఆఫ్ ఆఫీసర్స్‌లో చర్చ జరుగుతుందని తెలియజేసింది. తుది జాబితా ప్రచురణ తర్వాతే... ఇటీవలి కాలంలో ‘సర్’ప్రక్రియతో సహా అనేక నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వివరించింది. 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలా 2025 జూన్ 24న జారీ చేసిన ఈ ‘సర్’ఉత్తర్వు ఎన్నికల కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతో వెలువడినట్లు తేల్చిచెప్పింది. 2026 మే 27న సుప్రీంకోర్టు దీనిని సమర్థించినట్లు పేర్కొంది. ఎన్నికల సంఘం ఏకగ్రీవ ఆమోదంతో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ‘సర్’òÙడ్యూల్ 2025 అక్టోబర్ 27న, అలాగే 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన షెడ్యూల్ 2026 మే 14న జారీ చేసినట్లు వెల్లడించింది. మూడో దశలోని మిగిలిన 12 రాష్ట్రాల్లో తుది జాబితా ప్రచురణ తర్వాతే ఓటర్ల సంఖ్యకు సంబంధించిన తుది గణాంకాలు తెలుస్తాయని ఉద్ఘాటించింది. ‘సర్’కోసం ఫారం–6కు జతచేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమరి్థంచినట్లు గుర్తుచేసింది. ఓటర్ల జాబితా ‘నిరంతర అప్డేషన్’ 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్’ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాలో పేరు లేనివారు, యువతీ యువకులు లేదా మొదటిసారి ఓటు వేసేవారితో సహా ఎవరైనా సరే ‘నిరంతర అప్డేషన్’ప్రక్రియ ద్వారా తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడానికి సంబంధిత ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఈఓలను ఆదేశించింది. ఓటర్ల నమోదు కోసం సీఈఓలు, డీఈఓలు, ఈఆర్ఓలు తక్షణమే ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తారని ప్రకటించింది. ‘సర్’కు సంబంధించి నోటీసులు అందుకున్నవారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనునున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల ఫిర్యాదులను పరిష్కరిస్తామని పేర్కొంది. రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారుల నుంచి అందిన సూచనల ఆధారంగా ఈసీఐ పోర్టల్‌లో ఇప్పటికే పలు మార్పులు చేసినట్లు తెలియజేసింది. ‘సర్’ప్రక్రియ విషయంలో క్షేత్రస్థాయి అధికారులకు అదనంగా ఏవైనా సౌకర్యాలు అవసరమైతే, వాటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. ‘సర్’నోటీసులు అందుకున్న ఓటర్ల సౌలభ్యం కోసం ఢిల్లీ, మహారాష్ట్రలో గడువు తేదీలను పొడిగించడం, వారి ఇళ్ల వద్దకే వెళ్లి పత్రాలను సేకరించడం వంటి నిర్ణయాలను సైతం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్ల ఇంటికే బీఎల్ఓలు ‘సర్’ కింద నోటీసులు అందుకున్న వారు అసాధారణ సందర్భాల్లో తప్ప వ్యక్తిగత ంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం సూచించింది. మ్యాపింగ్ లేకపోవడం లేదా తార్కిక వ్యత్యాసాల కారణంగా నోటీసు అందుకున్న వ్యక్తుల విషయంలో సంబంధిత పత్రాలను సేకరించడానికి బీఎల్ఓలు వారి ఇళ్లను సందర్శిస్తారని, తర్వాత ఈఆర్ఓల నిర్ణయం కోసం ఆ పత్రాలను ఈసీఐనెట్‌లో అప్లోడ్ చేస్తారని తెలిపింది. నోటీసు అందుకున్న అటువంటి వ్యక్తులను విచారణ కోసం ఈఆర్ఓ/ఏఈఆర్ఓ కార్యాలయానికి పిలవాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. కేవలం అసాధారణ పరిస్థితులలో మాత్రమే, ఈఆర్ఓ నిర్ణయం మేరకు విచారణను వీలైనంత వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారని వెల్లడించింది. అవసరమైతే ఓటరు తరపున విచారణకు హాజరయ్యేందుకు కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడికైనా అధికారం ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం సూచించింది. కూలీలు, పేదలు, నిరాశ్రయుల కోసం ఓటరు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులపై ఉందని పేర్కొంది. -
‘సర్’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఢిల్లీ: సర్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. అంతర్గత విబేధాలు బయటపడిన తర్వాత తొలిసారి జరిగిన భేటీకి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, ఈసీలు సందు, జోషి హాజరయ్యారు. ‘సర్’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘సర్’లో అభ్యంతరాలపై నవంబర్ 30 వరకు గడువు పొడిగించింది. నోటీసులు అందుకున్నవారు బీఎల్వోను కలవక్లర్లేదని.. బీఎల్వోలే ఓటర్లక ఇళ్లకు వస్తారని ఈసీ తెలిపింది.ఎస్ఐఆర్ (SIR)లో నోటీసు వచ్చిన వారికి బీఎల్వోలు ఇంటికి వచ్చి డాక్యుమెంట్లు తీసుకొని ఈసీఐనెట్‌లో అప్లోడ్ చేస్తారు. ఈఆర్వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అసాధారణ పరిస్థితుల్లోనే ఆన్లైన్ హియరింగ్. కుటుంబ సభ్యుడు కూడా హాజరు కావచ్చు. రాత్రి షెల్టర్లు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం డీఈవోలు సహాయ కేంద్రాలు, స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి’’ అని సీఈసీ పేర్కొన్నారు.‘‘ఎస్ఐఆర్ ఫామ్-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్ఐఆర్ కాకుండా ఇతర సమయాల్లో సాధారణ నియమాల ప్రకారం ఫామ్‌లు వాడాలి. ఈసీఐనెట్‌ను సీనియర్ డీఈసీ అధ్యక్షతన కమిటీ సమీక్షిస్తుంది. కొత్త ఐటీ మాడ్యూళ్లు కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ద్వారా ఆమోదం తీసుకోవాలి. ఢిల్లీ క్లెయిమ్స్, అబ్జెక్షన్లు 30 అక్టోబర్ 2026 వరకు, డిస్పోజల్ 30 నవంబర్ 2026 వరకు పొడిగింపు. మహారాష్ట్రలో క్లెయిమ్స్ 12 అక్టోబర్ 2026 వరకు, డిస్పోజల్ 10 నవంబర్ 2026 వరకు పొడిగిస్తున్నాం’’ అని సీఈసీ తెలిపారు.ఎస్ఐఆర్ 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తయింది. ఓటర్లు, యువకులు కంటిన్యుయస్ అప్డేషన్ ద్వారా పేరు చేర్చుకోవచ్చు. ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని సీఈవోలకు ఈసీ ఆదేశించింది. కమిషన్ సమావేశాలకు ముందుగా అజెండా, తర్వాత మినిట్స్ జారీ చేయాలి. అధికారుల ఏపీఏఆర్లు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలి. విదేశీ పర్యటనలకు కమిషన్ అనుమతి తప్పనిసరి’’ అని సీఈసీ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో కలకలం.. -
CEC పై విపక్షాల ఐక్య పోరు
-
CEC రాజీనామా చేయకుంటే ఢిల్లీ దద్దరిల్లేలా CJP భారీ ప్రొటెస్ట్..
-
సాక్షి కార్టూన్: 26-09-2026
సాక్షి కార్టూన్: 26-09-2026 -
ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం బలోపేతం కావాలి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన
-
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై YS జగన్ ఆందోళన
-
ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం బలోపేతం కావాలి
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సీఈసీ నియామక చట్టాన్ని పునఃసమీక్షించాలన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలుమార్లు నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఈసీఐనెట్ (ఎలక్షన్ కమిషన్ ఇంటర్నెట్)నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం ప్రజల్లో తీవ్రమైన ప్రశ్నలు, సందేహాలకు దారితీస్తోందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆరోపణల కంటే వాస్తవాలపై స్పష్టత పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కంటే.. ఏ అభ్యంతరాలు నమోదు అయ్యాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం, తిరిగి చేర్చడం వంటి ప్రక్రియలు ఎంత పారదర్శకంగా జరిగాయి? అనే అంశాలపై ప్రజలకు స్పష్టత అవసరం. ఈ అంశాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలి. అంతిమంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలి. ఎలాంటి భయం లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. పారదర్శకతతో పాటు నమ్మకమూ అవసరం ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటం మాత్రమే కాకుండా.. పారదర్శకత ఉన్నదనే నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. గతంలో తమ మద్దతు పొందిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీ కాల చట్టం–2023ను ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ముగ్గురు సభ్యుల కమిటీతో నియామకాలు కేంద్ర ప్రభుత్వం (అధికార పార్టీ) ముందుకు వచ్చి, ప్రస్తుతం నెలకొన్న భయాలు, అనుమానాలను తొలగించే విధంగా ఒక సాధారణ విశ్వసనీయమైన విధానాన్ని పునరుద్ధరించాలి. ఎన్నికల కమిషనర్ నియామకాన్ని మళ్లీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ద్వారా చేపట్టేలా చట్ట సవరణ తీసుకురావాలి. ఈ కమిటీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి ఉండాలి. తనకు పరీక్ష నిర్వహించే పరీక్షకుడిని విద్యార్థి తానే నియమించుకోవడం అనేది.. పరీక్షకుడు ఎంత నిజాయితీపరుడైనా ఆరోపణలకు అవకాశం కల్పిస్తుంది. అందుకు బదులుగా తటస్థమైన వ్యక్తి లేదా వ్యవస్థ ద్వారా నియామకం జరగడం మరింత సముచితం. ఇలాంటి మార్పు ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఉన్న గౌరవం, విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేందుకు దోహద పడుతుంది. ఏపీలో ఎస్ఐఆర్ పైనా అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ సందర్భంగా అధికారంలో ఉన్న పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినందున ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. అనేక సందర్భాల్లో తాము చేసిన అనేక విజ్ఞప్తులను పట్టించుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నియోజకవర్గాలు, డివిజన్ల పునర్విభజన జరిగిన తీరుపైనా ప్రతిపక్ష పార్టీగా వ్యక్తం చేసిన అభ్యంతరాలను పక్కన పెట్టారు. ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని బలహీన పరుస్తాయి. ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ ఎలా పని చేస్తుందో అంచనా వేయడానికి పారదర్శకత, జవాబుదారీతనం నిజమైన ప్రమాణాలు. వీటిని కాపాడటం ఆ సంస్థ ప్రాథమిక బాధ్యత’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సార్ మీ సాయం మరువలేంవైఎస్ జగన్‌కు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్దిపొందిన కుటుంబం కృతజ్ఞతలు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘సార్.. మీరు చేసిన సాయం ఎప్పటికీ మరువలేం..’ అని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్‌ను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతులు తమ కుమార్తె ధన్సికతో సహా శుక్రవారం కలిశారు. ధన్సిక 2019లో రెండు నెలల పాపగా ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైందని తెలిపారు. అప్పటికి కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. చిన్నారి ధన్సికతో ఆప్యాయంగా మాట్లాడుతున్న వైఎస్ జగన్ ఆ సమయంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రిలో మెదడుకి సంబంధించి అత్యంత క్లిష్టమైన న్యూరో సర్జరీ ఉచితంగా చేశారని, తమ కుమార్తె కోలుకుందని వైఎస్ జగన్‌కు వివరించారు. ఆపరేషన్ తర్వాత తమ కుమార్తె ఆరోగ్యంగా ఉందని చెప్పారు. అత్యంత క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి పాపకు సకాలంలో వైద్య సాయం అందించేలా చేసిన వైఎస్ జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని మహేష్, వినీల దంపతులు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి ధన్సికను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని చిన్నారిని వైఎస్ జగన్ ఆశీర్వదించారు. చిన్నారి, ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు వారితో కలిసి సెల్ఫీ దిగారు. -
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తటంపై ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ‘‘ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి.. అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుంది. ఎన్నికల సంఘంలోనే ఇద్దరు ఎన్నికల కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ముఖ్యంగా ఓటర్ల జాబితాల నిర్వహణ సహా అనేక అంశాల్లో బేధాభిప్రాయాలు వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవి ప్రజల్లో అనేక ప్రశ్నలకు దారితీశాయి. ఆ మీడియా కథనాల ప్రకారం గత పది నెలల్లోనే 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇవన్నీ సహజమే అంటోంది. బేధాభిప్రాయాలు ఉన్నా తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెప్తోంది. కానీ ప్రజల్లో నెలకొన్న సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలి..ఆరోపణలు–ప్రత్యారోపణలకు పరిమితం కాకుండా ఏయే అంశాలపై అభ్యంతరాలు నమోదయ్యాయి?. వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగింది?. ఓటర్ల జాబితాల నిర్వహణలో క్షేత్రస్థాయి అధికారులకు ఎంత స్వతంత్రత ఉంది?. అనే అంశాలపై స్పష్టత అవసరం. ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించటం అత్యంత ముఖ్యం. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాదు. పారదర్శకత ఉందనే నమ్మకం కూడా ప్రజలకు కలగాలి. 2023లో తీసుకొచ్చిన నూతన చట్టానికి మేము మద్దతు ఇచ్చాం. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ చట్టాన్ని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది..ఎన్నికల సంఘంపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చూడాలి. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల కమిటీ విధానాన్ని తిరిగి తీసుకు రావాలి. ఆ మేరకు చట్ట సవరణపై ఆలోచించాలి. విద్యార్థే పరీక్ష పెట్టే వారిని నియమించే పరిస్థితి ఉంటే.. ఆ వ్యక్తి ఎంత నిజాయితీపరుడైనా అనుమానాలకు తావిస్తుంది. అందుకే నియామకాలు పారదర్శకంగా ఉండేలా వ్యవస్థ ఉండాలిఇదీ చదవండి: సాయం అంటే ఇది.. థాంక్యూ జగన్ మామయ్య..అలాంటి మార్పు ఎన్నికల సంఘం ప్రతిష్ఠను, దానిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ సందర్భంగా ప్రతిపక్షంగా మేము అనేక అభ్యంతరాలను చెప్పాం. కానీ వాటికి సరైన స్పందన ఎన్నికల సంఘం నుండి రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియలోనూ.. వార్డులు, డివిజన్ల పునర్విభజనపై ప్రతిపక్షంగా మేము అనేక అభ్యంతరాలను తెలిపాం. కానీ వేటినీ పరిగణనలోకి తీసుకోకపోవటం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితులే ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలకు కారణమవుతాయి..అందుకే పారదర్శకత, జవాబుదారీతనం ఎన్నికల వ్యవస్థకు ప్రాథమిక ప్రమాణాలుగా ఉండాలి. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడటం.. ఎలాంటి భయం లేదా అనుమానం లేకుండా ఆ హక్కును వినియోగించుకునేలాబుండాలి. ఆ వ్యవస్థను బలోపేతం చేయడం ఎన్నికల వ్యవస్థ ముందున్న అత్యంత ముఖ్యమైన బాధ్యత’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Democracy can stand only when people have complete confidence in constitutional institutions such as the Election Commission. National media reports that two Election Commissioners raised objections on several occasions to decisions, electoral rolls and the management of ECINet…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2026 -
ఇంకా 24 గంటలే.. సీఈసీ జ్ఞానేశ్‌కు కాక్రోచ్ల డెడ్‌లైన్
ఎన్నికల సంఘం వ్యవహారంపై వివాదం మరింత ముదిరింది. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు విధించిన గడువులో ఒక్కరోజు పూర్తైంది. శనివారం నాటికి ఆయన గనుక రాజీనామా చేయకపోతే తమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించింది. అందుకు ముహూర్తం కూడా ప్రకటించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇవాళ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. గాంధీ జయంతి రోజు ముంబై నుంచి దేశవ్యాప్త ఆందోళనలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ రేపటిలోగా రాజీనామా చేయకపోతే.. అక్టోబర్ 2 నుంచి ముంబైలో నిరసన ప్రారంభించి దేశంలోని ఇతర నగరాలకు విస్తరిస్తాం” అని దీప్కే ఎక్స్‌లో పోస్టు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు సీఈసీ రాజీనామాకు 48 గంటల గడువు ఇచ్చి, అవసరమైతే ‘జంతర్ మంతర్ 2.0’ పేరుతో ఢిల్లీలో మరో ఆందోళన చేపడతామని హెచ్చరించింది. అయితే ఇప్పుడు ముంబైని అందుకు వేదికగా మార్చుకోబోతోంది.సర్‌పై తీవ్ర అభ్యంతరాలు..ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో కోట్లాది పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి మినహాయించబడ్డాయని సీజేపీ ఆరోపిస్తోంది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల్లో లేకుండా పోయాయని ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆ సంస్థ విమర్శలు గుప్పిస్తోంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో రెండు కోట్లకు పైగా చొప్పున, కర్ణాటకలో సుమారు కోటి, తమిళనాడులో 97 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 90 లక్షలు, తెలంగాణలో 73 లక్షలు, ఢిల్లీలో 47 లక్షలు, కేరళలో 24 లక్షల మేర పేర్లు తొలగించబడ్డాయని సీజేపీ అంటోందిఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలు..‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దర్యాప్తు కథనం ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీకి ఇద్దరు కమిషనర్ల మధ్య గ్యాప్ నడుస్తోంది. ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14సార్లు ఈసీ నిర్ణయాలపై లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ, ఫామ్–6 మార్పులు, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ వంటి అంశాల్లో తమకు సమాచారం లేదంటే అనుమతి లేకుండానే నిర్ణయాలు జరిగాయని వారు ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది.మరోవైపు ఈసీ మాత్రం దీనిపై భిన్నమైన వివరణ ఇచ్చింది. బహుళ సభ్యుల రాజ్యాంగ సంస్థలో భిన్నాభిప్రాయాలు, రాతపూర్వక నోట్లు, అంతర్గత చర్చలు సహజమేనని.. గత ఏడాది తీసుకున్న తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.‘ఎన్నికల్లో పోటీ చేయొద్దు’..ఇదే సమయంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని చెబుతున్న ప్రతిపక్ష పార్టీలపైనా విమర్శలు చేశారు. ఎన్నికలు ‘రిగ్డ్’ అవుతున్నాయని భావిస్తే.. అలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా వాటికి చట్టబద్ధత కల్పిస్తున్నట్లవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండటం వల్ల తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందనే భయంతోనే ప్రతిపక్షాలు పోటీ చేస్తున్నాయా? అని ప్రశ్నించారు. -
ఈసీలో మళ్లీ అదే రచ్చ.. నాడు టీఎన్ శేషన్ ఏం చేశారో గుర్తుందా?
ఎన్నికల సంఘం.. దేశ ఎన్నికల ప్రక్రియకు కాపలాదారు. ఆ సంస్థలో ముగ్గురు సభ్యులు ఉంటే.. నిర్ణయం ఎవరిది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) మాటే తుది మాటా? లేదంటే ముగ్గురూ కలిసి నిర్ణయం తీసుకోవాలా? ఇప్పుడు ఈ ప్రశ్న మరోసారి చర్చకు వచ్చింది. కారణం.. ఈసీలోనే ఇద్దరు కమిషనర్లు వరుసగా తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు వచ్చిన తాజా కథనాలు. సరిగ్గా ఇలాంటి ప్రశ్నే మూడు దశాబ్దాల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకెళ్లింది. ఆ సమయంలో చీఫ్ కమిషనర్‌గా ఉన్న టీఎన్ శేషన్ ఈసీలో తనకే అధికారం ఉండాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.టీఎన్ శేషన్.. భారత ఎన్నికల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పేరు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.. రాజకీయ నేతలు, మంత్రులు, అధికారులపై కూడా చర్యలకు వెనుకాడని అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. దీంతో ఈసీకి గతంలో లేని స్థాయిలో ప్రాధాన్యం వచ్చింది. అయితే ఆ 1993లో పరిస్థితి మారింది. అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎంఎస్ గిల్, జీవీజీ కృష్ణమూర్తిలను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించింది. అప్పటివరకు సీఈసీ ఒక్కరితోనే నడిచిన ఈసీ మళ్లీ ముగ్గురు సభ్యుల సంస్థగా మారింది.ఇక్కడే అసలు వివాదం మొదలైంది. కొత్తగా వచ్చిన ఇద్దరు కమిషనర్లకు సీఈసీతో సమాన నిర్ణయాధికారం ఉండటాన్ని ఈసీ బాస్ వ్యతిరేకించారు. వారి నియామకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టులో కీలక ప్రశ్నశేషన్ వాదనలో ప్రధాన అంశం ఒక్కటే.. సీఈసీకి రాజ్యాంగం ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు, మిగిలిన ఇద్దరు కమిషనర్లతో సమానంగా ఎలా పరిగణించగలరన్నది. ముఖ్యంగా బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు మెజారిటీతో తీసుకోవడాన్ని కూడా ఆయన సవాలు చేశారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. 1995లో సంచలన తీర్పు వెలువడింది. బహుళ సభ్యుల ఎన్నికల కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.అంతేకాదు.. సీఈసీ కమిషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, మిగిలిన కమిషనర్లపై ఆయనకు తుది నిర్ణయాధికారం లేదని కోర్టు తేల్చింది. కమిషన్‌లో అభిప్రాయ భేదాలు వస్తే మెజారిటీ నిర్ణయమే అమలవుతుందని స్పష్టం చేసింది. అంటే.. సీఈసీ ‘ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్’ మాత్రమే. మిగిలిన ఇద్దరు కమిషనర్లు కూడా నిర్ణయ ప్రక్రియలో సమాన భాగస్వాములే అన్నది ఆ తీర్పు సారాంశం.ఆయన అక్కడితో ఆగలేదుసుప్రీంకోర్టు తీర్పుతో శేషన్ పూర్తిగా వెనక్కి తగ్గలేదు. తీర్పును సమీక్షించాలంటూ మరోసారి కోర్టును ఆశ్రయించారు. కమిషన్ సమావేశం ఎప్పుడు జరగాలి, ఎజెండాలో ఏ అంశాలు ఉండాలి వంటి విషయాల్లో సీఈసీకే ప్రధాన అధికారం ఉండేలా నిబంధనలు రూపొందించే ప్రయత్నం కూడా చేశారు. అయితే సుప్రీంకోర్టు సమీక్ష పిటిషన్‌ను కొట్టివేసింది.ఇప్పుడు మళ్లీ అదే చర్చ ఎందుకు?మూడు దశాబ్దాల తర్వాత.. ఈసీలో అంతర్గత నిర్ణయాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని కమిషన్‌లో ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14సార్లు కొన్ని నిర్ణయాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. ఓటర్ల జాబితా, ఫామ్–6 మార్పులు, ఈసీ ఐటీ వ్యవస్థ వంటి కీలక అంశాలపై తమకు సమాచారం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది.జ్ఞానేశ్‌కు రాజీనామా సెగ!ఇదిలా ఉండగా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై ప్రతిపక్షాల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. ఈసీలోని ఇద్దరు కమిషనర్లు కీలక నిర్ణయాలపై పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికల నేపథ్యంలో.. కాంగ్రెస్ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా ఈసీ కార్యాలయాల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా ఇదే అంశంపై ఉద్యమానికి సిద్ధమైంది. 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకపోతే ‘జంతర్ మంతర్ 2.0’ పేరుతో మరో భారీ ఆందోళన చేపడతామని ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను ఈసీ ఖండిస్తూ.. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో సహజమేనని, గత ఏడాది తీసుకున్న తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.భారత ఎన్నికల లెజెండ్‌గా టీఎన్ శేషన్ 1932 డిసెంబర్ 15న కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించారు. పాలక్కాడ్‌లోని గవర్నమెంట్ విక్టోరియా కాలేజీలో, ఆ తర్వాత చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. కొంతకాలం అక్కడే లెక్చరర్‌గా పనిచేసిన ఆయన.. అనంతరం సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు. 1955లో ఐఏఎస్‌లో చేరిన శేషన్.. కేరళ, కేంద్ర ప్రభుత్వాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్లానింగ్ కమిషన్ సభ్య కార్యదర్శిగా, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1990 డిసెంబర్ 12న భారత 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు పెద్దగా ప్రజల దృష్టిలో లేని ఎన్నికల సంఘానికి తన కఠినమైన శైలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ, బూత్ క్యాప్చరింగ్, అధికార దుర్వినియోగం, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను గట్టిగా అమలు చేయడంతో పాటు.. ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు (EPIC) అందించే ప్రక్రియను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లారు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం జవాబుదారీతనాన్ని పెంచడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో రామన్ మెగసెసే అవార్డు లభించింది. 1996లో సీఈసీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రజాజీవితం నుంచి క్రమంగా దూరమైన శేషన్.. 2019 నవంబర్ 10న చెన్నైలో 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థంగా ఉపయోగించి.. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో కొత్త నమ్మకం కలిగించిన సీఈసీగా ఆయన పేరు మాత్రం ఇప్పటికీ భారత ఎన్నికల చరిత్రలో ప్రత్యేకంగానే నిలిచిపోయింది.ఇదీ చదవండి: లడాఖ్ పాపాల భైరవుడు అమిత్ షానే! -
29న సీడబ్ల్యూసీ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఈనెల 29వ తేదీన సమావేశం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) పనితీరు, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జరగనున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసీ తీరుపై వెల్లువెత్తుతున్న తీవ్ర అభ్యంతరాలపై సీడబ్ల్యూసీ కూలంకషంగా చర్చించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఓటర్ల జాబితా, సర్, ఎన్నికల సాఫ్ట్వేర్, ఓటర్ల నమోదుకు సంబంధించిన నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వస్తున్న కథనాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అదేవిధంగా, కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం–6లో సర్‌కు సంబంధించిన కొత్త వివరాలను చేర్చడంపైనా ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో 29న జరిగే సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ ప్రకటించనున్న కార్యాచరణపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. -
‘ఈసీఐ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశాయి. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ఓట్ల చోరి జరిగిందనడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని నేతలు ప్రశ్నించారు.ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. దేశంలో వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధించడం వెనుక ఎన్నికల సంఘం అండదండలు ఉన్నాయని, ఓట్ల చోరి కోసమే జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరి అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని, వీరిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.దేశంలో మోదీ, అమిత్ షాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాజ్యాంగ విలువులను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు.దేశంలో చాలా మంది ప్రధానిలు ప్రజల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, మోదీ మాత్రం ప్రతి ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారంటూ పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం,ఎన్నికల సంఘం తీరుపై ధ్వజమెత్తాయి. -
CJP మరో డిమాండ్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే
-
48 గంటల్లో రాజీనామా చేయకపోతే..
ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా మళ్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడతామంటూ తేల్చి చెప్పారు. భారత ఎన్నికల సంఘం (ECI)లో అంతర్గత విభేదాల నేపథ్యంలో సీజేపీ మూడు డిమాండ్లు పెట్టింది. భారత ఎన్నికల కమిషన్.. వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో అభిజీత్ దీప్కే ఎక్స్‌లో ‘జ్ఞానేశ్, ఇక అయిపోయింది బ్రో!’ అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ(గురువారం) మీడియా సమావేశంలో సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.. ఈసీ ముందు డిమాండ్లు పెట్టారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. జరగబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికలనూ నిలిపివేయాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను నిలిపివేసి.. ఓటర్ల జాబితాలను జనవరి 2025 నాటి జాబితాకు తిరిగి మార్చాలి. ‘సర్’కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను పరిశీలించేందుకు స్వతంత్ర విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.యువత తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాలంటూ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. దేశం కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. సీఈసీపై అభిజీత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ ఈ దేశంలోనే అతిపెద్ద దేశద్రోహి. ఆయన వెంటనే రాజీనామా చేయాలి.. ఎందుకంటే ఆయన భారతదేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించారు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం.. కానీ జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినప్పటి నుండి ఎవరు ఓటు వేయాలి? ఎవరు వేయకూడదు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. ఇదేనా ప్రజాస్వామ్యం?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఈసీలో అంతర్గత విభేదాలు -
త్వరలోనే ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గ విషయంలో ఉత్కంఠకు తెర పడింది. ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయగా.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇవాళ ఉన్నత న్యాయస్థానం తీర్పునే సమర్థించడంతో ఆయనకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151A ప్రకారం సాధారణంగా శాసనసభలో ఏర్పడిన ఖాళీని ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక ద్వారా భర్తీ చేయాలి. అయితే మిగిలిన పదవీకాలం ఏడాది కంటే తక్కువగా ఉండటం వంటి చట్టపరమైన మినహాయింపులు ఉన్నాయి. కానీ, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి వీలైనంత త్వరగానే ఉప ఎన్నిక తేదీని ఈసీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 6న దేశంలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసి..ప్రచారాలు నడుస్తున్నాయి. కాబట్టి ఖైరతాబాద్ ఆ చాన్స్ మిస్సయ్యింది. అయితే ఇప్పటి నుంచి ఏవైనా స్థానాలు ఖాళీ అయితే గనుక ఈసీ అధికారిక షెడ్యూల్ అతిత్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. లేదంటే ఖాళీపై అధికారిక సమాచారం అందిన వెంటనే ఎన్నికల సంఘం తన ప్రక్రియను ప్రారంభించే చాన్స్ ఉంది.సాధారణంగా ఇలాంటి కేసుల్లో.. సీటు ఖాళీ విషయాన్ని శాసనసభ ఈసీకి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే హైకోర్టు తీర్పు తర్వాత దానం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ నుంచి ఈసీకి సమాచారం వెళ్లే అవకాశం ఉంది. నియోజకవర్గ పరిస్థితులు, ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి ఈసీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను నిర్ణయిస్తుంది. ఇదీ చదవండి: ఇక చాలూ.. ఉప ఎన్నికలకు వెళ్లండి -
సీజేపీ నెక్స్ట్ మిషన్.. మరికాసేపట్లో బిగ్ అనౌన్స్మెంట్?
భారత ఎన్నికల సంఘంలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన నివేదికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. ఈసీ పనితీరు, ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల సంస్కరణలపై కాసేపట్లో కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ‘హైజాకింగ్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ఇటు.. ఈసీని సంస్కరించాల్సిన అవసరం ఉందంటూ ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో స్పందించారు.ఈసీ వ్యవహారాలపై ఇకపై తమ ప్రధాన దృష్టి ఉంటుందని నిన్న సీజేపీ ప్రతినిధులు తెలిపారు. పార్టీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. పాఠశాలలు, నిరుద్యోగం, మౌలిక వసతులు వంటి అంశాలపై తమ ప్రచారాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకపోతే వాటి ద్వారా ఆశించిన మార్పు సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈసీపై తమకు ఉన్న అభ్యంతరాలను ఢిల్లీ ప్రెస్మీట్లో వివరిస్తామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో పేరిట కొత్త ఉద్యమం నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?ఈసీలో ఎన్నికల కమిషనర్ల మధ్య బేదాభిప్రాయాలు నడుస్తున్నాయని.. పలు అంశాలపై ఆ ప్యానెల్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ సంచలన కథనం ప్రచురించింది. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలిపింది. అలాగే కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు–పునరుద్ధరణ, ఫారమ్–6లో మార్పులు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఐటీ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఈ అభ్యంతరాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఓటర్ల డేటాబేస్ కేంద్రీకృతం కావడంపై కూడా కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.ఫారమ్–6పై అభ్యంతరంకొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారమ్–6లో ఎస్ఐఆర్కు సంబంధించిన ప్రశ్నను చేర్చడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్లు నివేదిక పేర్కొంది. నిబంధనల్లో మార్పు లేకుండా ఫారమ్‌లో మార్పు చేయడంపై కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిపింది. అంతేకాదు.. గోవాలో 97 మంది ఓటర్లకు సంబంధించిన కేసులోనూ సాఫ్ట్వేర్ సమస్య తలెత్తినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. అర్హులని అధికారులు నిర్ధారించినప్పటికీ, వారిని తిరిగి జాబితాలో చేర్చేందుకు అవసరమైన సాంకేతిక సదుపాయం సకాలంలో అందుబాటులో లేకపోయిందని నివేదించింది.పార్టీల నుంచి భిన్న స్పందనలు..ఈసీలోని అంతర్గత అభ్యంతరాలపై రాజకీయ పార్టీల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలు ఈ పరిణామాలపై ఈసీ తీరును ప్రశ్నించగా.. బీజేపీ మాత్రం కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని పేర్కొంది. దీంతో ఈసీ వ్యవహారంపై రాజకీయంగానూ చర్చ మొదలైంది.ఈసీ వివరణ ఇదీ..అయితే ఈ కథనంపై ఈసీ స్పందించింది. కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు, రాతపూర్వక సూచనలు, సాంకేతిక అభిప్రాయాలు సాధారణ ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేసింది. ఎస్ఐఆర్తో సహా అన్ని కీలక నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయాలేనని పేర్కొంది. అంతర్గత నోట్స్‌లోని కొన్ని అంశాలను మాత్రమే చూపించడం వల్ల మొత్తం నిర్ణయ ప్రక్రియలోని మరో కోణం కనిపించదని తెలిపింది.ఇప్పుడు సీజేపీ ఏం చెబుతుంది?ఈ నేపథ్యంలోనే.. ఇప్పటివరకు స్కూల్స్ క్యాంపెయిన్ వంటి అంశాలపై దృష్టి పెట్టిన సీజేపీ హఠాత్తుగా ఈసీ సంస్కరణల అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈసీ పనితీరు, ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తమ వైఖరిని ఢిల్లీలో జరిగే ప్రెస్మీట్లో వెల్లడించనుంది. ‘ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో’ పేరుతో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతుందా? ఈసీపై ఏవైనా కీలక డిమాండ్లు, కార్యాచరణ ప్రకటిస్తుందా? అన్నదానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ఐఐటీ బాంబే సాహిల్ కేసు.. సంచలన ఫుటేజీ బయటకు! -
‘సీఈసీ, ఈసీల’ నియామకంపై పిటిషన్లు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఈసీ, ఈసీల ఎంపిక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని మినహాయిస్తూ 2023లో తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను ఐదు రోజులపాటు విచారించింది. వీటిని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని అంగీకరించడానికి జస్టిస్ దత్తా నిరాకరించారు. ఇదే ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ.. జస్టిస్ దత్తా అభిప్రాయాలతో విభేదించారు. అభిప్రాయ భేదాల కారణంగా.. తదుపరి విచారణ కోసం తగినంత మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పరిశీలనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఇలాంటి రాజ్యాంగపరమైన అంశాల్లో కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి శాశ్వత విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్నీ పరిశీలించాలని సీజేఐని ధర్మాసనం కోరింది. 2023 మార్చి 2న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం.. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన ఒక కమిటీ సిఫార్సు మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకాలను కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం నుంచి తప్పించే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాత 2023 డిసెంబర్లో పార్లమెంట్లో ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా షరతులు, పదవీకాలం) చట్టం–2023’తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సీఈసీ, ఈసీ ఎంపికలో సీజేఐ ప్రమేయం ఉండదు. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రిని చేరుస్తారు. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ దత్తా ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఇవి రాజ్యాంగ ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని, వీటిని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని జస్టిస్ దత్తా తిరస్కరించారు. కానీ, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ.. జస్టిస్ దత్తా అభిప్రాయాలతో విభేదించారు. ‘‘ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థగా ఉండటమే కాకుండా, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కూడా కనిపించాలి. రాజ్యాంగ వ్యవస్థ సమగ్రతను, పవిత్రతను కాపాడే సమిష్టి బాధ్యత మంత్రి మండలిదే కాబట్టి ఆర్టికల్ 75(3) ప్రకారం ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్న ఒక మంత్రి, ఒక సున్నితమైన రాజ్యాంగ పదవికి నియామకం విషయంలో ప్రభుత్వ అధినేత అభిప్రాయంతో విభేదిస్తారని ఆశించలేం’’అని జస్టిస్ దత్తా స్పష్టంచేశారు. 2023 నాటి చట్టాన్ని కేంద్రం సమర్థించుకుంది. భారత న్యాయవ్యవస్థలో కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమిస్తారని గుర్తుచేసింది. దీనిపై జస్టిస్ దత్తా స్పందించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమిస్తారంటూ తరచూ వినిపించే వాదనలో నిజం లేదన్నారు. స్వార్థ శక్తులు ప్రేరేపిత కథనాల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని నూరిపోశాయని ఆక్షేపించారు. అంతేకాకుండా కొలీజియం తీర్మానాల ఆధారంగా ప్రభుత్వం చేసే పక్షపాత నియామకాలను ప్రస్తావించారు. ఈ పక్షపాత వైఖరి కారణంగా ఆ నియామకాలు పవిత్రతను కోల్పోతాయని అన్నారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక శాఖ నుంచి స్వతంత్రంగా ఉండటంతోపాటు స్వయంగా సమర్థతను కలిగి ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశించారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అంబేద్కర్ ఆశయం అస్పష్టంగా మారి, తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం.. రాజ్యాంగం స్వతంత్రంగా ఉండాలని ఉద్దేశించిన సంస్థలను తమ నియంత్రణలోకి తీసుకోవడం సౌకర్యంగా భావించిందని జస్టిస్ దత్తా చెప్పారు. శాశ్వత ధర్మాసనం ఏర్పాటు చేయాలి రాజ్యాంగపరమైన అంశాలున్న కేసులను విచారించడానికి ఐదుగురు న్యాయమూర్తులతో శాశ్వత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తిని కోరింది. విస్తృత ధర్మాసనాలకు పంపిన కేసుల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందని గుర్తుచేసింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఒక కేసు చాలాకాలం పాటు పెండింగ్‌లో ఉండటం సంబంధిత సంస్థ ప్రతిష్టకు మంచిది కాదని, కాబట్టి ఆత్మపరిశీలన అవసరమని వెల్లడించింది. గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఎప్పుడు పరిష్కారమవుతాయో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని గుర్తుచేసింది. ఇది తాము కొత్తగా చెబుతున్న సంగతి కాదని.. బాధ్యతాయుతమైన పౌరులు పదేపదే ప్రస్తావిస్తున్నారని తెలియజేసింది. ప్రజల అభిప్రాయాన్ని తాము సమరి్థస్తున్నామని పే ర్కొంది. రాజ్యాంగపరమైన అంశాలను పరిష్కరించడం అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తుల ప్రాథమిక బాధ్యత అని తేల్చిచెప్పింది. -
ఈసీలో అంతర్గత విభేదాలు
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ పెను వివాదంలో చిక్కుకుంది. ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. గత పది నెలల కాలంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్జోషీలు మొత్తం 14 సార్లు వివిధ నిర్ణయాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తం చేశారని, అనధికారిక, అక్రమ ఉత్తర్వులంటూ తెలిపినప్పటికీ ఆ నిర్ణయాలు అమలయ్యాయని ఈ కథనం ఆరోపించింది. దీంతో సర్‌తోపాటు ఎన్నికల కమిషన్ తీరుతెన్నులపై ఇప్పటికే పలుమార్లు విమర్శలు, ఆరోపణలు గుప్పించిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మరోసారి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉండే అర్హత ఆయనకు లేదని, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడగా, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ(ఎం), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, పీడీపీలు కూడా గొంతుకలిపాయి. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంపై ఒక ప్రకటన జారీ చేస్తూ అన్ని నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా తీసుకున్నవేనని, భిన్నాభిప్రాయాలు సహజమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘంపై, జ్ఞానేశ్ కుమార్‌పై తాము ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నా కేంద్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కలిసికట్టుగా ఓట్ చోరీ చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్నికల కమిషన్లు దేశద్రోహానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌పై వ్యాఖ్యానిస్తూ.. ఏళ్లుగా తాము లేవనెత్తిన అనుమానం ఇప్పుడు నిజమైందని అన్నారు. సీఈసీ తొలగింపు కోరుతూ ఏప్రిల్ 26న 73 మంది రాజ్యసభ సభ్యులు సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారని, వర్షాకాల సమావేశాలింకా ప్రోరోగ్ కాలేదు కాబట్టి.. రాజ్యసభ ఛైర్మన్ ఈ నోటీసుపై ఇప్పుడైనా చర్య తీసుకుంటారా? అని ప్రశ్నించారు. పాత జాబితాతో మళ్లీ ఎన్నికలు: మమత ఎన్నికల కమిషన్‌లో అక్రమ నిర్ణయాలు అమలవుతున్నాయన్న కథనాలపై ప.బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం విమర్శలు చేశారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికలను బీజేపీ, ఈసీలు కలిసికట్టుగా చోరీ చేశాయని, వాటిని రద్దు చేసి సర్‌కు ముందునాటి ఓటర్ల జాబితాతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆమె ఫేస్బుక్ లైవ్‌లో డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి: కేజ్రీవాల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేసి, విచారణ జరిపించాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న విషయం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ద్వారా స్పష్టమైందని, మూడేళ్ల నాటి ఓటర్ల జాబితాలను పునరుద్ధరించాలని, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. భిన్నాభిప్రాయాలు సాధారణమే: ఈసీఐ ఎన్నికల సంఘంలో (ఈసీఐ) కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు, అంతర్గత నోట్స్, సూచనలు ఉండటం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, చట్టబద్ధ నిబంధనలు, సంస్థాగత సంప్రదాయాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం పని చేస్తుందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. పారదర్శకత, చట్టపరమైన నిబంధనల అమలు, పరిపాలనా క్రమశిక్షణను నిర్ధారించేందుకు లిఖితపూర్వక నోట్స్, అభిప్రాయాలు, సాంకేతిక సూచనలు, అంతర్గత తనిఖీలు నిరంతరం కొనసాగుతుంటాయని వెల్లడించింది. ఎన్నికల సంఘం తీసుకున్న అన్ని చర్యలు చట్టాలు, కమిషన్ ఆదేశాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. గత పది నెలల్లో నమోదైన కొన్ని అంతర్గత నోట్స్, అభిప్రాయాల ఆధారంగా మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ సహా గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవ నిర్ణయాలేనని స్పష్టం చేసింది. ఈసీఐనెట్‌లో అనధికారిక మార్పులు, డేటా తారుమారు, ఇతర జోక్యాలను నిరోధించేందుకు భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు) తమకు చట్టం కల్పించిన అధికారాల మేరకు ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలను నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది. ఇద్దరు కమిషనర్లు చేసిన ఆరోపణలు 1. అక్టోబర్ 28, 2025: తగిన అనుమతుల్లేకుండానే ఎన్నికల కమిషన్ పేరుతో లేఖలు, ఆదేశాలు జారీ అయ్యాయని సంధూ అభ్యంతరం. 2. ఏప్రిల్ 16, 2026: ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన కొత్త ఐటీ మాడ్యూళ్లు/పోర్టల్స్ వివరాలు మీడియా ద్వారా తెలుసుకున్నానన్న సంధు. 3. ఏప్రిల్ 16, 2026: కమిషన్ అనుమతి లేకుండానే అధికారిక సమాచాం జారీ4. ఏప్రిల్ 16, 2026: కమిషన్ సమావేశాలకు సంబంధించిన అజెండా ఏడాదిగా ఇవ్వడం లేదని, మినిట్స్ నమోదు చేయడం లేదన్న జోషీ 5. ఏప్రిల్ 16, 2026: కమిషన్ అధికారులు అనుమతుల్లేకుండానే విదేశీ పర్యటలు 6. ఏప్రిల్ 24, 2026: అనుమతి లేకుండా సమాచారాన్ని జారీ చేయవద్దన్న జోషీ7. మే 16, 2026: ఫారం–6లో మార్పులు చేయరాదని జోషీ. తర్వాత ఏకీభవించిన సంధూ 8. మే 29, 2026: ఓటర్ల జాబితా సమాచారాన్ని కేంద్రీకృతం చేస్తున్నారన్న జోషీ 9. జూలై 29, 2026: విధుల విభజనలో మార్పులు చేశారని కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు 10. జూలై 29, 2026: విధుల కేటాయింపుపై ఉన్న అభ్యంతరాలను మరోసారి ప్రస్తావిస్తూ, సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని సంధు కూడా కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. 11. జూలై 30, 2026: కొత్త విధుల కేటాయింపు ఉత్తర్వును జోషి, సంధులు ఇద్దరూ రద్దు చేశారు. 12. ఆగస్టు 12, 2026: బెంగాల్లో ఓట్లపై ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో ఎన్నికల కమిషన్ తరఫున అప్పీళ్లు దాఖలు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని సంధూ ప్రశ్నించారు. 13. ఆగస్టు 13, 2026: ఫారం–6లో చేసిన మార్పు చట్టవిరుద్ధమని ప్రకటించిన సంధూ 14. ఆగస్టు 14, 2026: ఈఆర్ఓలకు ఈసీఐ నెట్‌ను యాక్సెస్ చేసే అవకాశం లేకపోవడంపై అభ్యంతరం -
ఈసీపై దుమారం : కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: SIR ప్రక్రియలోని లోపాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (ECs) అభ్యంతరం వ్యక్తం చేశారంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని సుమోటా తీసుకొని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత విచారణ జరిపే విశ్వసనీయత సుప్రీంకోర్టుకు తప్ప మరే ఇతర సంస్థకూ లేదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం పనితీరు, విశ్వసనీయతపై తీవ్రమైన సంక్షోభం నెలకొందని కేటీఆర్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయనా, తాజా వార్తలతో మరింత అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థపై వచ్చిన ఆరోపణలపై దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తప్ప మరే ఇతర సంస్థపైనా నమ్మకం ఉంచలేమన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్లు చెబుతున్న అంశాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంపై స్యూమోటో కింద విచారణ జరపాలన్నారు దీనివల్ల కొన్ని సమాధానాలు లభిస్తాయని, నిజం బయటపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహంకాగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూవచ్చిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలోప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.BRS Working President @KTRBRS key remarks on objections raised by two Election Commissioners over the SIR process.There is now a serious crisis of confidence in the functioning of the Election Commission.The objections reportedly raised by two Election Commissioners over the… pic.twitter.com/kj9YsDsam1— KTR Updates (@KTRMediaUpdates) September 23, 2026 -
ఎన్నికల కమిషనర్ల నియామకంపై.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం కేసుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈసీ నియామక ప్రక్రియపై సందేహం వ్యక్తం చేసింది. ఈసీ స్వతంత్రంగా ఉండడమే కాదు స్వతంత్రంగా కనిపించాలి కూడా అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ప్రధాని నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి, ప్రధానిమంత్రి కి వ్యతిరేకంగా ఓటు వేయలేరు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ల చట్టం 2023ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. -
యూపీలో రాజ్యసభ ఎన్నికల సందడి.. అక్టోబర్ 16న పోలింగ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 19లోపు పూర్తవుతుంది.బీజేపీకి 8 స్థానాలు?403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం 397 మంది సభ్యులున్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిపి 289 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీకి 101 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత బలాబలాల ఆధారంగా బీజేపీ నేతృత్వంలోని కూటమి 8 రాజ్యసభ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉందని, ఎస్పీ తన స్థానాలను రెండుకు పెంచుకోవచ్చని ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది.బీఎస్పీకి రాజ్యసభలో..బహుజన్ సమాజ్ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న ఏకైక సభ్యుడు రాంజీ గౌతమ్ పదవీకాలం నవంబర్ 25తో ముగియనుంది. యూపీ అసెంబ్లీ, శాసన మండలి, లోక్‌సభలోనూ బీఎస్పీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం లేదని నివేదిక తెలిపింది. దీంతో తాజా ఎన్నికల తర్వాత పార్లమెంట్లో ఆ పార్టీ ప్రాతినిధ్యం పూర్తిగా ముగిసే పరిస్థితి ఏర్పడింది.క్రాస్ ఓటింగ్‌పై రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుందని నివేదిక పేర్కొంది. ఈసారి కూడా క్రాస్ ఓటింగ్ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై కొందరు ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి ప్రభావం చూపవచ్చని హిందుస్థాన్ టైమ్స్ విశ్లేషించింది.సెప్టెంబర్ 29న నోటిఫికేషన్రాజ్యసభ ఎన్నికలకు సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 6 చివరి తేదీ. అక్టోబర్ 7న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలుయూపీలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఐదు గ్రాడ్యుయేట్, ఆరు టీచర్ నియోజకవర్గాల స్థానాలకు అక్టోబర్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 27న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 31లోపు పూర్తవుతుంది. -
125 ఏళ్ల ఓటర్‌కూ ఎస్ఐఆర్ నోటీస్
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 125 ఏళ్ల తాతకు సైతం ఎన్నికల అధికారులు ఎస్ఐఆర్ నోటీస్ అందజేశారు. ఢిల్లీలోని సదర్‌బజార్ శాసనçసభ నియోజకవర్గం పరిధిలో 125 ఏళ్ల శ్యామ్ ముఖీజియాకు ఓటు ఉంది. పాత ఢిల్లీ పరిధిలో ఇతనే అత్యంత వృద్ధ ఓటరుగా గుర్తింపు పొందారు. అయినాసరే నీ పేరులో తప్పులు ఉన్నాయని, సంబంధిత నిర్ధారణ పత్రాలు లేదా డాక్యుమెంట్లు చూపించాలంటూ ఈయనకు తాజాగా ఈసీ అధికారులు ఎస్ఐఆర్ నోటీస్ పంపించారు. ఇంకొంత మంది ప్రముఖులకూ నోటీస్‌లు మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాన్, భారత వాయుసేన మాజీ చీఫ్ ఎన్ఏకే బ్రౌనీ, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉదిత్ రాజ్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ భార్య తేజస్వీ భూషణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ భార్య కల్పన, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్, చరిత్రకారుడు రోమిలా థాపర్, ఢిల్లీ ఆర్చ్‌బిషప్ అనిలకౌటో, సీనియర్ సీపీఐ నేత అన్నీ రాజాలకూ తాజాగా ఎస్ఐఆర్ నోటీస్‌లు పంపించారు. -
ఇదా ‘సర్’ నిర్వాకం!
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణలో చోటుచేసుకుంటున్న చిత్ర విచిత్ర విన్యాసాలు బయటపడుతూనే ఉన్నాయి. బిహార్‌లోనో, బెంగాల్లోనో, మరోచోటనో కష్టాలు పడటం సామాన్యుల వంతయింది. ప్రముఖులకు ఆ తాకిడి పెద్దగా లేదు. కానీ ఢిల్లీలో ఉంటూ రాజ్యంలోని వివిధ వ్యవస్థల్లో కీలకపాత్ర పోషించిన, పోషిస్తున్న వారికి కూడా చుక్కలు చూపించగలమని ఎన్నికల సంఘం (ఈసీ) రుజువు చేసింది. మాజీ ప్రధాని ఎల్.కె. అడ్వాణీ, ఆయన కుమార్తె, కోడలు, విదేశాంగ మంత్రి జైశంకర్, కాగ్ చీఫ్ కె. సంజయ్‌మూర్తి, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, బీఆర్ గవాయ్, మాజీ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, సైనిక దళాల మాజీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, సెబీ చీఫ్ తుహిన్‌కాంత పాండేలకు నోటీసుల జారీ వైనం మీడియాలో మోతమోగుతోంది. ఆఖరికి ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ సంధూ పేరు కూడా ఉందంటే ఈ ప్రక్రియ ఎంత దివ్యంగా సాగుతోందో అర్థమవుతుంది. వీరిలో 2002 నాటి సర్‌తో ‘మ్యాపింగ్’ కాలేదని కొందరికీ, పేర్లలో ‘తార్కిక వ్యత్యాసాలున్నా’యని మరికొందరికీ, మీకూ... మీ తండ్రికీ/తాతకూ మధ్య వయో భేదం ‘తక్కువుంద’ని ఇంకొందరికీ వర్తమానం పంపారు. సంధూ పేరును ఇప్పటికే చేర్చామని ఈసీ వివరణనిచ్చింది. ఆమధ్య భారతరత్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు సైతం తాఖీదు వచ్చిందని మీడియాలో ప్రముఖంగా రాగా, ఆయన పేరు అప్పటికే జాబితాలో చేర్చామని ఈసీ ఆదరాబాదరాగా జవాబిచ్చింది. మొన్న ఆగస్టు 31న ఢిల్లీకి సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన మూడు వారాలకు తాజా తాఖీదులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న వారందరికీ ఆన్లైన్లో తప్పులు సరిచేసుకునే అవకాశా లిస్తున్నామని ఈసీ చెబుతోంది. వాదన వినిపించుకునే అవకాశం ఇచ్చి మాట్లాడాకగానీ ఎవరి పేరూ తొలగించబోమని కూడా ఎంతో పెద్ద మనసుతో చెబుతోంది. మెచ్చుకోదగ్గ విషయమే. కానీ కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇంత పనికిమాలిన ప్రక్రియను కోట్లాది రూపాయలు వ్యయంచేసి, ఎందుకు అమలు చేస్తున్నట్టన్న సందేహం సంస్థ సారథులకే తడుతుంది. ప్రముఖులకు ఏమైనా జరిగితే ‘అయ్యో... ఇదేం చోద్యమ’నేవారు చాలా మందే ఉంటారు. మీడియాలో కావలసినంత రచ్చ జరుగుతుంది. కనుక డాక్టర్ సంధూ మాదిరే వీరిలో అందరికందరూ తుది జాబితాకెక్కుతారు. అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. మరి సామాన్యుడి గతేమిటి? సర్‌లో చోటు దొరక్కపోతే ఓటు కోల్పోవడం ఒక్కటే సమస్య కాదు. ఏదో ఒకరోజు మీరు ఈ దేశ పౌరులు కాదని అలాంటి వారందరూ వర్తమానం అందుకునే ప్రమాదం లేకపోలేదు.పింఛన్ అందుకునే వారికి ప్రతియేటా ఒక తప్పనిసరి తంతు సాగుతుంటుంది. ‘లైఫ్ సర్టిఫికెట్’ పేరుతో ఎవరికి వారు తాము బతికేవున్నట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే తదుపరి నెల పింఛన్ అందుతుంది. అంటే ఏడాదిలో మిగతా 364 రోజులూ ఆ పేరుతో ఎవరు తీసుకున్నా పట్టించుకోరు. ఆ ఒక్కరోజూ మాత్రం ‘నిరూపించు కోవాలి’. సర్ ప్రక్రియ అందుకు భిన్నమేమీ కాదు. ఇంతకూ గతంలో ఉన్నత పదవుల్లో పనిచేసి నిష్క్రమించినవారికీ, ఆ పదవుల్లో కొనసాగుతున్నవారికీ ఈసీ నోటీసులిచ్చి అడగటం, ఆపై ఆ సంగతి మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చూడటంలోని మర్మమేమిటి? ‘మేం నిష్పాక్షికంగా ఉంటున్నాం. సాధారణ పౌరులైనా, మరొకరైనా మాకొకటే’ అని ప్రకటించుకోవటమేనా? ఆ మాటేమోగానీ సర్ ప్రక్రియ ప్రహసనం గమనించి, ఇందుకా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారన్న ప్రశ్న అయితే సాధారణ పౌరుల్లో తలెత్తుతుంది. ఢిల్లీ వరకూ చూసినా అక్కడ గత జాబితాలోని 33 శాతంమంది పేర్లు గల్లంతయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇతరచోట్లా 2024 నాటి ఎన్నికల్లో ఈవీఎంల లీలల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలూ, మేధావులూ ప్రశ్నిస్తున్నా గంభీర మౌన ముద్ర దాలుస్తూ, తప్పించుకు తిరుగుతున్న ఈసీ... ఈ దేవతా వస్త్రాల నేత పనిలో ఎందుకంత బిజీగా ఉంటున్నది? ఈసీ సారథులే చెప్పాలి. సర్ ప్రక్రియలో నిండా మునిగి, ఆ సంస్థ తన ఇతరేతర కర్తవ్యాల సంగతి ఎటూ వదిలేసింది. కనీసం ప్రజలకైనా వేరే పనులుంటాయని తోచొద్దా? -
అప్పుడు అధికారం.. ఇప్పుడు పార్టీ గుర్తు.. దీదీకి షాకిచ్చిన ఎన్నికల సంఘం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో, మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక గుర్తు ‘జోడా ఘాస్’ (పూలు-గడ్డి)ను కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా రద్దు చేసింది.మమతా బెనర్జీ వర్గానికి ‘ఫుట్‌బాల్ ఆటగాడు’ గుర్తును కేటాయించగా, టీఎంసీలోని రెబల్ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత, ఎమ్మెల్యే రితబత్ర బెనర్జీ వర్గానికి ‘ఎన్వలప్’ (కవర్) గుర్తును కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎంసీలో తలెత్తిన అంతర్గత కలహాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రెండు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, అధికార టీఎంసీ 80 సీట్లతో ఓటమి పాలైంది. ఈ భారీ పరాజయం తర్వాత టీఎంసీలో అంతర్గత తిరుగుబాటు తలెత్తింది.రితబ్రత బెనర్జీ వంటి నేతల నేతృత్వంలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వ శైలిని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ రెబల్ క్యాంపుగా ఏర్పడ్డారు. జూన్ 22 నాటికి ఈ రెబల్ వర్గం మమతా బెనర్జీని పార్టీ ఛైర్పర్సన్ పదవి నుంచి తొలగించి, అరూప్ రాయ్‌ను ‘అసలైన టీఎంసీ’ చైర్మన్‌గా ప్రకటించుకుంది.దీంతో అసలైన తృణమూల్ ఎవరిది? అనేదానిపై ఇరు వర్గాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. దీనిపై సమగ్ర విచారణ ముగిసే వరకు వివాదాస్పదమైన అసలు పేరును, గుర్తును నిలిపివేస్తూ ఈసీ ఈ మధ్యంతర నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాబోయే ఉపఎన్నికల్లో ఇరు వర్గాలు పూర్తిగా కొత్త గుర్తింపులతోనే బరిలోకి దిగాల్సి వస్తోంది. కాగా, అక్టోబర్ 6న నందిగ్రామ్, రెజిన్నగర్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇదీ చదవండి : బెంగాల్ ఉప ఎన్నికలు.. ఈసీ బిగ్ ట్విస్ట్ -
బెంగాల్ ఉప ఎన్నికలు.. ఈసీ బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఎవరికీ హక్కు ఉందనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఉపయోగించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 6న జరగనున్న నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మమతా బెనర్జీ, అరూప్ రాయ్(రితబ్రత బెనర్జీ నేతృత్వంలో..) వర్గాలకు షాక్ తగిలినట్లైంది.ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో పాటు ఆ పార్టీకి కేటాయించిన పూలు-గడ్డి గుర్తును కూడా రెండు వర్గాలు ఉపయోగించకూడదని ఈసీ పేర్కొంది. ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీపై హక్కు వివాదాన్ని ఇప్పటికిప్పుడు పరిష్కరించడం సాధ్యం కాదని, అందువల్ల రెండు వర్గాలను సమాన స్థాయిలో ఉంచేందుకు ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ మేరకు రెండు వర్గాలు శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా తమకు కావాల్సిన మూడు పేర్లు, మూడు ఉచిత ఎన్నికల గుర్తులను సూచించాలని ఈసీ ఆదేశించింది. వాటిలో నుంచి ఒక్కో వర్గానికి ఒక పేరు, ఒక గుర్తును కేటాయించనుంది. అవసరమైతే తమ కొత్త పేర్లలో ‘ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్’తో అనుబంధాన్ని సూచించుకునే అవకాశం కూడా రెండు వర్గాలకు ఉంటుందని ఈసీ తెలిపింది.టీఎంసీలో చీలికపై విచారణపార్టీ సంస్థాగత నియంత్రణపై మమతా బెనర్జీ వర్గం, అరూప్ రాయ్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాలూ తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని, పార్టీ పేరు, గుర్తు తమకే చెందాలని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ రెండు వర్గాలతో గురువారం మరోసారి విచారణ నిర్వహించింది. ఐదు రోజుల వ్యవధిలో ఇరు వర్గాలతో ఈసీ సమావేశం కావడం ఇది రెండోసారి.ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈసీ పేర్కొంది. ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఆర్డర్–1968లోని 15వ పేరా కింద పార్టీ అంతర్గత చీలికలు, గుర్తు–పేరు హక్కుల వివాదాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై సమగ్ర నిర్ణయానికి మరింత విచారణ అవసరమని కమిషన్ అభిప్రాయపడింది.అక్టోబర్ 6న రెండు నియోజకవర్గాల్లో పోలింగ్పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు వర్గాల అభ్యర్థులు ఇప్పటివరకు తృణమూల్ కాంగ్రెస్ అధికారిక గుర్తుతోనే బరిలోకి దిగారు. అయితే ఈసీ తాజా ఉత్తర్వులతో ఉప ఎన్నికల కోసం వారు కొత్త పేర్లు, కొత్త గుర్తులతో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.పార్టీ పేరు, గుర్తుపై తుది హక్కు ఎవరికి దక్కాలన్న దానిపై ఈసీ విచారణ కొనసాగనుంది. ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులు ఉప ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న మధ్యంతర చర్య మాత్రమే. వివాదంపై తుది నిర్ణయం తర్వాత పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి తదుపరి పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: విజయ్ సర్కార్‌కు తలంటిన సుప్రీం కోర్టు -
SIR: ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ‘సర్’ ప్రక్రియలో జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి కొత్త వెసులుబాటు కల్పించింది. ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు హాజరైతే చాలు. ఫ్యామిలీ మెంబర్‌కు వ్యక్తిగత హాజరుకు అవకాశం ఇచ్చింది. ఈఆర్వో, ఏఈఆర్వోల ఎదుట హాజరై పత్రాలు, సమాచారం అందించే అవకాశం కల్పించింది. కుటుంబ సభ్యుల తరఫున అవసరమైన పత్రాలు సమర్పించవచ్చని.. నోటీసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలంగాణ సీఈవో ఆదేశాలు జారీ చేశారు.ఓటర్ల పత్రాలు స్వీకరించి నోటీసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. జిల్లా ఎన్నికల అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చిన ఈసీ.. ఓటర్ల నోటీసులను పరిశీలించి పరిష్కరించాలని సూచించింది. ఫారం-6 దరఖాస్తులపై సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫారం-6 దరఖాస్తులకు డిక్లరేషన్ ఫారం తప్పనిసరి. భవిష్యత్‌లో అందే ఫారం-6 దరఖాస్తులకూ డిక్లరేషన్ ఫారం తప్పనిసరి.అర్హత తేదీ 1.10.2026 పరిగణనలోకి తీసుకోవాలి. ఫారం-6 పరిశీలన, డిక్లరేషన్ స్వీకరణ, క్లెయిమ్‌ల పరిష్కారానికి ఆదేశాలిచ్చింది. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటరు జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ.. తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇదీ చదవండి: HYD: ఈ హోటళ్లలో బిర్యానీ తిన్నారా?.. బిగ్ షాక్! -
మ్యాపింగ్ చేయలేదా.. సాఫ్ట్వేర్ లోపమా?
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)–2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్లు.. సర్–2002 ఓటర్ల జాబితాలోని తమ/తమ బంధువుల ఓటు వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది..ఆపై వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం పదేపదే పేర్కొంది. ‘సర్’రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సైతం ఇదే హామీ ఇచ్చింది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారంలో సర్–2002 జాబితాలోని వివరాలు ఇచ్చినా, పెద్ద సంఖ్యలో ఓటర్లను అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాపింగ్ చేసుకునే అవకాశం లేదని బీఎల్ఓలు చెప్పడంతో ఓటర్లు విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. సర్–2026లో భాగంగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2,64,87,213 మంది ఓటర్లు ఉండగా, వారిలో 92,87,577 మంది (35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. నిర్లక్ష్యమా...లేకపోతే... చివరిసారిగా 2002లో ‘సర్’నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో తమ పేరు/తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలు ఇవ్వకపోవడతో వారిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నట్టు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. ఇక ఫారంలో సర్–2002 వివరాలను నమోదు చేసినా, ప్రస్తుత ఓటు వివరాలతో పోలిస్తే వ్యత్యాసాలుండడంతో మరో 60,50,918 మంది ఓటర్లకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. చాలామంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో సర్–2002 ఓటు వివరాలను ఇచ్చినా వారిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటిసులిస్తుండడంతో ‘సర్’ప్రక్రియలో తీవ్ర లోపాలను ఎత్తిచూపుతోంది. ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేరును సర్–2002 ఓటర్ల జాబితాలోని పేరుతో అనుసంధానం (మ్యాపింగ్) చేయాల్సి ఉండగా, పెద్ద సంఖ్యలో ఓటర్లను మ్యాపింగ్ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో సర్–2026 ప్రక్రియ ప్రారంభానికి కొన్ని నెలల ముందే..ముందస్తు సన్నాహకంగా మ్యాపింగ్ ప్రక్రియను ఈసీ చేపట్టగా, తమ పేర్లను మ్యాపింగ్ చేయాలని అప్పట్లోనే స్థానిక బూత్ స్థాయి అధికారుల (బీఎల్వో)కు చాలామంది ఓటర్లు అందజేశారు. ఆ తర్వాత ఎన్యూమరేషన్ ఫారంలో సైతం సర్–2002 జాబితాలోని వివరాలను అందజేశారు. అయినా, తమను అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి ఈసీ నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలతో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారని సామాజిక మాధ్యమాల వేదిక ఓటర్లు ఆరోపిస్తున్నారు. బీఎల్ఓలు/ బీఎల్ఓ సూపర్వైజర్లు/ఈఆర్వోల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందా? లేక సాఫ్ట్వేర్ లోపాలతో జరిగిందా? అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో ఇలాంటి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతంలోని చింతల్‌కుంటలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో వందల సంఖ్యలో ఓటర్లుండగా, వారిలో చాలామంది ఓటర్లు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు. వివరాలిచ్చినా బీఎల్ఓల నిర్లక్ష్యంతో మ్యాపింగ్ జరగని ఓటర్ల మ్యాపింగ్‌కు మరో అవకాశం కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు. -
మాది అత్యంత పారదర్శక పద్ధతి: సీఈసీ
అహ్మదాబాద్: భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాతో మొదలుపెట్టి ఓట్ల లెక్కింపు వరకూ ప్రతిదశలోనూ ధ్రువీకరణ జరుగుతూండటం ఇందుకు కారణమని ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్శిటీ అటల్ కలామ్ హాల్లో శుక్రవారం బూత్ లెవల్ ఆఫీసర్లతో సీఈసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రతిదశలోనూ రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు నిరంతరం ధ్రువీకరణ చేస్తూంటారు కాబట్టి ఇది అత్యంత పారదర్శక ఎన్నికల విధానమని స్పష్టం చేశారు. -
ఏపీలో పోలింగ్ ముగిశాక 17.25లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 కోట్ల మంది ఓట్లు తొలగించారని, వీరంతా వీధుల్లోకి వచ్చి తమ ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని శనివారం గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభలో ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, విశ్వసనీయత, పౌరసమాజం కర్తవ్యం’ అనే అంశంపై పరకాల ప్రభాకర్ స్మారకోపన్యాసం చేశారు. సర్ పేరుతో సంచార జాతులు, వలస కార్మికులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని పరకాల ఆందోళన వ్యక్తంచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన 10 రోజుల తర్వాత పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో 2024 మే నెలలో పోలింగ్ పూర్తయిన తర్వాత 3,500 పోలింగ్ బూత్‌లలో 17.25 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయని, రాత్రి 11 నుంచి తెల్లవారుజూమున 2 గంటల వరకు ప్రజలు పోలింగ్ బూత్‌ల వద్ద నిలబడి ఓటు వేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అలా ఓట్లు వేసినవారిని ఆధారాలతో చూపితే తాను వారికి పాదపూజ చేస్తానని పరకాల చెప్పారు. సర్ ప్రక్రియ ద్వారా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్న ఎన్నికల సంఘం ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోందని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారిక గుర్తింపునిచ్చింది. దీనితోపాటు విజిల్ గుర్తును టీవీకే పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తుగా కేటాయించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే అత్యధికంగా 108 స్థానాలలో విజయం సాధించింది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం టీవీకేని తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారిక ప్రాంతీయ పార్టీగా గుర్తించింది. దీంతో తమిళనాడులో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన 7వ రాష్ట్ర పార్టీగా టీవీకే నిలిచింది. టీవీకే పార్టీకి భారత ఎన్నికల సంఘం గుర్తింపునివ్వడం ప్రజల మద్దతుతోనే సాధ్యమైందని తమిళనాడు సీఎం విజయ్ హర్షం వ్యక్తం చేశారు. -
బీజేపీ ఖజానాలో భారీ పెరుగుదల.. వివరాలివే..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి మొత్తం రూ.1,472.8 కోట్ల నిధులు అందాయి. ఎన్నికల అనంతరం పార్టీ ముగింపు నిల్వ రూ.7,627.2 కోట్లకు చేరింది. మార్చి 15, 2026న ఉన్న రూ.6,722.6 కోట్లతో పోలిస్తే ఇది రూ.904.6 కోట్ల పెరుగుదల. ఈ వివరాలను బీజేపీ.. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల వ్యయ, నిధుల నివేదికలో వెల్లడించింది.రూ.160 కోట్ల ఎన్నికల వ్యయంఅస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఆయా రాష్ట్ర, జిల్లా విభాగాలను కలిపి మొత్తం రూ.160 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో అస్సాంలో రూ.96.3 కోట్లు, తమిళనాడులో రూ.51.6 కోట్లు, పుదుచ్చేరిలో రూ.11.9 కోట్లు వ్యయమయ్యాయి. ఈ ఎన్నికల్లో సాధారణ ప్రచారానికి పార్టీ సుమారు రూ.130.4 కోట్లు ఖర్చు చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలకు సంబంధించిన వ్యయ వివరాలను మాత్రం ఎన్నికల సంఘం ఇంకా బహిర్గతం చేయలేదు.అస్సాంలో అధిక వ్యయంఅస్సాంలో బీజేపీ సాధారణ ఎన్నికల ప్రచారానికి రూ.76.7 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో కేంద్ర పార్టీ విభాగం రూ.23.1 కోట్లు, అభ్యర్థులపై రూ.19.5 కోట్లు వ్యయం చేసినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణాలకు రూ.27.3 కోట్లు, ప్రకటనలకు రూ.37 కోట్లు, ప్రచార సామగ్రికి రూ.8.9 కోట్లు, రాష్ట్ర విభాగం ఇతర ఖర్చులకు రూ.2.3 కోట్లు ఖర్చయ్యాయి. అభ్యర్థులకు మొత్తం రూ.19.4 కోట్లు చెల్లించగా, వారి నేర చరిత్ర ప్రచురణకు రూ.16.7 లక్షలు వెచ్చించారు.తమిళనాడులో రూ.51.6 కోట్లుతమిళనాడులో బీజేపీ మొత్తం రూ.51.6 కోట్లు ఖర్చు చేసింది. సాధారణ ఎన్నికల ప్రచారానికి రూ.44.5 కోట్లు, అభ్యర్థులపై సుమారు రూ.7 కోట్లు వ్యయమయ్యాయి. పుదుచ్చేరిలో మొత్తం ఎన్నికల వ్యయం రూ.11.9 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా ఇదే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ గతంలో సమర్పించిన వ్యయ వివరాల్లో మొత్తం రూ.248.6 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.ఇది కూడా చదవండి: ముగ్గురు సన్నిహితులకు ట్రంప్ భారీ నజరానా! -
‘సర్’నోటీసులొచ్చే ఓటర్లు వీరే!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్), 2026 కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకోనున్న ఓటర్ల జాబితాను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సర్, 2026లో భాగంగా ఇటీవల 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. వారిలో 92,87,577 మంది (35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. చివరిసారిగా 2002లో ‘సర్’నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో తమ పేరు/తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలను అందించకపోవడంతో వీరిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక ఫారంలో సర్–2002 వివరాలను నమోదు చేసినా ..ప్రస్తుత ఓటు వివరాలతో పోలిస్తే వ్యత్యాసాలుండడంతో మరో 60,50,918 మంది ఓటర్లకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ రెండు కేటగిరీల కలిపి మొత్తం 92లక్షల మంది ఓటర్లుండగా, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి జాబితాలను మంగళవారం ఆన్లైన్లో ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వెబ్సైట్ (https://ceotelangana.nic.in) లో ఈ జాబితా అందుబాటులో ఉంది. పార్ట్నంబర్ల(పోలింగ్‌బూత్ నంబర్) వారీగా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. జిల్లా పేరు, నియోజకవర్గం పేరు, తమ పోలింగ్ బూత్ సంఖ్య తెలిసి ఉంటే ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. సర్–2026 ముసాయిదా జాబితాలో చాలా మంది ఓటర్ల పోలింగ్‌బూత్/పార్ట్ నంబర్లు మారాయి. 1050 టోల్‌ఫ్రీ నంబర్‌కు ‘ఈసీఐ ఎపిక్‌నంబర్’ను ఎస్ఎంఎస్ చేస్తే సంబంధిత ఓటరు కొత్త పార్ట్ నంబర్‌ను ఈసీ ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తుంది. దీని ద్వారా పైన పేర్కొన్న జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించి చూడవచ్చు. వెబ్సైట్లో కొన్ని నియోజకవర్గాలు/పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన జాబితాలను ఇంకా అప్లోడ్ చేయలేదు. వాటిని తెరిచేందుకు ప్రయతి్నస్తే త్వరలో అప్లోడ్ చేస్తారనే సందేశం ప్రత్యక్షం అవుతోంది. -
6న 6 స్థానాల్లో ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలతోపాటు అస్సాంలోని నాగావ్ లోక్‌సభ నియోజకవర్గానికి అక్టోబర్ ఆరో తేదీన ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ ఐదు అసెంబ్లీ స్థానాల్లో పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ సైతం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీని ప్రస్తుత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేంధు అధికారి ఇదే నియోజకవర్గంలో ఓడించిన విషయం తెల్సిందే. అయితే గెలిచాక ఈ స్థానం నుంచి ఆయన రాజీనామా చేశారు. భవానీపూర్‌లోనూ సువేంధు పోటీచేయడం తెల్సిందే. అన్ని నియోజకవర్గాలకు అక్టోబర్ 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2024లో నాగావ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ప్రద్యుత్ బోల్డోలాయ్ తర్వాత రాజీనామాచేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన ఇటీవలి బీజేపీలో చేరి దిస్పూర్ నుంచి గెలిచారు. తమిళనాడులోని మధురాంతకం(ఎస్సీ) అసెంబ్లీ స్థానంలో మరకతం కుమారవేల్, ధరాపురం(ఎస్సీ) నియోజకవర్గంలో పి.సత్యభామ గెలిచారు. కానీ ఈ ఇద్దరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇటీవల విజయ్ సారథ్యంలోని టీవీకే పారీ్టకి మద్దతు పలికి అన్నాడీఎంకేకు రాజీనామాచేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తట్టంచవాడీ, మంగళం స్థానాల్లో గెలిచిన పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి కేవలం మంగళంకు పరిమితంకావడంతో తట్టంచవాడిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఖాళీగా ఉన్న మేఘాలయలోని షిల్లాంగ్, పశ్చిమబెంగాల్లోని బసీర్హాట్ లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ఖరారుచేయలేదు. -
అన్యాయమైపోయేది ఓటర్లు కదా సార్!
అన్యాయమైపోయేది ఓటర్లు కదా సార్! -
మూడో దశకూ మారని ‘సర్’
ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా... మీడియా సాక్షిగా ఎలాంటి అవకతవకలు బయట పడుతున్నా ‘స్వచ్ఛమైన’ ఓటర్ల జాబితా రూపకల్పన పేరిట ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో మూడో దశ పూర్తయింది. ఈసారి 16 రాష్ట్రాలూ, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 36.73 కోట్లమంది ఓటర్ల జాబితా లను జల్లెడబట్టి 6 కోట్లమందిని తొలగించినట్టు ఈసీ ప్రకటించింది. ఈ ప్రక్రియకు తొలి దశలో వచ్చినంత వ్యతిరేకత మలి దశలో లేదు. న్యాయస్థానాలు ఏవో కొన్ని ఆదేశాలీయటం మినహా ప్రక్రియను ఆపింది లేదు. మొదటి రెండు దశలతో పోలిస్తే మూడో దశ పెద్దగా అభ్యంతరాలు లేకుండానే పూర్తయినట్టు లెక్క. మొత్తంగా ఈ మూడు దశల్లోనూ 13 కోట్లమంది గల్లంతయ్యారు. దానర్థం వీరంతా అసలే లేకుండా పోయారని కాదు. జాబితాలో లేనివారు అభ్యంతరాలు చెబితే... ఈసీ అడిగిన పత్రాలు సమర్పించు కుంటే మళ్లీ చోటు దక్కించుకునే చాన్స్ ఉండొచ్చు. కానీ ఆ పత్రాల కోసం దూర ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే ఓపిక ఉండాలి.అందుకు కావలసిన తీరిక, సహనం ఉండాలి. ఖర్చు పెట్టగలిగే స్థోమత ఉండాలి. వారం, పదిరోజులు పనికి వెళ్లకున్నా కుటుంబం గడుస్తుందన్న భరోసా ఉండాలి. ఇంత చేసినా వచ్చే ఎన్నికల్లో ఓటేసే యోగం దక్కుతుందని అనుకుంటే అమాయకత్వమే. బెంగాల్లో ఒక అక్షరం ఇటూ అటూ అయినా జాబితాల్లో చోటుదక్కని వారు లక్షల్లో ఉన్నారు. ‘తార్కిక వ్యత్యాసాల’ పేరిట జాబితాల నుంచి వీరందరినీ వెళ్లగొట్టగా, 38 లక్షలమంది 19 ట్రిబ్యునళ్ల ముందు అప్పీల్ చేసుకున్నారు. ఇందులో కేవలం 82,000 మందికి ఊరట దొరికింది. పరిష్కరించిన అప్పీళ్లలో 90 శాతం మందికి తిరిగి చోటు దక్కింది. కానీ ఏం ప్రయోజనం... రాబోయే ఎన్నికల్లో తప్ప వీరు ఓటేయలేరు. వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఎగ్గొట్టే వారిపై దయ చూపి ‘హెయిర్ కట్’ పేరిట మాఫీ చేస్తారు. ఓటర్ల జాబితాలకు ఈసీ చేసే ఈ ‘హెయిర్ కట్’ నిరుపేదలతో నిర్దయగా వ్యవహరిస్తుంది. వారిని కష్టాలపాలు చేస్తుంది.బిహార్‌లో ‘సర్’పై విచారణ సందర్భంగా ‘విపక్షాలు హడావుడి చేస్తున్నాయి... మరి స్వల్ప సంఖ్యలో మాత్రమే అభ్యంతరాలు ఎందుకొస్తున్నా’యని ధర్మాసనం ప్రశ్నించింది. సహేతుకమైన సందేహమే. కారణాలనేకం. తమ ఓటరు కార్డు కేవలం ఎన్నికల సమయంలోనే అక్కరకొస్తుందని అనేకులు అనుకుంటారు. పోలింగ్ రోజున వెళ్లినప్పుడు మాత్రమే ఓటు గల్లంతయిందని తెలుస్తుంది. ఇదంతా మన పాలకుల నిర్వాకం. అవిద్య రాజ్యమేలేచోట ఏ ప్రచారమూ జనానికి పూర్తిగా చేరదు. ‘నిజాయితీగల’ ఓటర్లమేనని నిరూపించుకునే భారం ప్రజలకు వదిలితే ఎక్కడైనా జరిగేది ఇదే! చిన్న చిన్న లోపాలు మినహా అంతా సవ్యంగా చేశామని ఈసీ స్వోత్కర్షలకు పోతోంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. ఇందుకు ఒక ఆంగ్ల దినపత్రికలో జార్ఖండ్ గురించి వచ్చిన కథనమే తార్కాణం. అక్కడ గొడ్డా జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా జాబితా ప్రకటించాక ఫలానా వారి పేర్లు తొలగించాలంటూ బీజేపీ ఏజెంట్లు ఫామ్–7 పత్రాలు సమర్పించినట్టు ఆ పత్రిక వెల్లడించింది. ఒక కేంద్రంలో ఇలాంటివి 25 దాఖలయ్యాయి. వారిలో ఒకే ఒక్కరు మూణ్ణెల్లక్రితం మరోచోట కూలీ పని కోసం వెళ్లారు. మరోచోట ఒక బీజేపీ ఎమ్మెల్యే 75 ఫామ్‌లు సమర్పించారు. చిత్రమేమంటే... అవన్నీ మైనారిటీల ఓట్లు. వాటిలో అత్యధికం 2003 జాబితాతో మ్యాపింగ్ అయ్యాయి. ఇక వేరే జిల్లాల్లో ఏం జరిగిందో... అసలు ‘కొత్తగా చేరుతున్న’ వారెవరో తెలియదు. ఓటు లేకపోవటం మరణంతో సమానమని అనేకులు నమ్ముతారు. బీఎల్ఓ వెళ్లినప్పుడు ఇంట్లో లేనంత మాత్రాన ఓటరే ఉనికిలో లేడన్న నిర్ణయానికి రావటం క్రూరం. ఎందుకంటే ఈసారి ఓటు పోవటమంటే సంక్షేమ పథకాలు ఆగిపోవటం,ముందూ మునుపూ పౌరసత్వం కూడా మాయం కావటం. కొన్ని ప్రభుత్వాలు సంక్షేమా నికి ఓటర్ల జాబితా గీటురాయి కాబోదని హామీ ఇస్తున్నాయి గానీ... అది దయాధర్మ బిక్షంగా మారటం సాధారణ పౌరుణ్ణి అవమానించటం. రేపన్న రోజున అలాంటి వారందరికీ పథకాలు ఆపేయాల్సిందేనంటూ ఆదేశాలు జారీ కాబోవని చెప్పలేం. ఆ మాటెలా వున్నా ఓటరును పోలింగ్ కేంద్రం వైపు రాకుండా ఇంత చక్కని మార్గం ‘కనిపెట్టిన’ ఈసీని అభినందించి తీరాలి! -
ఎన్నికల్లో బీజేపీ గెలుపునకే ‘సర్’
న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకే భారత ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను నిర్వహిస్తోందని రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం ఆరోపించారు. సర్ కింద మూకుమ్మడిగా ఓటర్ల తొలగింపును సుప్రీంకోర్టు ఇప్పటికైనా అడ్డుకోవాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం సర్ పేరుతో చేస్తున్న ఓటర్ల జాబితా సవరణలు కూడా ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సాయపడేందుకేనని ఆయన విమర్శించారు. జార్ఖండ్ రాష్ట్రంలో మైనార్టీ ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు బీజేపీ ఏజెంట్లు బ్లాక్ లెవల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన ఒక కథనంపై కపిల్ సిబల్ ‘ఎక్స్’పై స్పందించారు. ‘సర్’ ఓటర్ల జాబితాను మార్చేందుకు జరుగుతున్న కార్యక్రమం. బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకు చేస్తున్నారు. అని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ... జార్ఖండ్‌లో ఓటర్ల తొలగింపునకు సంబంధించిన ఫామ్–7లను అత్యధికంగా బీజేపీ కార్యకర్తలే దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఫామ్–7లను మూకుమ్మడిగా దాఖలు చేయవచ్చు. 45 లేదా వంద లేదా 400 ఫామ్స్ తీసుకుని ఏ ఏ పేర్లను తొలగించాలో చెప్పవచ్చు. అందుకే కారణాలేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పని తేలినా చేసేదేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ అంశంపై విచారణ జరిపినప్పుడు తొలగించమని కోరిన పేర్లలో అత్యధికం ముస్లింలకు చెందినవే ఉన్నాయని తెలిసిందన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే ఎన్నికలు నిర్వహించిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తొలగించాలని దరఖాస్తులిచ్చిన ముస్లింలలో ఎక్కువ మంది ఆ ప్రాంతాంలోనే కుటుంబాలతో కలిసి ఏళ్లుగా ఉంటున్నట్లు తెలిసిందని చెప్పారు. ఇంతటి తీవ్రమైన అంశం కాబట్టే దేశ అత్యున్నత న్యాయస్థానం దీనిగ ఉరించి పట్టించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘సర్’ నిస్పాక్షికంగా జరుగుతున్నట్లు, ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉన్నట్లు న్యాయస్థానం భావిస్తే ప్రజాస్వామ్యం అతిపెద్ద సమస్యలో పడినట్లేనని స్పష్టం చేశారు. కోట్ల పేర్లు తొలగించారు ‘‘ఉదాహరణకు ఢిల్లీలోనే 45 నుంచి 47 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. వీటిల్లో ఎన్ని పునరుద్ధరిస్తారో నాకు తెలియదు. కానీ ఢిల్లీలోని మొత్తం ఓట్లలో పేర్లు తొలగించిన వారు 23 – 24 శాతం మంది ఉన్నారు.’’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 2.05 కోట్ల పేర్లు తొలిగాయని, ఇదేరకంగా ఇతర ప్రాంతాల్లోనూ కోట్లకు కోట్ల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ‘సర్’ మొదలైనప్పటి నుంచి దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ సుమారు ఐదారుకోట్ల పేర్లు తొలగించారని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రకారం ఇవన్నీ బీజేపీ కార్యకర్తలు మూకుమ్మడిగా ఫామ్–7లు దాఖలు చేయడం వల్ల తొలగినవేనని.. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే నిరూపితం కాగా... జాతీయ మీడియాలోనూ ఇప్పుడు కథనాలు వస్తున్నాయని వివరించారు. అదృష్టవశాత్తూ జార్ఖండ్‌లో బీఎల్ఓలు బీజేపీ కార్యకర్తల డిమాండ్లకు అభ్యంతరాలు చెబుతున్నారని, ప్రతిపక్షం అధికారంలో ఉండటం ఇందుకు కారణమైందని అన్నారు. అధికారంలోనూ బీజేపీనే ఉంటే ఎవరు అభ్యంతరం చెబుతారని ప్రశ్నించారు. -
SIRపై ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: SIR ప్రక్రియపై కేంద్రఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ( శనివారం) లేఖ రాశారు. ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువులు పొడిగించాలని కోరారు. మరో నాలుగు వారాల పాటు ఈ గడువును పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు తుది ఓటర్ల జాబితా గడువునూ పెంచాలని కోరారు. 73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలు ASDD జాబితాలోకి వెళ్లాయని దీంతో తాత్కాలికంగా వెళ్లిన వారిని సైతం శాశ్వతంగా తరలివెళ్లినట్లు పరిగణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు నోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు సమయం ఇవ్వాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హుల ఓట్లు తొలిగిపోకుండా చూడాల్సిన అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.కాగా రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆగస్టు మూడు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 3న సర్వే పూర్తి కాగానే ఓటరు డ్రాఫ్ట్ జాబితా ఆగస్టు 10న ప్రచురించనున్నట్లు అని తెలిపింది. అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకూ గడువుగా పేర్కొంది. చివరగా అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించించనుంది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. -
43.71 లక్షల మంది ఓటర్లకు నోటీసులు
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ప్రతీ దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దోషరహితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు సమిష్టిగా కృషి చేయాల్సిందిగా రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా.పవన్‌కుమార్ శర్మ కోరారు. అక్టోబరు 3న తుది జాబితా ప్రచురణ వరకు సమష్టి కృషితో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో సర్ పురోగతిపై రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్, అదనపు సీఈఓ డిల్లీరావుతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో పవన్‌కుమార్ శర్మ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 43,71,397 మంది ఓటర్లకు నోటీసులు పంపిణీ కాగా.. ఇందులో 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తిచేసినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో.. నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియలో ముందంజలో ఉన్న జిల్లాలను అభినందిస్తూ.. మిగిలిన జిల్లాలోనూ నాణ్యంగా, వేగంగా, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, సహకారం అనేవి ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలకమని.. ఎవరికే సందేహమున్నా నివృత్తి చేయడం, సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పవన్‌కుమార్ సూచించారు. ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు సంతృప్తికరంగా అందించడంలో ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. విచారణకు రాలేని వారి ఇళ్లకు వెళ్లండి..వృద్ధాప్యం, అనారోగ్యం వంటి వివిధ కారణాలవల్ల విచారణకు హాజరుకాలేని పక్షంలో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓను సమన్వయం చేసుకుంటూ ఇంటి సందర్శనతోపాటు వివిధ మార్గాల ద్వారా ఓటర్లకు సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే, నోటీసులపై విచారణ అనంతరం క్వాసీ జ్యుడీషియల్ అధికారి అయిన ఏఈఆర్ఓలు సమస్యను అర్ధంచేసుకుని న్యాయమైన తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. నోటీసుల విచారణలో వెనుకబడిన శ్రీ సత్యసాయి, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖపట్నం వెస్ట్, పెందుర్తి, నెల్లూరు సిటీ, కదిరి, హిందూపూర్, ఉదయగిరి, పెనుకొండ, ఎర్రగొండపాలెం, తిరుపతి, సర్వేపల్లి తదితర నియోజకవర్గాలు సెప్టెంబరు 5న జరిగే ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నాటికి ప్రగతి సాధించాలని పవన్‌కుమార్ శర్మ సూచించారు. -
ఔట్: 41.80 లక్షలు... డౌట్: 36.96 లక్షలు...
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 41.80 లక్షల మంది ఓట్లు డేంజర్లో పడ్డాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ముసాయిదా జాబితాలో వీరు ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) జాబితాలో ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి వీరి ఓట్లు దాదాపుగా లేనట్లే. మూడు జిల్లాల్లో మొత్తం 1,06,55,878 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 64,75,153 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. 41,80,725 మంది ఏఎస్‌డీడీ కేటగిరీల్లో ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరు 39.23 శాతం. వీరు కాక 13,83,472 మంది అనామలీస్, 23,13,150 మంది నో మ్యాపింగ్ కేటగిరీల్లో ఉన్నారు. వీరినీ కలిపితే 36,96,622 మంది వివరాలపై మరింత పరిశీలనకు అవకాశముంది. అంటే వీరి ఓట్లపై డౌట్ ఉంది.శాశ్వత చిరునామా మార్పు ఏఎస్డీడీలో అత్యధికంగా 28,64,052 మంది చిరునామా శాశ్వతంగా మారిన కేటగిరీలో ఉన్నారు. ఈ 25 నియోజకవర్గాల్లో ఎక్కువమంది శాశ్వత చిరునామాలు మారాయి. తర్వాత 7,59,346 మంది అన్ ట్రేసబుల్(గుర్తించలేని)/ఆబ్సెంట్(ఇళ్లలో లేని) వారుగా, 2,96,416 మంది మృతుల, 1,94,952 మంది ఇప్పటికే వేరు ప్రాంతాల్లో ఓటర్లుగా ఉండగా, మరో 65,951 మంది ఇతరుల జాబితాలో ఉన్నారు. అత్యధికం శేరిలింగంపల్లి.. నియోజకవర్గాల వారీగా చూస్తే శేరిలింగంపల్లిలో అత్యధికంగా 3,29,828 మంది ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నారు. ఆ తర్వాత రాజేంద్రనగర్‌లో 2,47,005, మహేశ్వరంలో 2,35,331, ఉప్పల్‌లో 2,18,323, ఎల్బీనగర్లో 2,70,284, కుత్బుల్లాపూర్‌లో 2,76,924 మంది ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నారు. అత్యల్పంగా 85,267 మంది ఇబ్రహీంపట్నంలో ఉన్నారు. ‘నో మ్యాపింగ్’లో కుత్బుల్లాపూర్ టాప్.. కుత్బుల్లాపూర్‌లో ఏకంగా 3,00,553 మంది నో మ్యాపింగ్ జాబితాలో ఉన్నారు..తర్వాత ఉప్పల్‌లో 2,13,068, కూకట్‌పల్లిలో 2,11,703, మేడ్చల్‌లో 2,20,070, మల్కాజిగిరిలో 1,27,199 మంది ఈ కేటగిరీలో ఉన్నారు. ఈ కేటగిరిలో అత్యల్పంగా 12,481 మంది చారి్మనార్‌లో ఉన్నారు.అనామలీస్‌లో రాజేంద్రనగర్..అనామలీస్ కేటగిరీలో రాజేంద్రనగర్ 96,743 మందితో మొదటి స్థానంలో ఉంది. తర్వాత మహేశ్వరం 84,385, మల్కాజిగిరి 85,927, మేడ్చల్ 76,175, కుత్బుల్లాపూర్‌లో 72,973 మంది ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అత్యల్పంగా 27,878 మంది ఈ కేటగిరీలో ఉన్నారు.మహేశ్వరంలో మృతులెక్కువ.. ఏఎస్డీడీలోని మృతుల్లో మహేశ్వరం 16,835 మందితో మొదటి స్థానంలో ఉంది. తర్వాత మేడ్చల్ 15,898, రాజేంద్రనగర్ 14,824, ఉప్పల్ 14,922, గోషామహల్ 13,237, కుత్బుల్లాపూర్ 13,733గా ఉన్నాయి. అత్యల్పంగా సనత్‌నగర్‌లో 4,172 మంది మృతుల కేటగిరీలో ఉన్నారు.శేరిలింగంపల్లిలో అన్‌ట్రేసబుల్.. అన్‌ట్రేసబుల్, ఆబ్సెంట్ కేటగిరీలో శేరిలింగంపల్లి 86,793 మందితో ముందుంది. తర్వాత ఎల్బీనగర్ 86,609, రాజేంద్రనగర్ 83,491, కుత్బుల్లాపూర్ 68,293, బహదూర్‌పురా 27,294గా ఉన్నాయి. అత్యల్పంగా మలక్‌పేటలో 3,718 మంది ఉన్నారు. శాశ్వతంగా చిరునామా మారిన వారిలోనూ 2,16,933 మందితో శేరిలింగంపల్లి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మహేశ్వరం 1,70,613, ఎల్బీనగర్ 1,58,129, మేడ్చల్ 1,56,016, రాజేంద్రనగర్ 1,32,063, కూకట్పల్లి 1,22,906 మంది ఉన్నారు. అత్యల్పంగా చారి్మనార్‌లో 42,238 మంది మాత్రమే నమోదయ్యారు.ఖైరతాబాద్‌లో ఇతరులెక్కువఇతరుల కేటగిరీలో ఖైరతాబాద్ 11,658 మందితో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చాంద్రాయణగుట్ట 8,264, మహేశ్వరం 9,425, ముషీరాబాద్ 1,644 తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యల్పంగా చార్మినార్‌లో 99 మంది ఉన్నారు.ఇప్పటికే నమోదులో.. మహేశ్వరం ఇప్పటికే మరోచోట అంటే ఇతర రాష్ట్రాలు, నగరాలు, తదితర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైనవారిగా గుర్తించిన కేటగిరీలో మహేశ్వరం 19,758 మందితో ముందుంది. తర్వాత రాజేంద్రనగర్ 14,269, ఇబ్రహీంపట్నం 13,964, మేడ్చల్ 12,363, యాకుత్‌పురా 11,860 ఉన్నాయి. అత్యల్పంగా మల్కాజిగిరిలో 2,714 మంది ఉన్నారు.ఇంకా అవకాశం ఉంది..అనామలీస్, నోమ్యాపింగ్తో పాటు ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్నవారు తగిన వివరాలు సమరి్పస్తే వారి ఓటు ఉంటుందని అధికారులు తెలిపారు.25 నియోజకవర్గాల్లో ఇలా... -
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ
తాడేపల్లి : అర్హులు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. నిజమైన ఓట్లర హక్కులు కాపాడాలంటూ వైఎస్సార్సీపీ లేఖలో పేర్కొంది. ‘ఓటర్ల సవరణలో పారదర్శకత పాటించండి. నోటీసులు ఇవ్వకుండా ఏ ఓటూ తొలగించవద్దు. ఈ మేరకు ఈసీ తక్షణ ఆదేశాలు జారీచేయాలి. రక్తసంబంధీకుల ద్వారా వెరిఫికేషన్‌కు అనుమతించండి. వీడియో-కాల్ ధ్రువీకరణ నిబంధనలు ఖరారు చేయండి. అన్మ్యాప్డ్ జాబితాలను బూత్‌వారీగా ప్రచురించాలి. రాజకీయ పార్టీలకు నోటీసుల వివరాలివ్వాలి. నకిలీ ఓట్లను తక్షణమే తొలగించాలి. వలస ఓటర్లకు న్యాయం చేయండి. ఓటర్ల సవరణలో పారదర్శకత పాటించండి’ అని ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ రాసినట్లు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
పాపం! ఓటు గల్లంతు కాకుండా చూడమని ఈసీకి మొక్కుతున్నాడు!
పాపం! ఓటు గల్లంతు కాకుండా చూడమని ఈసీకి మొక్కుతున్నాడు! -
‘స్థానిక’ ఎన్నికలు బ్యాలెట్‌తోనే
సాక్షి, అమరావతి: పాత విధానంలోనే బ్యాలెట్ పేపర్‌తో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు సరిపడినన్ని బ్యాలెట్ బాక్స్‌లు రాష్ట్రంలో అందుబాటులో లేనందున పొరుగు రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలనూ బ్యాలెట్ విధానంలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు లేఖ రాసి 50 వేల చొప్పున మొత్తం 1.50 లక్షల బ్యాలెట్ బాక్స్‌లను సమకూర్చాలని కోరినట్లు అధికారులు పేర్కొంటున్నారు.మన రాష్ట్రంలో చిన్న, పెద్దవి కలిపి దాదాపు 1.10 లక్షల బ్యాలెట్ బ్యాక్స్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో ఎక్కువ భాగం ప్రస్తుతం వినియోగానికి పనికి రావని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వాటిలో 50 వేల లోపు మాత్రమే బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ అవసరాలకు వినియోగించుకునే వీలుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు వరసగా నిర్వహించే అవకాశం ఉన్నందున కనీసం 1.50 లక్షల బ్యాలెట్ బ్యాక్స్‌లను అందుబాటులో ఉంచాలని కమిషన్ యోచిస్తోంది.మూడు పొరుగు రాష్ట్రాల నుంచి కనీసం లక్షకు తక్కువ కాకుండా బ్యాలెట్ బాక్సులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. జిల్లాల వారీగా ప్రస్తుతం వినియోగానికి పనికి వచ్చే బ్యాలెట్ బాక్స్‌ల వివరాలు పంపాలని కలెక్టర్లకు లేఖలు పంపినట్లు సమాచారం. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికల నిర్వహణ ఉంటుందన్న యోచనతో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారుల సైతం బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే బ్యాలెట్ పేపరు కొనుగోలుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈవీఎంలతో నిర్వహించాలనుకున్నాగ్రామ పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో కాకుండా తొలిసారి ఈవీఎంలతో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలుత యోచించింది. కూటమి ప్రభుత్వంలో నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉండగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలనే ఉద్దేశంతో ఈవీఎంల కొనుగోలుకు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయనే అంచనాతో నాలుగు దశల్లో నిర్వహిస్తే 41,301 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ పేపరు యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని భావించారు.ఈవీఎంల కొనుగోలుకు రూ.400 కోట్లకు పైగా ఖర్చు అవుతుందనే అంచనాతో 2025 చివరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనిపై 9 నెలలుగా ప్రభుత్వం స్పందించకపోవడం, ఎన్నికల నిర్వహణకు గడువు సమీపించడంతో బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ నిర్ణయించినట్లు సమాచారం. -
తెలంగాణ ఫ్యామిలీ కార్డ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డులను ప్రాతిపదికగా తీసుకుని జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను (ఎఫ్ఆర్సీ) ఓటర్ నమోదు సవరణల్లో ఆమోదించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ లిఖితపూర్వక లేఖ రాసింది.మీసేవా కేంద్రాల ద్వారా ఎఫ్ఆర్సీలు జారీ చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం జులై 25న జీవో 172ను విడుదల చేసింది. అయితే, కేవలం రేషన్ కార్డుల ఆధారంగా ఎఫ్ఆర్సీలను జారీ చేయడంపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందాయి. రేషన్ కార్డు ప్రామాణికంగా ఎఫ్ఆర్సీలను జారీ చేస్తే అనర్హులు కూడా ఓటర్ల జాబితాలోకి చేరే ప్రమాదం ఉందని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.సుప్రీంకోర్టు తీర్పుల ప్రస్తావనఈ వ్యవహారాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేషన్ కార్డు అనేది ఓటరు అర్హత నిర్ధారణకు లేదా ఎస్ఐఆర్కు అనువైన డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఈసీ ప్రస్తావించింది. 2013 నాటి మెమో 11496 ప్రకారం ఫ్యామిలీ సర్టిఫికెట్లకు అనుమతి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదించినప్పటికీ, ఈసీ దానిని తోసిపుచ్చింది. రేషన్ కార్డుల ఆధారంగా రూపొందించిన ఎస్ఆర్సీ పత్రాలను ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. -
ఫ్యామిలీ రిజిస్టర్‌కు నో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జూలై 25న జీవో 172 కింద జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా ప్రామాణిక పత్రంగా అంగీకరించలేమని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కు లేఖ రాశారు. 2026 జూలై 25కు ముందు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను మాత్రం ఆధారంగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ‘సర్’ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. చివరి సారిగా 2002లో సర్ నిర్వహించినప్పుడు రూపొందించిన ఓటర్ల జాబితాతో పోల్చితే ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లు, ఇతర వివరాల్లో తేడాలు కలిగిన ఓటర్లకు స్థానిక ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వోలు) ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 మధ్య నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారు. సర్ ప్రక్రియలో 2,64,87,214 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించగా, వారిలో 60,51,503 మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు నిర్ధారించడంతో వీరందరూ త్వరలో నోటీసులు అందుకోనున్నారు. విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక దాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉండగా, ఆ జాబితాలో పదో పత్రంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన వారికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీకి ఆదేశిస్తూ జూలై 25న ప్రభుత్వం జీవో 172 జారీ చేయగా, ‘సర్’ప్రక్రియలో అది చెల్లుబాటు కాదని తాజాగా ఈసీ స్పష్టం చేసింది. విచారణ లేకుండా జారీ చేయనుండటంతోనే... రేషన్ కార్డ్ డేటా ఆధారంగా ఎలాంటి విచారణ లేకుండా మీ–సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశిస్తూ జీవో 172ను జారీ చేశారని ఈసీ ప్రస్తావించింది. విచారణ లేకుండా జారీ చేసే ఈ సర్టిఫికెట్ కేవలం రేషన్ కార్డుతో సమానమని పేర్కొంది. ‘సర్’ధ్రువీకరణ పత్రాల జాబితాలో రేషన్‌కార్డును చేర్చలేదని గుర్తు చేసింది. రేషన్ కార్డు పౌరసత్వానికి తగిన నిదర్శనం కాదని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. గత జూలై 25న జీవో 172 జారీ చేయగా,ఆ తేదీకి ముందు పాత విధానంలో జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను మాత్రం రుజువుగా స్వీకరిస్తామని ఈసీ స్పష్టంచేసింది. -
ఏ పుట్టి మునిగేనో?
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుండగా.. రాష్ట్రంలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం కన్పిస్తుండటం రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. ఆయా పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ టికెట్ ఆశావహుల్లో గుండెదడకు కారణమవుతోంది. గతంలో ఏ పార్టీకి పడిన ఓట్లు గల్లంతయ్యాయో, పలు ఎన్నికల్లో సంప్రదాయంగా ఆ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతయిన వాటిల్లో తమ పార్టీ ఓట్లు ఉన్నాయా? అనేది ఆయా పార్టీల నేతలను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి పోలింగ్ బూత్‌స్థాయి సమీక్షలకు పూనుకుంటున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు లోపలి భాగంలో ఉన్న 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40 లక్షలకు పైగానే ఓట్లు గల్లంతయ్యాయని లెక్కలు చెబుతుండడంతో.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా ఎంఐఎంకు నష్టం కలుగుతుందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు అనామలిస్ ఓట్లు (సందేహాలున్నవి) కూడా సుమారు 60 లక్షలు దాటడంతో అందులో ఎన్ని మళ్లీ ఓటరు జాబితాలో చేరతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్యూమరేషన్ ఫారం నింపిన తర్వాత ఓటరు పక్షాన తప్పులు దొర్లడం, 2002 ఎస్ఐఆర్తో లింకు కుదరకపోవడంతో ఈ ఓటర్ల పేర్లను అనామలిస్ జాబితాలో ఉంచారు. గల్లంతయిన ఓట్లకు ఈ అనామలిస్ తోడు కావడంతో ఇంకెన్ని లక్షల ఓట్లు మాయమవుతాయో, ఈ మాయమైన ఓట్ల సమీకరణలు ఏ రాజకీయ పార్టీ తలరాతను ఏ విధంగా మారుస్తుందోననే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో కనిపిస్తోంది. ఆ 26 నియోజకవర్గాలు ఏమవుతాయో? ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 26 నియోజకవర్గాల్లో అత్యధికంగా, అత్యల్పంగా ఓటర్లు గల్లంతయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీ, ముగ్గురు జంపింగ్ ఎమ్మెల్యేలుండగా, మిగిలిన అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. 50 వేల కంటే ఎక్కువ ఓట్లు గల్లంతయిన నియోజకవర్గాల్లో ఎక్కువగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంచిర్యాల (64,980), ఇబ్రహీంపట్నం (85267), చేవెళ్ల (55609), పరిగి (52856), వికారాబాద్ (52195), తాండూరు (65531), వరంగల్ వెస్ట్ (82617), ఖమ్మం (80663), మహబూబ్‌నగర్ (50647), వరంగల్ ఈస్ట్ (50791) అసెంబ్లీ స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఉన్న నిజామాబాద్ అర్బన్ (83283), బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన కరీంనగర్ (100622) స్థానాల్లోనూ భారీ ఎత్తున ఓట్లు గల్లంతు కావడం గమనార్హం. ఇక అత్యల్పంగా 20వేల లోపు ఓటర్లు గల్లంతయిన నియోజకవర్గాల్లో భువనగిరి (15892), ఆలేరు (10227), పాలేరు (19156 ), వైరా (17153 ), భద్రాచలం (19873), అశ్వారావుపేట (15451), పరకాల (19081), నర్సంపేట (18331), స్టేషన్ ఘన్పూర్ (17055), పాలకుర్తి (19777), డోర్నకల్ (19080), మునుగోడు (17035), బాన్సువాడ (19882), మానగకొండూరు (19658), మెదక్ (18722), దుబ్బాక (17835) ఉన్నాయి. వీటిలో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, స్టేషన్‌ఘన్‌పూర్, బాన్సువాడ, భద్రాచలం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన అన్నిచోట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. తాజాగా ఈ 26 చోట్ల ఫలితం ఏ మేరకు తారుమారవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 39715 ఓట్లు గల్లంతయ్యాయి. మంత్రుల విషయానికొస్తే చెన్నూరు (27942), మంథని (23841), హుస్నాబాద్ (24321), కొల్లాపూర్ (35101), మధిర (20638), పాలేరు (19156), ఖమ్మం (80663), వరంగల్ ఈస్ట్ (50791), హుజూర్నగర్ (22506), నల్లగొండ (31890), మక్తల్ (39757), ములుగు (27842 ), ధర్మపురి (18638), ఆంథోల్ (32503)లలోనూ పెద్ద సంఖ్యలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. వీటితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష కంటే ఎక్కువ మంది చొప్పున ఓటర్లు గల్లంతయ్యారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 3.29 లక్షల ఓటర్లు కనిపించకుండా పోయారు. -
సాక్షి కార్టూన్ : 05-08-2026
సాక్షి కార్టూన్ : 05-08-2026 -
ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో సమ్మరీ ఇన్ఫర్మేషన్ రివిజన్ (SIR) ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్లు ఈసీ వెల్లడించింది. అంటే రాష్ట్ర మొత్తం ఓటర్లలో 89.22 శాతం మంది ఫారాలు ఇచ్చినట్లయ్యింది. జాబితా ప్రక్షాళనలో భాగంగా 7.37 లక్షల మంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. 15.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్టు ప్రకటించగా, 22.30 లక్షల మంది షిఫ్ట్, గైర్హాజరైనట్లు తెలిపింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 44,89,512 మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించాల్సి ఉందని, ప్రస్తుతానికి వారి నుంచి ఫారాలు తీసుకోలేదని ఈసీ స్పష్టం చేసింది.కాగా, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం సిబ్బంది (BLOలు) ప్రతి ఇంటికీ తిరిగి, అక్కడ నివసిస్తున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
హాయ్.. నా పేరు డా. సూరి శ్రీమతి.. విషయం ఏంటంటే?
హైదరాబాద్: హాయ్.. నా పేరు డా.సూరి శ్రీమతి. నా వయసు 92 ఏళ్లు. నేను ఓటేసేందుకు ఆసక్తిగా ఉంటాను. అందుకే ఈ వయసులోనూ ఎన్యూమరేషన్ ఫారం నింపి అందజేశాను. అందరూ నాలాగే ‘సర్’లో పాల్గొనండి. ఓటు మీ హక్కుగా గుర్తించండి’ అంటూ సందేశమిచ్చారు సీనియర్ గైనకాలజిస్ట్ సూరి శ్రీమతి. ఆమె సోమవారం సీతాఫల్‌మండిలోని తన నివాసంలో ఎన్యూమరేషన్ ఫారం నింపి 141వ బూత్ బీఎల్ఓ లీలావతి, బీఎల్ఏ నాగమణికి అందచేశారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నందుకు ఆనందంగా ఉందని, అందరూ ఓటును పరిరక్షించుకోండని చెప్పారు. -
మాయాబజార్లో ఓటర్ల దేవులాట
‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అని పాడుకునే ‘మాయాబజార్’ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రానికి నిజానికి ‘శశిరేఖా పరిణయం’ అని ఉండాలి. కానీ ప్రపంచం మాయాబజార్ గానే గుర్తుంచుకుంది. ఎందుకంటే ఆ కథలో మాయ, వ్యూహం, వేషధారణ, భ్రమ – అన్నీ కలగలిసి ఉంటాయి. ఎవరు నిజం? ఎవరు మాయ? అనే సందేహమే కథకు ప్రాణం. నేటి ఓటరు జాబితాల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియను గమనిస్తే కూడా ఇటువంటి సందేహాలే తలెత్తుతున్నాయి. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలు ఒక పవిత్ర ప్రక్రియ. ఆ ప్రక్రియలో పారదర్శకత కనిపించకపోతే, అది ‘మాయాబజార్’లా అనిపించడం సహజం.మాయాబజార్లో ‘సత్యపీఠం’ ఉంటుంది. దానిపై కూర్చుంటే అసత్యం బయటపడుతుందని భావిస్తారు. కానీ వాస్తవ జీవితంలో రాజ్యాంగ పదవులు చేపట్టే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు– అందరూ సత్యనిష్ఠతో పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. అయినప్పటికీ, వారి నిజాయితీని నిరూపించేందుకు అటువంటి ‘సత్యపీఠం’ లేదు. భారత సుప్రీంకోర్టు కూడా ‘సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ (2010) కేసులో పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలను వ్యక్తి సమ్మతి లేకుండా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రశ్న ఏమిటంటే, పౌరుడి విషయంలో రాజ్యాంగం అంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఓటరును మాత్రం మళ్లీ మళ్లీ తన ఉనికిని నిరూపించమని అడగడం ఎంత వరకు సమంజసం?ఓటరు ఎవరు?ఎన్నికల సంఘం చెబుతున్నది ఒకటే: ఫారం నింపండి, పత్రాలు ఇవ్వండి, వివరాలు సమర్పించండి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న కూడా ఒక్కటే: ‘నేను ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. నా పేరు ఇప్పటికే ఓటరు జాబితాలో ఉంది. మళ్లీ నేను ఎవరో ఎందుకు నిరూపించాలి?’ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు ప్రజలకు అందలేదు. 2002లో జరిగిన ప్రత్యేక సవరణ తరువాత అనేక ఎన్నికలు జరిగాయి. అదే జాబితాల ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలాది మంది ఓటు వేశారు. అప్పుడు చెల్లుబాటైన ఓటరు ఇప్పుడు అకస్మాత్తుగా సందేహా స్పదుడిగా ఏ విధంగా మారాడు?ఎన్నికల జాబితా రూపొందించడం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించడం, ఫారాలు అందించడం, సందేహాలు నివృత్తి చేయడం బూత్ లెవల్ అధికారుల విధి. కానీ అనేక ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా కనిపి స్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి వంటి పట్టణ ప్రాంతాల్లో వేలాది మందికి ఫారాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల బీఎల్వోలు కాలనీల్లో కూర్చొని వచ్చిన వారికి మాత్రమే ఫారాలు ఇస్తున్నారు. అలాంటి పరిస్థితిలో, ఫారం అందకపోయినా బాధ్యత ఓటరుపైనే వేయడం న్యాయమా?జూలై మధ్య నాటికి సుమారు 1.66 కోట్ల తెలంగాణ ఓటర్లలో సగానికి కూడా తక్కువ మంది మాత్రమే ఫారాలు సమర్పించారని అధికారిక సమాచారం చెబుతోంది. అంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఫారం అందలేదా? సమయం సరిపోలేదా? లేక ప్రక్రియపై సరైన అవగాహన కల్పించలేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా గడువులు పొడిగించడం ప్రజల సందేహాలను తగ్గించదు.డిజిటలైజేషన్ ఎందుకు?డిజిటల్ ఇండియా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆధార్, ఓటర్ ఐడీ, జనన–మరణ నమోదు, చిరునామా రికార్డులు, ప్రభుత్వం వద్ద ఇప్పటికే విస్తృత సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని సమన్వయం చేయకుండా, ప్రతి ఓటరునూ మళ్లీ పత్రాలతో రావాలని అడగడం పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిజిటల్ వ్యవస్థ పౌరుడికి సౌలభ్యం కలిగించాలా? లేక అతనిపై కొత్త భారం మోపాలా?ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర పరిధిలోనే లక్షలాది నమోదులు పరిశీలనకు వస్తే, ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా వివరాలు వెల్లడించడం అత్యవసరం. ఎన్నికల సంఘం ఒక సాధారణ ప్రభుత్వ శాఖ కాదు. అది రాజ్యాంగం సృష్టించిన స్వతంత్ర సంస్థ. దాని నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి, అనుమానాలను కాదు. పౌరుడు ఎన్నికల సంఘాన్ని నమ్మాలి, ఎన్నికల సంఘం కూడా పౌరుడిని నమ్మాలి. ఈ పరస్పర విశ్వాసమే ప్రజాస్వామ్యానికి మూలాధారం.మాయాబజార్ సినిమాలో చివరికి మాయ తొలగిపోతుంది. నిజం బయటపడుతుంది. అందుకే ఆ కథ సుఖాంతమవుతుంది. ప్రజాస్వామ్యంలో కూడా అదే జరగాలి. ఎన్నికల ప్రక్రియలో మాయకు, సందేహాలకు, అపార్థాలకు చోటు ఉండకూడదు. ‘నీవు ఓటరువని నిరూపించు’ అనే ధోరణి కంటే, ‘నీ ఓటు హక్కు రక్షించడం మా రాజ్యాంగబద్ధ బాధ్యత’ అనే ధోరణి ఎన్నికల సంఘానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది.సర్ అనేది కేవలం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మాత్రమే కాదు. అది ఎన్నికల సంఘం విశ్వసనీయతకు కూడా పరీక్ష. ఆ పరీక్షలో విజయం సాధించేది గణాంకాలు కాదు; పారదర్శకత, నిష్పాక్షికత, ప్రజల విశ్వాసం. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన ‘సత్యపీఠం’.- మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
నా ఓటు ఉంటుందా సార్!
నా ఓటు ఉంటుందా సార్! -
ఈసీ కొత్త మెలిక!
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటికే దాదాపు అయిదున్నర కోట్లమంది ఓటర్లను జాబితాల్లోంచి తొలగించి రికార్డు సృష్టించిన ఎన్నికల సంఘం(ఈసీ)... కొత్త రికార్డులు నెలకొల్పాలని తహతహలాడుతున్నట్టు కన బడుతోంది. 2002 నాటి ఓటర్ల జాబితాలో గల తమ తల్లిదండ్రుల వివరాలు పొందుపరి స్తేనే కొత్తగా 18 యేళ్లు నిండినవారూ, ఓటుహక్కు పొందదల్చుకున్న ఇతరులూ అర్హులవు తారని విధించిన తాజా నిబంధన ప్రకంపనలు రేపుతోంది. బిహార్‌తో మొదలెట్టి ఇంత వరకూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ‘సర్’లో లేని నిబంధన ఇప్పుడు కొత్తగా అందరి నెత్తినా పడేసింది. 2002 నాటికే తల్లిదండ్రులు మరణించివున్నా... అప్పట్లో సమయానికి ఇంట్లో లేకపోవటంవల్లనో, పనిపాటల కోసం వేరే ప్రాంతంలో ఉండటంవల్లనో వారి ఓటు హక్కు గల్లంతైవుంటే అలాంటి వాళ్ల పరిస్థితేమిటో చెప్పాలన్న స్పృహ కూడా దానికి లేకుండా పోయింది. అలాంటివాళ్లు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చనటం తప్ప మరేమీ వివరణ లేదు! తీరా ఇస్తే ఈ నిబంధన సాకుతో తిరస్కరించటం తప్ప ఒరిగేదేముంటుంది? ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన పాలకుల పుణ్యమా అని ఈ దేశంలో ఇతర చీడలతో పాటు నిరక్షరాస్యత కూడా నిక్షేపంగా ఉంది. 2011 నాటి లెక్కల ప్రకారం అక్షరాస్యత 74.04 శాతం. ఇప్పుడు జాతీయ సగటు 81 శాతమని అంటున్నారు. సంతకం పెట్టగలి గినపాటి జ్ఞానం వచ్చినవారిని అక్షరాస్యులుగా లెక్కేయటంవల్ల ఈమాత్రం కనబడుతోంది. తేలిగ్గా దేన్నయినా చదవగలిగేవారెందరో చెప్పలేం. అలాంటివారు ఇరవైయ్యేళ్ల క్రితం తమ ఓటు ఎక్కడుందో గుర్తుపెట్టుకుని పాత చిట్టాలు వెతకగలరా? ఒకవేళ గుర్తున్నా 2008 పునర్విభజనలో చాలా నియోజకవర్గాల పేర్లు, వాటి పరిధిలోని ఊళ్లు మారాయి గనుక వాస్తవంగా తమ ఓటు ఏ పరిధిలోకి పోయిందో తెలుసుకోలేరు. పైగా ఇది సాగు సీజన్. నాట్లు, యూరియా కొనుగోలు, ఇతరేతర పనుల కోసం రైతులు ఇప్పటికే తిప్పలు పడుతున్నారు. వారి పిల్లలు సైతం ఆ పనులు పంచుకుంటే తప్ప ఒక కొలిక్కి రాదు. జనాన్ని బాధించటానికి ఇంతకన్నా మంచి అదును ఈసీకి దొరకలేనట్టుంది!ఈసీ తీసుకొచ్చిన ఈ ‘సర్’ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెప్పివుండొచ్చు. అందులో చోటు దొరకనివారు ట్రిబ్యునళ్లను ఆశ్రయించవచ్చన్న వెసులుబాటు కల్పించి వుండొచ్చు. కానీ అది నిగ్గుతేలేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. బెంగాల్ సంగతే తీసుకుంటే జాబితాల్లో గల్లంతైనవారు లక్షల్లో ఉండగా... ట్రిబ్యునళ్లు తేల్చిన కేసులు మూడు, నాలుగు వేలు మించలేదు. ఇలాగైతే అంతా తేలేసరికి కనీసం పాతికేళ్లు పడుతుందని న్యాయ నిపుణులు లెక్కేస్తున్నారు. ‘సర్’లో చోటు దొరక్కపోతే పింఛన్లు మొదలు కొని గ్యాస్ సిలెండర్ల సబ్సిడీ వరకూ సమస్తం ఆపేయటం కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. రేపో మాపో మీరు ఈ దేశ పౌరులు కాదు... ఇక్కడ ఉండటానికి అనర్హులని చెప్పినా ఆశ్చర్యం లేదు. పోనీ ఈసీ ‘స్వచ్ఛమైన’ జాబితాను రూపొందించగలుగుతోందా? పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు చెబుతున్నదాన్నిబట్టి చూస్తే యూపీలో కొన్ని చిరునామాల్లో వందలమంది ఓటర్లు నమోదైవున్నారు. ఇలాంటి ఆరోపణలకు ఈసీ వివరణ ఇచ్చిన దాఖలా లేదు. అసలు అలాంటి బాధ్యత ఉన్నట్టు కూడా అది గుర్తించే స్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల టీడీపీ కార్యాలయాల్లో, ఆ పార్టీ నేతల ఇళ్లలో ‘సర్’ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి... ఎవరికి ఇవ్వకూడదన్న నిర్ణయాలు జరుగుతున్నా యని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మీడియాలో ఫొటోలు, వీడియోలు వస్తున్నాయి. అయినా ఈసీ ఉలకదు, పలకదు. సంబంధిత బీఎల్ఓలపై చర్యలుండవు. ఈ తంతు గమనిస్తే ఇది ‘తీసివేతల ఈసీ’గా కనబడుతోంది. గతంలో ఓటర్ల జాబితా సవరణలో కొత్తగా ఇన్ని లక్షలమంది జమ అయ్యారని... అందులో మొదటిసారి ఓటుహక్కు వచ్చినవారు ఇంతమంది అని ఈసీ గర్వంగా చెప్పుకునేది. ఇప్పుడు తీసివేతలే గర్వకారణంగా మారింది. ప్రపంచంలోనే అన్నీ డిజిటల్ చేశామని గొప్పగా చెప్పుకునే దేశంలో కాగితాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే స్థితి కల్పించిన ఘనత ఈసీది. మొత్తానికి ఆ సంస్థ మస్తిష్కంలో రేపటి రోజున ఎలాంటి ఆలోచనలు పుడతాయో, ఏం అమల్లోకొస్తుందో అని జనం భయపడే రోజులొచ్చాయి. -
కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్
న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియతో ఇప్పటికే లక్షలాది మంది తమ పేర్లు ఓటరు జాబితాలో ఉంటాయా? లేదా? అనే ఆందోళనలో ఉండగా.. ఎన్నికల సంఘం మరో కీలక నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫామ్-6 ఆన్లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా తాతమ్మల పేర్లు గత SIR ఓటరు జాబితాలో ఉన్నాయా? లేదా? అనే వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. దీంతో "పాత జాబితాలో కుటుంబ సభ్యుల పేర్లు లేకపోతే కొత్త ఓటరు నమోదు ఇబ్బందుల్లో పడుతుందా?" అనే చర్చ మొదలైంది.ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే వాళ్ల కోసం ఎన్నికల సంఘం (EC) కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే.. తమతో పాటు తల్లిదండ్రులు లేదా పూర్వీకుల పేర్లు గత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితాలో ఉన్నాయా? లేదా? అనే వివరాలను ఫామ్-6లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆన్లైన్ దరఖాస్తు ముందుకు వెళ్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఫామ్-6లో కొత్త మార్పుకొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు.. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత, గతంలో పేరు తొలగించబడి మళ్లీ నమోదు కోరుకునే వారు ఫామ్-6ను వినియోగిస్తారు. తాజాగా ఈ ఫామ్‌లో కొత్త డిక్లరేషన్‌ను జత చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినప్పటికీ, పరిపాలనా ఆదేశాల ద్వారా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ఏ వివరాలు అడుగుతున్నారు?ఆన్లైన్ దరఖాస్తులో అభ్యర్థి మూడు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గత SIR ఓటరు జాబితాలో తన పేరు ఉందా? తల్లిదండ్రులు లేదా తాతమ్మల పేర్లు గత SIR జాబితాలో ఉందా?తన పేరు గానీ, కుటుంబ సభ్యుల పేర్లు గానీ గత SIR జాబితాలో లేవా?మొదటి రెండు ఎంపికల్లో ఏదైనా ఎంచుకుంటే, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబర్, ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.ఈసీ చెబుతున్న కారణం ఇదే..!ఈ ప్రక్రియతో కొత్త ఓటర్లను ఇప్పటికే ఉన్న ఓటరు రికార్డులతో అనుసంధానం చేయడం సులభమవుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. అలాగే అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం కూడా తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం తొలిసారిగా గత ఏడాది బిహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సందర్భంగా అమలు చేసినట్లు తెలిపారు.దేశవ్యాప్తంగా SIR ప్రక్రియదేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించినవారు, చిరునామా మార్చుకున్నవారు, దీర్ఘకాలంగా గైర్హాజరైనవారు, అనర్హులు లేదా విదేశీయుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో SIR పూర్తికాగా.. తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు.. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ సవరణల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించబడటంపై రాజకీయ వర్గాలు, పౌరసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధన భవిష్యత్తులో కొత్త ఓటర్ల నమోదుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది -
రెండు ఓట్ల సంగతి దేవుడెరుగు... ఉన్న ఒక్క ఓటు పోకుంటే చాలు!
రెండు ఓట్ల సంగతి దేవుడెరుగు... ఉన్న ఒక్క ఓటు పోకుంటే చాలు! -
ఇదేమి.. 'సర్'దర్ద్!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 సామాన్యులకు పజిల్‌గా మారింది. రాష్ట్రంలో 99.46 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి కార్యాలయం ప్రకటించగా ఇంకా తమకు ఫారాలు అందలేదని చాలా మంది ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని ఎలా నింపాలో తెలియక తికమక పడుతున్నారు. ఫారాలను నింపడంపై ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) యూట్యూబ్‌లో చూసి నింపుకోవాలని సెలవిస్తున్నారు. వెరసి ‘సర్’కార్యక్రమం ఓటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. కాగితాలపైనే 100% ఫారాల పంపిణీ! ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఏకంగా 100 శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ ఆయా జిల్లాల్లో చాలా మంది ఓటర్లు తమకు ఇంకా ఫారాలు అందలేదని చెబుతున్నారు. ఇళ్లు మారిన ఓటర్లలో చాలా మంది పాత ఇళ్లకు చెందిన ప్రాంతాల్లోని బీఎల్ఓల వద్దకు వెళ్లి ఫారాలు తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. అలాగే కొన్ని కుటుంబాల్లో కొందరికే ఫారాలు అందాయి. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంత జిల్లాల్లో కొందరు బీఎల్ఓల వద్దే సగానికిపైగా ఫారాలు పంపిణీ కాకుండానే మిగిలిపోయాయి. పంపిణీ కాని ఫారాలను ఓటర్ల గైర్హాజరు, వలసలు, మరణించిన (అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్/ఏఎస్డీ) ఓటర్లవని పేర్కొంటూ వాటిని సైతం లెక్కల్లో చూపడంతోనే సగటున 99 శాతానికిపైగా ఫారాల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. అవగాహన లేక..వివరాలు లేక.. ఫారం నింపలేక... ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు 2002 ‘సర్’ఓటర్ల జాబితాలో ఓటరు పేరు ఉంటే ఆ వివరాలను ఎడమ వైపు కాలమ్‌లో రాయాల్సి ఉండగా ముందు (ఎడమ) కాలమ్‌లో బంధువుగా పేర్కొన్న వ్యక్తి పేరు గత సర్ జాబితాలో ఉంటే ఆ వివరాలను కుడివైపు కాలమ్‌లో రాయాల్సి ఉంది. ఇందుకోసం 2002 జాబితాలో తమ పేరు, బంధువుల పేర్లను వెతకాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన లేని ఓటర్లు ఈ కాలమ్స్‌లో ప్రస్తుత జాబితాలోని తమ వివరాలు రాస్తున్నారు. వాస్తవానికి 2002 జాబితాలో ఓటరు పేరు, బంధువు పేరు ఎలా ఉంటే అలా యథాతథంగా రాయాలి. 2002 జాబితాలో లేకుంటే ఖాళీగా వదిలేయాలి. అలాగే ఫారం మూడో విభాగంలో ఓటరు పుట్టిన తేదీ/ఆధార్(ఐచ్ఛికం)/మొబైల్ నంబర్/తండ్రి/తల్లి/భాగస్వామి వివరాలను రాయాల్సి ఉంది. 2002 జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో దాదాపుగా అందరు ఓటర్ల పేర్లు, బంధువుల పేర్లు, వయసు, బంధుత్వం వివరాల్లో వ్యత్యాసాలున్నాయి. ఒక జాబితాతో పోలిస్తే మరో జాబితాలో కొందరి పేర్లు, బంధువుల పేర్లు పూర్తిగా మారిపోయాయి. బంధుత్వం వద్ద తండ్రికి బదులు భర్త అని, భర్తకి బదులు తండ్రి/భార్య అని తప్పుగా వచ్చింది. దీంతో మూడో విభాగంలో ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం వివరాలు రాయాలా లేక సరైన వివరాలు రాయాలా అనే అంశంపై ఓటర్లలో గందరగోళం నెలకొంది. దీంతో తప్పులు రాసి మళ్లీ సరిదిద్దే ప్రయత్నంలో చాలా మంది ఫారాన్ని గజిబిజి చేస్తున్నారు. పాతబస్తీలోని కొన్ని జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు ఒక్కో ఫారం నింపడానికి రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుల తరబడి వెతికినా దొరకని 2002 జాబితాలో ఓటు ఇళ్లు మారిన పట్టణ ప్రాంత ఓటర్లు 2002 జాబితాలో తమ పేర్లను వెతకడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసీఐ పోర్టల్ (https://voters.eci.gov.in/searchIn SIR) లో 2002 జాబితాలో ఓటర్ల పేర్లు వెతకడానికి పీడీఎఫ్, సెర్చ్ విత్ ఓటర్స్ డిటైల్స్ అనే రెండు ఆప్షన్లు ఇచ్చారు. పాత నియోజకవర్గం పేరు, నాటి పోలింగ్ కేంద్రం నంబర్ తెలిసి ఉంటేనే పీడీఎఫ్ జాబితాలో నేరుగా వెతకడానికి వీలవుతోంది. ఈ వివరాలు తెలియకపోతే సెర్చ్ విత్ ఓటర్స్ డిటైల్స్ ఆప్షన్‌లోకి వెళ్లి ఓటరు పేరు, బంధువు పేరును కీవర్డ్స్‌గా ఇచ్చి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేస్తే తమ పేర్లు మినహా సారుప్యత కలిగిన ఇతర ఓటర్ల పేర్లు డిస్ప్లే అవుతున్నాయని ఓటర్లు పేర్కొంటున్నారు. సెర్చ్‌లో 200 మందికి మించి పేర్లు చూపకుండా సాఫ్ట్‌వేర్‌లో పరిమితులు విధించడంతో 2002 జాబితాలో పేర్లు వెతకడం చాలా మందికి అసాధ్యంగా మారింది. దీంతో ఆయా ఓటర్లు ఫారాలు నింపకుండా ఖాళీగా ఇచ్చేస్తున్నారు. ఫలితంగా వారంతా నోటీసులు అందుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఖాళీ ఫారం తిరిగిచ్చేశా.. నా పేరు 2002 ఓటర్ల జాబితాలో లేదు. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి వివరాలు లేవు. ఫారం నింపాలని బీఎల్ఓను అడిగితే ఏదో ఒక ఆధారం కావాలని అన్నారు. తండాలో చదువుకున్న వారి వద్దకు వెళ్తే వివరాల్లేకుండా ఫారం నింపడం సాధ్యం కాదన్నారు. అందుకే మీకు నచ్చినట్టు నింపుకోండని బీఎల్ఓకు ఫారం ఇచ్చేశా. – మాలోతు బాలమ్మ, గార్ల మండలం మర్రిగూడెం పంచాయతీ తిర్లాపురం తండా, మహబూబాబాద్ జిల్లా నాకు ఫారం ఇవ్వలేదు నేను వెల్డర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇంట్లో నలుగురం ఉన్నాం. ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. నాది ఇవ్వలేదు. రోజూ అధికారులను అడిగినా దొరకట్లేదు అంటున్నారు. దీంతో వారిని అడగడం మానేశా. – తిరునగిరి మహేశ్, వీవర్స్ కాలనీ, జనగామ (100% పంపిణీ పూర్తైన జిల్లా) ఫారాలు ఎలా నింపాలో తెల్వట్లే... మా ఇంట్లోని నలుగురు ఓటర్లకు బీఎల్వో ఫారాలను ఇచ్చారు. కానీ మాకు చదువురాకపోవడంతో ఎలా నింపాలో తెలియలేదు. హైదరాబాద్‌లో ఉన్న కొడుకు, కోడలి సూచనతో తెలిసిన వారిని అడిగాం. వారు సైతం తెలియదనడంతో ఫారాలను ఇంట్లోనే పెట్టుకున్నాం. 2002లో ఓటు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. –వాంకుడోత్ దేవోజి, భూక్యారాం తండా, మహబూబాబాద్ జిల్లా -
ఊళ్లకు 'ఫారం' ఫీవర్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఓ కొలిక్కి వస్తున్నప్పటికీ ఈ ఫారాలను నింపడం ఎలాగో తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. ఫారంలోని రెండు భాగాల్లో తమ వివరాలను ఎక్కడ నింపాలో చాలా మందికి తెలియడం లేదు. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఫారంలో ఎటువైపు వివరాలు నింపాలి.. 2002 జాబితాలో పేరు లేని వారు ఫారంలో వివరాలు ఎక్కడ నింపాలనే దానిపై గందరగోళం నెలకొనడంతో బీఎల్ఓలకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. అలాగే కొన్నిచోట్ల వివిధ పార్టీల బీఎల్ఏల సహాయం తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితాలో పేరున్నప్పటికీ కొన్ని చోట్ల వారు స్థానికంగా లేకపోవడం, ఫోన్ నంబర్, చిరునామా తెలియకపోవడంతో బీఎల్ఓలు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా శనివారం నాటికి 2.88 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఓటర్లు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో ఫారాల పంపిణీ పూర్తి కావడం లేదు. పట్టణ ప్రాంతాల్లో చిరునామాలు దొరక్క ఫారాల పంపిణీలో కొంత జాప్యం జరుగుతోంది. మరోవైపు బీఎల్ఓలకు ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓ యాప్‌లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఎలా నిర్వహించాలనే అంశంపై మరోసారి బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త కోడళ్లకు ‘సర్’ఇక్కట్లు.. కొత్తగా పెళ్లయి అత్తారింటికి వచ్చిన కొత్త కోడళ్లకు ఎన్యూమరేషన్ దరఖాస్తులు నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత మహిళ తండ్రి, తల్లి, తాత, నాయనమ్మలకు సంబంధించిన ఎపిక్ నంబర్‌ను ఫారంలో పొందుపరచడం తప్పనిసరిగా మారింది. దీంతో వారి పుట్టింటికి ఫోన్లు చేసి కనుక్కోవాల్సి వస్తోందని ఆ మహిళలు పేర్కొంటున్నారు. భర్త తరఫు వారి ఎపిక్ నంబర్లతో మ్యాపింగ్ జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. జిల్లాల్లో పరిస్థితి ఇలా.. – ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మిక ఓటర్లు ఎక్కువగా ఉండే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు, సంగారెడ్డి వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ తక్కువగా జరుగుతోంది. చాలా మంది అద్దెకు ఉన్న వారి ఆచూకీ కనుక్కోవడం ఇబ్బందిగా మారిందని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. – ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వివాహం చేసుకొని వచ్చిన మహిళల పాత (2002) ఓటరు వివరాలు సేకరించడం కష్టంగా మారింది. ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు వలస వెళ్లిన ఓటర్ల నుంచి సమాచారం, పత్రాలు పొందడం ఇబ్బందిగా మారింది. – ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఉన్న కెరమెరి మండలం పరందోలి, అంతాపూర్, బోలపటార్ వంటి 11 గ్రామాల్లోని ఓటర్లు రెండు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన ఫారాలను తీసుకుంటున్నారు. ఒకే రాష్ట్రంలో ఓటు హక్కు మిగిలే అవకాశం ఉండటంతో ఇరు రాష్ట్రాల బీఎల్ఓలు పోటాపోటీగా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోల్‌బెల్ట్‌లో రిటైర్డ్ కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో వారికి ఫారాల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. – కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఫారాలను పూర్తి చేయడంలో నిరక్షరాస్యులకు సమస్య తలెత్తుతోంది. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి పట్టణంలో ఓటర్ల చిరునామాలను బీఎల్వోలు గుర్తించలేకపోవడంతో ఆయా వార్డుల్లో పార్టీల నేతల సహకారంతో ఫారాలను పంపిణీ చేస్తున్నారు. సింగరేణి కార్మికుల్లో కొందరికి భూపాలపల్లితోపాటు వారి స్వగ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయి. భూపాలపల్లి ఓటు హక్కును తొలగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూపాలపల్లి పట్టణంలో సుమారు 10 వేల వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉంది. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని చాలా వరకు రాజకీయ నేతలే చేపడుతున్నారు. బీఎల్ఓలు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. – ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పట్టణాల్లో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లకుండా తాము ఉన్న చోటకే వచ్చి ఫారాలను తీసుకెళ్లాలని చెబుతున్నారు. అధికారుల కోసం ఎదురు చూస్తున్నాం నాలుగు రోజుల క్రితం అధికారులు వచ్చి ఫారం ఇచ్చి వెళ్లిపోయారు. మాకు చదువు రాదు. ఫారం ఎలా నింపాలో తెలియదు. మళ్లీ అధికారులు వస్తే వివరాలు చెబుదామని ఎదురుచూస్తున్నా. – అచ్చమ్మ, వెంకటాపురం(కె), ములుగు జిల్లాఫారం ఎలా నింపాలో చెప్పట్లేదు ఫారం నింపి ఇవ్వకపోతే ఓటు పోతుందంటున్నారు. ఎలా నింపాలో మాత్రం ఎవరూ చెప్పట్లేదు. ఫారం నింపేందుకు చదువుకున్న వాళ్ల చుట్టూ తిరిగా. కానీ వాళ్లకూ అర్థంకాకపోవడంతో చివరకు బీఎల్ఓల దగ్గరకే వెళ్లా. – కథలప్ప, మరికల్, నారాయణపేట జిల్లా -
ఓటు కోసం కోటి కష్టాలు! సరిగ్గా జరగడం లేదు ‘సర్’!
నేను కాశీబుగ్గ శ్రీనివాసనగర్‌లో ఉంటున్నా. ఇంత వరకు ఎవరూ ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వలేదు. మా వీధికి వచ్చిన వారిని అడిగితే ఇక్కడ కాదని అంటున్నారు. మా సొంతూరు అంబుసోలి వెళ్తే అక్కడ ఏమీ తెలియదంటున్నారు. మా ఇంటిలో 3 ఓట్లు ఉన్నాయి. ఎవరికీ ఫారాలు ఇవ్వలేదు. – కోనేటి కుమారి, శ్రీనివాసనగర్, కాశీబుగ్గ సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) కార్యక్రమానికి ఇక మిగిలింది పదిరోజులే.. ఓటును కాపాడు కోవడం కోసం ఓటర్లు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. తీసుకున్న వారు వాటిని ఎలా పూర్తి చేసి ఇవ్వాలో అర్థం కాక తలపట్టుకు కూర్చుంటున్నారు. సర్ కార్యక్రమంపై ఓటర్లకు సమగ్ర అవగాహన కలిగించకుండా, బీఎల్వోలకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వకుండా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎవరి ఓట్లు మిగులుతాయో, ఎవరి ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆందోళనలో అందరూ ఉన్నారు. జూన్ 15న మొదలైన ‘సర్’ కార్యక్రమంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా.. శనివారం నాటికి 2,00,46,384 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ వివరాలు డిజిటలైజ్ చేయడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇరవై రోజుల్లో సగం మాత్రమే పూర్తికావడంతో అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. బీఎల్వోలు సతమతమవుతున్నారు. ఓటర్లలో చాలామందికి ఈ ఫారాలు ఎలా పూర్తిచేయాలో తెలియడం లేదు. మీరే పూర్తిచేయండి అంటూ ఇచ్చేస్తున్నారని బీఎల్వోలు అంటున్నారు. వివరాలు లేకుండా ఇస్తున్న ఫారాలు సచివాలయాలలో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ ఎలా సాగుతుందో ‘సాక్షి’ పరిశీలించింది. ఫారాలు ఇవ్వకుండానే... అధికారుల ఒత్తిడి భరించలేక బీఎల్వోలు చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు ‘సాక్షి’ పరిశీలనలో స్పష్టమయ్యింది. గత నాలుగు రోజుల నుంచి ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాలు 100 శాతం ఇచ్చేసినట్లు ప్రతి రోజు విడుదల చేస్తున్న నివేదికల్లో వెల్లడిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఇప్పటికీ చాలా మందికి ఫారాలు అందలేదని ఓటర్లు చెబుతున్నారు. చాలా మంది ఓటర్లు ఎక్కడున్నది తెలియకపోయినా పై అధికారుల ఒత్తిడితో ఇచ్చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు పలువురు బీఎల్వోలు తెలిపారు. ముందు రికార్డుల్లో ఇచ్చేసినట్లు చూపించండి ఆ తర్వాత డిజిటలైజేషన్ సమయంలో ఏం చేయాలో చెప్తామనడంతో 100 శాతం ఇచ్చేసినట్లు చూపించినట్లు బీఎల్వోలు చెబుతున్నారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ సమస్య.. సర్ ప్రక్రియలో ప్రధాన సమస్య 2002 ఓటర్ల జాబితాల్లో పేరు లేని ఓటర్లే. ఆ ఓటర్ల సమగ్ర సమాచారం సేకరించడం సమస్యగా మారింది. రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్‌లో ఉండే మొత్తం ఓటర్లలో కనీసం 20 శాతం మంది ఈ 24 ఏళ్ల కాలంలో పెళ్లిళ్ల కారణంగా అత్తారి ఊళ్లో ఓటు న మోదు చేసుకున్న వారు, మరో ఊరు వలస వచ్చిన వారి ఓట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారు ఓటు వివరాలను వారు 2002 నివాసం ఉన్న ప్రాంత వివరాలతో మ్యాపింగ్ చేసేలా నిబంధనలు పెట్టడంతో లక్షలాది ఓటర్లు తమ ఓటును కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వాళ్లు సైతం ‘సర్’ నిబంధనలు తెలియక తికమక పడుతున్నారు. ఉద్యోగ రీత్యా వేరొక చోట నివాసం ఉండే వాళ్లు లేదా కొడుకులు, కూతుళ్ల వద్ద ఉంటున్న తల్లిదండ్రులు తాము తాత్కాలికంగా అక్కడ నివాసం ఉంటున్నా, సొంత ఊరిలో ఓటు కాపాడుకోవడానికి బంధువుల ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారని బీఎల్వోలు పేర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గం పాతమాగులూరు గ్రామానికి చెందిన చల్లా శేషమ్మ గుంటూరులో కొడుకు వద్ద నివాసం ఉంటూ, సర్ కార్యక్రమంలో ఊళ్లో ఉన్న తన ఓటు నిలుపుకునేందుకు శుక్రవారం పాతమాగులూరు వచ్చి తమ బీఎల్వోకు ఏమేమి వివరాలు ఇవ్వాలో అడిగి తెలుసుకుని మరీ తమ వివరాలు నమోదు చేసుకోవడం ‘సాక్షి ’ ప్రతినిధి కంట పడింది. ఫారాలు పక్కన పడేస్తున్నారు.. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేరు లేకుండా తరువాత ఓటు హక్కు వచ్చిన వారు ఎన్యూమరేషన్ ఫారాల్లో తల్లిదండ్రుల పేర్లు, వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు సరిగా లేవని, పేర్లలో తేడాలున్నాయని రకరకాల సాకులు చూపిస్తూ డిజిటైజేషన్ చేయడంలేదు. అలా చాలా ఎన్యూమరేషన్ ఫారాలను పక్కన పడేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామ పరిధిలోని 1042 ఓటర్లు ఉన్న 117 నెంబరు పోలింగ్ బూత్ పరిధిలో 53 మంది ఫారాల్లో వివరాలు సరిగా లేవంటూ పక్కన పడేశారు. అధికారపార్టీ బీఎల్ఏలను సంప్రదిస్తున్నాం.. అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్లకే బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారని, కొంతమందికి ఫారాలు ఇవ్వకుండా సచివాలయాలకు వచ్చి సంప్రదించాలని చెబుతున్నారని చాలాచోట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఓటర్ల ఇళ్ల వివరాలు తెలియక తాము అధికారపార్టీ నియమించిన బీఎల్ఏలకు రోజూ ఫోన్లు చేస్తున్నమాట నిజమేనని చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో ఓ బీఎల్వో పేర్కొన్నారు. ‘‘ఓటర్లకు పంచిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుందామని ఇళ్లకు వెళ్లితే చాలా ఇళ్లలో కుటుంబ సభ్యులు పనులకు పోయారని చెబుతున్నారు. ఉదయానే వెళ్లినా పనులకు పోతున్నాం, సాయంత్రం రమ్మంటున్నారు.’’ అని బీఎల్వోలు చెబుతున్నారు. ‘ఫారాలు మేమే పూర్తి చేయాల్సి రావడంతో సర్ కార్యక్రమం వేగంగా ముందుకు సాగడం లేదు’ అని చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని బీఎల్వో వివరించారు. మొరాయిస్తున్న యాప్.. ఇవన్నీ ఓక ఎత్తయితే ఆన్లైన్ సాంకేతిక సమస్యలు ఉండనే ఉన్నాయి. సర్ కార్యక్రమంలో ఓటరు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే బీఎల్వోల మొబైల్ ఫోన్లో యాప్ రోజూ సాయంత్రం అయితే మొరాయిస్తోంది. కనీసం లాగిన్ అవడానికి వీలులేకుండా యాప్ ఓపెన్ కావడం లేదని బీఎల్వోలు అంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల మధ్య తరచూ ఈ సమస్య తలెత్తుతోందని, సమస్య తలెత్తినప్పుడు కనీసం 20 నిమిషాలు యాప్ పూర్తిగా పనిచేయకుండా ఆగిపోతుందని బీఎల్వోలు అంటున్నారు. ‘ఆధార్’ వివరాలు ఎందుకు అడుగుతున్నట్లు? ఎన్నికల సంఘం ‘సర్’ కార్యక్రమ నిబంధనల్లో ప్రతి ఓటరు తల్లిదండ్రుల వివరాలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పనిసరికాదు. కానీ బీఎల్వోలు ప్రతి ఓటరు నుంచి ఆధార్ వివరాలు కూడా సేకరిస్తున్నారు. తమ ఎన్యూమరేషన్ ఫారాలలో ఆధార్ వివరాలు లేకుండా ఇస్తే తిరిగి ఆధార్ వివరాలు తీసుకురండి అంటూ బీఎల్వోలు ఒత్తిడి తెస్తున్నారని పలువురు ఓటర్లు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అధికారులు ఆధార్ వివరాలు తప్పనిసరి అంటూ ఓటర్లను భయపెట్టి ఆ వివరాలు సేకరిస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సొంతంగా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ వివరాలు నమోదు చేసుకోవడానికే ఆధార్ అవసరమవుతుంది. కానీ అలా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఇంటి పేరు అసలు పేరు ముందు వెనకా తారుమారు కావడంతో ఆన్లైన్ కావడంలేదు. అలాగే ఆధార్‌తో ఫోన్ అనుసంధానం కాక, ఓటీపీ రాక ఆన్లైన్లో వివరాలు నమోదు కావడం లేదని అంటున్నారు.గడువు పొడిగింపు కోసం.. దాదాపు సగం మంది ఓటర్ల వివరాలు నమోదు ఇంకా జరగాల్సి ఉండడంతో కార్యక్రమం గడువు పొడిగించాలని బీఎల్వోలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో 60 శాతం ప్రక్రియ పూర్తయినపటికీ... 25 శాతం కూడ పూర్తికాని బూత్‌లు ఒక్కో మండలంలో పదుల సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో శుక్రవారం నాటికి ఇంకా 25 శాతం ప్రక్రియ కూడ పూర్తి కాని పోలింగ్ బూత్‌లు 24 దాక ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని పొడిగించాల్సిందిగా జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు కోరడం గమనార్హం. హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తే లక్షలాది మంది ఓటును కోల్పోవాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. మమ అనిపించాలనే తొందర...‘సర్’ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు చేస్తున్న హడావిడి చూస్తుంటే తూతూమంత్రంలా మమ అనిపించేయాలన్నట్లే కనిపిస్తోందని పలువురు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. పై అధికారులు క్షేత్రస్థాయి సమస్యలతో సంబంధం లేకుండా ఏసీ గదుల్లో కూర్చొని కేవలం అక్కడ ఇంత శాతం అయ్యింది, వాళ్లు మొదటిస్థానంలో ఉన్నారు మీరు ఎందుకు వెనకున్నారని అడుగుతున్నారే కానీ వాస్తవ పరిస్థితులను పట్టించుకోవడం లేదని బీఎల్వోలు పేర్కొంటున్నారు. డిజిటలైజేషన్లో మేమంటే మేము ముందుండాలని జిల్లాలు పోటీ పడుతూ ఆయా కలెక్టర్లు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకోవడం లేదని వారంటున్నారు.పనులకు వెళ్లేటప్పుడు వస్తే ఎలా..? సవర కుడ్డబ గ్రామంలో సుమారు 56 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. బీఎల్వో కనీసం సమాచారం ఇవ్వకుండా.. అందరూ పనులకు వెళ్లే సమయంలో గ్రామానికి వస్తే ఎలా. మేమే బాధ్యత తీసుకుని చదువుకున్న వారితో ఎన్యూమరేషన్ ఫారాలు నింపించాం. అయినా ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు ఫారాలు ఇవ్వలేదు. – సవర వెంకటేశ్, సవర కుడ్డబ గ్రామం, శ్రీకాకుళం జిల్లావివరాలు నింపడానికి డబ్బులా? వివరాలు ఫారంలో నింపకపోతే ఓటు పోతుందని అధికారులు భయపెట్టారు. సచివాలయంలో వాళ్లు పెట్టిన ఓ వ్యక్తి తనవద్ద డబ్బులు వసూలు చేశాడు. నాకు చదువు రాదు. ఐదు దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నా ఇపుడు నా ఓటును కాపాడుకోవడానికి డబ్బులివ్వాల్సి రావడం బాధనిపించింది. – వెంకటేశ్వరరావు, ఎనికేపాడు, కృష్ణా జిల్లా ఊళ్లో వివరాలు తెలియడం లేదు.. నాకు పెళ్లి అయినప్పటి నుంచి మా ఊళ్లోనే ఓటు ఉంది. ఓటరు ఐడీ కార్డు జీజీవీ 2596393. కానీ, మా అమ్మవాళ్ల వివరాలు కావాలంట. అమ్మానాన్న ఫొటోలు, ఆ జిల్లా, నియోజకవర్గం, మండలం, ఓటు వేసిన వార్డు నెంబరు ఇవ్వమంటున్నారు. మా అమ్మవాళ్లకి ఫోను చేసి అడిగితే వాళ్లు తెలియదంటున్నారు. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. ఏమి చేయాలి మేం? – షేక్ సైదాబీ, పాతమాగులూరు, ప్రకాశం జిల్లా -
‘సర్’పై మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)–2026 కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) హైదరాబాద్ మినహా ఫారాలను తెలుగులోనే ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఉర్దూ మాట్లాడే జనాభా 20 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ఆ భాషలో ఫారాలు అందించే విషయాన్ని పరిశీలించా లని ఈసీని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సర్ ఫారాలు ఏఏ భాషల్లో ముద్రించారో వివరాలివ్వాలన్నారు. అలాగే పిటిషనర్ అభ్యంతరాలపై ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వారంపాటు వాయిదా వేశారు. ఎస్ఐఆర్ ఫారాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే ముద్రించి పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కరీంనగర్‌కు చెందిన ఎంఏ ముజీబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఓటర్ల నమోదు నియమావళి రూల్ 4కు ఈసీ తీరు వ్యతిరేకం.. వివక్షపూరితమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలన్నీ సమ్మతించాయి.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోలకు ఏ భాష వచ్చో.. ఏ భాష రాదో.. తెలియదు. మైనారిటీలను తొలగించాలనే ఉద్దేశంతోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో మాత్రమే దరఖాస్తు ముద్రించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆంగ్లంలో ఉన్న ఫారాలను కూడా హైదరాబాద్ వరకే ఇచ్చారు. తెలిసిన భాషలో పత్రం కోరడం రాజ్యాంగ హక్కు. హైదరాబాద్‌లో ఉర్దూ వచ్చిన వారెక్కువ. తెలుగు రాని వారి కోసం ఉర్దూలో ముద్రించాల్సిన అవసరం ఉంది’అని చెప్పారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ‘బీఎల్వోల వద్ద తెలుగు ఫారాలతోపాటు ఆంగ్లం, ఉర్దూ డమ్మీ ఫారాలుంటాయి. ఎవరికైనా తెలుగు తెలియకుంటే ఇతర భాషలోనివి చూపించి.. తెలుగు ఫారమ్‌లో నింపుతారు. ఈ నెల 17న జరిగిన భేటీలో రాజకీయ పార్టీలన్నీ దీనికి ఏకగ్రీవంగా సమ్మతించాయి. తెలంగాణలో అన్ని రాష్ట్రాల వారున్నారు.. దేశంలోని అన్ని భాషల్లో సర్ ఫారాలు ప్రింట్ చేయాలనడం సరికాదు. ఇప్పటికే ప్రింటింగ్ ముగిసింది. బీఎల్వోలు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఒకే ఫారమ్‌లో రెండు, మూడు భాషలిస్తే ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఫారమ్ ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది’అని చెప్పారు. -
పాస్పోర్టూ పనికిరాదా?
ప్రపంచంలో ఏ దేశం పాస్‌పోర్టు శక్తిమంతమైందో లెక్కేసిచెప్పే హెన్లే పాస్‌పోర్టు ఇండెక్స్ (హెచ్పీఐ)... మన పాస్‌పోర్టు 75వ స్థానంలో ఉందంటూ ఈ ఏడాది మొదట్లో నిర్ధారించింది. ‘హమ్మయ్య... నిరుటితో పోలిస్తే పదిమెట్లు పైకొచ్చాం’ అని మన పౌరులు గర్వపడి ఆర్నెల్లు కాకుండానే దానికేమీ పెద్దగా విలువలేదనీ, భారత పౌరసత్వానికి అదేమీ రుజువు కాబోదనీ మన విదేశాంగ శాఖ తేల్చిచెప్పి, ఆ సంతోషంపై నీళ్లు చల్లింది. ‘ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు... గత పుష్కరకాలంలోని నిర్ణయం కానేకాదు. 1967 నాటి పాస్‌పోర్టు చట్టమే ఆ మాట చెప్పిం’దని సెలవిస్తోంది. గత కాలపు నిర్ణయం అయినంత మాత్రాన ఏదైనా శిరోధార్యమవుతుందా... దాన్ని సమీక్షించటం, మార్చటం అసాధ్యమా అన్న ప్రశ్నలు సహజంగానే అందరిలో తలెత్తుతున్నాయి. ఈమధ్యకాలంలో ఎన్నికల సంఘం (ఈసీ) ధర్మమా అని పౌరసత్వంపై ప్రజానీకంలో ఆందోళన బయల్దేరింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బిహార్‌లో మొదలై పలు రాష్ట్రాల్లో సాగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కావలసినంత కలవరపాటును సృష్టించింది.ఇంకా సృష్టిస్తోంది. పౌరులమని నిరూపించుకునే పత్రాలు సమర్పిస్తేనే ఓటు ఉంటుందనటంవల్ల పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పౌరులు ఓటుహక్కు కోల్పోయారు. యూపీలో అలాంటివారు రెండు కోట్ల పైమాటే. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోవటం తక్షణ ప్రమాదమైతే... దేశంలో నివసించటం అసాధ్యమయ్యే స్థితి ఏర్పడటం మున్ముందు ఎదురయ్యే ముప్పు. ఈ దేశ పౌరులని ఈసీ నమ్మితేనే ఎవరికైనా ఓటుహక్కు లభిస్తుంది. అలాగని ఓటర్ గుర్తింపు కార్డు పౌరసత్వానికి రుజువు కాబోదని ప్రభుత్వమే చెబుతోంది. ఇప్పుడు పాస్‌పోర్టు సైతం ఆ ఖాతాలో చేరింది.పదిహేనేళ్ల క్రితం మహారాష్ట్రలోని తెంబ్లీలో ఆధార్‌ను లాంఛనంగా ప్రారంభించి నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమనీ, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినా వుంటుందనీ అన్నారు. నిరుపేదలకు ఏ గుర్తింపు కార్డూ లేకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు ప్రారంభించామని కూడా చెప్పారు. తీరా సర్ ప్రక్రియ సమయంలో అది చెల్లుబాటు కాబోదని ఈసీ తేల్చి చెప్పింది. అటుపై సుప్రీంకోర్టు అనుమతించిన 12 పత్రాల్లో పాస్‌పోర్టు కూడా ఉండటం చాలామందికి ఊరటనిచ్చింది. ఇప్పుడు పాస్‌పోర్టు కూడా పౌరసత్వాన్ని నిర్ధారించటానికి పనికిరాదనటం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. అవధానాల్లో ఆశువుగా పద్యం చెప్పే అవధానికి ‘నిషిద్ధాక్షరి’ మాటున పృచ్ఛకుడు అడుగడుగునా అడ్డుతగులుతూ, ప్రతి పదంలోనూ అక్షరాలను నిషేధిస్తూ ముప్పు తిప్పలు పెడతాడు. వీటన్నిటినీ అధిగమించి ఛందోబద్ధంగా అందమైన పద్యాన్ని అల్లటం అవధాని పద సంపదకు పరీక్ష. పౌరసత్వం విషయంలో దేశ పౌరులకు ఇలాంటి పరీక్షే ఎదురవుతోంది. ఏ పత్రం దాఖలు చేద్దామనుకున్నా అది పనికిరాదని చెప్పటం తప్ప, పనికొచ్చేదేమిటో పాలకులు నిర్ధారణగా చెప్పరు. ఇందువల్ల సామాన్యుల్లో అభద్రతా భావన ఏర్పడటం తప్ప సాధిస్తున్నదేమిటి? పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 6(2)(ఏ) ఈ దేశ పౌరుడుకాని వ్యక్తికి పాస్‌పోర్టు నిరాకరించాలని స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్టే వేరే దేశాలకు ప్రమాణం. దాన్నిబట్టే వీసాలు జారీ అవుతాయి. అది పనికిరాదంటే ఆ దేశాలు అడుగుపెట్టనిస్తాయా?హెచ్పీఐ ర్యాంకులు సాధారణమైనవేం కాదు. ప్రపంచంలో సింగపూర్ పాస్‌పోర్టును మొత్తం 192 దేశాలు గుర్తించి, వీసా అవసరం లేకుండానే తమ భూభాగాల్లో అడుగు పెట్టేందుకు అనుమతిస్తున్నాయి. అందువల్లే అది ప్రథమ స్థానంలో ఉంది. 187 దేశాల గుర్తింపుతో జపాన్, దక్షిణ కొరియాలు... 186 దేశాల గుర్తింపుతో స్వీడన్, యూఏఈలు 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అలా చూస్తే మన పాస్‌పోర్టుకు 56 దేశాల గుర్తింపు మాత్రమే ఉంది. ఇతరచోట్లకు వెళ్లాలంటే వీసా కావాలి. వారు సైతం పాస్‌పోర్టు ఆధారంగానే వీసా జారీచేస్తారు. ఇప్పుడు విదేశాంగశాఖ తకరారుతో అంతర్జాతీయంగా ఎవరైనా తలుపులు మూస్తే మన పౌరుల గతేమిటి? ఎన్నో దేశాల్లో అన్నిటికీ చెల్లుబాటయ్యే కార్డు జారీ విధానం దశాబ్దాల క్రితమే అమల్లోకొచ్చింది. మనం మాత్రం అభద్రతాభావంతో పౌరులకు అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్నాం. ఇది సబబేనా? -
'ఎవరివి' తీసేయాలో మాకు బాగా తెలుసు
'ఎవరివి' తీసేయాలో మాకు బాగా తెలుసు -
ఓటర్ల వద్దకు బీఎల్ఓలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ)లు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం ప్రారంభించారు. బీఎల్ఓల వెంట ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు (బూత్ లెవెల్ ఏజెంట్లు) కూడా ఉన్నారు. జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. తొలుత బీఎల్ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఈ ఫారాలను పంపిణీ చేస్తారు. ఓటర్లు పూర్తి వివరాలు నింపిన తర్వాత తిరిగి వాటిని సేకరిస్తారు. ఎవరికైనా ఈ ఫామ్‌లు అందకపోతే ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఎన్యూమరేషన్ ఫారాలను తెలుగులో కూడా ముద్రించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నారు. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. సెపె్టంబర్ 28 వరకు ఈ అభ్యంతరాలు పరిష్కరిస్తారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఎన్నికల వ్యవస్థలో బోగస్ ఓట్లపై బీఆర్ఎస్ ఆందోళన
సాక్షి,హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియను బోగస్, నకిలీ ఓట్ల బెడద నుంచి పూర్తిగా విముక్తి చేయకుండా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తన అసలు లక్ష్యాన్ని చేరుకోలేదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక దేశం - ఒక పౌరుడు - ఒకే ఓటు అనే ఆలోచన మేరకు వారి ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి సమగ్ర వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడం అనే లక్ష్యంతోనే భారత రాష్ట్ర సమితి ఈ అంశాన్ని అత్యంత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల పవిత్రతకు విఘాతం కలిగించే బోగస్, నకిలీ ఓట్ల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు.డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రజల అసలు తీర్పును వక్రీకరించే ప్రమాదం కలిగిస్తారని డా. శ్రవణ్ పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టినప్పటికీ, ఒక రాష్ట్రంలో ఓటు హక్కు కొనసాగిస్తూ మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా నమోదైన వారిని గుర్తించి తొలగించే స్పష్టమైన విధానం ఇప్పటికీ లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.హైదరాబాద్ నేడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు నివసిస్తున్న అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగిందని ఆయన చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. వీరిలో చాలామంది తమ స్వరాష్ట్రాల్లో ఓటు హక్కును కొనసాగిస్తూనే తెలంగాణలో కూడా ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఒకే వ్యక్తికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అటువంటి నమోదులను గుర్తించి తొలగించడంలో ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని డా. శ్రవణ్ అన్నారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ పాత ఓటు నమోదులను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం ఉందన్నారు. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఉమ్మడిగా పని చేస్తూ రెండు రాష్ట్రాల ఓటరు జాబితాలను పరస్పరం పరిశీలించాలని సూచించారు.ఒక రాష్ట్రంలో నమోదైన ఓటరు మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా ఉన్నట్లయితే అలాంటి నమోదులను గుర్తించి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలు కలిసి పనిచేసి ఓటరు జాబితాలను పరస్పరం సరిపోల్చి, క్షుణ్ణంగా పరిశీలించి, నకిలీ నమోదులను తొలగిస్తేనే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని అన్నారు.అదేవిధంగా ఈ ప్రక్రియను కేవలం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బీహార్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా తెలంగాణలో నివసిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లను గుర్తించే జాతీయ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన “ఒక దేశం – ఒక పౌరుడు – ఒకే ఓటు” అనే సిద్ధాంతాన్ని డా. శ్రవణ్ ప్రస్తావించారు. ఒక దేశంలో ప్రతి పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రమని పేర్కొన్నారు. ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు హక్కు ఉండాలి తప్ప రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు కొనసాగకూడదని స్పష్టం చేశారు.ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటు నమోదులు ఉండటం, తప్పుడు సమాచారంతో ఓటరుగా నమోదు కావడం, బోగస్ ఓటు వేయడం చట్టరీత్యా నేరమని డా. శ్రవణ్ గుర్తు చేశారు. అలాంటి నేరాలకు ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై చాలా మందికి సరైన అవగాహన లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, బోగస్ ఓట్లు కలిగి ఉండటం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ఓటు హక్కు పవిత్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కేవలం రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లే కాకుండా, ఒకే రాష్ట్రంలోని వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన డూప్లికేట్ ఓట్లను కూడా గుర్తించి తొలగించాలని డా. శ్రవణ్ డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తి ఒక నియోజకవర్గంలో కాకుండా రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉండే సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అలాంటి నమోదులను గుర్తించి రద్దు చేయడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు.ఒకే నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన నకిలీ ఓట్లు ,అన్నింటినీ సమగ్రంగా గుర్తించి తొలగించాలని ఎన్నికల అధికారులను కోరినట్లు తెలిపారు. అవసరమైతే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీలో కలిసి కూడా తమ వాదనను వినిపిస్తామని డా. దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, ఓటు పవిత్రత కోసం భారత రాష్ట్ర సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి నారాయణ బరితెగింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి పొంగూరు నారాయణ నిబంధనలకు విరుద్ధంగా బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓలు)కు సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి నారాయణ సోమవారం సాయంత్రం కార్పొరేషన్లో బీఎల్ఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు, అధికార పార్టీ నేతలు ఇలా బీఎల్ఓలతో సమీక్షించడం నిబంధనలకు వ్యతిరేకం. ఒకవేళ నిర్వహించినా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉద్యోగులు, అ«ధికారులు హాజరుకాకూడదు. అయితే మంత్రి సూచనతో ఏకంగా కార్పొరేషన్ కార్యాలయానికి బీఎల్ఓలు తరలివచ్చారు. కమిషనర్ నందన్‌తోపాటు ఇతర అధికారులు, ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ఆదేశాలకు భయపడి సమావేశానికి హాజరుకావాల్సి వచ్చిందని కొందరు బీఎల్ఓలు చెప్పడం గమనార్హం. ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు కుట్ర? ఈ సర్ ప్రోగ్రాంను మంత్రి నారాయణ అవకాశంగా మలుచుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు నగరంతోపాటు, నెల్లూరు రూరల్‌లో ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను, కచ్చితంగా తమకు ఓట్లు వేయరని అనుకున్న వారి ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగానే మంత్రి నారాయణ బరితెగించి బీఎల్ఓలతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కాగా, 80 శాతానికిపైగా బీఎల్ఓలు ఓటర్లకు కేవలం ఒక ఫారం మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఆన్లైన్లో వివరాలను నమోదు చేయకపోతే అడిగేందుకు ఓటరు దగ్గర ఎలాంటి రశీదు (ఎక్నాలెడ్జ్మెంట్) ఉండదు. ఓటు తీసేసినా అడగలేని పరిస్థితి వస్తుంది. దీని వెనుక మంత్రి నారాయణ వంటి వారి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఓటరుకు రెండో ఫారం (ఎకనాలెడ్జ్మెంట్) ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీఎల్ఓలను తక్షణమే సస్పెండ్ చేయాలి బీఎల్ఓలతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించడం నిబంధనలకు వ్యతిరేకం. ఇలాంటి సమీక్షలు నిర్వహించేటప్పుడు కమిషనర్ అడ్డుచెప్పాల్సి ఉంది. మంత్రికి భయపడి మిన్నకుండిపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే. సమావేశానికి హాజరైన బీఎల్ఓలను తక్షణమే సస్పెండ్ చేయాలి. మేయర్, డిప్యూటీ మేయర్, అధికార పార్టీలకు చెందిన నేతలతో కూర్చుని ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నడమే ఈ సమీక్ష ఉద్దేశం. దీనిపై కలెక్టర్‌కు సమాచారమిచ్చాం. కమిషనర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు నగర సమన్వయకర్త -
ఓటర్ల జాబితా సవరణ..
దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై(సర్) రాజకీయ పార్టీలకు పలు అనుమానాలు కలిగే పరిస్థితి ఉండడం దురదృష్టకరం. దీనికి దేశంలోని ఆయా వ్యవస్థలు బాధ్యత వహించాలి. దేశంలో ఇప్పటికీ బోగస్ ఓట్లతో ఎన్నికలు జరపడం, కొందరి ఓట్లు గల్లంతవడం, పలువురికి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉండడం, ఈవీఎమ్‌ల టాంపరింగ్ అవకాశం, వివిపాట్ స్లిప్‌ల లెక్కింపు జరగకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల కమిషన్ విఫలం అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి ఉపయోగపడేలా పనిచేస్తోందన్న ఆరోపణ వల్ల కమిషన్ చిత్తశుద్ధిపై ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రంగం సిద్ధం అయింది. రాజకీయ పార్టీలతో ఏపీ, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారులు సమావేశం అయి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నందున, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అప్రమత్తం అయ్యాయి. కాంగ్రెస్ అభిమానుల ఓట్లు తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గాంధీభవన్‌లో ఒక సమావేశం పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కూడా ఒక నియోజకవర్గం బాధ్యతలు తీసుకుని ఓటర్ల జాబితా తీరుపై దృష్టి పెడతామని అనడాన్ని బట్టి ఆ పార్టీ ఎంత సీరియస్‌గా ఉంది అర్థం చేసుకోవచ్చు.ఈ సందర్భంలోనే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనిపై శ్రద్ధ వహించడం లేదని, జమిందార్ల మాదిరి వ్యవహరిస్తున్నారని కూడా ఘాటు వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఓటర్ల జాబితా అంశంలో పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. గతంలోనే కొన్ని ఇళ్లలో నలభై, ఏభై ఓట్లు ఉన్న విషయాన్ని గుర్తుచేసి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాగా బీజేపీ నేతలు మాత్రం పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ఆరోపణలను తిప్పికొడుతున్నారు.ఏపీ విషయానికి వస్తే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సర్ లో వైఎస్సార్సీపీకి నష్టం జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గంవారీగా బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి తగు శిక్షణ ఇప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇలాంటి వ్యూహాలలో ఉన్న అనుభవం రీత్యా వైఎస్సార్సీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.విశేషం ఏమిటంటే సర్ కార్యక్రమంపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కూడా పిలుపు ఇచ్చారు. టీడీపీ ఓట్లు తొలగించేలా వైఎస్సార్సీపీ కుట్రలు చేయవచ్చని ఆయన అన్నారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నా, పార్టీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్సీపీ కుట్రపూరితంగా తొలగించిందని ఆయన ఆరోపించారట. అదే ఆయనలో ఉన్న విశిష్టత. తాను ఏదైనా చేయదలచుకుంటే, తొలుత ప్రత్యర్థులపై ఆ బురద చల్లుతారని రాజకీయపార్టీలలో ఒక అభిప్రాయం ఉంది. సరిగ్గా అదే రీతిలో ఆయన మాట్లాడారు.నిజానికి 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ అలా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించినట్లు ఆరోపణలు రాలేదు. పైగా సేవామిత్ర యాప్ పేరుతో చంద్రబాబు ఆధ్వర్యంలోనే టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితాలో లేకుండా చేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో అలా సేవా మిత్ర యాప్ ద్వారా కొందరు ఉద్యోగులు ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో తెలుసుకునే యత్నం చేయడాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆనాడు బహిర్గతం చేశారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తమిళనాడు, కర్నాటకలలోని సరిహద్దు గ్రామాలకు చెందినవారిని ఓటర్లుగా చేర్పించారని, తద్వారా సుమారు ముప్పైవేల నుంచి నలభైవేల బోగస్ ఓట్లు అక్కడ ఉన్నాయని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటుంది.గతంలో చంద్రబాబుపై పోటీచేసిన వైఎస్సార్సీపీ నేత, దివంగత మాజీ ఐఏఎస్ చంద్రమౌళి నిత్యం దీనిపై పనిచేసి 17వేల ఓట్లను తొలగించగలిగారు. అయినా అంతకన్నా డబుల్ బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన చెబుతుండేవారు. తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కుప్పంలో 20వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు ఎన్నడూ వివరణ ఇవ్వలేదు. బీసీ వర్గాలు అధికంగా ఉండే కుప్పాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవడమే కాకుండా ఇలా బోగస్ ఓట్లను కూడా చేర్పించడం ద్వారా తనకు తిరుగులేని పరిస్థితిని తెచ్చుకున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి టెక్నిక్‌లు అమలు చేయడంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిలేరని గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి నేతలు విమర్శించేవారు.చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ తీసి బోగస్ ఓట్ల జాబితాపై గవర్నర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడం, చనిపోయినవారి ఓట్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడడం, ఇతర ప్రాంతాలవారు ఓటర్లుగా ఉంటే వాటిని తీసివేయడం వంటి లక్ష్యాలతో ఈ సవరణ జరుగుతుంది. నిజానికి దీని ఆశయం మంచిదే. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే వేలాది మంది ఓటర్లు అటు ఏపీకి, ఇటు తెలంగాణ జిల్లాలకు ఎన్నికల సమయంలో వెళుతుంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటారు. వీరికి రెండేసి ఓట్లు ఉండడం చట్ట విరుద్ధం. దానిని శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు కనిపించదు.ఒక దశలో ఆధార్ కార్డుకు ఓటుకు లింక్ పెట్టాలన్న ఆలోచన జరిగినా దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ అభ్యంతరాలు చెప్పింది. ఓటు వేసినప్పుడు వేలు ముద్ర వేయడం ద్వారా సాంకేతికంగా డబుల్ ఓట్ల అక్రమాలను నివారించవచ్చన్న సూచన ఉన్నా ఎందుకు పట్టించుకోడం లేదు. మొత్తం వ్యవస్థను సరళీకరించి బోగస్ ఓట్లు లేకుండా చేయడం కన్నా, తమకు ఏది ప్రయోజనమో దానిపైనే అధికార పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్న భావన లేకపోలేదు.పశ్చిమబెంగాల్, బీహారు రాష్ట్రాలలో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం వివాదం అయింది. ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడానికి జరిగిన కుట్రగా కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు ఆరోపించాయి. ఈ అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ బెంగాల్లో 91 లక్షల ఓట్లను తొలగించారని, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. మమత బెనర్జీ పోటీచేసిన భవానీపూర్‌లో 45982 ఓట్లు తొలగిస్తే 15వేల తేడాతో ఆమె ఓడిపోయారని ఆయన చెప్పారు. స్టాలిన్ పోటీచేసిన కొలత్తూరులో 71 వేల ఓట్లు తీసివేస్తే, ఆయన 8వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారని ఉదాహరించారు. బెంగాల్లో 31 లక్షల ఓట్ల తేడాతో, తమిళనాడులో 17 లక్షల ఓట్ల తేడాతో టి.ఎమ్.సి,డి.ఎమ్.కె.లు ఓడిపోయాయని ఆయన వివరించారు.ఏపీలో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోతే, ఆ రాష్ట్రాలలో ఓట్లు తీసివేయడం వల్ల ఓడిపోయారని, రెండూ ప్రమాదమేనని జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం ఓట్ల బోగస్ వ్యవహరం ఒక హిస్టరీ మిస్టరీ అని అన్నారు. ఒక్కో బూత్ పరిధిలో ఏభై చొప్పున వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించినా ఐదువేల ఓట్ల వరకు పోయినట్లే అని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి గ్రామంలో ఆ ఓట్ల తొలగింపు లేకుండా, బోగస్ ఓట్లు చేరకుండా అప్రమత్తంగా ఉండాలని జగన్ తన కేడర్‌కు పిలుపునిచ్చారు. అయితే మరో రెండేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేనందున, ఒకవేళ మరీ తేడా ఉంటే దానిపై పోరాటం జరిపి, సరిచేసుకునే అవకాశం ఉండవచ్చు.ఏపీలో సీఈఓ ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేత పేర్నినాని చేసిన సూచనలు కూడా గమనించదగినవే. బూత్ లెవెల్ అధికారులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండేలా చూడాలని అన్నారు. ఇంతవరకు ఉన్న ఓటర్ల జాబితాలను పార్టీలకు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. కాగా గత ఎన్నికల సమయంలో ఏపీలో 3500 బూత్‌లలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిపినట్లు చూపిన వైనంపైన, 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోల్ అయ్యాయన్నదానిపైన ఇంతవరకు ఎన్నికలసంఘం వివరణ ఇవ్వలేకపోయింది.వివిపాట్ స్లిప్‌లతో ఈవీఎమ్‌లను సరిపోల్చి చూపడంలో ఎన్నికల సంఘం విఫలం అయింది. వివిపాట్ స్లిప్‌లను కౌంటింగ్ జరిగిన పది రోజులకే దగ్దం చేయడం అనుమానాలకు దారితీసింది. అలాగే ఈవీఎమ్‌ల బాటరీ చార్జింగ్ కౌంటింగ్ నాటికి పెరిగిందన్న ఆరోపణపై జవాబు ఇవ్వలేకపోయారు.ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా చూసుకోవడానికి వైఎస్సార్సీపీ సన్నద్ధం అయింది. అయినా పలుచోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ నిత్యం ఫిర్యాదు చేయవలసి వస్తోంది. ఏది ఏమైనా రాజకీయ లక్ష్యంతో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లను అదనంగా చేర్చడం వంటివి జరగకుండా ఎన్నికల సంఘం నిజాయితీగా వ్యవహరించకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు
సాక్షి,విజయవాడ: ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం (జూన్ 15) ఎస్ఐఆర్లో పలు సమస్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ లు అప్పిరెడ్డి, రాహుల్లాలు, లీగల్ సెల్ మనోహర్ సహా పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ సీఈవోకి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. ఎన్నికల కమిషన్ సీఈవోకి లేఖ ఇచ్చారు.అనంతరం లేఖపై మీడియాతో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నం చేశారు. అయితే, సెక్రటరియేట్లో మీడియాతో మాట్లాడడంపై ఆంక్షలు అమలులో ఉన్నాయంటూ వారిని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఆ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
‘సర్’తో కొన్ని వర్గాల ఓట్లు తొలగించే కుట్ర
నెల్లూరు(అర్బన్): దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో ఎన్నికల కమిషన్, మిలిటరీ దళాలను గుప్పెట్లో పెట్టుకుని కొన్ని వర్గాల ప్రజలకు ఓట్లు లేకుండా చేస్తున్నారని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆరోపించారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓట్లు తొలగించిన 20 మంది సుప్రీంకోర్టుకు వెళ్లి తాము బతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నెల్లూరులో ఆదివారం డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి 18వ స్మారక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్– భ్రమలు, వాస్తవాలు’ అనే అంశంపై పరకాల మాట్లాడారు. ఇప్పటి వరకు సర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల మంది ఓట్లను తొలగించారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికల ముందు సర్ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని తెలిపారు. రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లను తొలగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రశ్నించకుండా ఉండేందుకు వికసిత్ భారత్ పేరుతో డ్రామాలాడుతూ కుల, మత, భాషాపరంగా ప్రజలను విభజన చేస్తున్నారని వివరించారు. ఇలాంటి దారుణాలను ఎదుర్కోవాలంటే ప్రజలు రోడ్ల మీదకు రావాలని, పోరాటాలు చేయాలని పరకాల పిలుపునిచ్చారు. స్కిల్ ఇండియా ఒక స్కామ్దేశంలో గడిచిన వందేళ్లలో లేనంతగా ప్రస్తుతం ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయని, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరకాల ప్రభాకర్ చెప్పారు. విద్య, వైద్యం, అక్షరాస్యత... ఇలా పలు రంగాల్లో అనేక చిన్న దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందన్నారు. ఉత్పాదక రంగంలో 133వ స్థానానికి, ఆకలి సూచీలో 102 స్థానానికి మన దేశం దిగజారిపోయిందని తెలిపారు. అయినా భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిలో 5వ స్థానంలో ఉందని పాలకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ప్రధాన మంత్రి కౌసల్ యోజన (స్కిల్ ఇండియా) పెద్ద స్కామ్‌గా మారిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు. స్కిల్ ఇండియా ద్వారా శిక్షణ పొందినట్లు చెబుతున్న వారిలో 61 లక్షల మంది పేర్లు, ఊçర్లు లేవన్నారు. 12 వేల మంది మళ్లీ మళ్లీ శిక్షణలో పాల్గొంటున్నట్లు తేలిందన్నారు. శిక్షణ పొందిన 34 లక్షల మంది ఇళ్లకు వెళ్లి పరిశీలించగా, వారికి స్టైఫండ్ అందలేదన్నారు. కాగ్ నివేదిక ప్రకారం 95 శాతం బోగస్ అకౌంట్లు ఉన్నాయని, స్కిల్ ఇండియా పేరుతో డబ్బును దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. -
కవిత ‘తెలంగాణ రక్షణ సేన’పై బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’(TRS)కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కవిత పార్టీ టీఆర్ఎస్పై ఈసీఐకి దాదాపు 700 ఫిర్యాదులు అందడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.ఈ నేపథ్యంలో కవిత రాజకీయ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి (BRS) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘టీఆర్ఎస్’ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ను ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ కూడా ‘టీఆర్ఎస్’ అనే పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. -
ఆర్ఓ నిర్ణయాన్ని రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటరి్నంగ్ అధికారి(ఆర్ఓ) తిరస్కరించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్ఓ నిర్ణయం చట్టవిరుద్ధం అప్రజాస్వామికమని తేల్చిచెప్పింది. నామినేషన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కేసీ వేణుగోపాల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ తంఖా, రణదీప్ సూర్జేవాలా, దీపాదాస్ మున్షీ, భూపేశ్ బఘేల్‌ల బృందం ఈసీని కలిసి తమ వాదనను విన్పించింది. అనంతరం అభిషేక్ సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. ‘‘మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు ఆర్ఓ చూపిన కారణాలకు చట్టపరమైన ఆధారాలు లేవు. ఏదైనా క్రిమినల్ కేసులో నేరాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అది కేసుగా మారుతుందన్న ప్రాథమిక న్యాయ సూత్రాన్ని రిటర్నింగ్ అధికారి విస్మరించారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసును ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ కోర్టు కేవలం నోటీసు మాత్రమే ఇచ్చింది. మేజిస్ట్రేట్ దీనిపై నిర్ణయం తీసుకోనంత వరకు అది క్రిమినల్ కేసుగా లెక్కలోకి రాదు’’ అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద కేంద్ర ఎన్నికల సంఘానికి విశేషాధికారాలు ఉన్నాయని కాంగ్రెస్ బృందం వెల్లడించింది. అభ్యర్థికి న్యాయం చేసేందుకు ఆర్ఓ నిర్ణయాన్ని రివర్స్ చేసే అధికారం ఈసీకి ఉందని గుర్తుచేసింది. -
నామినేషన్ వివాదం.. ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం దుమారం రేపుతోంది.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ చట్టవిరుద్ధమని పేర్కొంది. తన విస్తృత అధికారాలతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈసీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గతంలో హరియాణా, గుజరాత్లో ఆర్వో నిర్ణయాలు ఈసీ సరిచేసిందని కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మన్వు సంఘ్వీ అన్నారు.కాగా, ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్‌లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది.. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్‌లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్‌లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.బోపాల్‌కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్‌కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్‌గా మారిపోయింది.ఈసీ ఏం చేయబోతోంది?..ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్‌లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
మీనాక్షి కి కోర్టు నోటీసులు.. MP నామినేషన్ రిజెక్ట్ కు అసలు కారణం ఇదే..
-
ఓట్ల చోరీ.. అడ్డదారుల్లో ఎన్నికలు
నెల్లూరు (బారకాసు): దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలు సక్రమంగా జరగడం లేదని, ఓట్లు చోరీకి గురవుతున్నాయని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ, అడ్డదారుల్లో ఎన్నికలపై ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా (డబ్ల్యూపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కేఎంఏ సుభాన్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో ‘మేలుకో ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా ‘ఎన్నికల సంఘం పనితీరు – సర్‌పై అవగాహన–శిక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అపహాస్యమవుతోందని చెప్పారు. పారదర్శకత లేకుండా చేపడుతున్న ఈ విధానం వల్ల రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కోట్లాది మంది అర్హులు కోల్పోతున్నారని చెప్పారు. సర్ ద్వారా ఇప్పటికే దేశంలో 6.50 కోట్ల మంది ఓట్లను తొలగించారని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 16.50 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఇది ఇంతటితో ఆగదు... వాస్తవానికి 2002లో జరిగిన సర్ ప్రక్రియకు, ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌కు చాలా తేడా ఉందని పరకాల చెప్పారు. అప్పుడు ‘సర్’ అంటే స్పెషల్ రివిజన్ ఆఫ్ ఇంటెన్సీవ్ రివిజన్ అని, ఇప్పుడు ‘సర్’ అంటే స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(ఉద్దేశపూర్వకంగా రివిజన్) అని ఆయన వివరించారు. దేశంలో సర్ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదని, 30 కోట్ల మంది ఓట్లను తొలగించేంత వరకూ మళ్లీ మళ్లీ కొనసాగుతూనే ఉంటుందన్నారు. సర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఆయా రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించారని వివరించారు. దాని గురించి ఎవరూ చర్చించడం లేదని, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్నికలను, రాజకీయాలను క్రికెట్ ఆటను చూసిన విధంగా చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఎవరు ఓటర్లుగా ఉండాలో నిర్ణయిస్తున్న పాలకులు గతంలో ప్రజలు ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలని ఆలోచించేవారని, కానీ ఇప్పుడు ఎవరు ఓటర్లుగా ఉండాలని పాలకులు నిర్ణయిస్తున్నారని పరకాల పేర్కొన్నారు. దేశంలో సర్ ప్రక్రియను నిర్వహించాలని ఎవరు నిర్ణయించారు? ఎందుకు, ఎలా నిర్వహిస్తున్నారన్న విషయాలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. కేంద్రం చేతిలో భారత ఎన్నికల సంఘం కీలుబొమ్మలా మారిందని విమర్శించారు.ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. అనంతరం తొలగించిన ఓట్లను తిరిగి ఎలా పొందాలి, ఓటు చోరీకి గురి కాకుండా ఎలా కాపాడుకోవాలి తదితర విషయాలను మసూద్‌ఖాన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
నిమ్మగడ్డ రమేష్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: మాజీ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)లో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆయన తమను వేధింపులు, వివక్షకు గురి చేశారంటూ నలుగురు అధ్యాపకులు ఆయనపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుల్లో ఒకటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించినది కాగా, మిగిలినవి తమను పక్కనపెట్టి తనకు సన్నిహితులైన వారికి రమేష్ కుమార్ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలతో ఉన్నాయి.హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రభుత్వానికి, ప్రైవేట్ సంస్థలకు మధ్య అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. 2024 ఆగస్టులో ఏఎస్సీఐ డైరెక్టర్ జనరల్‌గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజులకే తనకు రమేష్ కుమార్ నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా నాలుగు సార్లు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మహిళా ప్రొఫెసర్‌పై వేధింపులుడైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రమేష్ కుమార్ తనను ఒంటరిగా కలవాలని కోరినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 ఏళ్లకు పైగా ఏఎస్‌సీఐలో పనిచేస్తున్న తనను లైంగిక వేధింపులకు గురిచేశారని వాపోయారు. ఉన్నత పదోన్నతుల కోసం 'కొంతమందిని సంతృప్తి పరచాల్సి ఉంటుందని' పెడార్థంతో వ్యాఖ్యానించారని, తాను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇతర సిబ్బంది ఎదుట అవమానించడం, తాను నిర్వహిస్తున్న కేంద్రం డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం, పెద్ద కార్యాలయ గదిని తీసేసి చిన్న గదికి మార్చడం వంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.కాంట్రాక్ట్ పునరుద్ధరణలో వివక్ష?ఏఎస్‌సీఐలో అధ్యాపకులు ప్రభుత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ సంస్థల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఆదాయం సమకూర్చాలి. ప్రతి అధ్యాపకుడు సంవత్సరానికి కనీసం రూ.95 లక్షల ఆదాయం తీసుకురావాల్సి ఉంటుంది. గత మూడేళ్లుగా తాను సగటున రూ.1 కోటి ఆదాయం సమకూర్చినా, ఫిర్యాదు చేసిన తర్వాత తనకు పనులు కేటాయించడం నిలిపివేశారని మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. 2025 నవంబరులో ముగిసిన తన కాంట్రాక్ట్‌ను కేవలం ఆరు నెలలపాటు మాత్రమే పొడిగించారని వాపోయారు. ఆ గడువు మే 31తో ముగియగా జూన్ 1న కళాశాలకు వెళ్లినప్పుడు భద్రతా సిబ్బంది తనను లోపలికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతున్న సమయంలో ఈ చర్యలు POSH చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మరో ముగ్గురు ప్రొఫెసర్ల ఫిర్యాదులునిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై 2026లో మరో ముగ్గురు ప్రొఫెసర్లు ఏఎస్సీఐ పాలన బోర్డుకు ఫిర్యాదులు చేశారు. వారు తమ కాంట్రాక్ట్ రెన్యువల్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ల్యాండ్ అక్విజేషన్ సెంటర్‌ను విలీనం చేయడం, సైబర్ ల్యాబ్ మూసివేసేలా ప్రయత్నాలు చేయడం, విస్తరణ పనులపై సమాచారం ఇవ్వకుండా సంబంధిత శాఖ అధికారుల్ని దూరం చేశారని ఆరోపణలు వినిపించాయి. రమేష్ ఆగడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తమకు మరిన్ని వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. పబ్లిక్ ఈవెంట్లలో అవమానించడం, అసభ్యంగా మాట్లాడడం, కాలేజీలో జరిగే ఈవెంట్ల నుంచి బయటకు పంపి అవమానించడం, బెదిరింపులకు పాల్పడడం చేశారని బాధితులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 2029 వరకు ఉన్న తన కాంట్రాక్ట్‌ను 2024లో అకస్మాత్తుగా రద్దు చేశారని మాజీ మహిళా ప్రొఫెసర్ కూడా ఆరోపించారు. ఇందులో ఏఎస్సీఐ చైర్మన్ పద్మనాభయ్య పాత్ర ఉందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందనతనపై వచ్చిన ఆరోపణలు దురుద్దేశపూరితమైనవి, ఆధారరహితమైనవిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని, ఏఎస్సీఐ రిజిస్ట్రార్ సమాధానం ఇస్తారని చెప్పారు. అయితే ఇప్పటివరకు రిజిస్ట్రార్ నుంచి అధికారిక స్పందన రాలేదు. -
సర్ చట్టబద్ధమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న ఓటరు జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియ చట్టబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఇది జీవ నాడి వంటిదని వ్యాఖ్యానించింది. వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా బిహార్, బెంగాల్‌లలో చేపట్టిన సర్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పును ఎన్నికల కమిషన్ సాధించిన ఘన విజయంగా భావిస్తున్నారు. సర్ ప్రజాప్రాతినిధ్య చట్టం–1960లోని నిబంధనలకు ఏమాత్రం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయత ఓటరు జాబితా కచ్చితత్వంపైనే ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రక్రియను కేవలం పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం చేపట్టినట్లుగా తాము నిర్థారించలేకపోతున్నామని తెలిపింది. ఎన్నికల కమిషన్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించిందనే వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం..ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలన్న రాజ్యాంగం నిబంధనలకు సర్ ప్రాణం పోస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, ఓటరు జాబితా సవరణ ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం మాత్రం ఈసీకి లేదని స్పష్టం చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరుల పిటిషన్లపై జనవరిలో విచారణ ముగించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు బుధవారం 124 పేజీల సవివర తీర్పు వెలువరించింది. జాబితా ప్రక్షాళన ఈసీ అధికారమే ఓటర్ల జాబితాలో ఒకసారి పేరు నమోదైన తర్వాత, దానిపై మళ్లీ కొత్తగా విచారణ జరిపి పేర్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జాబితా సవరణ పేరుతో ఈసీ చేపట్టిన తొలగింపులు నిబంధన 21ఏకు విరుద్ధమని వారన్నారు. అలాగే, ఓటరు నమోదు, ధ్రువీకరణలకు సంబంధించి పత్రాల పరిశీలన కోసం ఈసీ విధించిన నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, వీటి కారణంగా ఎందరో ఓటు హక్కును కోల్పోతున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల సంఘం చర్యలను సమర్థించింది. ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక గుర్తింపే అయినప్పటికీ, దాన్ని మళ్లీ పరిశీలించకూడదన్న నియమం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను, ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచేందుకు ఇలాంటి సవరణలు (ఎస్ఐఆర్) చేపట్టే పూర్తి అధికారం ఈసీకి ఉంటుందని వ్యాఖ్యానించింది. పత్రాల పరిశీలనకు ఈసీ విధించిన నిబంధనలు పరీక్షకు నిలబడతాయని, అవి పూర్తిగా సహేతుకమైనవేనని తెలిపింది. అయితే, ఒక వ్యక్తి పౌరసత్వంపై ఈసీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేయగలదని, పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం ఆ సంస్థకు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈసీ తీసుకునే నిర్ణయం కేవలం ఎన్నికల ప్రయోజనాలకు మాత్రమే పరిమితం అవుతుందని, పౌరసత్వ చట్టం కింద సదరు వ్యక్తులు తమ హక్కులు కోల్పోయినట్లు భావించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనుమానిత కేసులన్నీ అథారిటీకేసర్లో ముందుగా ఈసీ నోటీసులిచ్చి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకునే విధానాన్ని పాటించినందున ఈ ప్రక్రియ చట్టబద్ధంగా అమలైందని ధర్మాసనం తుది తీర్పులో పేర్కొంది. అయితే, 2003 జాబితా నుంచి భారత పౌరులు కారు అనే కారణంతో తొలగింపునకు గురైన వారి కేసులన్నిటినీ నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం–1955 కింద ఏర్పాటు చేసిన ‘కాంపిటెంట్ అథారిటీ’కి తప్పనిసరిగా పంపాలని ఆదేశించింది. ఆ అథారిటీ చట్టబద్ధంగా విచారణ జరిపి వారు భారత పౌరులే అని తేల్చితే, ఆ పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. మరణించినవారు, వలస వెళ్లిన వారు లేదా నకిలీలు అనే కారణాలతో పొరపాటున జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు న్యాయ సమీక్ష ద్వారా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం కూడా ఉందని ధర్మాసనం వివరించింది. పౌరసత్వానికి ఆధార్ ధ్రువీకరణ కాదుసర్ కోసం ఎన్నికల కమిషన్ అమలు చేసిన ధ్రువీకరణ పత్రాల విధానాన్ని ధర్మాసనం సమర్థించింది. ఎన్నికల సంఘం అనుమతిస్తున్న డాక్యుమెంటేషన్ ప్రమాణాలపై అభ్యంతరాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓటర్ల జాబితాల తయారీ ఒక యాంత్రిక ప్రక్రియ కాదు, అదొక ప్రాథమిక రాజ్యాంగబద్ధమైన విధి అని తీర్పు నొక్కి చెప్పింది. నివాసం, అర్హత వంటి చట్టబద్ధమైన నిబంధనల నిర్ధారించే హక్కు ఈసీకి ఉందని పేర్కొంది. అదేవిధంగా, ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని కూడా తెలిపింది. 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) చట్టం ప్రకారం ఆ కార్డును పౌరసత్వానికి, స్థానికతకు నిరూపణగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటు హక్కుకు అవసరమైన చట్టబద్ధ అర్హతగా దీనిని పరిగణించకపోవడంలో ఈసీ నిర్ణయం సరైందేనని పేర్కొంది. ఒక వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఆధార్‌ను ఉపయోగించాలని తెలిపింది. ఓటర్ల ముమ్మర సర్వే కోసం నిర్దేశించిన పత్రాల జాబితా నుంచి రేషన్ కార్డులను మినహాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. సర్ ప్రక్రియకు అనుగుణంగా రేషన్ కార్డుల స్థానంలో మరింత విశ్వసనీయమైన పత్రాలను కోరడం, కొన్ని రకాల పత్రాలను మార్చడం వంటి విచక్షణాధికారాలు ఈసీకి ఉన్నాయని తీర్పులో పేర్కొంది.తీర్పు ముఖ్యాంశాలు→ బిహార్‌లో చేపట్టిన సర్ ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం–1960 నిబంధనలకు విరుద్ధంగా లేదు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిబంధనలకు భంగం కలిగించడం లేదు. → ప్రస్తుతం నిర్వహించిన సర్ ప్రక్రియ, చట్ట పరమైన అవసరాలకు అనుగుణంగానే ఉంది. సాధించాల్సిన లక్ష్యానికి అనుగుణంగానే ఈ చర్యలు ఉన్నాయి. ఇవి హేతుబద్ధమైనవి. ఏకపక్షంగా ఎవరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా నిరోధించడానికి తగు రక్షణ విధానాలు ఇందులో ఉన్నాయి. → ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకే కొన్ని రకాల పత్రాల వర్గీకరణ, కొన్ని వర్గాల పత్రాల మినహాయింపు స్పష్టమైన ప్రమాణాల ఆధారంగానే నిర్ణయించారు. → ఓటర్ల జాబితాలో చేర్చడానికి కావలసిన అర్హతను నిర్ధారించే క్రమంలో పౌరసత్వంపై పరిమితమైన విచారణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది. అయితే, ఇటువంటి విచారణ పౌరసత్వాన్ని పూర్తిగా నిర్ధారించే ప్రక్రియ మాత్రం కాదు. → ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన వారు తమ ఫిర్యాదులను నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం పరిధిలోని సంబంధిత అథారిటీకి ఎన్నికల సంఘం రిఫర్ చేయాలి. → ఆయా కేసులపై సంబంధిత అథారిటీ చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలి. వీలైతే తదుపరి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏది ముందుగా జరిగితే దానికి ముందే నిర్ణయం ప్రకటించాలి. అలాగే, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు ముందుగా నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినడానికి తగిన అవకాశం కల్పించాలి. → ఒకవేళ సదరు అథారిటీ విచారణ తర్వాత తొలగింపునకు గురైన వారు భారత పౌరులేనని తేలితే వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఎవరు ఓటేయాలో నిర్ణయించేది బీజేపీయే: యోగేందర్ యాదవ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లలో ఒకరైన యోగేందర్ యాదవ్ స్పందించారు. తీర్పు తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఇలాంటి తీర్పు వస్తుందని తాను ముందే ఊహించానన్నారు. అందుకే, తీర్పు సమయానికి తాను కోర్టుకు వెళ్లలేదని చెప్పారు. సర్ రాజ్యాంగబద్ధతను పరిశీలించడం వదిలేసి, ఫిర్యాదుల పరిష్కారం, మధ్యవర్తిత్వంపైనే న్యాయస్థానం దృష్టి సారించినప్పుడే తనకీ విషయం అర్థమైందని చెప్పారు. ఇకపై ఎవరు ఓటేయాలో, ఎవరు ఓటేయ కూడదో నిర్ణయించేది బీజేపీనంటూ ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. అసలు వాస్తవమేమంటే.. ఈ తీర్పు లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును రద్దు చేయడానికి అనుమతి ఇవ్వడం. ఇప్పటివరకు కనీసం 5.9 కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోయారు. ఇది మున్ముందు 10 కోట్లకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.సుప్రీం తీర్పుతో సమాధానాలకు మించి ప్రశ్నలు: కాంగ్రెస్ సర్‌కు రాజ్యాంగబద్ధతను కట్టబెడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తీర్పుతో తాము గౌరవప్రదంగా ఏకీభవించడం లేదని తెలిపింది. ‘సర్‌కు అనుమతి ప్రాథమికంగా ఒక చట్టబద్ధతను చేకూర్చవచ్చు. కానీ, దాని అమలులోని దురుద్దేశాన్ని ఎంతమాత్రం సరిదిద్దలేదు’అని పేర్కొంది. సర్ ప్రక్రియను ఈసీ అమలు చేసిన తీరుపై తాము లేవనెత్తిన అనేక ప్రశ్నలను న్యాయస్థానం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపింది. పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు ఈసీకి లేదని ఈ తీర్పు స్పష్టం చేసినప్పటికీ ఈసీ ఇప్పటికే పౌరసత్వం ప్రాతిపదికన ప్రజలను ఓటర్ల జాబితా నుంచి మినహాయించడం పరస్పర విరుద్ధం కాదా? అని ప్రశ్నించింది. -
సర్ ప్రక్రియ.. వైఎస్ జగన్ హాట్ కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం త్వరలో సర్ ప్రక్రియను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనం ఎస్ఐఆర్పై దేశ వ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలను అనేక రాజకీయ పార్టీలు వ్యక్తంచేయడం చూశాం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలనూ విన్నాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూసే ఉంటారు. బెంగాల్లో 91 లక్షలు, అంటే ఉన్న ఓట్లలో 11.9%. అలాగే తమిళనాడులో 74 లక్షలు, అంటే మొత్తం ఓట్లలో 11.6% తొలగించారు. మమతాబెనర్జీ పోటీచేసిన భవానీపూర్‌లో 44,990 ఓట్లను తొలగించారు. అక్కడ ఆమె 15,105 ఓట్లతో ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ పోటీచేసిన నియోజకవర్గంలో దాదాపుగా 71,133 ఓట్లను తొలగించారు. ఆయన ఓడింది 8వేల ఓట్లతేడాతోనే. అంతేకాకుండా బెంగాల్లో తీసేసిన ఓట్లు 91లక్షలు అయితే, ఆ రాష్ట్రంలో మమత పార్టీ ఓడింది 31లక్షల తేడాతో. అదే తమిళనాడులో తీసేసింది 74లక్షల అయితే, స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతోనే. అందుకే మనమంతా ఎస్ఐఆర్పై జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం. అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఈ రెండూ డేంజరే. ఊరికి యాభై మన ఓట్లను తీసేస్తే చాలు.. నియోజకవర్గానికి 5వేలు పోయినట్టే. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్లమీద కూడా మనం దృష్టిపెట్టాలి. కుప్పంలో అది మన కళ్లెదుటే కనిపించింది. కుప్పంలో ఓట్ల జాబితా ఒక్కసారి చూస్తే 22వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదుసార్లో, పది సార్లో కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా, లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఏపీలో ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి బోగస్ ఓట్లు, తప్పుడు ఓట్లు మీద దృష్టిపెట్టాలి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా అని వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
విజయ్ ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం
సాక్షి, చెన్నై : తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి జూన్ 18న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సి.వి.షణ్ముగం మైలం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకే సమయంలో అటు ఎమ్మెల్యేగా, ఇటు రాజ్యసభ ఎంపీగా రెండు పదవుల్లో కొనసాగలేరన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన మే 7వ తేదీన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణకు వ్యక్తిగతంగా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికకు చర్యలు తీసుకుంది. ఉప ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జూన్ 1 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 8గా పేర్కొన్నారు. 9వ తేదీ పరిశీలన, 11వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. పోలింగ్: జూన్ 18 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) జరగనుంది. ఓట్ల లెక్కింపు – ఫలితాల ప్రకటన అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమై ప్రకటిస్తారు. సాధారణంగా రాజ్యసభ ఎంపీల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే, ఇది ఉప ఎన్నిక (మధ్యంతర ఎన్నిక) కావడంతో, ఇప్పుడు ఎన్నికయ్యే కొత్త ఎంపీ సి.వి. షణ్ముగం మిగిలిన పదవీకాలమైన జూన్ 29, 2028 వరకు మాత్రమే ఎగువ సభలో కొనసాగతారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. టీవీకే ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారన్న విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి అత్యధిక సంఖ్యాబలం (ఎమ్మెల్యేల మెజారిటీ) ఉంది. ఈ దృష్ట్యా ఉప ఎన్నికలో టీవీకే నిలబెట్టే అభ్యర్థి విజయం సాధించడం నల్లేరుపై నడకే కానుంది. దీని ద్వారా తమిళనాడులో సరికొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ పార్టీ, ఢిల్లీలోని రాజ్యసభలోనూ అడుగుపెట్టి తన ఉనికిని చాటనుంది. ఈ స్థానానికి టీవీకే తరఫున రాజ్యసభకు వెళ్లే ఆ అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, విజయ్ సన్నిహితుడైన ప్రవీణ్ చక్రవర్తి రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. -
నియోజకవర్గాల పునర్విభజనకు మిశ్రమ ప్రాతినిధ్య విధానమే మేలు
సాక్షి, హైదరాబాద్: సమర్థ పరిపాలనతోపాటు జనాభాకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మిశ్రమ ప్రాతినిధ్య విధానం ద్వారా దేశంలో నియోజకవర్గాల పునర్వీభజన చేపట్టడం ద్వారా ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విద్వేష రహిత సామరస్యాన్ని సాధించొచ్చని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి డాక్టర్ ఎస్.వై. ఖురేషీ అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ ఖురేషీ ‘ప్రతిపాదిత పునర్వ్యవస్థీరణ–దక్షిణాది రాష్ట్రాల స్థితి’అనే అంశంపై సుందరయ్య 41వ స్మారక ఉపన్యాసం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలను జనాభా లెక్కన వేరు చేయలేం భారత పార్లమెంటరీ వ్యవస్థ నేటికీ 1971 నాటి జనగణన ఆధారంగానే కొనసాగుతుంది. 1976 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలలో పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో మార్పు లేదు. పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని జనసంఖ్యతో ముడిపెడితే జనాభా నియంత్రణ లక్ష్యాలను పాటించిన రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరుగుతుందని దేశం గుర్తించింది. అందుకే 1976లో ఇందిరాగాంధీ పునర్వీభజనను 2001 వరకు నిలిపివేయాలని నిర్ణయిస్తే, వాజ్‌పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే జనగణన వరకు కొనసాగించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది పూర్తయ్యే జనగణన తర్వాత చేపట్టే పునర్విభజనపై దక్షిణ, ఉత్తర రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు చాలా ఉన్నాయి.1976లో జనాభా 54 కోట్ల 80 లక్షలు ఉంటే, ప్రస్తుత జనాభా 150 కోట్లు అని, అయితే ఇప్పటికీ 1976 నాటి ప్రాతిపదికనే పార్లమెంట్లో ఎంపీల సంఖ్య ఉంది. సమస్య సీట్ల పెంపు విషయంలో కాదని, ఏ ప్రాతిపదికన పెంచాలన్నదే ఇక్కడ సమస్య. 1971 నుంచి జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాదిలోని తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 1.8 శాతంతో జాతీయ సగటు 2.1 శాతం కన్నా తక్కువగా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో నేటికీ సంతానోత్పత్తి రేటు 2.7 శాతంగా ఉంది. సీట్ల పరంగా జనాభా లెక్కన ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా, తమిళనాడులో తక్కువగా కేటాయింపులు జరపడాన్ని ఆక్షేపించడాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు. మిశ్రమ విధానం లేదా మరో 15 ఏళ్లు గడువు ఈ పరిస్థితుల్లో పునర్వీభజనకు సంబంధించి మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. ⇒ వివిధ రాష్ట్రాల్లో సంతానోత్పత్తి సామర్థ్యం ఒకే స్థాయికి చేరేంత వరకు పునర్వ్యవస్థీకరణ వాయిదా వేయడం ఒక మార్గం. ఈ మేరకు పునర్వ్యవస్థీకరణను మరో పది, పదిహేనేళ్లు వాయిదా వేయగలిగితే జనాభా వ్యత్యాసాలు తగ్గుతాయి. 50 ఏళ్లనాటి జనగణన ఆధారంగా ఇప్పటి ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం సమంజసం కాదు. ⇒ మరో విధానం దశల వారీగా పునర్వ్యవస్థీకరణ చేయడం. అంటే ఒకేసారిగా దేశమంతా పునర్వ్యవస్థీకరణ కాకుండా రెండు మూడు ఎన్నికల వరకు అంటే 15 ఏళ్లలో దశల వారీగా అమలు జరిగేలా వ్యూహం రూపొందించుకోవడం. మొండిగా గణాంకాలపై ఆధారపడకుండా ఓపికగా సున్నితంగా వ్యవహరించడం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విజయవంతంగా పూర్తి చేసినట్టు అన్నమాట. ⇒ఈ రెండింటి కన్నా ఆమోదయోగ్యమైనదే మిశ్రమ విధానమే మెరుగైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాను. ఈ విధానం నిష్పాక్షికమైన సమాఖ్య స్వభావాన్ని గౌరవిస్తూనే ప్రజాతంత్ర ప్రాతినిధ్యానికి పెద్దపీట వేస్తుంది. జనాభా నియంత్రణతోపాటు మెరుగైన ఆర్థిక వ్యవస్థ, ఇతర సుపరిపాలన ద్వారా సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకుంటూనే రాజ్యాంగపరమైన శస్త్రచికిత్స అవసరం లేకుండా సమస్య పరిష్కరించేందుకు వీలుంటుంది. ఆర్థిక సంఘం నమూనా రూపంలో ఇప్పటికే జయప్రదమైన నమూనా అందుబాటులో ఉంది. ఆర్థిక సంఘం రూపొందించిన ఈ మిశ్రమ ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు ఆమోదించాయి.అమెరికా, జర్మనీ, ఆ్రస్టేలియా పార్లమెంటరీ వ్యవస్థల్లో దొంతర్ల వ్యవస్థ ఉన్న జర్మనీ విధానాన్ని ఎగువ సభ అయిన రాజ్యసభకు వర్తింపజేయాలి. అక్కడ రాష్ట్రాలను బట్టి సీట్లు 3 నుంచి గరిష్టంగా 6 ఉంటాయి. అమెరికా సెనేట్‌లో జనసంఖ్యతో సంబంధం లేకుండా 4 కోట్లు ఉన్న కాలిఫోరి్నయాకు, 6 లక్షల జనాభా ఉన్న వ్యోమింగ్ రాష్ట్రానికి 2 సీట్లే ఉంటాయి. ఇక ఆ్రస్టేలియాలో జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి 12 సీట్లు ఉంటాయి. ఈ లెక్కన జర్మనీ విధానాన్నే మనం ఫాలో కావాలి.మోదీ కన్నా ఎన్నికల కమిషన్ గురించే ఇప్పుడు చర్చ : బీవీ రాఘవులు దేశంలో మోదీ కన్నా ఎన్నికల కమిషన్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ అధ్యక్షుడు బీవీ రాఘవులు అన్నారు. నాటి ఈసీకి, ఇప్పటి ఈసీకి తేడా చాలా ఉందన్నారు. కొన్ని తప్పులున్నా, వ్యవస్థలోని లోపాలను నాటి ఈసీ సవరిస్తే, నేటి ఈసీ బానిస సంస్థగా మారిందన్నారు. -
‘ప్యాకేజీ అందింది’.. రీపోలింగ్ నుంచి తప్పుకున్న ‘పుష్ప’
కోల్‌కతా: సీఎం సువేందు అధికారి, సింగం ఐపీఎస్ అజయల్ పాల్ శర్మకు ‘పుప్ప’ భయపడ్డారా? అంటే అవుననే అంటున్నాయి పశ్చిమ బెంగాల్ రీపోలింగ్ ఎన్నికల్లో తాజా పరిణామాలు. ఈ నెల 21న జరగనున్న రీపోలింగ్ ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి పుష్ప అలియాస్ జహంగీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఫల్టాలో శాంతి, భద్రతలే నాకు ముఖ్యం. ఆ రెండు ఉంటేనే అభివృద్ధి జరుగుతోంది. సీఎం సువేందు అధికారి ఫల్టా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. నేను అనుకున్నది జరిగింది. అందుకే త్వరలో జరగనున్న ఫల్టా నియోజకవర్గ రీపోలింగ్ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నా నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.రీపోలింగ్ ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం వెనుక పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హస్తం ఉందా? లేదంటే మీరే సీఎం సువేందుకు బయపడి వెనక్కి తగ్గుతున్నారా? అన్న మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ..మీరు అడుగుతున్న ప్రశ్నలకు నేను చెప్పే సమాధానం ఒకటే. ఫల్టా ప్రజల కోసం, ఫల్టాలో అభివృద్ధి కోసం, ఫల్టాలో శాంతిని కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. జహంగీర్‌ఖాన్ నిర్ణయంపై టీఎంసీ అధికార ప్రతినిధి మీడియాతో అరూప్ చక్రవర్తి స్పందించారు. జహంగీర్‌ఖాన్ తన నిర్ణయంపై సమాచారం ఇచ్చారు. అయితే ఆ నిర్ణయానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు.రీపోలింగ్ ఎన్నిక నుంచి తప్పుకున్నానంటూ జహంగీర్‌ఖాన్ ప్రకటనపై సీఎం సువేందుకు అధికారి విమర్శలు గుప్పించారు. ఫల్టా నియోజకవర్గంలో జరగనున్న రీపోలింగ్‌లో పోలింగ్ ఏజెంట్ దొరకడని అతను పారిపోయాడు’ అని ఎద్దేవా చేశారు. ఆయనో ప్రముఖ క్రిమినల్. ఆయన సంగతిని నాకు వదిలేయండి నేను చూసుకుంటానని అన్నారు.ఇటీవల జరిగిన రెండో విడత పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం 95మంది అధికారుల్ని నియమించింది. వారిలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అజయ్‌పాల్ ఉన్నారు. ప్రయాగరాజ్‌లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)గా విధులు నిర్వహిస్తున్న అజయ్ శర్మ ఎన్కౌంటర్ స్పెషలిస్టు. 500కి పైగా ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర ఉంది. ఈసీ ఆయనను సౌత్ 24 పరగణ జిల్లా పోలీస్ ఆబ్జర్వర్‌గా నియమించింది. తనిఖీలు నిర్వహించే సమయంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటి వద్ద అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఆపై జహంగీర్‌ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ వరుస పరిణామాలపై జహంగీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. పుష్ప సినిమాకు జహంగీర్ ఖాన్ బీభత్సమైన ఫ్యాన్. అయినప్పటికీ ఆయన సింగం అయితే, నేను పుష్పని ఫైర్ అనుకుంటున్నారా? వైల్డ్ ఫైర్ అంటూ మాస్ డైలాగులు వదిలారు. ఇప్పుడు ఫల్టా రీపోలింగ్ ఎన్నికల నుంచి తప్పుకోవడంపై సీఎం సువేందుకు, ఐపీఎస్ అజయ్ శర్మకు పుష్ప బయపడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎంపీ నియోజకవర్గమైన డైమండ్ హార్బర్ పరిధిలోకి ఫల్టా నియోజకవర్గం కావడం, చరిత్రలో తొలిసారిగా ఈసీ నియోజకవర్గం మొత్తం రీపోలింగ్ నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. రీపోలింగ్ ఉన్నా సరే మే 4నుంచి ఇప్పటి వరకు దీదీ,అభిషేక్‌తో పాటు ఇతర సీనియర్ నేతలెవరూ ప్రచారం జోలికి వెళ్లలేదు. ఫల్టా నియోజకవర్గంపై ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. రెండో విడుత ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి. వరుస ఫిర్యాదులతో ఫల్టాలోని మొత్తం 285 కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ 24వ తేదీన కౌంటింగ్ జరగనుంది. -
నిష్పాక్షిక ఎన్నికలు రాజ్యాంగంలో భాగం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల విధానం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర ఎన్నికల కమిషన్‌తోనే ఇది సాధ్యమంది. స్వతంత్రంగా కనిపిస్తేనే చాలదు. అది కచ్చితంగా స్వతంత్రంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై ఆఖరు రోజు గురువారం వాదనలు కొనసాగాయి.ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సిఫారసు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుందంటూ కేంద్రం సవరించిన నిబంధనలు 2024 జనవరిలో అమల్లోకి వచ్చాయి. ఈ త్రిసభ ఎంపిక కమిటీలో అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రభుత్వం చేర్చింది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పైవ్యాఖ్యలు చేసింది.అయితే, ఈసీ నియామకాల విషయంలో పార్లమెంట్‌కు పూర్తి అధికారముందని, న్యాయ వ్యవస్థ జోక్యం తగదని అటార్నీ జనరల్ వెంకటరమణి గట్టిగా వాదించగా ఈ విషయంలో ‘మా లక్ష్మణ రేఖ ఏమిటో మాకు తెలుసు. మేం ఎన్నటికీ ఆ గీత దాటము’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
-
నిష్పాక్షిక ఎన్నికలు రాజ్యాంగంలో భాగం
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల విధానం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర ఎన్నికల కమిషన్‌తోనే ఇది సాధ్యమంది. స్వతంత్రంగా కనిపిస్తేనే చాలదు. అది కచ్చితంగా స్వతంత్రంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఆరు పిటిషన్లపై ఆఖరు రోజు గురువారం వాదనలు కొనసాగాయి. ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సిఫారసు మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుందంటూ కేంద్రం సవరించిన నిబంధనలు 2024 జనవరిలో అమల్లోకి వచ్చాయి. ఈ త్రిసభ ఎంపిక కమిటీలో అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రభుత్వం చేర్చింది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పైవ్యాఖ్యలు చేసింది. అయితే, ఈసీ నియామకాల విషయంలో పార్లమెంట్‌కు పూర్తి అధికారముందని, న్యాయ వ్యవస్థ జోక్యం తగదని అటార్నీ జనరల్ వెంకటరమణి గట్టిగా వాదించగా ఈ విషయంలో ‘మా లక్ష్మణ రేఖ ఏమిటో మాకు తెలుసు. మేం ఎన్నటికీ ఆ గీత దాటము’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ఓటింగ్‌లో సునామీ.. థర్డ్ జెండర్లకు ఒరిగిందేమీ..
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో థర్డ్ జెండర్లకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. మరోవైపు అది దేశంలో ఆందోళన కలిగించే అంశంగానూ కనిపిస్తోంది. థర్డ్ జెండర్ వర్గం నుంచి ఎన్నికల బరిలో కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నిలుచున్నారు. అయితే ఆ ఇద్దరూ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్య వేదికపై వారి రాజకీయ ప్రాతినిధ్యం ఇంకా ఎంత వెనుకబడి ఉందనేది తెలియజేస్తోంది. ఓటింగ్ శాతంలో ఉత్సాహం చూపించిన ఈ వర్గం చట్టసభల మెట్లు ఎక్కడంలో తీవ్ర నిరాశనే ఎదుర్కొంటోంది.బరిలో నిలిచింది ఇద్దరేఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇద్దరు థర్డ్ జెండర్ అభ్యర్థులు మాత్రమే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కేరళ నుంచి ఒకరు, తమిళనాడు నుంచి మరొకరు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచేందుకు ధైర్యం చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఎన్నికల్లో మిగిలిన ఏ రాష్ట్రం నుంచి కూడా ఈ వర్గానికి కనీస ప్రాతినిధ్యం దక్కలేదు.డిపాజిట్లు కూడా దక్కలేదుపోటీ చేసిన ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఓటర్ల నుంచి కనీస మద్దతును సాధించలేకపోయారు. ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేక, తమ డిపాజిట్లను సైతం కోల్పోయారు. ఎన్నికల బరిలో నిలబడటమే ఒక పెద్ద సవాలుగా మారిన ప్రస్తుత తరుణంలో, వారికి ప్రజల ఆదరణ కూడా ఆశించిన స్థాయిలో లభించకపోవడం గమనార్హం.గత ఎన్నికల్లోనూ ఇదే తీరుథర్డ్ జెండర్ అభ్యర్థులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సరిగ్గా ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. అప్పట్లో కేరళలో ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి పోటీ చేయగా, తమిళనాడులో ఇద్దరు బరిలో నిలిచారు. అయితే, ఆ ఎన్నికల్లోనూ వీరెవరూ విజయం సాధించలేకపోయారు, పైగా వీరు తమ డిపాజిట్లను సైతం కోల్పోయారు.ఓటింగ్ కు క్యూ కట్టిన బెంగాల్గత నెలలో అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మే 4న ఫలితాలు వెలువడ్డాయి. పోటీలో వెనుకబడినప్పటికీ, ఓట్లు వేయడంలో మాత్రం థర్డ్ జెండర్ ఓటర్లు విశేషంగా స్పందించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని రెండో విడత పోలింగ్‌లో ఏకంగా 91.28 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,257 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండగా, తొలి దశలో 465 మంది (56.79 శాతం), రెండో దశలో 792 మంది (91.28 శాతం) ఓటేశారు.పుదుచ్చేరి రికార్డ్.. ఇతర రాష్ట్రాల పరిస్థితి?కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 139 మాత్రమే అయినప్పటికీ, ఏకంగా 91.81 శాతం మంది పోలింగ్ బూత్‌లకు వెళ్లి అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఇక 7,728 మంది థర్డ్ జెండర్ ఓటర్లతో అత్యధిక సంఖ్య కలిగిన తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్ లో కేవలం 60.49 శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 343 మంది ఓటర్లకు గాను 36.84 శాతం పోలింగ్ జరగ్గా, కేరళలో 277 మంది ఓటర్లలో 57.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఈసీ వెల్లడించింది.నవీన్ చావ్లా చొరవతోనే గుర్తింపుఒకప్పుడు ఓటరు జాబితాలో తమ ఉనికిని చాటుకోవడానికి కూడా ఇబ్బంది పడిన థర్డ్ జెండర్ వర్గానికి.. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకంగా నిలిచింది. ఆయన చొరవతోనే ఓటర్ల నమోదు ప్రక్రియలో ‘ఇతరులు’ (Others) లేదా ‘ఓ’ (O) కేటగిరీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగానే ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్లను ‘పురుషులు’, ‘మహిళలు’, ‘ఇతరులు’ లేదా ‘థర్డ్ జెండర్’గా అధికారికంగా గుర్తిస్తూ, వారికి ఓటు హక్కును కల్పిస్తోంది.ఇది కూడా చదవండి: కాషాయ భారతం: 21 రాష్ట్రాలు.. రాజ్యసభలో 113 సీట్లు -
పట్టుబడింది రూ.1,444 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దమొత్తంలో సీజ్ చేసింది. వీటి మొత్తం విలువ రూ.1,400 కోట్లకు పైమాటేనని ఈసీఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు 5 రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పటిష్టంగా అమలు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా (144) అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికల నియమావళి ముగిసినట్లు వెల్లడించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాన కార్యదర్శులు, సీఈఓలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించామని వివరించింది. ఇందులో భాగంగా 376 మంది వ్యయ పరిశీలకులు, 7,470 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 7,470 స్టాటిక్ సరై్వలెన్స్ బృందా (ఎస్ఎస్టీ)లను మోహరించామని వెల్లడించింది. కీలకంగా మారిన ఐటీ వేదిక ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎస్ఎంఎస్) అనే ఐటీ వేదికను ఈసీ వినియోగంలోకి తెచ్చింది. దీని ద్వారా వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపడి సమాచార మార్పిడి వేగవంతమైంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈఎస్ఎంఎస్ యాక్టివేట్ చేసినప్పటి నుంచి మే 6వ తేదీ వరకు పట్టుబడిన మొత్తం సొత్తు వివరాలను ఈసీ వెల్లడించింది. ఈ కాలంలో పట్టుబడిన సొత్తు విలువ రూ.1444.96 కోట్లు. ఇందులో నగదు రూ.154.89 కోట్లు, మద్యం విలువ రూ.183.33 కోట్లు, డ్రగ్స్ రూ.337.88 కోట్లు, విలువైన లోహాలు రూ.250.14 కోట్లు, ఉచితాలు తదితరాల విలువ రూ.518.73 కోట్లుగా రికార్డయింది. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా రూ.662.28 కోట్లు సీజ్ చేయగా, పశ్చిమ బెంగాల్ రూ.573.41 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అస్సాంలో రూ.117.24 కోట్లు, కేరళలో రూ.80.67 కోట్లు, పుదుచ్చేరిలో రూ.9.72 కోట్లు పట్టుబడ్డాయి.40.14 శాతం పెరుగుదల2021 సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.1029.93 కోట్లు. ఆ గణాంకాలతో పోలిస్తే 2026 ఎన్నికల్లో 40.14 శాతం పెరుగుదల నమోదైంది. పశ్చిమ బెంగాల్లో సీజ్‌ల శాతం అత్యధికంగా 68.92% పెరగ్గా, తమిళనాడులో 48.40% పెరుగుదల నమోదైందని ఎన్నికల సంఘం వివరించింది. -
బెంగాల్ ట్విస్ట్: దీదీకి సరికొత్త టెన్షన్!
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరో మలుపు తిరిగింది. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడి నెగ్గిందంటూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్ హత్యకు గురి కావడంతో రాజకీయ దుమారం రేగింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రద్దుమమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం!9న పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం దర్యాప్తు ముమ్మరంసువేందు అధికారి పీఏ చంద్రనాథ్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంఘటనాస్థలి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు రంగంలోకిమధ్యమ్గ్రామ్లోని ఘటనాస్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులుకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ డిమాండ్ పక్షపాతం లేకుండా విచారణ జరగాలన్న తృణమూల్అందుకే నా పీఏను చంపారు: సువేందునా పీఏ చంద్రనాథ్ రాథ్ హత్యకు కారణాలు ఉన్నాయిఆయన నా కార్యనిర్వాహక సహాయకుడిగా ఉండటమే హత్యకు కారణంభవానీపూర్లో మమతా బెనర్జీని నేను ఓడించడమూ ఓ కారణంనా బాధ్యతలన్నింటినీ నేను నిర్వర్తిస్తాను: సువేందుమమతకు కొత్త తలనొప్పి!ఓడినా సీఎం పదవికి రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ దీదీ ప్రకటనతో వేడెక్కిన పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నేటితో బెంగాల్ అసెంబ్లీ గడువు పూర్తిఆటోమేటిక్గా రద్దు కానున్న టీఎంసీ సర్కార్ఈలోపు.. మరో ట్విస్ట్!టీఎంసీ భేటీకి డుమ్మా కొట్టిన 10 మంది కొత్త ఎమ్మెల్యేలుపార్టీలో జోష్ నింపేందుకు భేటీ నిర్వహించిన మమతా బెనర్జీ80 మందికిగానూ 70 మందే హాజరుచీలిక ఏర్పడిందా అనుమానాలుపార్టీ ఫిరాయిస్తారని జోరుగా ప్రచారంఆ ఊహాగానాలను తోసిపుచ్చిన టీఎంసీ గైర్హాజరుపై ముందుగానే సమాచారం ఇచ్చారని వెల్లడితాజా పరిణామాలపై బీజేపీ సైలెన్స్ ఆ పిస్టోల్ అక్రమంగా వచ్చిందే!బెంగాల్లో సంచలనంగా సువేందు అధికారి పీఏ హత్య కేసుసువేందు పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యబుధవారం రాత్రి ఇంటికి వెళ్తున్న టైంలో కాల్పులు జరిపిన దుండగులుఅక్కడికక్కడే కారులో కుప్పకూలిన చంద్రనాథ్చంద్రనాథ్ రథ్ హత్యకు ఉపయోగించిన తుపాకీ అక్రమంగా వచ్చిందే!హత్యకు ఆస్ట్రియా మేడ్ తుపాకీ వాడిన దుండగలుతుపాకీని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తింపునిందితులను ట్రేస్ చేసే పనిలో కోల్‌కతా పోలీసులుమమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలుఈ నెల 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారంసీఎం ఎంపిక.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై దృష్టి పెట్టిన బీజేపీటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలుమే 4వ తేదీన వెలువడ్డ బెంగాల్ ఫలితాలుఫలితాల్లో బీజేపీ ఘన విజయంసీఎం పదవికి ఇప్పటిదాకా రాజీనామా చేయని మమతా బెనర్జీదేశ రాజకీయాల్లో.. ఇప్పటిదాకా ఎవరూ ఇలా చేయలేదు!సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చేసిన దీదీఏం చేసుకుంటారో చేస్కోమంటూ తాజాగా మరోసారి సవాల్కావాలంటే రాష్ట్రపతి పాలన విధించుకోండి అంటూ వ్యాఖ్యసీఎంగా ఎవరైనా ప్రమాణం చేస్తే.. ఆ రోజును బ్లాక్‌డేగా పాటిస్తామని ప్రకటనమరోవైపు.. ఇప్పటికే ముగిసిన బెంగాల్ అసెంబ్లీ గడువురాజ్యాంగం ప్రకారం.. రద్దైన మమతా బెనర్జీ సర్కార్అయినా సీఎం కుర్చీలో తానే కూర్చుంటానంటున్న మమతా బెనర్జీఎవరీ చంద్రనాథ్?చంద్రనాథ్ రథ్.. బీజేపీ నేత సువేందు అధికారికి అత్యంత విశ్వసనీయ సహాయకుడుచంద్రనాథ్ వయసు 41 ఏళ్లు.. స్వస్థలం మేదినిపూర్ జిల్లా చందిపూర్ రహారా రామకృష్ణ మిషన్‌లో చదివిన చంద్రనాథ్ దాదాపు రెండు దశాబ్దాలు భారత వాయుసేనలో సేవలుఆధ్యాత్మిక జీవితం వైపు ఆకర్షితుడైన.. ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ కొంతకాలం రామకృష్ణ మిషన్‌లో సేవలందించిన చంద్రనాథ్ ఆపై కార్పొరేట్ రంగంలో పనిచేసి.. అక్కడ నుంచి పొలిటికల్ కన్సల్టెన్సీలో విధులు తృణమూల్ కాంగ్రెస్‌తో చంద్రనాథ్ కుటుంబానికి అవినాభావ సంబంధంసువేందు అధికారి బీజేపీలో చేరాక.. ఆయన వెంటే చంద్రనాథ్సువేందు కోసం బీజేపీ తరఫున కీలకంగా పని చేసిన చంద్రనాథ్అధికారి సువేందు ఎన్నికల ప్రచార నిర్వహణ, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, లాజిస్టిక్స్ వంటి సున్నితమైన పనులను హ్యాండిల్ చేసిన చంద్రనాథ్తాజా విజయంతో.. బీజేపీ చంద్రనాథ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్తుందనే ఊహాగానాలు ఈలోపే.. చంద్రనాథ్ దారుణ హత్యబెంగాల్ను కుదిపేస్తున్న హత్యారాజకీయాలు ఉత్తర 24 పరగణాలో దారుణ హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందు పీఏ చంద్రనాథ్తన నివాసానికి వెళ్తున్న టైంలో బైక్ మీద వచ్చి కాల్చి చంపిన దుండగులుఅక్కడికక్కడే మృతి చెందిన చంద్రనాథ్.. డ్రైవర్ పరిస్థితి విషమంటీఎంసీపై బీజేపీ ఆరోపణలు.. ఆరోపణలను ఖండించిన టీఎంసీఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసహింసాత్మక ఘటనల్లో పలువురు బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మృతిఈసీ సీరియస్బెంగాల్లో హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. వరుసగా దాడులు, హత్యలుఇప్పటికే పలువురు టీఎంసీ, బీజేపీ కార్యకర్తలపై దాడులుహత్యకు గురైన పలువురు!బెంగాల్ పోలీస్ శాఖపై ఈసీ ఆగ్రహంశాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాలని ఆదేశంఘటనలపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశం #WATCH | North 24 Parganas | On Suvendu Adhikari's PA Chandra shot dead in Madhyamgram, BJP leader Sajal Ghosh says, "He had no enemies and was a cheerful boy. This was destined for him just because he worked for Suvendu... This is Bengal... 5 bullets were shot... I have been… pic.twitter.com/X6rFpnDzyZ— ANI (@ANI) May 6, 2026టీఎంసీ స్పందన ఇదే.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదుచంద్రనాథ్ హత్యను ఖండిస్తున్నాంఆ హత్యతో మాకు సంబంధం లేదుదోషులెవరైనా కఠినంగా శిక్షించాలికోడ్ అమల్లో ఉండగా హింస దురదృష్టకరంచంద్రనాథ్ హత్యపై సీబీఐ విచారణ జరగాలి పీఏ హత్యపై సువేందు రియాక్షన్మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సంచలన ఆరోపణలుఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారి సువేందుపక్కా ప్లాన్‌తోనే నా పీఏను మత్య చేశారుహత్య వెనుక మమతా మేనల్లుడి ప్రమేయం ఉంది సువేందు పీఏ దారుణ హత్యబీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి పీఏ దారుణ హత్యచంద్రనాథ్ను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులుమధ్యమ్గ్రామ్లో హత్య చేసిన దుండగులుకారులో వెళ్తుండగా కాల్చివేతనాలుగు రౌండ్ల కాల్పులుఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లి కారులోనే కుప్పకూలిన చంద్రనాథ్కారులో ఉన్న మరో వ్యక్తికి గాయాలూ.. పరిస్థితి విషమంSTORY | Bengal BJP leader Suvendu Adhikari's personal assistant shot deadBJP leader Suvendu Adhikari's personal assistant was shot dead by unidentified assailants in West Bengal's North 24 Parganas district, party sources said. The incident took place at Doharia in Madhyamgram… pic.twitter.com/oMET6SQm8w— Press Trust of India (@PTI_News) May 6, 2026 -
దీదీ ధిక్కార స్వరం!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విలక్షణ నాయకురాలు. పదిహేనేళ్లపాటు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పాలించి తొలిసారి ఓటమి చవిచూసిన ఆమె దీన్ని తేలిగ్గా వదలదల్చుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ‘ఎన్నికల సంఘం(ఈసీ) ఆసరాతో మా గెలుపు కొల్లగొట్టారు. మేం ఓడిపోలేదు. కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేద’ని ఆమె బాంబు పేల్చారు. ఆమె అయిదేళ్ల పదవీకాలం ఎటూ ఈ నెల ఏడుతో ముగుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఈలోగానే ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తారా... లేక గడువు ముగిశాక ఆమెను సచివాలయంలోకి రాకుండా అడ్డుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఓడిపోయినవారు ప్రత్యర్థి ఎన్నికను న్యాయస్థానంలో సవాలు చేసే ప్రత్యా మ్నాయం ఉంటుంది. అవన్నీ తేలటానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. సీనియర్ నాయకు రాలు గనుక ఇవన్నీ ఆమెకు సంపూర్ణంగా తెలిసే ఉంటాయి. కానీ అక్కడితో ఆగిపోతే ఆమెకూ, ఇతర నాయకులకూ తేడా ఉండేది కాదు. వైదొలగక తప్పదని తెలిసినా తగినంత రచ్చచేసి నిష్క్రమించటం ఆమె ఎత్తుగడ కావొచ్చు. యూత్ కాంగ్రెస్ నాయకు రాలిగా పనిచేసినప్పటినుంచి మమత స్ట్రీట్ ఫైటర్. వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వంపై సాగిస్తున్న పోరాటంలో పార్టీనుంచి సరైన సహకారం అందటం లేదన్న ఏకైక కారణంతో ఆమె కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. సొంతంగా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఆ తర్వాత ఆమెదంతా అలుపెరగని పోరాట చరిత్ర.ఇంత రగడకు ఏకైక కారణం ఎన్నికల సంఘం(ఈసీ). స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్‌లో అమలైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాక కూడా ఇతర రాష్ట్రాల్లోనైనా సజావుగా పూర్తి చేయాలన్న ఇంగిత జ్ఞానం ఆ సంస్థకు లేకపోయింది. బెంగాల్లో దాన్ని మరింత అధ్వాన్నం చేసింది. తొలగింపు ల్లోనూ, చేర్పింపుల్లోనూ అవకతవకలకు అంతూ దరీ లేకుండా పోయింది. ఫాం–7 కింద ఊరూ పేరూలేని వారు దాఖలు చేసిన ఫిర్యాదుల్ని ఆసరా చేసుకుని తాఖీదులు పంపడం, కావలసిన పత్రాలన్నీ ఇచ్చాక నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ కాలేదంటూ తొలగించటం వంటివి చోటుచేసుకున్నాయి. పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా ‘తార్కిక వ్యత్యాసం’ పేరిట అనర్హులుగా జమేయటం మరో దాష్టీకం. ఏతావాతా 91 లక్షలమంది ఓటర్లు మాయమయ్యారు. పైగా ఏడు లక్షలమంది రహస్యంగా వచ్చిచేరారని మమత ఆరోపిస్తున్నారు. అజ్యుడికేషన్లో మాత్రం కేవలం 1,607 మందికి మాత్రమే ఓటుహక్కు పునరుద్ధరించారు. మిగిలిన లక్షలాది దరఖాస్తులు తేలడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓటుహక్కు ప్రసాదించే సంస్థ అనే ముద్రనుంచి దాన్ని తొలగించటమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థగా ఈసీ పరివర్తన చెందటంలో మతలబేమిటి?సర్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా గత నెల 13న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, ఓటర్ల జాబితాల్లో భారీస్థాయి తొలగింపులు జరిగితే అది ఎన్నికల ఫలితాలపై ‘గణనీయమైన ప్రభావం’ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితే వస్తే ఏం చేయాలో ఆలోచిస్తామని కూడా చెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎటూ విపక్షాలు సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశం ఉంది. విచారకరమైన సంగతేమంటే... ఈ ఎన్నికల్లో తానూ ఒక అభ్యర్థినే అన్నట్టు ఈసీ ప్రవర్తించింది. వచ్చిన కేంద్ర పరిశీలకులు సైతం అందుకు తగినట్టే ఉన్నారు. మరి ‘ఓట్ చోరీ’ ఆరోపణలు రావటంలో వింతేముంది?ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటి ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఇంతవరకూ ఈసీ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులకు అతీ గతీ లేదు. నిమిషానికి నలుగురు చొప్పున ఓటేయటం గురించీ, సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేయటం గురించీ పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు ప్రశ్నిస్తుంటే మన్నుతిన్న పాములా కూర్చుంది. ఏ సంస్థా ఇంత సిగ్గుమాలినతనాన్ని ప్రదర్శించిన వైనం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. కనీసం ఇప్పుడు సర్ ప్రారంభించబోయే రాష్ట్రాల్లోనైనా సక్రమంగా ప్రవర్తించటం ఈసీ నేర్చుకోవాలి. లేనట్టయితే అక్కడ కూడా ఇలాంటి ఛీత్కారాలే ఎదురవుతాయి. -
విజయం మనదే: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దని ఆమె టీఎంసీ శ్రేణులను ఆమె కోరారు. నిజమైన ఫలితాలు వచ్చేదాకా అంతా ఎదురు చూడాలని.. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు ఆమె పిలుపు ఇచ్చారు. ‘‘మనం ఇంకా ఓడిపోయినట్లు కాదు. కౌంటింగ్ కేంద్రం నుంచి టీఎంసీ నేతలు వెళ్లిపోకూడదు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లు దొంగలించింది. ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలే వచ్చాయి. పలు చోట్ల కౌంటింగ్ నిలిపివేశారు. 70 నియోజకవర్గాల కౌంటింగ్‌పై ఈసీ నుంచే అప్డేట్ లేదు. టీఎంసీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దు. మనం ఇంకా ఓడిపోయినట్లు కాదు. చివరి కాదా వేచి చూడండి. తుది ఫలితాలు మనవైపే ఉంటాయి. అసలైన విజయం మనదే’’ అని అన్నారామె.ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బెంగాల్లో 191 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ (147) దాటేసి అధికార కైవసం దిశగా అడుగులేస్తోంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మమతా బెనర్జీపై ప్రజలకు ఉన్న కోపం ఈ ఫలితాలతో స్పష్టమైందని బీజేపీ అంటోంది. ఇక ఫలితాల్లో.. టీఎంసీ 97 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా.. సీపీఎం, కాంగ్రెస్‌లు చెరో 1 స్థానంలో లీడ్‌లో కొనసాగుతున్నాయి. -
నేడే కౌంటింగ్.. అందరి చూపు బెంగాల్ పైనే!
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి లాభమో? పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్‌ల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా, 87 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్‌కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్‌కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. తమిళనాడులో విజయం విజయ్‌దేనా?తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పటా్నయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టంచేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్‌పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే! కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్‌లో 79.63 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్పై యూడీఎఫ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్‌లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్‌లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి. – సాక్షి, నేషనల్æడెస్క్2 -
ప్రజలెన్నుకున్నవి కావు.. పాలకులెంచుకున్న ప్రభుత్వాలివి
అనంతపురం/అనంతపురం కల్చరల్: దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పాలకులు అపహాస్యం చేసి.. ప్రజల అభీష్టానికి విలువ లేకుండా చేశారని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, రానున్న రోజుల్లో స్వేచ్ఛగా మాట్లాడే రోజులు ఉండవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కీలక చర్చలు’ అనే అంశంపై వేర్వేరు సదస్సులు జరిగాయి. జీఆర్ ఫంక్షన్ హాలులో సలీం మాలిక్ నిర్వహణలో జరిగిన మొదటి సదస్సుకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పరకాల ప్రభాకర్.. ‘రాజ్యాంగం–ఎన్నికలు–ప్రజాస్వామ్యం’, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ అనే అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు ప్రజలు ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలని ఆలోచించే వారని.. కానీ, ఇప్పుడు ఎవరు ఓటర్లుగా ఉండాలని పాలకులు ఆలోచిస్తున్నారని చెప్పారు. ఏపీలో ఇటీవలి ఎన్నికల్లో నిమిషానికి మూడుకంటే ఎక్కువ ఓట్లు పడ్డాయని.. ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కల ప్రకారమే 132 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇదెలా సాధ్యమో పాలకులుగానీ, ఈసీ కానీ చెప్పడంలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు తాము వేద్దామనుకున్న వారికి వారి ఓట్లు పడ్డాయో లేదో తెలియడంలేదన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నిలదీయాలని పరకాల కోరారు. తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్లు ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ ప్రకటించారని.. 2024 మే 13 రాత్రి 2.15 గంటల్లో 4.16 శాతం (17,19,482) ఓట్లు పోలయ్యాయన్నారు. ఇక తుది పోలింగ్ శాతం ప్రకటించడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. మొత్తం మీద అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయనిపరకాల చెప్పారు. 90 శాతం నమోదైతేనే రీపోలింగ్ జరుపుతారని, కానీ ఏకంగా 130 శాతానికి పైగా నమోదైనా ఎలాంటి రీపోలింగ్ జరపలేదన్నారు. హిందూయేతరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతున్నారని తెలిపారు. పౌరుడిని చంపకుండా పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్ అని విమర్శించారు.అమరావతిలో రూ.లక్షల కోట్ల వృథా..ఇక అమరావతిని బలవంతంగా రుద్దుతూ రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నా మే«ధావులు స్పందించకపోవడం బాధాకరమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ. రామచంద్రయ్య అన్నారు. అమరావతికి పెట్టే ఖర్చుతో రాష్ట్రంలోని 15 నగరాలను అద్భుతంగా అభివృద్ధి చెయొచ్చన్నారు. అమరావతికి జనం వచ్చే అవకాశమేలేదని కుండబద్దలు కొట్టారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాలపైనే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నారని, ఎక్కడా పారదర్శకతలేదని ఆరోపించారు. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే ధరలు పెంచడం, పన్నులు రెట్టింపు చేయడమేనని విమర్శించారు. ఇక రెండో సదస్సు ‘ప్రజలకు దూరమవుతున్న వైద్యం’ అనే అంశంపై మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్ఎం బాషా అధ్యక్షతన జరిగింది. -
ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే!
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్ అన్నారు. -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. రేపే పలు బూత్‌లలో రీపోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా దక్షిణ 24 పరగణాలకు చెందిన పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలకు ట్యాప్ అతికించారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో పాటు అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహట్ పశ్చిమ్ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం (మే 2, 2026) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మగ్రాహట్ పశ్చిమ్‌లోని 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది.142 మగ్రాహట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, 143 డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ 2026న జరిగిన పోలింగ్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు,పరిశీలకుల నివేదికల ఆధారంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం ఆ రోజు జరిగిన పోలింగ్ చెల్లదని కమిషన్ ప్రకటించింది.అందుకు అనుగుణంగా మే 2, 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులో తెలిపారు. పోలింగ్ ప్రాంతంలో డప్పులు కొట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే పోటీ అభ్యర్థులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
కవిత పార్టీ కొత్త పేరు ‘తెలంగాణ రక్షణ సేన’
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’ పేరిట రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పచ్చజెండా ఊపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 29ఎ కింద పార్టీ నమోదు కోసం దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన ఈసీ.. నిబంధనల ప్రకారం పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 28న కవితకు ఈసీ అధికారిక లేఖ పంపింది. బంజారాహిల్స్ చిరునామాతో ఉన్న ‘తెలంగాణ ప్రజా జాగృతి’ని రాజకీయ పార్టీగా మార్చేందుకు ఏప్రిల్ 23న కవిత ఈసీకి దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం.. దరఖాస్తులో ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై బహిరంగ ప్రకటన ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పార్టీ రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న రాష్ట్రంలో రెండు జాతీయ, రెండు స్థానిక దినపత్రికల్లో పార్టీ పేరును తెలుపుతూ వరుసగా రెండు రోజులపాటు పబ్లిక్ నోటీసు ప్రచురించాలి. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రకటన ప్రచురించిన నాటి నుంచి 30 రోజుల వ్యవధిలో తెలపాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొనాలి. అభ్యంతరాలను సాధారణ కాగితంపై రాసి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ (పొలిటికల్ పార్టీ)కి పోస్టు ద్వారా లేదా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చని ప్రజలకు తెలియజేయాలి.పబ్లిక్ నోటీసుపై వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ పేరుకు ఈసీ తుది ఆమోదం తెలుపుతుంది. ఈసీ ఆమోదించిన పేరిట పార్టీ రాజ్యాంగాన్ని, నిబంధనలను పొందుపరుస్తూ అనుబంధం–1లో తాజా దరఖాస్తును దాఖలు చేయాలని లేఖలో ఈసీ స్పష్టం చేసింది. ఈ పత్రాలు అందిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదుపరి దశకు చేరుకుంటుంది.‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట దరఖాస్తుకేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అధ్యక్షురాలి హోదాలో కవిత కొత్త పార్టీ పేరు కోసం అనుమతి కోరుతూ ఐదు పేర్లు ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి పేర్లను ప్రతిపాదించారు. కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రత్యుత్తరాలు నడుస్తున్నా కొత్త పార్టీ పేరుపై స్పష్టత రాకపోవడంతో ఈ నెల 25న జరిగిన ఆవిర్భావ సమావేశంలో కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు.బీఆర్ఎస్ పూర్వపు పేరు టీఆర్ఎస్ను పోలిఉండేలా కవిత ఈ పేరును ప్రకటించారు. ఇదిలా ఉంటే ‘ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఐదు పేర్లతో దరఖాస్తు చేస్తే మూడో ప్రాధాన్యతగా ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాకు రాసి పెట్టి ఉందేమో’ అని కవిత గురువారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.‘తెలంగాణ రాజ్యాధికార సమితి’ అభ్యంతరంటీఆర్ఎస్ సంక్షిప్త నామంతో ఇప్పటికే తమ పార్టీ ఉన్నందున అదే అక్షరాలను పోలి ఉండే కొత్త పార్టీని రిజిస్టర్ చేయొద్దని తెలంగాణ రాజ్యాధికార సమితి అధ్యక్షులు తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇలాఉండగా, తిరిగి టీఆర్ఎస్గా పార్టీ పేరు మార్చుకుంటామని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాలలో జరిగిన మీడియా భేటీలో వెల్లడించారు. నెల రోజుల్లోగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుపై ఎలాంటి అభ్యంతరాలు రాకుంటే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని కవితకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ‘టీఆర్ఎస్’ సంక్షిప్త నామంపై పరస్పర ఆరోపణల పర్వం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. -
కవిత టీఆర్ఎస్కు ఈసీ ఆమోదం.. ఇక్కడే ఓ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో పార్టీకి లైన్ క్లియర్ అయ్యింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సేనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్లో తెలంగాణ ఆత్మ లోపించిందని.. అందుకే తాను కొత్త పార్టీ పెట్టానని ఆమె ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించారు. అయితే.. ఆ ప్రకటన తర్వాత పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఒరిజినల్.. ఒరిజినలేనంటూ బీఆర్ఎస్ పార్టీ సెటైర్లు వేసింది. అదే సమయంలో ఆమె పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలో ఆ అభ్యంతరాలను పరిశీలించిన ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు మీద కాకుండా.. తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత పార్టీకి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లిన అధికారులు సంబంధిత లేఖను అందజేసినట్లు సమాచారం. -
రెండో దశలోనూ రికార్డ్ స్థాయిలో
కోల్‌కతా: బీజేపీ, టీఎంసీ ముఖ్యనేతల హోరాహోరీ ప్రచారపర్వం తర్వాత బుధవారం పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం రాత్రి 7.45 గంటలకు అందిన సమాచారం మేరకు రెండో దఫాలో రికార్డ్ స్థాయిలో 92.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసేనాటికి క్యూ వరసల్లో నిల్చున్న వాళ్లకు సైతం ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే వీలుంది. తొలి దశలో 93.19 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొదటి, రెండో దశ పోలింగ్ శాతాలను కలుపుకుంటే సగటును 92.84 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్రచరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 2011లో 84.72 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం రెండో దశలో 142 స్థానాలకుగాను బుధవారం 40వేలకుపైగా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు బారులు తీరి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 93.78 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో 88.59 శాతం పోలింగ్ నమోదైంది. భవానీపూర్ నుంచి పోటీచేస్తున్న 71 ఏళ్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం నియోజకవర్గంలోని చక్రబేరియా ప్రాంతంలోని 70వ నంబర్ వార్డ్‌లో పోలింగ్‌కేంద్రంలో ఓటేసి బయటికొచ్చి కూర్చున్నారు. అదే సమయానికి మమతపై పోటీకి దిగిన బీజేపీ రాష్ట్ర ముఖ్యనేత సువేంధు అధికారి అక్కడికి వచ్చారు. కానీ ఇద్దరి మధ్యా ఎలాంటి సంభాషణ జరగలేదు. ఈమెకు ఒక్కరు కూడా ఓటేయబోరు అని సువేంధు వ్యాఖ్యానించారు. పానీహటిలో బీజేపీ మహిళా అభ్యర్థి, ఆర్జీకర్ బోధనాస్పత్రిలో హత్యోదంతంలో బాధిత వైద్యురాలి తల్లి రత్నా దేభ్నాథ్ కారును టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుని నిరసనతెలిపారు. బసంతిలో తమ కారును టీఎంసీ గూండాలు అడ్డుకుని డ్రైవర్‌ను కొట్టారని బీజేపీ అభ్యర్థి బికాశ్ సర్దార్ ఆరోపించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్జవాన్లు గూండాల్లా ప్రవర్తిస్తూ మహిళా ఓటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. హౌరాలోని సథాఛియాలో నాలుగేళ్ల పిల్లాడిని, ఆమె తల్లిని క్యూవరసలో సరిగా నిల్చోలేదని సీఆర్పీఎఫ్ జవాన్లు విచక్షణారహితంగా కొట్టారని టీఎంసీ ఆరోపించింది. -
ముగిసిన ఎన్నికల రణం
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్‌లో ఎన్నికలుంటాయని గత నెల 16న ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది మొదలు అలుముకున్న ఒక రకమైన యుద్ధ వాతావరణం పరిసమాప్తమైంది. పశ్చిమ బెంగాల్లో బుధవారం ముగిసిన రెండో దశ పోలింగ్‌లో అనుకున్నట్టే భారీ స్థాయి ఓటింగ్ జరిగింది. సాయంత్రానికల్లా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలవరకూ చూస్తే దాదాపు అన్ని సర్వే సంస్థలూ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం ఖాయమని తెలిపాయి. తమిళనాడులో కొత్త పార్టీ టీవీకే ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతూనే డీఎంకే తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని అయిదు సంస్థల్లో మూడు అంచనా వేయగా, ఒక సంస్థ అన్నాడీఎంకే–బీజేపీ కూటమివైపు మొగ్గింది. బెంగాల్లో తృణమూల్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయని సర్వేలు తేల్చాయి. ఆరు సంస్థల్లో రెండు తృణమూల్‌వైపు, మిగిలిన సంస్థలు బీజేపీవైపు మొగ్గాయి. వాస్తవ ఫలితాలకు ఇవి ఏమేరకు దగ్గరగా ఉంటాయన్నది వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతగానీ తెలియదు. పోలింగ్ వరకూ చూస్తే మిగిలినచోట్ల దాదాపు ప్రశాంతంగానే ముగిసినా పశ్చిమ బెంగాల్ ఎప్పటిలాగే తనదైన ముద్ర మిగిల్చింది. రెండు దశల్లోనూ హింసాత్మక ఘటనలు తప్పలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన హింస చాలా తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. కావొచ్చు... కానీ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో దాదాపు రెండున్నర లక్షలమంది బలగాలను మోహరించటం, ముఖ్యంగా రెండో దశ పోలింగ్ జరిగిన దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భద్రతా బలగాలు అతిగా ప్రవర్తించిన తీరు సబబు కాదు. ఒకరి హింసకు మరొకరి హింస ప్రత్యామ్నాయం కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట ఏకంగా 91 లక్షలమంది ఓటర్ల పేర్లు గల్లంతు కావటం, ఎక్కడెక్కడికో పనుల కోసం వలసపోయినవారు తిరిగొచ్చి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా తగిన పత్రాలు సంపాదించలేకపోవటం, దాఖలు చేసినవారు సైతం భంగపడటం ఎందరినో కలవరపెట్టింది. చివరకు తొలి దశలో 139 మంది, మలి దశలో 1,468 మంది మాత్రమే న్యాయసమీక్షలో ఓటుహక్కు పొందారు. ఇక ఈసీ వివాదాస్పద పాత్ర సరేసరి. ముఖ్యంగా బెంగాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించటం కోసం తాను తటస్థంగా వ్యవహరించాలన్న సంగతిని అది మరిచింది. ఈ ఎన్నికల బరిలో తానూ ఉన్నానన్నట్టు వ్యవహరించింది. నిజానికి 2024 ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఈ పోకడలు కనబడ్డాయి. అధికారుల బదిలీలు మొదలుకొని అనేక అంశాల్లో విపక్షం చెప్పినట్టల్లా ఈసీ ఆడిందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు బెంగాల్లో అది మరింత బాహాటంగా జరిగింది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన ఒకరిద్దరు బెదిరింపు ధోర ణిలో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. అందులో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’గా మీడియా చెబుతున్న యూపీకి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఏ అభ్యర్థి అయినా సక్రమంగా వ్యవహరించకపోతే, డబ్బు పంచుతుంటే లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చట్టం అనుమతించిన మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బహిరంగ సవాళ్లు దేనికి? ఇది మంచి సందేశాన్ని పంపదు. ఇతరచోట్ల గణనీయమైన విజయాలు సాధిస్తున్నా... బీజేపీకి మాతృసంస్థ అనదగ్గ జనసంఘ్‌కు నారూ నీరూ పోసిన స్వర్గీయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన బెంగాల్లో అది సాధించలేకపోతున్నామని మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్‌పేయి ఒక దశలో ఆవేదన వ్యక్తం చేశారంటారు. ఆయన తొలినాళ్లలో ముఖర్జీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనైనా అదెంతవరకూ సాకారమవుతుందన్న విషయంలో ఎవరి అంచనాలు వారివి. ‘స్ట్రీట్ ఫైటర్’గా పేరున్న ముఖ్యమంత్రి మమతకు దీటుగా నిలబడగల స్థానిక నాయకులు ఇంతవరకూ బీజేపీకి తారసపడలేదు. అందుకే ప్రచార బాధ్యతల్ని స్వయంగా నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మోయాల్సివచ్చింది. అక్కడొచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పాలక, విపక్షాల వ్యూహాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపగలవనటంలో సందేహం లేదు. -
బెంగాల్ పోలింగ్: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ.. అధికార, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలకు దిగాయి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఓడిపోతున్నాననే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని.. రౌడీయిజంతో ఆ పార్టీనే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే..పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై గుర్తులకు టేప్ అంటించి ఉండడం కలకలం రేపింది. పలు నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సౌత్ 24 పరగణాలోని పోలింగ్ బూత్‌ల్లో.. అదీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టున చోట ఇది ఎక్కువగా జరిగిందని అంటోంది.ఇంతకాలంగా మమతా బెనర్జీని రక్షిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా? అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అభిషేక్ బెనర్జీ కూడా ఈ మోడల్‌తోనే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గారా? అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఫల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్‌లలో బీజేపీ గుర్తు ఉన్న బటన్‌ను టేప్‌తో కప్పి, ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విధానాన్ని వారు “డైమండ్ హార్బర్ మోడల్” అని పిలుస్తున్నారు. ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించిన టెంప్లేట్ అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ తన క్రిమినల్ కేసులున్న టీఎంసీ అభ్యర్థి జెహంగీర్ ఖాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్‌ను రక్షిస్తున్నారు అని మాలవీయా విమర్శించారాయన. అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేపుతో దాచేశారని సీపీఎం ఆరోపిస్తోంది. ఈ సంచలన ఆరోపణల నడుమ.. ఆ వీడియో వైరల్ అవుతోంది.అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని అంటోంది. మాలవీయా సోషల్ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు ఈసీని ప్రయోగించి చేయాల్సింది చేస్తారు అని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తులో వాస్తవమని తేలితే రీపోలింగ్ అంశం పరిశీలిస్తామని చెబుతోంది. This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86— Amit Malviya (@amitmalviya) April 29, 2026 -
ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది?
న్యూఢిల్లీ: ఎన్నికల పోలింగ్ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పైనే పడుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల హోరు ముగింపు దశకు చేరుకోవడంతో, ఈరోజు (ఏప్రిల్ 29) సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడే ఈ సర్వే ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇంతకీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఇవి ఏ మేరకు వాస్తవాలను ప్రతిబింబిస్తాయి?సర్వేల వెనుక..ఎగ్జిట్ పోల్స్ (పోస్ట్-పోల్ సర్వేలు) అంటే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత.. వారి నుంచి పోలింగ్ కేంద్రం బయట తీసుకునే అభిప్రాయ సేకరణ.. దీనికోసం సర్వే సంస్థలు వయసు, కులం, లింగం, గ్రామీణ-పట్టణ నేపథ్యం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతిలో ఓటర్లను ఎంపిక చేస్తాయి. ఓటర్లు ఎవరికి ఓటేశారు అనేది నిర్దిష్ట ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ డేటాను గణాంక నమూనాలతో విశ్లేషించి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఒక ప్రాథమిక అంచనాకు వస్తారు.చట్టం ఏం చెబుతోంది? జైలు శిక్ష తప్పదా?ఈ ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126ఏ ప్రకారం, పోలింగ్ జరిగే సమయంలో వీటిని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టరీత్యా నేరం. 2026 ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 9 ఉదయం 7 గంటల నుండి ఏప్రిల్ 29 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై కఠిన నిషేధం అమలులో ఉంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది.ఎగ్జిట్ పోల్స్ 100 శాతం పక్కానా?ఈ సర్వేలు ఎన్నికల సరళిని, ఓటర్ల నాడిని ముందుగానే పసిగట్టేందుకు ఒక అంచనా సాధనంగా ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎల్లప్పుడూ కచ్చితమైనవి కావు. గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, పలుమార్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు పూర్తి భిన్నంగా వచ్చాయి. శాంప్లింగ్ లోపాలు, ఓటర్లు తమ అసలు ఎంపికను చెప్పడానికి ఇష్టపడకపోవడం, చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయాలు మారడం వంటివి ఇందుకు కారణం. ఇవి కేవలం ముందస్తు అంచనాలు మాత్రమేనని, ఎన్నికల సంఘం ప్రకటించేవే అంతిమ, అధికారిక ఫలితాలని గ్రహించాలి.ఇది కూడా చదవండి: Kerala: ముస్లిం లీగ్ ‘మాస్టర్ ప్లాన్’.. అదిరిపోయే టార్గెట్? -
మలి యుద్ధం నేడే
కోల్‌కతా: దశాబ్దన్నరకాలంగా పశ్చిమబెంగాల్ రాజకీయాలను శాసిస్తూ అధికారపీఠంపై కూర్చున్న మమతా బెనర్జీని గద్దె దించే లక్ష్యంతో కమలనాథులు చేసిన విస్తృతప్రచారం, ప్రజాకర్షక పథకాలతో బెంగాళీలను మెప్పించానని చెబుతూ ప్రచారంచేసిన దీదీ మాటలు ఓట్లరూపంలో ఏమేరకు సఫలీకృతమవుతుందనేది నేటితో తేలిపోనుంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన తొలిదఫా పోలింగ్‌లో భారీ ఓటింగ్ నమోదుకావడంతో ఇది ప్రభుత్వవ్యతిరేక సరళి అని ఢంకా భజాయించిన బీజేపీ నేతలు అదేఊపుతో దక్షిణ ప్రాంత జిల్లాల్లోనూ విస్తృత ప్రచారంచేశారు.అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటలైన కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో బీజేపీ ఆధిపత్యం సాధించాల్సి ఉంది. నేడు పోలింగ్ జరగనున్న 142 స్థానాల్లో గతంలో టీఎంసీ హవా కొనసాగింది. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్ఎఫ్ గెలిచాయి. గత ఐదేళ్లుగా ఈ 142 స్థానాల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో బాగా వేళ్లూనుకుంది. అయినాసరే ఈసారి కూడా ఉత్తర 24 పరగణాలు(33 సీట్లు), దక్షిణ 24 పరగణాలు(31 సీట్లు), హౌరా(16), నదియా(17), హుగ్లీ(18), పూర్బా బర్ధమాన్(16), కోల్‌కతా(11 సీట్లు) ఈదఫా ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారాయి.నేడు జరగబోయే ఎన్నికల్లో మొత్తంగా 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులుకాగా 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తంగా 41,001 పోలింగ్స్టేషన్లలో పోలింగ్ జరగనుంది. 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన మథువా హిందూ శరణార్థులు, పౌరసత్వ సవరణ చట్టం, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటం వంటివి బీజేపీకి ఈదఫా సానుకూల అంశాలుగా కన్పిస్తున్నాయి. పదేళ్లు పాలించిన 2021లో మమతను మళ్లీ బెంగాళీలు గెలిపించడం తమ పార్టీకి ఇంకా అత్యంత ప్రజాదరణ ఉందని టీఎంసీ ప్రకటించింది. అదేఊపుతో నాలుగోసారి నెగ్గుకురాగలమనే ధీమా పార్టీలో ఎక్కువైంది. అయితే కట్ మనీ, బొగ్గు కుంభకోణం, పథకాల్లో అవినీతి, టీఎంసీ గూండాయిజం, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి ముస్లింల చొరబాట్లు, ఖాళీ ప్రాంతాల ఆక్రమణల అంశాలు ఈసారి టీఎంసీకి వ్యతిరేకతను పెంచేలా కన్పిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు కీలక జిల్లాల్లో చాలా ప్రచారసభల్లో పాల్గొని భారీ స్థాయిలో హామీల వర్షం కురిపించారు. మమతా బెనర్జీ సైతం టీఎంసీ తరఫున సుడిగాలి పర్యటనలు చేసి మరోమారు తన పార్టీని ఆశీర్వదించాలని ఓటరు మహాశయులను వేడుకున్నారు. ఎక్కడా అవాంఛనీయఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నడూలేనంతటి భారీ సంఖ్యలో కేంద్రరిజర్వ్ బలగాలను పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మోహరించింది.తొలి దశ ఎన్నికల్లో 93.19 శాతం పోలింగ్ నమోదవడంతో రెండోది, చివరిదైన ఈ దఫాలో ఎంతటి పోలింగ్ నమోదవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కంచుకోట భవానీపూర్ నుంచి మమతాబెనర్జీ పోటీపడుతున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ అగ్రనేత సువేంధు అధికారి నిలబడ్డారు. బెంగాళీలు, గుజరాతీలు, మార్వాడీలు, జైనులు, సిక్కులు, ముస్లింలు, బిహార్, జార్ఖండ్ శరణార్థులతో నిండిన భవానీపూర్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది. -
రీపోలింగ్‌పై ఈసీ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కీలక ప్రకటన చేసింది. మొదటి విడత పోలింగ్ ముగిసిన ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి రీపోలింగ్ నిర్వహించబోమని స్పష్టం చేసి, పలువురి ఊహాగానాలకు తెరదించింది. ఏప్రిల్ 23న (2026) జరిగిన పశ్చిమ బెంగాల్ (152 స్థానాలు), తమిళనాడు (234 స్థానాలు) ఎన్నికల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ఈసీ అధికారులు తేల్చి చెప్పారు.బెంగాల్‌లోని 44,376 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. మిగిలిన 142 స్థానాలకు బెంగాల్లో ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. తొలి విడత తరహాలోనే రెండో విడతను కూడా ప్రశాంతంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించాలని బీజేపీ నేత తపస్ రాయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఐదుగురు పోలీస్ అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది. డైమండ్ హార్బర్ అదనపు ఎస్పీ సందీప్ గరాయ్, ఎస్డీపీఓ సజల్ మండల్, ఇన్స్పెక్టర్ మౌసమ్ చక్రవర్తితో పాటు ఫాల్టా, ఉస్తి పోలీస్ స్టేషన్ల అధికారులైన అజయ్ బాగ్, శుభేచ్ఛా బాగ్లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరందరిపై కఠిన క్రమశిక్షణ చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.విజయంపై అంచనాలు..ఎన్నికల ఫలితాలపై అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు మిత్రపక్షాలు తీవ్ర ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో మొదటి విడత ఎన్నికల్లోనే టీఎంసీ ‘సెంచరీ (100+ స్థానాలు)’ కొట్టేసిందని, ఈ పరిణామంతో బీజేపీ శిబిరంలో వణుకు పుట్టిందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మరోవైపు, నార్త్ 24 పరగణాల జిల్లాలో టీఎంసీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి మమతా బెనర్జీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
పోటెత్తిన ఓటింగ్
కోల్‌కతా/చెన్నై: ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యానికి సంకేతంగా పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకే విడతలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గురువారం 152 స్థానాలకు జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 92.72 శాతం, మొత్తం 234 స్థానాలకు జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 85.14 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే ద్వారా అర్హత లేని లక్షలాది ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదవడం గమనార్హం. శుక్రవారం ఉదయం కల్లా తుది గణాంకాలు రావొచ్చు. బెంగాల్లో అక్కడక్కడా హింసాకాండ చోటుచేసుకోవడం మినహా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కనిష్ట స్థాయిలో హింస జరగడం బెంగాల్ ఎన్నిక చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి, దేశ పౌరులుగా తమ విధిని నిర్వర్తించడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటువేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల ఎదుట రద్దీ తగ్గలేదు. వరుసలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక ఓటింగ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 9న జరిగిన అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 85.38 శాతం, పుదుచ్చేరిలో 89.83 శాతం నమోదయ్యింది. బెంగాల్, తమిళనాడులో ఇప్పటిదాకా 2011 నాటి ఎన్నికల ఓటింగే అత్యధికం. అప్పట్లో బెంగాల్లో 84.72 శాతం, తమిళనాడులో 78.29 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ రికార్డును ఈసారి ఓటర్లు తిరగరాశారు. రెండు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. తమిళనాడులో పురుషులు 83.57 శాతం మంది ఓటువేయగా, మహిళలు 85.76 శాతం మంది ఓటువేశారు. బెంగాల్లో పురుషులు 90.92 శాతం, మహిళలు 92.69 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన రెండు రాష్ట్రాల ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ఓటర్లలో 91.78 శాతం మంది ఓటు వేశారు.పశ్చిమ బెంగాల్లో స్వల్ప హింస బెంగాల్లో తొలి విడత ఎన్నికల సందర్భంగా హింసాకాండ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. హింసాత్మక ఘటనలు ఓటర్ల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. 2021లో 82.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, గురువారం 92 శాతం దాటేసింది. బెంగాల్ ప్రజలు తమ హక్కులను కోల్పోకుండా ఉండేందుకే అధిక సంఖ్యలో ఓటు వేశారని టీఎంసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే పౌరులుగా తమ హక్కులను, పౌరసత్వాన్ని కోల్పోతామని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, అందుకే ఆ ప్రమాదం తలెత్తకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీర్భూమ్లోని ఖరిసోల్లో ఈవీఎంలలో టీఎంసీకి వేసిన ఓట్లను బీజేపీకి అనుకూలంగా నమోదు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో అధికారులు పోలింగ్‌ను తాత్కాలిక నిలిపివేశారు. స్థానికులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రాళ్లతో దాడికి దిగారు. పారామిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దక్షిణ దినాజ్‌పూర్‌లోని కుమార్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై దాడి జరిగిందని, అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలోని రహమత్ నగర్ సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే అగి్నమిత్ర పాల్ కారుపై రాళ్లతో దాడి చేసి వెనుక కిటికీని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. నవోడాలో ఏజేయూపీ నాయకుడు హుమాయున్ కబీర్ కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు. దీంతో అతడి మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణచోటుచేసుకుంది. లాభ్పూర్, చంచల్. మురారైలలో హింసాత్మక, బెదిరింపు ఘటనలు జరిగాయి. వేర్వేరు పారీ్టల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. డోమ్‌కల్‌లో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకోకుండా కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వందలాది ఫిర్యాదులు అందినట్లు తెలియజేసింది. జిల్లాల వారీగా చూస్తే ముర్షిదాబాద్, బంకూర, కూచ్ బెహార్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా కలింపాంగ్‌లో 81 శాతం నమోదయ్యింది. బెంగాల్ ఎన్నికలు అంటేనే హింసాకాండకు మారుపేరుగా చెబుతుంటారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో అంతా ప్రశాంతం అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే, కొత్తగా రంగప్రవేశం దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో 85.14 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే–బీజేపీ కూటమిని లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తీవ్రంగా పోరాడిన డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హోరాహోరీగా పోరాడింది. విజయ్ పార్టీ తమిళగ వేట్రి కళగం(టీవీకే), తమిళ జాతీయవాది సీమాన్‌కు చెందిన నాన్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఎన్నికల రంగంలో గట్టి పోటీదారులుగా నిలిచాయి. డీఎంకే–కాంగ్రెస్, అన్నాడీఎంకే–బీజేపీ కూటములు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. అత్యధికంగా కరూర్ స్థానంలో 91.86 శాతం, అత్యల్పంగా కన్యాకుమారిలో 75.50 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. చెదురు ముదురు ఘటనల మినహా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా, తక్షణం మరమ్మతులు చేసి ఓటింగ్‌ను కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. చెన్నైలోని మైలాపూర్‌లో ఓటర్లకు డీఎంకే డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ ముఖ్యనేతలు అన్నామలై, వనతి శ్రీనివాసన్ ఆరోపించారు. అధికార డీఎంకే పార్టీ ఉదయించే సూర్యుడి చిహ్నాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తమ కుటుంబంతో సహా చెన్నైలో ఓటు వేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సేలం సిలువం పాళయం నెడుంకుళం పంచాయతీ పరిధిలోని యూనియన్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌లో కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత విజయ్ చెన్నై నీలాంకరై పోలింగ్ బూత్‌లో గట్టి భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, తమిళ సినీ నటులు రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, జ్యోతిక దంపతులు, కార్తీ, అర్జున్, విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, విశాల్, మణిరత్నం, సంగీత దర్శకుడు అనిరుద్, నటీమణులు త్రిష, కీర్తి సురేష్, రాధిక, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ ఓటింగ్ మాకే అనుకూలం: అన్నాడీఎంకే తమిళనాడులో 2021లో 73.63 శాతం ఓటింగ్ నమోదు కాగా, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధించింది. 2011లో 78.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచింది. ఈసారి 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడాన్ని తమకు సానుకూలాంశంగా అన్నాడీఎంకే–బీజేపీ కూటమి నాయకులు భావిస్తున్నారు. తమిళనాట ఎస్ఆఐర్ ద్వారా ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్‌లో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 5.73 కోట్లకు తగ్గింది. 2021 ఎన్నికల సమయంలో 6.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 56 లక్షల మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. తమిళనాట ఓటింగ్ సరళి తమిళనాడులో 1957లో అత్యల్పంగా 47 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత 1960వ దశకం నుంచి నేటి వరకు సగటు ఓటింగ్ శాతం 70కి దరిదాపుల్లోనే ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులు చెదిరిపోయాయి.👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓటర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లొద్దు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ అత్యవసరంగా ఓ లేఖ రాశారు. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూనే.. పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.ఎలక్షన్ టైంలో తమిళనాడులో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటేయాలనుకుంటున్నవాళ్లు బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు పట్టణ, నగరాల్లోనూ బస్టాండులలో పడిగాపులు పడుతున్నారు. కొయంబత్తూరులో జనం ఏకంగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఈ పరిస్థితులన్నింటినీ విజయ్ తన లేఖలో ప్రస్తావించారు. ‘‘ఓటు వేసేందుకు తమిళనాడు ఓటర్లు పోటెత్తుతున్నారు. గంట గంటకు పెరుగుతున్న ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం. అయితే.. పూర్తిస్థాయిలో ఓటు వేయకుండా అడ్డుకునే కుట్ర కనిపిస్తోంది. సరిపడా బస్సులు లేక ఓటర్లు అవస్థలు పడుతున్నారు. చెన్నైలోని ప్రధాన టెర్మినల్స్ అని ప్రజలతో నిండిపోయాయి. పోలింగ్ బూత్‌లకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారు. వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి. ఓటు వేయాలన్న ఓటర్ల ఉత్సామంపై నీళ్లు చల్లొద్దు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలింగ్‌ను మరో రెండు గంటలు పొడిగించండి’’ అని ఈసీని లేఖలో కోరారాయన. pic.twitter.com/Y7Q3Gn1mKY— TVK Party HQ (@TVKPartyHQ) April 23, 2026తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6గం.తో పోలింగ్ ముగియనుంది. అప్పటిదాకా క్యూ లైన్లో ఉన్న వాళ్లను మాత్రమే ఓటింగ్‌కు అనుమతించనున్నారు. అయితే బస్సుల కొరత కారణంగా విజయ్ ఆ సమయాన్ని 8గం. దాకా పొడిగించాలని ఈసీని కోరుతున్నారు.తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు విజయ్. మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇదీ చదవండి: విజయ్.. ఆ సింప్లిసిటీ ఏమైంది? -
అల్లరిమూకలపై డేగ కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్లో తొలి దశ పోలింగ్ సందర్భంగా సమస్యలు సృష్టించే వారు, అల్లరి మూకలను కట్టడి చేయడంపై ఈసీ దృష్టిపెట్టింది. ఇలాంటి వారితో కూడిన వెయ్యిమంది జాబితాను సిద్ధం చేసింది. ఇందులో 9మంది వరకు తృణమూల్ ఎమ్మెల్యేలున్నారు. పలువురు అభ్యర్థులు, కౌన్సిలర్లు ఉన్నారు. వీరిపై పోలీసు నిఘా పెరిగింది. ఈ జాబితాపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. తమ నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ ప్రయత్నమని ఆరోపించింది. దీనిపై టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. నిర్దిష్ట ఆధారాలు లేకుండా రాజకీయ నాయకులను సమస్యాత్మక వ్యక్తులుగా గుర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన సమయంలో ఈ జాబితా వెలుగులోకి రావడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. -
బెంగాల్లో నేడు తొలి దశ పోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఉత్తర బెంగాల్‌లోని 8 జిల్లాలతోపాటు ముర్షిదాబాద్, హుగ్లీ, నడియా, బిర్భూమ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 54 సీట్లు బీజేపీకి కీలకంగా మారాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్‌లో 3.60 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 167 మంది మహిళలు సహా మొత్తం 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 8 వేలకు పైగా పోలింగ్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈసీ రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల బలగాలను మోహరించింది. వీరితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. ప్రభావం చూపే కీలకాంశాలివే.. అవినీతి, నిరుద్యోగం వంటి కీలక అంశాల కంటే ఈసారి సామాజిక గుర్తింపు, పౌరసత్వం, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలకే ప్రాధాన్యం పెరిగిన విభిన్న పరిస్థితులు నెలకొన్న వేళ ఈ జిల్లాల్లో సాధించే ఆధిక్యాన్ని బట్టే బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఉత్తర బెంగాల్లో సాధించిన ఫలితాలే కీలకంగా మారాయి. ఇదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో ఈ ప్రాంతంలో ఉన్న 152 సీట్లకుగాను బీజేపీ 59 చోట్ల విజయం సాధించగా, అధికార టీఎంసీ 93 సీట్లు దక్కించుకుంది. ఉత్తరబెంగాల్‌లో బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడం అధికార పక్షానికి కూడా చాలా కీలకం. ఎందుకంటే, ఇది రెండో దశతోపాటు రాష్ట్రంలో మొత్తం రాజకీయ వాతావరణంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రాంతాలేవైనా సర్ ఒక్కటే.. ఉత్తర బెంగాల్లో తేయాకు తోటలున్న జల్పాయ్గురి అలీపూర్‌దువార్, కొండప్రాంతాలైన డార్జిలింగ్, కాలింపాంగ్, రాజ్బన్షీలున్న కూచ్ బెహార్ ఉన్నాయి. సరిహద్దుల్లోని మల్దా, ఉత్తర దినాజ్‌పూర్, మైనారిటీల ప్రాబల్యమున్న ముర్షిదాబాద్, నడియాలున్నాయి. ఎన్ని తేడాలున్నప్పటికీ, ప్రతి జిల్లాలోనూ ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనున్న ఏకైక అంశం ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో సర్ కారణంగా 91 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఇవి సుమారు 12 శాతం. ఒక్క ముర్షిదాబాద్ జిల్లాలోనే 7.48 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. తర్వాత, నడియాలో 4.85 లక్షలు, మాల్దాలో 4.59 లక్షలు, ఉత్తర్ దినాజ్పూర్లో 3.63 లక్షలు, కూచ్ బెహార్లో 2.42లక్షలకు పైగా ఓట్లను పక్కనబెట్టారు. దీంతో, ఎన్నికల్లో ప్రచారాంశాలే ఏకంగా మారిపోయాయి. అవినీతి, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు అప్రాధాన్యాంశాలు కాగా, పౌరసత్వం, చొరబాట్లు, బోగస్ ఓట్లు, తొలగింపునకు గురైన ఓటర్లు, విదేశీయులు వంటివాటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. చొరబాట్లు, పౌరసత్వం అంశాలకు సర్‌ను రెఫరెండంగా బీజేపీ అభివర్ణించగా, నిజమైన ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు, పేదల పేర్లను తొలగించారంటూ టీఎంసీ ప్రచారం చేసుకుంది. బరిలో పలువురు ప్రముఖులు మొదటి దశ బరిలో పలువురు ప్రముఖ నేతలున్నారు. ముఖ్యంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఒకరు. 2021 ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఆయన ఇక్కడ ఓడించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ఈయన చుట్టూతా నడుస్తున్నాయి. ఈసారి ఇక్కడ సువేందుకు నమ్మినబంటుగా ఉన్న పబిత్రా కర్ టీఎంసీ తరఫున బరిలో ఉన్నారు. అదేవిధంగా, బహరంపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే సుబ్రతా మైత్రా పోటీ పడుతున్నారు. మాతాభంగలో కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీ చేస్తున్నారు. ఖరగ్‌పూర్ సదర్‌లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ తలపడుతున్నారు.నన్ను భయపెట్టాలని చూస్తున్నారు: మమతఆమ్డాంగా(పశ్చిమ బెంగాల్): పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ సంఖ్యలో శాంతి భద్రతల కోసమంటూ సాయుధ బలగాలను మోహరించడంతోపాటు సీఆర్పీఎఫ్ వాహనాలను రంగంలోకి దించడంపై సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షలాదిగా బలగాలను తరలించి కేంద్రం తనను భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. సీఎం మమత బుధవారం ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్లతోపాట రైల్వే బలగాలను కూడా కేంద్రం ఇక్కడ ఎన్నికల కోసం తీసుకువచి్చంది ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ మాత్రమే, ఎవరినీ చంపడానికి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కోసం బెంగాల్‌కు మునుపెన్నడూ లేని విధంగా సుమారు రెండు లక్షల కేంద్ర బలగాలను తీసుకువచ్చారు. ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?’అంటూ కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. -
నేడే తమిళనాడు సమరం
సాక్షి, చెన్నై: వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్... ఐదేళ్ల క్రితం దూరమైన అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి... తొలి పోటీలోనే సత్తా చాటాలని సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తహతహలాడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమయ్యింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో జరిగే ఓటింగ్‌లో 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల తలరాతలను నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే పోటీ నెలకొన్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) గణనీయమైన ప్రభావం చూపడం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పార్టీ ఏ కూటమి ఓట్లను చీలుస్తుంది? లాభపడేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల సర్వేలు స్టాలిన్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేయడం గమనార్హం. డీఎంకే–కాంగ్రెస్ కూటమి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెల్చుకోనున్నట్లు సర్వేలు తెలిపాయి. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు సాధిస్తుందని వెల్లడించాయి. విజయ్ పార్టీ టీవీకే 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. యువ ఓటర్లకు గాలం ఎన్నికల్లో ప్రధాన పార్టీలు యువత ఓట్లపై గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చాయి. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు రప్పిస్తామని పేర్కొన్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. యువత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడించాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇవ్వడం విశేషం. దళపతి విజయ్ యువ ఓటర్లనే నమ్ముకున్నారు. ఆయన సభలకు యువత పోటెత్తారు. విజయ్ అభిమానుల్లో యువత, మహిళలు అధికంగా ఉండడం ఆయనకు అనుకూలాంశంగా మారింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 చొప్పున అందజేస్తామని విజయ్ హామీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పలు పథకాలు ప్రకటించారు. యువతకు చేరువకావడానికి పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. తొలిసారి ఓటర్లు 14.59 లక్షల మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా అధికారులు నిఘా ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పటా్నయక్ తెలిపారు. 14.59 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం 1,06,418 బ్యాలెట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఓటింగ్‌లో జాప్యం జరగకుండా అదనపు యంత్రాలను సమకూర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 249 మోడల్ పోలింగ్ స్టేషన్లు, పూర్తిగా మహిళలే నిర్వహించే 325 పింక్ స్టేషన్లు, దివ్యాంగులు నిర్వహించే 71 పోలింగ్ స్టేషన్లు, యువత నిర్వహించే 29 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంచేశారు. 83,875 మంది స్థానిక పోలీసులతోపాటు 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలను చాలావరకు అరికట్టామని, ఇప్పటిదాకా స్వా«దీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.1,262 కోట్లకు చేరిందని, అందులో నగదు, ఇతర సామగ్రి విలువ రూ.543 కోట్లు అని అర్చనాపట్నాయక్ తెలియజేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. విదేశాల నుంచి రాక తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్వరాష్ట్రానికి తరలివచ్చారు. గత రెండు రోజుల్లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాలకు పది వేల మందికి పైగా తరలిరావడం విశేషం. ఓటింగ్ ప్రక్రియను స్వయంగా తిలకించడానికి కొందరు విదేశీయులు సైతం వచ్చారు. -
ఏఐసీసీ చీఫ్‌పై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నిన్న ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ చర్చలకు ఉపక్రమించింది. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
తమిళనాట హోరాహోరీ
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజులపాటు హోరాహోరీగా కొనసాగిన ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు గడువు ముగిసే చిట్టచివరి క్షణం వరకు నేతలు రోడ్ షోల ద్వారా పోటాపోటీగా ప్రచారం సాగించారు. అసెంబ్లీలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. అర్హులైన 5.73 కోట్ల మంది ఓటర్లు బరిలో ఉన్న 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్(ఈసీ) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.రాష్ట్రంలో అధికార డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్(ఎస్పీఏ)కి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకి ప్రధాన పోటీ నెలకొంది. ఎస్పీఏలో డీఎంకే, కాంగ్రెస్‌లతోపాటు వామపక్షాలు, వీసీకే, ఎంఎంకే తదితర పారీ్టలున్నాయి. ఎడపాడి పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే, బీజేపీ తదితర పార్టీలతో జట్టుకట్టింది. సినీ నటుడు విజయ్‌కి చెందిన టీవీకే, ఒకప్పటి సినీ దర్శకుడు సీమాన్‌కు చెందిన నామ్ తమిళార్ కట్చి మొత్తం 234 సీట్లలో బరిలో నిలిచాయి. దీంతో, ప్రధానంగా బహుముఖ పోటీ నెలకొంది. మహామహుల ప్రచారం.. ఎన్నికల ప్రచారంలో డీఎంకే కూటమి తరఫున సీఎం ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అన్నాడీఎంకే కూటమి తరఫున పళనిస్వామితోపాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. డీఎంకేకు మద్దతు తెలిపిన సినీ నటుడు కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ ఈ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. చివరి రోజైన మంగళవారం సొంత కొళత్తూరు నియోజకవర్గంలో రోడ్ షో ద్వారా సీఎం స్టాలిన్ ప్రచారం ముగించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చెన్నైలో రోడ్‌షో నిర్వహించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ చెన్నై నందనంలో జరిగిన సభతో ప్రచారం ముగించారు. ఎండల వేడిని మరిపించిన ప్రచారం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేసవి ఎండలను మించిన వేడెక్కించింది. ప్రధాన వైరిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. డీఎంకేకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జతయ్యారు. అన్నాడీఎంకే కేవలం ముసుగు మాత్రమే దీని వెనుక కథ నడిపించేదంతా బీజేపీయే నంటూ వ్యాఖ్యానించారు. ఎన్డీయేకి అధికారమిస్తే మోదీ ఆడించినట్లుగా ఆడే కీలు బోమ్మ సీఎం రాష్ట్రానికి వస్తారని విమర్శించారు. అన్నాడీఎంకేను ఢిల్లీ నుంచి బీజేపీ కంట్రోల్ చేస్తుందని, ఇక్కడి పోరును తమిళనాడు వర్సెస్ ఎన్డీఏ–ఢిల్లీ పోరుగా సీఎం స్టాలిన్ అభివర్ణించారు.తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే తమిళనాడు సూపర్‌స్టార్ అయ్యిందని చెప్పుకొచ్చారు. దేశంలో నంబర్ వన్ రాష్ట్రం కానుందని, దక్షిణాసియాలోనే ఆదర్శం అవుతుందని చెప్పారు. ఈ విమర్శలకు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి దీటుగా బదులిచ్చారు. తమ పార్టీని ముక్కలు చేసేందుకు డీఎంకే కుట్ర పన్నగా తాము వాటిని సాగనివ్వలేదని తెలిపారు.


