కన్నడ నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah).. హిందీలో సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్‌లో స్థిరపడిపోయాడు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన 21 ఏళ్ల తర్వాత తన మాతృభాషలో సినిమా చేసే ఛాన్స్ వరించింది. అదే కాంతార: చాప్టర్ 1 (Kantara: A Legend Chapter-1 Movie). ఈ మూవీలో విలన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న గుల్షన్ ప్రస్తుతం 'థెరపీ షెరపీ' అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇందులో మరాఠి నటి గిరిజ ఓక్ నటిస్తోంది.
ముందే చెప్తారు
తాజాగా ఆమె సిరీస్ షూటింగ్‌లో ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. గిరిజ (Girija Oak Godbole) మాట్లాడుతూ.. సిరీస్ అయినా, సినిమా అయినా కొన్ని అభ్యంతరకర ససన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు కొందరు సెట్‌లోనే ఉంటారు. నటీనటులు ఇబ్బందిపడకుండా వాళ్లు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సీన్ ఎలా ఉండబోతుంది? ఏం చేయాలి? అనేది వాళ్లు క్లియర్‌గా వివరిస్తారు.
ఏ ఇబ్బందీ రానివ్వలేదు
అయినప్పటికీ కొన్నిసార్లు సడన్‌గా డైలమాలో పడుతుంటాం. అయితే కొందరు నటులతో పనిచేసినప్పుడు అసౌకర్యం అనేదే ఉండదు. అలాంటివారిలో గుల్షన్ ఒకరు. మేము దుస్తులు ధరించే ఉన్నాం, అక్కడ చెడుగా ఏమీ లేదు. అప్పటికీ అతడు మీకు ఓకే కదా? ఇబ్బందేం లేదుగా అని 16-17 సార్లు అడిగాడు. ఆయన చూపించిన గౌరవం, కేరింగ్ నాకెంతో నచ్చింది. తనవల్లే ఎటువంటి ఇబ్బంది లేకుండా సీన్ పూర్తి చేశాం అని గిరిజ ఓక్ చెప్పుకొచ్చింది.
చదవండి: తనవల్లే తెలిసొచ్చింది.. నేను పూర్తిగా మారిపోయా: శర్వానంద్


