హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. ఈ చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. ఈ సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్‌జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్‌కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది.


