breaking news
Madham Movie
-
బిగ్‌బాస్ ఇనయా సుల్తానా థ్రిల్లర్ మూవీ.. సెన్సార్ పూర్తి..!
హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. ఈ చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. ఈ సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్‌కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది. -
‘మదం’ లాంటి సినిమా చూడాలంటే గుండె ధైర్యం కావాలి
‘‘మదం’ సినిమాకు కథే హీరో. ఇందులో భావోద్వేగాలు బాగుంటాయి. మా రమేష్‌గారి కథ, వంశీగారి మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని హర్ష గంగవరపు తెలిపారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మదం’(Madham Movie). ఏకైవ హోమ్స్ బ్యానర్‌పై సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన బాబు), రమేష్ బాబు కోయ నిర్మించిన ఈ సినిమా మార్చి 14న రిలీజ్ అవుతోంది. ‘తండేల్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ‘మదం’ మూవీ టీజర్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో వంశీ కృష్ణ మల్లా మాట్లాడుతూ– ‘‘మదం’ వంటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’’ అన్నారు. రైటర్ రమేష్ బాబు కోయ మాట్లాడుతూ.. ‘నా కథను ఇంత అద్భుతంగా తీసిన వంశీకృష్ణకు థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీజర్‌ను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు.ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. ‘నాకు నెగెటివ్ పాత్రలు చేయడమంటే ఇష్టం. మదం చిత్రంలో నేను చాలా ఇంపార్టెంట్ కారెక్టర్‌ను చేశాను. మా డైరెక్టర్ వంశీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. నా క్లిష్ట పరిస్థితుల్లో వంశీ గారు సపోర్ట్‌గా నిలిచారు. నేను బాగా నటించడానికి ఆయనే కారణం. లత నాకు మంచి స్నేహితురాలు. హర్ష చాలా రియలిస్టిక్‌గా నటించాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. మార్చి 14న సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.


