కొన్ని కథలను వెండితెరపై చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతారు. ఒక్కోసారి అలాంటి జీవితాలే మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇదే కోవలో నటి, బిగ్‌బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా లైఫ్ ఉంది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్‌బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఆ తర్వాత ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, తనతో బ్రేకప్ అయిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ క్రమంలో ప్రియుడు చేసిన మోసాన్ని బయటపెట్టింది.
సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి సింగిల్‌గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఇనయా.. గౌతమ్ కొప్పిశెట్టి అనే యువకుడితో ప్రేమలో పడింది. అతను యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని సమాచారం. తనతో కొద్దిరోజులు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పినట్లు పేర్కొంది. అయితే, తనను ప్రియుడు మోసం చేశాడని ఆమె పేర్కొన్నారు.

ఫిజికల్‌గా కూడా కలిశాం..
'స్నేహంతో మొదలైన మా పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం పాటు నాతో బాగానే ఉన్నాడు. మా ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు.. అందుకే సోషల్‌మీడియా ద్వారా అందరికీ తనను పరిచయం చేశాను. నాకు ఎవరూ లేరనుకున్న సమయంలో అతను పరిచయం అయ్యాడు. ఆపై ప్రేమలో పడ్డాం. కానీ, అతను కేవలం నా మనీ, పేరును మాత్రమే ఉపయోగించుకోవాలనుకున్నాడు. తనతోనే జీవితం అనకున్నాను కాబట్టి ఫిజికల్‌గా కూడా కలిశాం. అతని కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. తను వ్యాపారం చేస్తానంటే భారీగా డబ్బు సాయం చేశాను. చివరకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గొల్డ్ గాజులు కూడా తనకోసం అమ్మేశాను. దేవుడా.. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు (కన్నీళ్లు)..
ఇప్పటికే ఎన్నో లక్షల రూపాయాలు ఇచ్చాను. నా బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యాక వదిలేశాడు. ప్రస్తుతం రూ. 5 లక్షలకు పైగానే అప్పులో ఉన్నాను. ఎలాంటి పనిచేయకుండా ఇంట్లోనే ఉంటాడు. నేను షూటింగ్ వెళ్తున్నా సరే ఒకటే గొడవలు. నాపై అనుమానం పెంచుకున్నాడు. ప్రతిరోజు నరకంగా నా జీవితం మారింది. కేవలం మనీ కోసం మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు. నేను ఏం చేసినా సరే తప్పుగానే చూస్తాడు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా ఉండాలి అనిపించింది. విడిపోయాక రెండు నెలలు చాలా బాధపడ్డాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది.

మదం సినిమాలో అతనితోనే ఇంటిమేట్ సీన్.. ఆరోజే చచ్చిపోయాను
మదం సినిమాలో ఇనయా కీలకమైన పాత్రలో నటించింది. జనవరి 1న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులోఆమె చాలా బోల్డ్‌గా కనిపించనుంది. అయితే, ఇదే మూవీలో తనను మోసం చేసిన ప్రియుడు కూడా నటించాడని ఆమె తెలిపింది. తనతో బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇంటిమేట్ సీన్‌లో ఇద్దరం కలిసి నటించామని ఆమె ఇలా చెప్పింది. మదం సినిమాలో మూడు ఇంటిమేట్ సీన్లు నాతోనే ఉన్నాయి. ఒక సీన్‌లో నా పర్సనే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని మొదట ఓకే చెప్పాను. తర్వాత మేము బ్రేకప్ అయ్యాం. అయితే, సినిమా కోసం అతనితోనే ఇంటిమేట్ సీన్‌లో నటించాను. ఆరోజు ఒక మనిషిగా చచ్చపోయాను. ఆరోజు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు బతుకుతున్నానా అనే ప్రశ్న కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. అని ఇనయా చెప్పింది.


