మనశంకర వరప్రసాద్‌గారు సీరియల్ బ్యూటీ.. ఫుల్ ట్రెండింగ్‌లో నటి..! | Megastar ManaShankara VaraPrasad Garu Movie Serial Actress Fame Viral | Sakshi
Sakshi News home page

ManaShankara VaraPrasad Garu Movie: సినిమాలో సీరియల్ బ్యూటీ.. ఇంతలా ట‍్రెండ్‌ అవుతోంది..!

Feb 13 2026 7:53 PM | Updated on Feb 13 2026 10:07 PM

Megastar ManaShankara VaraPrasad Garu Movie Serial Actress Fame Viral

మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

అయితే ఈ చిత్రంలో కనిపించిన అన్ని పాత్రలకు ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు ఓ సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్‌గా సౌమ్య పాత్రలో మెప్పించింది. మన శంకర వర ప్రసాద్ కారెక్టర్‌లో చిరంజీవి ఆ సీరియల్ గురించి.. ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్‌‌లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆ నటి కోసం తెగ వెతికేస్తున్నారట.

ఈ మూవీలోని సీరియల్‌లో సౌమ్య పాత్రలో నటించిన ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేస్తోంది. ఆ తరువాత యూట్యూబ్‌లో సిరీస్‌లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది.

రీసెంట్‌గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement