వరుస ఫ్లాఫ్స్.. మాస్ మహారాజా రిస్క్ తీసుకుంటున్నారా? | tollywood Hero Ravi teja key decision after Movie Flops in a row | Sakshi
Sakshi News home page

Ravi Teja: వరుస ఫ్లాఫ్స్.. ఆ విషయంలో రిస్క్ చేస్తున్నారా?

Feb 13 2026 4:09 PM | Updated on Feb 13 2026 4:16 PM

tollywood Hero Ravi teja key decision after Movie Flops in a row

టాలీవుడ్‌లో మాస్‌ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మాస్ హీరో సక్సెస్ అందుకోలేకపోయారు. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చిన రవితేజకు కొత్త ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. సూపర్ హిట్ కాకపోవడం మాస్ మహారాజా ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు.

రవితేజ కీలక నిర్ణయం..

సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తగ్గించడం కోసం రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పారితోషికం తగ్గించుకుని మూవీకి వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పుడిదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఉంటోంది. దీంతో మూవీ బడ్జెట్‌ రూ.40 నుంచి 50 కోట్లను దాటిపోతోంది. అదే నిర్మాతలకు భారంగా మారింది. అందువల్లే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రిస్క్‌లో షేర్..

మరోవైపు ఓటీటీ రైట్స్ విలువ తగ్గడంతో నిర్మాతలు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇలా నిర్మాతలతో కలిసి రిస్క్ షేర్ చేసుకునే విధానం వైపే రవితేజ ‍అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో నాని, సాయి ధరమ్ తేజ్,  నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.  ఒకవేళ ఇది నిజమైతే ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే. 

రవితేజ కొత్త సినిమా..

రవితేజ- శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ ఇరుముడి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది.  జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్‌.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement