అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్ | Allu Sirish Wedding And Haldi Celebrations | Sakshi
Sakshi News home page

Allu Sirish Haldi: అల్లువారి ఇంట్లో పెళ్లి వేడుక.. ఇంట్లోనే సంప్రదాయబద్దంగా

Feb 13 2026 11:27 AM | Updated on Feb 13 2026 11:37 AM

Allu Sirish Wedding And Haldi Celebrations

అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నయనికతో మూడు ముళ్లు వేయనున్నాడు. గత నెలలో దుబాయిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకోగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ ఇంట్లో పసుపు దంచుడు కార్యక్రమం గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

సాధారణంగా హల్దీ పేరుతో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాటికి నో చెప్పిన శిరీష్.. ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం చేసుకున్నాడు. ఈ వేడుకలో బన్నీ సతీమణి స్నేహ, పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, మిగతా బంధువులు, పిల్లలు కనిపించారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement