Haldi Ceremony
-
రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)
-
'నా జుట్టు రంగు ఇంకా మారలేదు'.. హల్దీ వేడుకపై రష్మిక పోస్ట్
రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న ఈ వివాహా వేడుకలో అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యారు. వీరిద్దరి వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పెళ్లి తర్వాత అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.పెళ్లి తర్వాత రష్మిక తాజాగా మరో పోస్ట్ చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. హల్దీ ప్లస్ హోలీ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో మేము ఎంతగా తడిసిపోయామో.. ఇప్పటికీ నా జుట్టు రంగు ఇంకా ఎర్రటి రంగులోనే ఉందన్నారు. ఇంతటి మధురమైన క్షణాల వేళ.. నా బ్రైడ్ టీమ్‌తో కలిసి ఆ రోజు అన్ని ఆటలను గెలిచానంటూ సంతోషం వ్యక్తం చేసింది. అయితే విజ్జూ కూడా ఆ రోజు టీమ్ బ్రైడ్ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. రష్మిక షేర్ చేసిన హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఆనందాల ఊయల్లో..
తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను నేటి తరం ఆనందాల ఊ‘యలో’్ల విహరిస్తూ గుర్తుండిపోయేలా జరుపుకోంటోంది. వివాహ తంతులో మంగళస్నానాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దానికి ఆధునిక హంగులు అద్దుతూ కొత్తగా హల్దీ ఫంక్షన్ వచ్చి చేరింది. దీన్నే పసుపు వేడుక అని కూడా పిలుస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకూ ఈ ట్రెండ్‌ను అనుకరిస్తున్నారు. ఉత్తరాదిన జరిగే ఈ వేడుక ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఇంట వివాహానికి ముందుగా తప్పనిసరిగా మారింది. కొత్త పుంతలు పెళ్లికి ఒక్కరోజు ముందు వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే 2018 చివరి నుంచి ఇది కొత్త పుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్‌గా మారి పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం హల్దీ వేడుకలు ఎప్పుడూ గుర్తుండి పోయేలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్లో వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనితో పాటూ సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లను ఒక వీడియోలా చేసి, వివాహం రోజున ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక సెట్టింగ్‌లు హల్దీ వేడుకల కోసం ప్రత్యేక సెట్టింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఓ మాదిరిగా వివాహం చేసుకునే వారు సైతం హల్దీ సెట్టింగ్‌కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనిలో పెళ్లి కుమార్తె కూర్చోవడానికి తామరపువ్వు, పెళ్లి కుమారుడికి బాహుబలి, తోఫా సెట్టింగ్‌లు వేస్తున్నారు. గులాబీ, మల్లె, చామంతి వంటి రకరకాల పూలతో వాటిని అలంకరిస్తున్నారు. మంగళ స్నానాలకు ప్రత్యేకంగా గంగాళాలు, జల్లెడ, రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతున్నారు. వధూవరులకు పసుపు రాసిన అనంతరం గంగాళంలో పూలతో ఉన్న పసుపు నీటిని జల్లెడ ద్వారా పోసి చిరుజల్లులతో మంగళస్నానం చేయించడం, దాన్ని వీడియో, ఫొటోల్లో బంధించడం ఫ్యాషన్‌గా మారింది.డ్రెస్ కోడ్ హల్దీ ఫంక్షన్లలో అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్‌తో పాల్గొంటున్నారు. పురుషులు ఎక్కువగా పసుపు రంగు లాల్చీ, తెల్ల ప్యాంట్, మహిళలు పసుపు రంగు చీరలు ధరిస్తారు. ఇంకొందరు మెరూన్, బ్లూ, ఆరెంజ్ తదితర రంగుల దుస్తులు వినియోగిస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి ఎవరి ఇళ్లలో వేర్వేరుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పసుపు నీటితో మంగళస్నానం చేయిస్తున్నారు. హల్దీ ఫంక్షన్లో ఫొటో, వీడియో షూట్ క్రేజీగా మారింది. ఈ ఈవెంట్‌ను జీవితాంతం గుర్తుండేలా ఫొటో, వీడియో గ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. వీటికి పెద్ద మొత్తంలో చార్జి చేస్తున్నారు. చెప్పలేని ఆనందంఇటీవలే నా వివాహం జరిగింది. హల్దీ ఫంక్షన్లో బంధువులు, స్నేహితులందరూ ఒకే రంగు దుస్తులు ధరించి పాల్గొనడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ వేడుక నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతినిచ్చింది. – కె.సాయికుమార్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కాకినాడ ఉత్సాహాన్నిస్తాయికొన్ని సంవత్సరాలుగా వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్ ప్రత్యేకంగా మారింది. దీంతో వేడుకల్లో ఫొటో, వీడియోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు 50 వరకు హల్దీ ఈవెంట్లకు ఫొటో, వీడియో గ్రఫీ చేశా. ఈ వేడుకల షూట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.– కారంపూడి సత్తిబాబు, ఫొటోగ్రాఫర్, రాయవరం ప్రత్యేక ఆకర్షణపెళ్లి వేడుకల్లో హల్దీ ఫంక్షన్ సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఈ సెట్టింగ్‌లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, పట్టణాల్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూలు చేస్తున్నారు. – కె.సతీష్, ఎన్‌కేఎస్ ఈవెంట్ మేనేజర్,రాజమహేంద్రవరం -
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
-
#Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ రష్మిక పెళ్లికి అంతా సిద్ధం. ఈరోజు(ఫిబ్రవరి 26) ఉదయం 10:10 గంటలకు విజయ్ మూడు మూళ్లు వేయనున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో మెమొంటోస్ హోటల్.. ఈ వివాహానికి వేదిక. ఇప్పటికే బారాత్ మొదలైపోయింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. సాయంత్రం 4 గంటల తర్వాత (కొడవ) కన్నడ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు జరగనుంది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)ఇకపోతే బుధవారం సాయంత్రం హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా.. వేడుకకు వచ్చిన అతిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వెళ్లింది. హల్దీకి సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది హల్దీ కాదని ముందే హోలీ వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇదే పెళ్లి కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో చూస్తే.. ఈమె కూడా హల్దీ వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది.ఇదే పెళ్లి కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే ఉదయ్‌పుర్ చేరుకున్నారు. ఈ రోజు గానీ రేపు గానీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడతారు. ఫొటోలు కూడా రిలీజ్ చేయడం గ్యారంటీ. అలానే మార్చి 4న హైదారాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
వేడుకల్లో డెస్టినేషన్.. ఇప్పుడు ఓ క్రేజీ పేషన్
కరోనా సందర్భంగా ఊపందుకున్న డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ సంపన్న కుటుంబాల్లో ఇప్పుడు ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సినిమా సెలబ్రిటీల ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) ఆలోచనల నుంచి పుట్టిన ఈ కొత్త పోకడ... తర్వాత సంపన్న కుటుంబాలకు విస్తరించింది. ఇప్పుడు ఎగువ మధ్య తరగతి కూడా ఇదే బాట పట్టేందుకు దారితీసింది. ఒకప్పుడు వేర్వేరు ప్రాంతాలలో కేవలం పెళ్లిళ్లకు మాత్రమే డెస్టినేషన్ అన్వేషించేవారు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కు కూడా వ్యాపించింది. ఊళ్లను చుట్టేస్తున్న వివాహ వేడుకల ప్రక్రియగతంలో పెద్దింటి నుంచి పెళ్లి ఆహ్వానం వస్తే ఏ హోటల్లో?, ఏ ఆడిటోరియంలో? అని అడిగేవారు. ఇప్పుడు ఏ ఊర్లో..? ఏ టూరిస్ట్ ప్లేస్‌లో? అంటూ ఆసక్తి చూపే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో మరోసారి డెస్టినేషన్ వెడ్డింగ్స్ సందడి చేస్తున్నాయి. ఈ తరహా పెళ్లిళ్లు ఆన్లైన్లో తరచూ వైరల్ అవుతుండడం దీనికి మరింత క్రేజ్ పెంచుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌తో మొదలు వివాహ సందర్భంగా ఊర్లు, టూర్లు వెళ్లడం అనేది ప్రీ వెడ్డింగ్ షూట్స్‌తో మొదలై పెళ్లితో ముగుస్తోంది. దంపతులు కాబోతున్న జంటతో పాటు కొందరు సన్నిహితులు, ఫొటో/వీడియోగ్రాఫర్లు కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అక్కడ కొన్ని రోజులు గడిపి అచ్చంగా సినిమా తరహాలోనే షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఈ తరహా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం గోవా, ఊటీ, కూర్గ్, మున్నార్... వంటి సుందరమైన ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.హల్దీ టు సంగీత్పెళ్లికి హాజరయ్యే అతిథులు పర్యాటక ప్రాంతాల అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. దంపతులు, ఇరు కుటుంబాలతో పాటు హాజరయ్యే బంధుమిత్రులు సైతం పూర్తిగా పెళ్లి వేడుకల్లో ఇతరత్రా అడ్డంకులు లేకుండా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అదే నివసించే ప్రాంతంలోనే అయితే వ్యక్తిగత పనులు, రోజువారీ కార్యకలాపాల్లో పెళ్లికి హాజరవడం ఒక భాగంగా మాత్రమే పరిమితం అవుతుంది. సంగీత్, హల్దీ... వంటి భిన్న రకాల కార్యక్రమాలతో పాటు మొత్తం వేడుకల్లో హాజరైనవారిలో అత్యధికులు భాగం పంచుకునే వీలుంటుంది.సెలబ్రిటీ..నీవు నేరి్పన విద్యే టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మికా, విజయ్ దేవరకొండల పెళ్లి ఫలానా నెలలో జరుగుతుంది అని తెలియగానే అది డెస్టినేషన్ వెడ్డింగే అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అంతగా సెలబ్రిటీ సర్కిల్లో మమేకమైపోయిన ఈ ట్రెండ్ ఇప్పుడు సంపన్నులనూ ఆకర్షిస్తోంది. గత ఏడాది చివరిలో నగరవాసి, అమెరికాలో స్థిరపడిన పారిశ్రామికవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్రా మంతెన–వంశీ గాదిరాజు వివాహ వేడుకను ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో నిర్వహించారు. దీనికి ఏకంగా హాలీవుడ్ నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ సైతం హాజరవగా, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నృత్య కార్యక్రమం హైలైట్‌గా నిలిచింది. డెస్టినేషన్‌ను పేషన్‌గా మారుస్తున్నవి ఇవే.. పెళ్లిని ఒక గొప్ప జ్ఞాపకంగా మార్చుకోవాలనే ఆలోచన, ఈ వేడుకలను అత్యంత సన్నిహితులు, బంధువులకు మాత్రమే పరిమితం చేయాలని భావించే ధోరణి పెరుగుతోంది. ఇదే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఆదరణ పెంచుతోంది. స్థానికంగా నివసించే చోట పెళ్లి నిర్వహిస్తే రకరకాల సమస్యలు ముఖ్యంగా మీడియా నుంచి ప్రైవసీ ఉండదని తొలుత సెలబ్రిటీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటే అనంతరం రిచ్/పోష్ సర్కిల్ కూడా అదే బాట పట్టింది. పేరొందిన డెస్టినేషన్ వెడ్డింగ్స్.. ఇవే! రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ (సిటీ ఆఫ్ లేక్స్), జోథ్‌పూర్ (బ్లూసిటీ), జైపూర్ (పింక్ సిటీ), జై సల్మేర్ గోవాలోని పలు రిసార్ట్స్, క్లబ్స్, బీచ్‌లు హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, మనాలి, రిషికేష్ ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ విభిన్న రకాల ప్యాకేజీలుడెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహించేందుకు పలు ఆన్లైన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి వివిధ ధరల్లో ప్యాకేజ్ కూడా అందిస్తున్నాయి. కనీసం 50 నుంచి 100 మందితో కూడిన బృందానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల్లో కూడా ప్యాకేజ్ అందుబాటులో ఉంది. ఎంచుకున్న ప్లేస్, పాల్గొనేవారి సంఖ్యను బట్టి ఇది రూ.70 లక్షల వరకు పెరుగుతుంది. పలు రకాల ఈవెంట్లను కూడా వీటికి మేళవిస్తే ఆ ప్యాకేజీ రూ.కోటిపై మాటే. అయితే, రూ.కోట్లు వెచ్చించే సంపన్నులకు కొదవలేదు కాబట్టి ఈవెంట్ నిర్వాహకులకు మ్యారేజ్ సీజన్లో తగినంత డిమాండ్ ఉంటోంది. -
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)
-
అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్
అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నయనికతో మూడు ముళ్లు వేయనున్నాడు. గత నెలలో దుబాయిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకోగా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ ఇంట్లో పసుపు దంచుడు కార్యక్రమం గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)సాధారణంగా హల్దీ పేరుతో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాటికి నో చెప్పిన శిరీష్.. ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం చేసుకున్నాడు. ఈ వేడుకలో బన్నీ సతీమణి స్నేహ, పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, మిగతా బంధువులు, పిల్లలు కనిపించారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
-
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
చెల్లి పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుకలో సింగర్ మధుప్రియ
సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే తాను దగ్గరుండి చెల్లికి నిశ్చితార్థం చేసిన మధుప్రియ.. ప్రస్తుతం పెళ్లి పనుల్లోనూ బిజీ అయిపోయారు. తాజాగా తన చెల్లెలు శ్రుతిప్రియ పెళ్లి వేడుక సంబురాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవాళ నిర్వహించిన హల్దీ వేడుక వీడియోలను పోస్ట్ చేశారు. చెల్లి పెళ్లి కూతురైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.(ఇది చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్)కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది. అయితే 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మధుప్రియ.. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) -
హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం. -
రిషభ్ పంత్ సోదరి సాక్షి హల్దీ వేడుక.. ఫొటోలు వైరల్
-
హల్దీ వేడుకను గుర్తు చేసుకున్న కోలీవుడ్ నటి ఇంద్రజ శంకర్ (ఫొటోలు)
-
టాలీవుడ్ బుల్లితెర నటి మాన్షీ జోషి హల్దీ వేడుక.. ఫోటోలు
-
కొత్త పెళ్లికూతురికి పసుపుతో భయంకరమై ఎలర్జీ వచ్చిందట! ఫోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి, నటి నీలమ్ ఉపాధ్యాయను ( ఫిబ్రవరి 7న) పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆడపడుచు హోదాలో ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 'సిడ్నీ కి షాదీ' తన సోదరుడి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను హల్దీ వేడుకతో ప్రారంభిస్తున్నట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంది. హల్దీ, బారాత్, వెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి అందర్నిఫిదా చేసింది. భర్త నిక్, కుమార్తెతో కలిసి కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో పాటు, నిక్ జోనాస్ తల్లిదండ్రులుతో కలిసి స్పెషల్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట వైరల్‌గా మారింది.ప్రియాంక చోప్రా 'భాభి', నీలం ప్రీవెడ్డింగ్ వేడుకల అయిన హల్దీ వేడుక (ఫిబ్రవరి 5న)లో స్కిన్ ఎలర్జీతో బాధపడిందట. 'హల్దీ' మూలంగా తనకు అలర్జీ వచ్చిందని నీలం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని ప్రకారం మెడ , కాలర్‌బోన్ ప్రాంతం చుట్టూ భయంకరమైన చర్మ అలెర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా సేంద్రీయ పసుపుకాకపోవడంతో ఆమెకు ఎలర్జీ వచ్చినట్టుంది. ముందుగా టెస్ట్ చేసినప్పిటికీ, ఎలర్జీ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాపోయింది. ఈ ఫోటోలు నీలం నల్లపూసలతో కూడా మంగళసూత్రాన్ని కూడా చూపించింది. ఎండలో ఉండటం వల్ల ఇలా వచ్చిందా; అప్లయ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసా, అన్నీ బాగానే ఉన్నాయి. దీనికేంటి పరిష్కారం, అసలు ఎందుకిలా అయింది.. దయచేసి ఎవరైనా సలహా చెప్పండి అంటూ అభ్యర్థించింది.ఇదీ చదవండి :బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!పసుపుతో అలెర్జీ వస్తుందా? పసుపు సాధారణంగా చాలా మందికి సురక్షితమైనది . ప్రయోజనకరమైనది. కానీ కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైన దుష్ప్రభావం అలెర్జీ. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చర్మంపై పూసినప్పుడు కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవడంలాంటి కనిపించవచ్చు. ఇంకా లోపలికి తీసుకుంటే విరేచనాలు, వికారం,కడుపు నొప్పి వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుండి ఇనుము లోపం, పిత్తాశయ సమస్యలు, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.ఎవరు జాగ్రత్తగా ఉండాలి?పిత్తాశయ వ్యాధి ఉన్నవారు పసుపును నివారించాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు పసుపు రక్తస్రావం పెంచే అవకాశం ఉన్నందున దానిని నివారించాలి. గర్భిణీలు , పాలిచ్చే స్త్రీలు కూడా పసుపును జాగ్రత్తగా వాడాలి.పసుపులో ఉండే పదార్ధం కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది.దురదలు, దద్దుర్లు తగ్గించే యాంటిహిస్టామైన్ లాంటి మందులను వాడాలి. సమస్య బాగా తీవ్రంగా ఉంటే కార్టికోస్టెరాయిడ్, అనాఫిలాక్సిస్ లాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా సమస్య తీవ్రతను బట్టి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. ఏదిఏమైనా సమస్యను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.కాగా సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2013లో హీరో అల్లరి నరేష్‌కు జోడీగా యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్గా నటించింది నీలం. ఆ తరువాత తమిళ మూవీల్లో కూడా నటించింది. -
ప్రియాంక చోప్రా సోదరుడి హల్దీ వేడుక (ఫోటోలు)
-
అనురాగ్ కశ్యప్ కూతురి హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హల్దీ ఫొటోలు షేర్ చేసిన పీవీ సింధు.. దత్తపై ప్రేమను కురిపిస్తూ..
-
అనంత్-రాధిక హల్దీ.. వెలుగులోకి మరో వీడియో! వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి ఎంతలా అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అంబానీలు ధరించే కాస్ట్యూమ్స్, నగలు, తదితరాలు చాలా హాట్‌టాపిక్‌గా నిలిచాయి కూడా. అయితే ఆ వేడుకకు సంబంధించి ఓ వీడియోని మాత్రం అందరూ మిస్ అయ్యాం. సరదసరదాగా సాగే హల్దీ వేడుకకు సంబంధిచిన మరో వీడియో తాజగానెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంబానీలకు సన్నిహితుడైన అకా ఓర్హాన్ అవత్రమణి షేర్ చేసిన ఈ లేటెస్ట్ వీడియోలో అంబానీలంతా ఖుషీగా గడిపినట్లు కనిపించింది. అతిధులంతా పసుపునీళ్లు ఒకరిపై ఒకరూ వేసుకుంటూ సందడి చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ పసుపు నీళ్లు పడకుండా తప్పించుకోవడంలో విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వేడుకకు హోస్ట్‌గా ఉన్న నీతా అంబానీ సైతం అంరిలానే హల్దీ దాడిని ఎదుర్కోవడం ఫన్నీగా ఉంటుంది. ఇక అనంత్ అంబానీ బావమరిది ఆనంద్ పిరమల్ ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు, పూలతో దాడి చేయడం, మరోపక్క అతిథులంతా నవ్వుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ హల్దీ ఫంక్షన్ ముంబైలోని అంబానీ కుటుంబానికి చెందిన ఆంటిలియాలో జరిగింది. ఈ వేడుకలో జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ తదితర తారలు పాల్గొన్నారు. అంతేగాదు ఈ లెటెస్ట్ ఓర్రీ వీడియోలో ధోల్ బీట్లు, డ్యాన్స్‌లతో ఇతర అతిథులు ఎంత సరదాగా గడిపారో కూడా కనిపిస్తోంది. కాగా, అనంత్ రాధిక మర్చంట్ల వివాహం ఈ ఏడాది జూలై 12న అత్యంత లగ్జరియస్‌గా జరిగింది. (చదవండి: అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటీ..? ఎదురయ్యే దుష్ర్పభావాలు..) -
పెళ్లి కూతురి కంటే అందంగా.. హల్దీ వేడుకల్లో జాన్వీకపూర్ సిస్టర్!
-
స్టార్ డైరెక్టర్ ఇంట పెళ్లిసందడి.. హల్దీ వేడుకలో ఖుషీ కపూర్!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు ఆలియా కశ్యప్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కాగా.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబయిలో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు. ఈ హల్దీ వేడుకలో జాన్వీకపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ అందమైన దుస్తులు ధరించి మెరిసింది. ఈ ఫోటోలను అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అనురాగ్ కశ్యప్ తన కుమార్తెతో వివాహానికి ముందు అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ సినిమాని చూడటానికి తండ్రీకూతుళ్లిద్దరూ వెళ్లారు.కాగా.. ఆలియా కశ్యప్ కొంతకాలంగా షేన్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ డేటింగ్ యాప్ ద్వారానే పరిచయమయ్యారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో తన సోషల్ మీడియా ఖాతాల ప్రమోషన్స్ చేస్తోంది. అంతేకాకుండా ఆమె యూట్యూబ్ ఛానెల్లో వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) -
శోభిత మంగళస్నాన వేడుక.. ఆభరణాలకు ప్రత్యేక సెంటిమెంట్!
మరో మూడు రోజుల్లో అక్కినేనివారి కోడలు కానుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఇప్పటికే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. అయితే శోభిత ఇంట్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం మొదలైంది. సంప్రదాయ పద్ధతిలో రాత వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగానే శోభిత ధూళిపాళ్లకు మంగళస్నానం చేయించారు. ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సంప్రదాయ పద్ధతులను పాటించారు.శనివారం జరిగిన మంగళస్నానం వేడుకల్లో శోభితా ధూళిపాళ్ల తన కుటుంబ సంప్రదాయంగా వస్తున్న ఆభరణాలను ధరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రాత వేడుకలో తన తల్లి, అమ్మమ్మల నగలు ధరించింది. ఈ వేడుకలో పసుపుతో స్నానం చేయించడం మన తెలుగువారి సంప్రదాయంలో ముఖ్యమైన వేడుక. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకలో ఆచారం ప్రకారం ఎనిమిది దిక్కుల దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారం పెళ్లికి ముందు వధువును శుద్ధి చేసి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు.అన్నపూర్ణ స్టూడియోస్ పెళ్లి వేడుకనాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు మండపంలో వీరిద్దరు ఒక్కటి కానున్నారు. డిసెంబర్ 4న చైతన్య, శోభితల వివాహం జరగనుంది. -
శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. పెళ్లికళ ఉట్టిపడుతోందిగా! (ఫోటోలు)
-
పెళ్లి సందడి.. నాగ చైతన్య- శోభిత మంగళస్నానాలు (ఫోటోలు)
-
చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్
అక్కినేని కుటుంబంలో పెళ్లి భాజాలు మోగాయి. నాగచైతన్య-శోభిత డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. హల్దీ (పసుపు దంచడం) ఇప్పుడు జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)నాగచైతన్య-శోభిత పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి ఫ్యామిలీలతో పాటు రాజమౌళి లాంటి స్టార్స్ విచ్చేయనున్నారు. చైతూ-శోభిత.. ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లోనే మెరిసిపోనున్నారు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే) -
హీరోయిన్ రమ్య పాండియన్ హల్దీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ప్రియుడితో పెళ్లి.. పట్టలేనంత సంతోషంలో నటి
బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లికి రెడీ అయ్యారు. రెండు రోజుల క్రితమే పెళ్లిసంబరాలు షురూ అవగా నేడు (అక్టోబర్ 27న) వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కానున్నారు. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను సురభి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోని ఓ రిసార్ట్‌లో వివాభ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. కృత్రిమ డెకరేషన్ కాదని ప్రకృతి ఒడిలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించడం విశేషం.ఎవరీ సురభి జ్యోతి?పెళ్లికూతురు సురభి విషయానికి వస్తే.. ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్బాజ్, కోయి లౌట్కే ఆయా హై సీరియల్స్‌లో నటించింది. వరుడు సుమిత్ సూరి.. రిషికేశ్‌లో జన్మించాడు. సుమారు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. 2013లో వార్నింగ్ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలతో పాటు ద టెస్ట్ కేస్, హోమ్ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేశాడు.అప్పటి నుంచే లవ్సురభి, సుమిత్.. హాంజి: ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. అప్పటినుంచే వీరి మధ్య లవ్ మొదలైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో వీరు తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) చదవండి: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ -
సమంత హల్దీ ఫంక్షన్.. ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ! (ఫొటోలు)
-
అనంత్ అంబానీ - రాధిక హల్దీ : హాట్ టాపిక్‌గా సల్మాన్ ఖాన్ వాచ్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్‌తో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్ రీవెడ్డింగ్ బాష్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ హాట్ టాపిక్గానిలిచింది.అనంత్ అంబానీకి ఎంగేజ్మెంట్మొదలు, తొలి, రెండో క్రూయిజ్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్, ఇలా ప్రతీవేడుకలోనూ సల్మాన్ హాజరు తప్పకుండా ఉండాల్సిందే. ఇటీవల అనంత్-రాధిక సంగీత్‌లో కూడా అనంత్‌తో కలిసి స్టెప్పులేశారు. ఇక హల్దీ వేడుకలో సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్‌తో పాటు ఆల్-బ్లాక్ లుక్‌తో అలరించాడు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డైమండ్స్ పొదిగిన వాచ్ అందర్నీ ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచెస్ ధరించడం కొత్తేం కాదు. కోట్ల విలువ చేసే లగ్జరీ వాచెస్ కలెక్షన్ విలవ కోట్ల రూపాయకుపైమాటే. తాజాగా లగ్జరీ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ రెయిన్ బో (Patek Philippe Rainbow Watch) కి చెందిన వాచ్ ధరించాడు. ఆక్వానాట్ లూస్ రెయిన్బో మినిట్ రిపీటర్ హాట్ జ్యూయిలరీ వాచ్ సుమారు 130 వజ్రాలతో పొదిగి ఉందట. దీని ధర దాదాపు రూ. 23.54 కోట్లు ఉంటుందని అంచనా.కాగాజూలై 12న అనంత్, రాధిక వివాహ వేడుక మూడు రోజుల పాటు ఘనంగా జరగ బోతోంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
హల్దీ వేడుకలో కుసుమ బాలలా రాధిక (ఫోటోలు)
-
హల్దీ ఫంక్షన్లో ముఖేశ్ అంబానీ చెల్లెలు సందడి (ఫొటోలు)
-
అనంత్ అంబానీ హల్దీ వేడుక: 150 ఏళ్ల నాటి హైదరాబాదీ వస్త్రధారణలో నీతా..!
ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీత్ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యుల వస్త్రధారణ, నగలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. సోమవారం జరిగిన హల్దీ వేడుకలో నీతా, శ్లోకామెహతా, ఇషా తమదైన డిజైనర్‌వేర్ దుస్తులతో మెరిశారు. ఇషా,శ్లోకా రంగురంగుల లెహంగాలతో అలరించగా..నీతా వారిద్దర్ని తలదన్నేలా సరికొత్త లుక్‌లో కనిపించారు. అదికూడా మన హైదరాబాద్‌కు చెందిన 150 ఏళ్ల చౌగోషియ సంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్నారు. ఇది అత్యంత అరుదైన హైదరాబాద్ కుర్తా. దీనికి ఖాదా దుప్పటా చీర మాదిరిగా అతిపెద్దగా వస్తుంది. చెప్పాలంటే 150 ఏళ్ల నాటి దుస్తుల శైలి. హైదరాబాదీ ముస్లీం మహిళలు తమ నికాహ్ లేదా వివాహ వేడుకల సమయంలో ఈవిధమైన దుస్తులను ధరిస్తారు. దీని మూలాలు 17వ శతాబ్దంలో మొఘల్ శకంలో ఉద్భవించాయి. ఈ చారిత్రాత్మక సంప్రదాయాన్ని హైదరాబాద్‌లో రాజవంశస్థులైన రాణి, బేగంలు అనుసరించేవారు. అలనాటి సంప్రదాయ వస్త్రధారణ శైలి ఫ్యాషన్ నుంచి బయటపడదని మరోసారి తేటతెల్లమయ్యింది. ఏళ్ల నాటి ముస్లిం రాణుల సంప్రదాయ వస్త్రధారణతో సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేసింది నీతా. అందుకు తగ్గట్టు అద్భుతమైన ఆభరణాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆమె చెవులకు ధరించిన కమ్మలు మంత్రముగ్దుల్ని చేసేలా ఉండగా, ఆ డిజైనర్ వేర్కి మ్యాచింగ్‌గా ధరించిన బ్రాస్లెట్, బిందీ తదితరాలన్ని ఆమె రూపాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేశాయి. చివరిగా స్టైలిష్ స్ట్రాపీ హీల్స్‌తో తన రాణి మాదిరి లుక్‌ని తెప్పించింది. పైగా ముఖానికి లైట్ మేకప్‌ని ఎంచుకున్నారు. మొత్తం ఈ హల్దీ వేడుకలో ఆమె ఏళ్ల నాటి సంప్రదాయాన్ని సరికొత్తగా గుర్తు చేశారు ఆమె. ముఖ్యంగా మన హైదరాబాదీ సంప్రదాయన్ని అంబానీలు అనుసరించడం విశేషం. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్‌ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!) -
అంబానీ హల్ది ఫంక్షన్.. అందరికంటే ఈ బ్యూటీయే హైలైట్ (ఫోటోలు)
-
అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్‌ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మొదటగా జరిగిన సంగీత్ కార్యక్రమం నీతా ధరించిన ఆభరణాలు, వస్త్రాధారణ హైలెట్‌గా నిలిచింది. ఇక తర్వాత జరుగుతున్న హల్దీ వేడుక చాల కలర్ఫుల్గా సాగింది. ఈ హల్దీ వేడుకలో ఇషా పిరమల్, శ్లోకా మెహతా రంగరంగుల లెహంగాలతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో కాబోయే పెళ్లి కూతరు రాధిక ఆమె సోదరి సాంప్రదాయ వస్త్రధారణతో కళ్యాణ శోభను తీసుకొచ్చారు. ఈ గ్రాండ్ వేడుకలో శ్లోకా, అనామికా ఖన్నా డిజైనర్ వేర్ లెహంగాను ధరించింది. ఆమె ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బంగారు రంగు వంటి మరెన్నో రంగులతో కూడిన శక్తివంతమైన లెహంగా సెట్‌ను ధరించింది. దానికి తగినట్టుగా చిలుక ఆకుపచ్చ స్కర్ట్ దానిపై పూల ఎంబ్రాయిడరీని అందంగా తీర్చిదిద్దారు. ఇక ఇషా మల్టీకలర్ కలర్ లెహంగాను ధరించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ టోరాని దిల్ రంగ్ జీవా లెహంగా సెట్‌తో అలరించింది. ఇది ఇండో వెస్టట్రన్ టచ్‌తో కూడిన సరికొత్త డిజైనర్ వేర్ లెహంగా. దీనికి రా సిల్క్‌తో రూపొందించిన టాసెల్ అలంకారాలు హైలెట్‌గా ఉండగా, అందమైన నెక్లైన్తో కూడిన ప్రత్యేకమైన బ్లౌజ్ మరింత అకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా ధర ఏకంగా రూ. 135,500/-.(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!) -
అనంత్-రాధిక హల్దీ.. సుందరంగా ముస్తాబైన సెలబ్రిటీలు (ఫోటోలు)


