హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌! | haldi ceremony Bride to be enters dressed as dinosaur viral video | Sakshi
Sakshi News home page

హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్‌!

May 2 2025 3:08 PM | Updated on May 2 2025 3:38 PM

haldi ceremony Bride to be enters dressed as dinosaur viral video

పెళ్లి అంటే  ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం,  పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్‌, బారాత్‌ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్‌ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్‌  చేసే అల్లరి, అనుకోని సర్‌ప్రైజ్‌లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్‌. కానీ స్వయంగా పెళ్లి కూతురే  అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.

న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ  సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు.  ఇంతలోనూ ఉన్నట్టుండి  డైనోసార్‌ ఎంట్రీ ఇవ్వడంతో  అతిథులంతా షాక్‌ అయ్యారు.  అందర్నీ పలకరిస్తూ  తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్‌  చేసింది. పెళ్లి కొడుకును కూడా  కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ  తరువాత  అసలు విషయం తెలిసాక వేదిక అంతా  అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో  అందరూ  ఆశ్చర్యపోయారు. 

తనకు కాబోయే భార్య చిలిపితనం,  ఊహించని గెటప్ చూసి వరుడు కూడా  నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట  స్టెప్పులేయడం విశేషం.  ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్‌లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్‌ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు  కామెంట్  చేశారు.  గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్‌ చేయడం విశేషం. 

 

Advertisement
 
Advertisement
Advertisement