PC: X
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అదరగొట్టాడు. టాపార్డర్ విఫలమైన వేళ భారీ శతకం (334 బంతుల్లో 179)తో దుమ్ములేపాడు. అతడికి తోడుగా మార్కో యాన్సన్ (85), సైమన్ హార్మర్ (82) అర్ధ శతకాలతో రాణించగా.. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు (425-9 డిక్లేర్డ్) సాధించగలిగింది.
ఆసక్తికర ఘటన
ఆ తర్వాత ఆసీస్‌ను స్వల్ప స్కోర్లకే ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఓడించి.. ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కగిసో రబడ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (3) ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో తడబడిన మాథ్యూ బ్రీట్జ్కే.. ఎట్టకేలకు పనిపూర్తి చేశాడు.
అయితే, ఆ సమయంలో బ్రీట్జ్కేకు సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న బవుమా క్యాచ్ అందుకోవడాన్ని చూడకుండా.. మొహం తిప్పేసుకుని.. ప్రేక్షకుల వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. బవుమా తీరుపై జోకులు, సెటైర్లు పేలాయి.
హై క్యాచెస్ అందుకోవడం చాలా కష్టం
ఈ ఘటనపై బవుమా స్పందించాడు. తాను వెనక్కి తిరగడానికి గల కారణాన్ని మీడియాకు వెల్లడించాడు. ‘‘ఆ సమయంలో నేను చాలా ఆందోళనగా ఉన్నాను. సెయింట్ జార్జ్ మైదానంలో హై క్యాచెస్ అందుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా గాలి వీస్తున్నప్పుడు క్యాచ్ పట్టడం అంటే మామూలు విషయం కాదు.
అందుకే వెనక్కి తిరిగాను
అప్పుడు ఎవరు క్యాచ్ పడుతున్నారో నేను చూడనేలేదు. కాబట్టి సదరు ఆటగాడి మీద నాకు నమ్మకం లేకే పక్కకు తిరిగాననుకోవడం పొరపాటు. నిజానికి మ్యాచ్‌కు అదే మలుపు లాంటిది. స్టీవ్ స్మిత్ వంటి కీలక ఆటగాడిని అవుట్ చేయడం పెద్ద విషయం. ఆ సమయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కష్టంగా ఉండేది. నేను నా భావోద్వేగాలను కాస్త అదుపు చేసుకోవాల్సింది’’ అని బవుమా చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఎబెహా వేదికగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మెరిపించిన దక్షిణాఫ్రికా జట్టు రెండో టెస్టులో ఆసీస్‌పై ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో గెలిచింది. ఫాలోఆన్ ఆడుతూ ఓవర్‌నైట్ స్కోరు 156/4తో చివరిరోజు గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కంగారూ జట్టు.. 107.1 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది.
వర్షం కారణంగా తొలి సెషన్‌లో ఆట సాధ్యం కాకపోయినా... లంచ్ తర్వాత ఆట ప్రారంభంకాగా... టీ విరామానికి ఆ్రస్టేలియా 253/6తో నిలిచింది. టీ విరామం తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి ఆ్రస్టేలియా మరో 42 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.
ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (190 బంతుల్లో 121; 15 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నైట్ వాచ్‌మన్ బోలాండ్ (166 బంతుల్లో 40; 6 ఫోర్లు), అలెక్స్ కేరీ (69 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు) పోరాడినా ఆసీస్‌ను గట్టెక్కించలేకపోయారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 4 వికెట్లు, ముల్డర్ 3 వికెట్లు, హార్మర్ 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవూమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో రెండు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో టెస్టు ఈనెల 27 నుంచి మొదలుకానుండగా.. ఇందుకు కేప్‌టౌన్ వేదిక.
చదవండి: కేఎల్ రాహుల్ అవుట్!.. భారత జట్టులో అతడికి చోటు
Temba Bavuma talks about the reason why he turn around when the fielder was taking the catch of Steve Smith 😂 https://t.co/iSjTqHFaXO
— Johns. (@CricCrazyJohns) October 23, 2026


