breaking news
australia vs south africa
-
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. చరిత్ర సృష్టించిన యువ బౌలర్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ కూపర్ కన్నోలీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతడు.. ఆసీస్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కన్నోలీ కేవలం 22 ఏళ్ల 2 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో కన్నోలీ మాజీ ఫాస్ట్ బౌలర్ క్రెయిగ్ మెక్‌డెర్మాట్, ప్రస్తుత స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్‌లను వెనక్కు నెట్టాడు.మెక్‌డెర్మాట్ 22 ఏళ్ల 204 రోజుల వయసులో (1987) వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించగా.. స్టార్క్ 22 ఏళ్ల 211 రోజుల వయసులో (2012) ఈ ఘనత సాధించాడు. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలతో కన్నోలీ మరో రికార్డు కూడా సాధించాడు. మైఖేల్ క్లార్క్ తర్వాత ఆసీస్ తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మైఖేల్ క్లార్క్ 2004లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 35 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. కన్నోలీ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఆసీస్ సౌతాఫ్రికాను 276 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 432 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో కన్నోలీతో పాటు (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) సత్తా చాటడంతో సౌతాఫ్రికా 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
Cameron Green: రెండో వేగవంతమైన సెంచరీ
సౌతాఫ్రికాతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 276 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టాప్-3 ప్లేయర్లు ట్రవిస్ హెడ్ (103 బంతుల్లో 142; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (106 బంతుల్లో 100; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కెమరూన్ గ్రీన్ (55 బంతుల్లో 118 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకాలతో హోరెత్తించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగుల రికార్డు స్కోర్ చేసింది.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్ కన్నోలీ (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది.రెండో వేగవంతమైన సెంచరీఈ మ్యాచ్‌లో ఆసీస్ యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ శివాలెత్తిపోయాడు. మూడో స్థానంలో బరిలోకి దిగి కేవలం 47 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ సెంచరీ వన్డేల్లో ఆసీస్ తరఫున రెండో వేగవంతమైందిగా రికార్డైంది. 2023లో మ్యాక్స్‌వెల్ నెదర్లాండ్స్‌పై చేసిన 40 బంతుల శతకం.. వన్డేల్లో ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా కొనసాగుతుంది.వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగవంతమైన శతకాలు (టాప్-4)40 - గ్లెన్ మాక్స్వెల్ vs NED, ఢిల్లీ, 2023 47 - కామెరాన్ గ్రీన్ vs SA, మెకే, 2025* 51 - గ్లెన్ మాక్స్వెల్ vs SL, సిడ్నీ, 2015 57 - జేమ్స్ ఫాల్క్‌నర్ vs IND, బెంగళూరు, 2013 -
కుప్పకూలిన సౌతాఫ్రికా.. చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టు తమ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించింది. ఇవాళ (ఆగస్ట్ 24) సౌతాఫ్రికాతో జరిగిన నామమాత్రపు వన్డేలో 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా ఆసీస్‌కు అతి భారీ విజయం నెదర్లాండ్స్‌పై (2023 వన్డే వరల్డ్‌కప్‌లో 309 పరుగుల తేడాతో) దక్కింది.యాదృచ్చికంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేసిన స్కోర్ కూడా వారి వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్ తమ అతి భారీ స్కోర్‌ను కూడా సౌతాఫ్రికాపైనే చేసింది. 2006లో జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఆ జట్టుకు పరుగుల పరంగా వన్డేల్లో ఇదే అతి భారీ పరాజయంగా నిలిచింది. దీనికి ముందు 2023 వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో ఎదురైన 243 పరుగుల పరాజయం వారికి వన్డేల్లో అతి భారీ పరాజయంగా ఉండింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 432 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూపర్ కన్నోలీ (5/22) అద్బుత ప్రదర్శనతో చెలరేగి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్ కన్నోలీ (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్, మార్ష్.. 22 ఏళ్ల వరల్డ్ రికార్డు బ్రేక్
మెక్కే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి బంతి నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకు పడ్డారు.గ్రేట్ బారియర్ రీఫ్ అరీనాలో బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దిరూ తొలి వికెట్‌కు 250 పరుగుల భాగస్వామ్యం కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్ ప్లేయర్లు ఇద్దరూ సెంచరీలతో సత్తాచాటారు. హెడ్ కేవలం 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142 పరుగులు చేయగా.. మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.అతడితో పాటు కామెరూన్ గ్రీన్(55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 పరుగులు) సెంచరీతో కదం తొక్కాడు. వీరి ముగ్గురి విధ్వంసం ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీలతో మెరిసిన కంగారూ జట్టు ఓపెనర్లు పలు అరుదైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. తొలి ఓపెనింగ్ జోడీగా..👉వన్డేల్లో దక్షిణాఫ్రికా అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా హెడ్-మార్ష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఇంగ్లండ్ ఆటగాళ్లు వి సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ పేరిట ఉండేది.వీరిద్దరూ 2003లో ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో తొలి వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో 22 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును హెడ్-మార్ష్ బ్రేక్ చేశారు.👉దక్షిణాఫ్రికాపై ఒక వన్డే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన మూడో ఓపెనింగ్ జోడీగా మార్ష్-హెడ్ నిలిచారు. వీరిద్దరి కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ.. వి సోలంకి, మార్క్ ట్రెస్కోథిక్ జోడీలు ఉన్నాయి.👉వన్డేల్లో సౌతాఫ్రికాపై ఆసీస్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో ప్లేయర్‌గా హెడ్(142) నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2016లో కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో వార్నర్ 173 పరుగులు చేశాడు. -
SA vs AUS: ఆసీస్ బ్యాటర్ల సెంచరీల మోత.. ఏకంగా 432 పరుగుల టార్గెట్
మెక్కే వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్ విధ్వంసక శతకాలతో కదం తొక్కారు. తొలుత మార్ష్, హెడ్ సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేశారు. వారిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 250 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్ కేవలం 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142 పరుగులు చేయగా.. మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గ్రీన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి విధ్వంసం ధాటికి బౌండరీలు చిన్నబోయాయి. గ్రీన్ మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ముగ్గురు సెంచరీల హీరీలతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(50) ఆర్ధశతకంతో రాణించాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ముత్తసామి తలా వికెట్లు సాధించారు. ఫాస్ట్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. వియాన్ ముల్డర్ అయితే 7 ఓవర్లు బౌలింగ్ చేసి 93 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా ఇప్పటికే సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ కోల్పోయింది. ఇది కేవలం నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కసితో ఆసీస్ ఉంది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా లెజెండ్.. -
ఆల్ టైమ్ రికార్డు సమం చేసిన కెమరూన్ గ్రీన్
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ ఓ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఓ వన్డేలో అత్యధిక ఔట్ ఫీల్డ్ క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాడిగా మార్క్ టేలర్ (1992), మైఖేల్ క్లార్క్ (2004), ఆండ్రూ సైమండ్స్ (2006), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2015), మిచెల్ మార్ష్ (2016), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2017), లబూషేన్ (2024) సరసన చేరాడు. వీరంతా ఓ వన్డేలో తలో నాలుగు ఔట్ ఫీల్డ్ క్యాచ్‌లు పట్టారు.ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గ్రీన్ ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, వియాన్ ముల్దర్, నండ్రే బర్గర్ క్యాచ్‌లు పట్టాడు. గ్రీన్‌తో పాటు మిగతా ఆసీస్ ఆటగాళ్లు కూడా మైదానంలో పాదరసంలా కదలి సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆ జట్టు 31 ఓవర్లలో 163 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్ (18), లబూషేన్ (1), గ్రీన్ (35), క్యారీ (13) ఔట్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (78), ఆరోన్ హార్డీ (6) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్ 2, ఎంగిడి, ముల్దర్, ముత్తుసామి తలో వికెట్ తీశారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పర్యాటక సౌతాఫ్రికా తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. సౌతాఫ్రికాకు భారీ షాక్
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయంతో కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ధ్రువీకరించింది31 ఏళ్ల కగిసో రబాడ కూడి చీలమండ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి తప్పకొన్నాడు. రబాడకు సోమవారం(ఆగస్టు 18) స్కాన్ చేయించాము. కుడి చీలమండలో సమస్య ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతడు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలో ఉండి ప్రోటీస్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పునరావాసం పొందనున్నాడు అని క్రికెట్ సౌతాఫ్రికా ఓ ప్రకటనలో పేర్కొంది. అతడి స్ధానాన్ని యువ ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకాను సెలక్టర్లు భర్తీ చేశారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను ప్రోటీస్ కోల్పోయినప్పటికి మఫాకా మాత్రం తన సంచలన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మఫాకా(9) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచారు.ఈ క్రమంలో సెలక్టర్లు అతడికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు. క్వెనా మఫాకా గతేడాది పాకిస్తాన్‌తో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కెయిర్న్స్ వేదికగా మంగళవారం జరగనుంది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, క్వెనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లువాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రనెలన్ సబ్రాయన్.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, ఆడమ్ జంపా.చదవండి: Asia Cup 2025: 'ఏ జట్టునైనా ఓడిస్తాము.. ఆసియాకప్ టైటిల్ మాదే' -
చరిత్ర సృష్టించిన డెవాల్డ్ బ్రెవిస్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
కైర్న్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు బ్రెవిస్ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆసీస్ బౌలర్ ఆరోన్ హార్దీని బ్రెవిస్ ఉతికారేశాడు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హార్దీ బౌలింగ్‌లో బ్రెవిస్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బ్రెవిస్.. 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బ్రెవిస్ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.విరాట్ కోహ్లి రికార్డు బద్దలు..టీ20 చరిత్రలో ఆస్ట్రేలియాపై వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా బ్రెవిస్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుపై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా బ్రెవిస్ చరిత్ర సృష్టించాడు.బ్రెవిస్ ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై మూడు టీ20లు ఆడి 14 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఆస్ట్రేలియాలో మెన్ ఇన్ ఎల్లోపై 11 మ్యాచ్‌లు ఆడి 12 సిక్స్‌లు బాదాడు.తాజా మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదిన బ్రెవిస్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో శిఖర్ ధావన్(9) ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్రెవిస్(180) టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఆఖరి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో ఆస్ట్రేలియాకు కోల్పోయింది. -
బేబీ ఏబీడీ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో
ఆస్ట్రేలియా గడ్డపై సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డార్విన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో మెరుపు సెంచరీతో చెలరేగిన బ్రెవిస్.. ఇప్పుడు మూడో టీ20లో అదే తరహా విధ్వంసాన్ని సృష్టించాడు. కెయిర్న్స్ లోని కాజాలి స్టేడియం వేదికగా జరుగుతున్న సిరీస్ డిసైడ్ర్లో బ్రెవిస్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.మరోసారి ఆసీస్ బౌలర్లను ఈ జూనియర్ ఏబీడీ ఉతికారేశాడు. ముఖ్యంగా ఆసీస్ యువ బౌలర్ ఆరోన్ హార్డీకి బ్రెవిస్ చుక్కలు చూపించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హార్దీ బౌలింగ్‌లో బ్రెవిస్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకంటే ముందు ఆసీస్ స్పీడ్ స్టార్ బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌లో కూడా బ్రెవిస్ 100 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.అతడి బ్యాట్ పవర్‌కు బంతి స్టేడియం బయట పడింది. ఇది చూసిన వారంతా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బ్రెవిస్.. 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 53 పరుగులు చేశాడు.ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో బ్రెవిస్‌తో పాటు స్టబ్స్(25), వండర్ డస్సెన్(38) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఈల్లీస్ మూడు, జంపా, హాజిల్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.చదవండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు జీతాలు కట్!?Oh my goodness, what a player Dewald Brevis is!#AUSvSA pic.twitter.com/pcYPrcidd9— cricket.com.au (@cricketcomau) August 16, 2025 -
19 ఏళ్ల వయస్సులో సంచలనం.. సౌతాఫ్రికా ప్లేయర్ వరల్డ్ రికార్డు
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మఫాకా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 19 ఏళ్ల మఫాకా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబెలెత్తించాడు. టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, బెన్ డ్వార్షుయిస్, జంపాలను యువ సంచలనం పెవిలియన్‌కు పంపాడు.మఫాకా మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే 4 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో సఫారీ స్పీడ్ స్టార్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్‌గా.. అంతర్జాతీయ టీ20ల్లో పూర్తి సభ్య దేశాల(టెస్టు హోదా కలిగిన జట్లు) నుంచి నాలుగు వికెట్ల హాల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా మఫాకా చరిత్ర సృష్టించాడు. మఫాకా కేవలం 19 సంవత్సరాల 124 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు.ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ వేన్ పార్నెల్ పేరిట ఉండేది. పార్నెల్ 2009లో వెస్టిండీస్‌పై 19 సంవత్సరాల 318 రోజుల వయస్సులో ఫోర్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో పార్నెల్ ఆల్‌టైమ్ రికార్డును మఫాకా బ్రేక్ చేశాడు.అదేవిధంగా టీ20ల్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సఫారీ బౌలర్‌గా కూడా మఫాకా నిలిచాడు. ఇంతకుముందు రికార్డు కైల్ అబాట్, తహీర్, వైస్ పేరిట ఉండేది. వీరిముగ్గురూ కూడా ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని మఫాకా అధిగమించాడు. కాగా తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది.చదవండి: ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే: సౌరవ్ గంగూలీ -
AUS Vs SA: టిమ్ డేవిడ్ విధ్వంసం.. దెబ్బకు 16 ఏళ్ల వార్నర్ రికార్డు బ్రేక్
డార్విన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ సఫారీ బౌలర్లను ఊతికారేశాడు. మర్రారా క్రికెట్ గ్రౌండ్లో బౌండరీల వర్షం కురిపించాడు.ఒకవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి.. డేవిడ్ తన బ్యాటింగ్ విధ్వంసాన్ని ఆపలేదు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న డేవిడ్.. 8 సిక్స్‌లు, 4 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్ర్రమ్ తొలుత ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్(2), కెప్టెన్ మిచెల్ మార్ష్(13), జోష్ ఇంగ్లిష్(0) వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో డేవిడ్ గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.కానీ కాసేపు మెరుపులు మెరిపించిన గ్రీన్ కూడా పేవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులో వచ్చిన మాక్స్వెల్ సైతం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో డేవిడ్ టెయిలాండర్ల సాయంతో ప్రత్యర్ధి బౌలర్లపై ఎదరుదాడికి దిగాడు.అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, ఎంగిడీ, లిండే, ముత్తుసామి చెరో వికెట్ సాధించారు.వార్నర్ రికార్డు బ్రేక్ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాపై ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా వార్నర్ రికార్డును డేవిడ్ బ్రేక్ చేశాడు. డేవిడ్ వార్నర్ 2009లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో 8 సిక్సర్లు కొట్టిన డేవిడ్.. వార్నర్‌ను అధిగమించాడు.చదవండి: 'రోహిత్ ఒక మంచి స్పిన్నర్ అవుతాడనుకున్నా.. కానీ ఒక రోజు' -
భారీ రికార్డుపై కన్నేసిన మ్యాక్స్‌వెల్
ఆసీస్ వెటరన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 10) ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో మరో 4 వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన డబుల్‌ను (2500 పరుగులు, 50 వికెట్లు) సాధిస్తాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పాక్ మాజీ మొహమ్మద్ హఫీజ్, మలేసియా ఆల్‌రౌండర్ విరన్‌దీప్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో షకీబ్ అత్యధికంగా 129 మ్యాచ్‌ల్లో 2551 పరుగులు చేసి, 149 వికెట్లు తీయగా.. హఫీజ్ 119 మ్యాచ్‌ల్లో 2514 పరుగులు చేసి, 61 వికెట్లు తీశాడు. విరన్‌దీప్ 102 మ్యాచ్‌ల్లో 3013 పరుగులు చేసి, 97 వికెట్లు తీశాడు.మ్యాక్స్‌వెల్ విషయానికొస్తే.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటిదాకా 121 మ్యాచ్‌లు ఆడి 2754 పరుగులు చేసి, 46 వికెట్లు తీశాడు.కాగా, సౌతాఫ్రికాతో తొలి టీ20 ఇవాళ మధ్యాహ్నం 2:45 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్ డార్విన్‌లో (ఆస్ట్రేలియా) జరుగనుంది. రెండో టీ20 ఆగస్ట్ 12న ఇదే డార్విన్‌లో జరుగనుండగా.. మూడో టీ20 ఆగస్ట్ 16న కెయిన్స్ వేదికగా జరుగనుంది. టీ20 సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు ఆగస్ట్ 19, 22, 24 తేదీల్లో కెయిన్స్ (తొలి వన్డే), మెక్కే (మిగతా రెండు) వేదికలుగా జరుగనున్నాయి. -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సత్తా చాటిన ఆసీస్ ఓపెనర్
డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌కు ముందు ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో (క్లీన్స్‌ల్యాండ్) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఖ్వాజా 221 బంతుల్లో 12 బౌండరీలు, సిక్సర్ సాయంతో 127 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఖ్వాజాకు ఇది 43వ శతకం. ఖ్వాజా సెంచరీతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌ల్యాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఖ్వాజాకు జతగా లాచ్లాన్ హెర్నీ (74) అర్ద సెంచరీతో రాణించాడు. ఆట ముగిసే సమయానికి మైఖేల్ నెసర్ (10), జాక్ విల్డర్‌ముత్ (4) క్రీజ్‌లో ఉన్నారు. క్లీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా 20, జాక్ క్లేటన్ 19, బెన్ మెక్‌డెర్మాట్ 24, జిమ్మీ పియర్సన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. టస్మానియా బౌలర్లలో బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. గేబ్ బెల్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఫైనల్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఖ్వాజా సూపర్ సెంచరీ సాధించడంతో టస్మానియాపై క్లీన్స్‌ల్యాండ్ పైచేయి సాధించింది.కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించకముందు ఖ్వాజా శ్రీలంక పర్యటనలో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో ఖ్వాజా 352 బంతుల్లో 232 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఖ్వాజా లేటు వయసులో ఆస్ట్రేలియా తరఫున డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక పర్యటనకు ముందు స్వదేశంలో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఖ్వాజా కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా 9 ఇన్నింగ్స్‌ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. సౌతాఫ్రికాతో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఖ్వాజా ఫామ్‌లో కొనసాగడం ఆసీస్‌కు శుభసూచకం. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11-15 మధ్యలో లార్డ్స్ వేదికగా జరుగనుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వన్డే జట్టు ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌లో నిష్క్రమించింది. తొలి సెమీఫైనల్లో స్టీవ్ స్మిత్ సేన టీమిండియా చేతిలో భంగపడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారత్ 48.1 ఓవర్లలోనే ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది. విరాట్ కోహ్లి (84) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుతో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్), హార్దిక్ పాండ్యా (28) భారత్ గెలుపులో తలో చేయి వేశారు. మార్చి 9న జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
వాట్ ఏ సిక్స్.. వాట్ ఏ క్యాచ్!
అడిలైడ్ : దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో విజయానందుకున్న విషయం తెలిసిందే. వరుస ఓటములతో సతమతమైన ఆ జట్టుకు ఈ విజయం కొంత ఊరటనిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కరమ్ కొట్టిన ఓ అద్బుత సిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆసీస్ బౌలర్ 150.8 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతిని మార్కర్మ్ సిక్స్ కొట్టడం విశేషం అయితే.. ఈ బంతి గ్యాలరీలోని ఓ ప్రేక్షకుడు అందుకోవడం మరో విశేషం. ఫుల్ క్రౌడ్‌లో ఆ క్యాచ్ అందుకున్న ఆ అభిమాని చిన్నపిల్లాడిలా ఉబ్బితబ్బిబ్బవ్వడం అక్కడి ప్రేక్షకులను, కామెంటేటర్స్ను ఆకట్టుకుంది. మ్యాచ్ వ్యాఖ్యాతలు అయితే మార్కర్మ్ సిక్స్ కన్నా ఆ అభిమాని క్యాచ్‌నే ప్రస్తావిస్తూ కొనియాడడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన అధికారిక వెబ్సైట్ ట్విట్ చేయగా.. ఈ వీడియో వైరల్ అయింది. (చదవండి: హమ్మయ్య.. గెలిచాం) This was a serious shot off a rapid Starc delivery, but how's the catch from Old Mate in the crowd?! #AUSvSA pic.twitter.com/nvTl9Siwde — cricket.com.au (@cricketcomau) November 9, 2018 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 231 పరుగులు చేసింది. అరోన్ ఫించ్(41), క్రిస్ లిన్(44), అలెక్స్ కారే(47)లు రాణించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరును సఫారీల ముందుంచింది. అయితే లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి పరాజయం చెందింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డుప్లెసిస్(47), డేవిడ్ మిల్లర్(51)లు ఆకట్టుకున్నప్పటికీ గెలుపును అందించలేకపోయారు. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!) -
పూర్తిగా గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్..!
జోహెన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. దాదాపు పది అడుగుల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి.. పూర్తిగా గాల్లోకి ఎగిరి అతను క్యాచ్ క్రికెట్ అభిమానుల్ని సంభ్రమంలో ముంచెత్తింది. నాలుగో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 488 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 207 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా తాత్కాలిక కెప్టెన్ టిమ్ పైన్ మొండిపట్టుదలతో క్రీజ్ అంటిపెట్టుకొని ఉండి ప్రతిఘటించాడు. బొటనవేలికి అయిన గాయం సలుపుతున్నా.. పైన్ చెలరేగి ఆడాడు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన పైన్.. అనంతరం కగిసో రబడా బౌలింగ్‌లోనూ ఒక ఫోర్ మీద దూకుడు మీద కనిపించాడు. కానీ, రబడా ఓవర్ చివరి బంతిని పైన్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ఈ బంతిని మిడ్‌వికెట్ దిశగా తరలించేందుకు పైన్ ప్రయత్నించగా.. అది అమాంతం గాల్లోకి ఎగిరింది. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఎల్గర్ ఈ బంతిని క్యాచ్ అందుకోవడం మొదట్లో అసాధ్యమనిపించింది. కానీ, దృష్టినంతా గాలిలోని బంతిపైనే నిలిపిన ఎల్గర్.. దాదాపు పది అడుగుల దూరం పరిగెత్తుతూ.. ఒక్కసారి గాల్లోకి ఎగిరి.. కుడివైపు డ్రైవ్ చేస్తూ.. గాల్లోనే బంతిని ఒడిసిపట్టాడు. దీంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌కు 221 పరుగుల వద్ద తెరపడింది. గాల్లో సూపర్మ్యాన్లా డ్రైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టిన డీన్ ఎల్గర్ పట్టిన క్యాచ్ నెటిజన్లను విస్మయపరిచింది. దీంతో అతని క్యాచ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. Outrageous Dean Elgar. One of the best outfield catches you'll see #SAvAUS pic.twitter.com/ubobOaII5C — Ricky Mangidis (@rickm18) 1 April 2018 -
ఇలా కూడా ఔటవుతారా!
-
ఇలా కూడా ఔటవుతారా!
క్రికెట్ చరిత్రలో ఇది ఒక రకంగా అద్భుతమే. ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మన్ ఇలా అవుటై ఉండకపోవచ్చు. ఆస్ట్రేలియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అవుటైన తీరు చాలా విచిత్రంగా ఉంది. దక్షిణాఫ్రికాతో హోబర్ట్ నగరంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ చిత్రం చోటుచేసుకుంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన వార్నర్.. మరో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి అప్పటికి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కైల్.. ఇన్నింగ్స్ 23వ ఓవర్లో ఓ బంతి వేశాడు. దాన్ని లెగ్‌సైడ్‌కు పంపాలని వార్నర్ ప్రయత్నించాడు. కానీ, ఆ బంతి ముందుగా అతడి తొడకు తగిలి, ఆ తర్వాత మోచేతికి తగిలింది. ఆ వెంటనే వెనకాల ఉన్న వికెట్లను ముద్దుపెట్టుకుంది. ఏం జరిగిందోనని ఆశ్చర్యపోతూ వార్నర్ వెనక్కి తిరిగి చూసేసరికే బెయిల్స్ కింద పడ్డాయి. వార్నర్ ఇలా అవుటైన తీరును స్వయానా వార్నర్ గానీ, కోచ్ డారెన్ లేమన్ గానీ, జట్టులో మి గిలిన సభ్యులు గానీ ఏమా్తరం నమ్మలేకపోయారు. ఈ వికెట్ పడటం ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ అయింది. అప్పటికే రెండో వికెట్‌కు ఖ్వాజాతో కలిసి 79 పరుగులు జోడించిన వార్నర్.. వ్యక్తిగతంగా 45 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో జో బర్న్స్ పరుగులు ఏమీ చేయకుండానే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. చేతిలో 8 వికెట్లు మిగిలి ఉండగా.. మూడోరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 120 పరుగులు వెనకబడి ఉంది.