
డార్విన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ సఫారీ బౌలర్లను ఊతికారేశాడు. మర్రారా క్రికెట్ గ్రౌండ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు.
ఒకవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి.. డేవిడ్ తన బ్యాటింగ్ విధ్వంసాన్ని ఆపలేదు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న డేవిడ్.. 8 సిక్స్‌లు, 4 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.
కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్‌ర్రమ్ తొలుత ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్(2), కెప్టెన్ మిచెల్ మార్ష్(13), జోష్ ఇంగ్లిష్(0) వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో డేవిడ్ గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
కానీ కాసేపు మెరుపులు మెరిపించిన గ్రీన్ కూడా పేవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులో వచ్చిన మాక్స్‌వెల్ సైతం కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో డేవిడ్ టెయిలాండర్ల సాయంతో ప్రత్యర్ధి బౌలర్లపై ఎదరుదాడికి దిగాడు.
అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, ఎంగిడీ, లిండే, ముత్తుసామి చెరో వికెట్ సాధించారు.
వార్నర్ రికార్డు బ్రేక్
ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాపై ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా వార్నర్ రికార్డును డేవిడ్ బ్రేక్ చేశాడు. డేవిడ్ వార్నర్ 2009లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో 8 సిక్సర్లు కొట్టిన డేవిడ్.. వార్నర్‌ను అధిగమించాడు.
చదవండి: 'రోహిత్ ఒక మంచి స్పిన్నర్ అవుతాడనుకున్నా.. కానీ ఒక రోజు'