
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్‌తో విరుచుకుపడడం అందరికి తెలిసిందే. కానీ హిట్‌మ్యాన్‌కు బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తా ఉంది. ఐపీఎల్‌లో అతడి పేరిట ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఐపీఎల్-2009 సీజన్‌లో డక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్..ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించాడు.
అయితే రోహిత్ శర్మ ఆఫ్ స్పిన్నర్ నుంచి పూర్తి స్ధాయి బ్యాటర్‌గా మారడంలో అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్‌ది కీలక పాత్ర. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో రోహిత్ క్రికెట్ జర్నీ గురించి దినేష్ లాడ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
"రోహిత్ శర్మను నేను తొలిసారి ఒక బౌలర్‌గా చూశాను. అప్పుడు అతడి వయస్సు దాదాపు 13 సంవత్సరాలు. ఆ సమయంలో రోహిత్ మా స్కూల్ టీమ్‌తో మ్యాచ్ ఆడాడు. అప్పుడే అతడిలో అద్బుతమైన టాలెంట్ ఉందని గుర్తించాను. దీంతో రోహిత్‌ను మా స్కూల్‌లో చేర్పంచమని అతడి మామతో చెప్పాను.
ఆ తర్వాత రోహిత్ మా స్కూల్‌లో 1999లో చేరాడు. అతడికి బౌలింగ్ నేర్పించడం మొదలు పెట్టాను. అప్పటికి ఇంకా రోహిత్ ఏళ్లు లోపే ఉన్నుందన అండర్-14, అండర్-16 టోర్నీలో ఆడేందుకు సిద్దం చేయాలని నిర్ణయించుకున్నాను. ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ అవుతాడనుకున్నా.
కానీ ఒక రోజు నేను రోహిత్ బ్యాటింగ్ అద్బుతంగా చేస్తుండడం నేను చూశాను. బంతి పడేటప్పుడు అతడు తన బ్యాట్‌ను తీసుకురావడం నేను గమనించాను. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి నీవు బ్యాటింగ్ కూడా చేయగలవా అని అడిగాను. అందుకు అతడు చేస్తాను సార్ అని సమాధానం చెప్పాడు.
ఆ తర్వాత అతడి నెట్ ప్రాక్టీస్‌లో ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశమిచ్చాను. అంతకుముందు అతడికి ఒక్కసారి కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే అవకాశమివ్వలేదు. అది నా తప్పు. లేదంటే అప్పుడు బ్యాటింగ్ గురుంచి నాకు తెలిసిండేంది.
ఆ తర్వాత ఒక మ్యాచ్‌లో ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 40 పరుగులు చేశాడు. రోహిత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి దురదృష్టవశాత్తూ మేము మ్యాచ్ ఓడిపోయాము. హారిస్ షీల్డ్ తర్వాత అండర్-14 ప్రాక్టీస్ ప్రారంభమైనప్పుడు నేను రోహిత్‌కు నెట్స్‌లో రెండు లేదా స్థానంలో బ్యాటింగ్ ఇవ్వడం ప్రారంభించాను.
అతడికి బ్యాటింగ్‌లో చాలా మంచి ప్రతిభ ఉందని అన్పించింది. దీంతో అతడికి బౌలింగ్ బదులుగా బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టిపెట్టమని చెప్పాను. రోహిత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడు పూర్తిస్ధాయి బ్యాటర్‌గా ఉన్నాడని" ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్ కాస్ట్‌లో లాడ్ పేర్కొన్నాడు.
చదవండి: 'సిరాజ్ ఒక పోరాట యోధుడు'.. హైదరాబాదీపై పాక్ దిగ్గజం ప్రశంసలు