2025 సంవత్సరానికి గానూ విజ్డన్ (Wisden) పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను ప్రకటించింది. ఈ జట్టులో గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 8 దేశాలకు చెందిన 11 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది.
భారత్ నుంచి దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఎంపికయ్యారు. మరో భారతీయ ఆటగాడు మిలింద్ కుమార్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కినా, ప్రస్తుతం అతను యూఎస్‌ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
వెస్టిండీస్ (షాయ్ హోప్, జేడన్ సీల్స్), న్యూజిలాండ్‌కు (మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ) కూడా భారత్‌తో సమానంగా రెండు బెర్త్‌లు దక్కాయి. మిగతా బెర్త్‌లు సౌతాఫ్రికా (మాథ్యూ బ్రీట్జ్కే), స్కాట్లాండ్ (జార్జ్ మున్సే), ఇంగ్లండ్ (ఆదిల్ రషీద్), శ్రీలంకకు (అషిత ఫెర్నాండో) చెందిన ఆటగాళ్లు దక్కించుకున్నారు.
ఆటగాళ్ల వారిగా గతేడాది ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..
రోహిత్ శర్మ
పరుగులు- 650
సగటు- 50.00
స్ట్రయిక్‌రేట్- 100
అత్యుత్తమ ప్రదర్శనలు- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 76 పరుగులు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై సెంచరీలు
జార్జ్ మున్సే
పరుగులు- 735
సగటు- 73.50
స్ట్రయిక్‌రేట్- 107
2 సెంచరీలు
విరాట్ కోహ్లి
పరుగులు- 651
సగటు- 65.10
స్ట్రయిక్‌రేట్- 96
పాకిస్తాన్‌పై అజేయ శతకం, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీలో 84 పరుగులు
షాయ్ హోప్ (వికెట్‌కీపర్)
పరుగులు- 670
సగటు- 64.18
స్ట్రయిక్‌రేట్- 99
పాకిస్తాన్‌పై 120*; 15 క్యాచ్‌లు, 2 స్టంపింగ్స్
మాథ్యూ బ్రీట్జ్కే
పరుగులు- 706
సగటు- 64.18
స్ట్రయిక్‌రేట్- 99
అరంగేట్రంలోనే 150 పరుగులు; మొదటి ఐదు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు
మిలింద్ కుమార్
పరుగులు- 652
సగటు- 81.50
స్ట్రయిక్‌రేట్- 99
2 శతకాలు
వికెట్లు- 20
ఓ ఐదు వికెట్ల ప్రదర్శన
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్)
పరుగులు- 210
వికెట్లు- 25
ఎకానమీ- 4.57
కెప్టెన్‌గా స్థిరమైన ప్రదర్శన
ఆదిల్ రషీద్
వికెట్లు- 30
సగటు- 23.63
మ్యాట్ హెన్రీ
వికెట్లు- 27 వికెట్లు
సగటు- 18.14
2025లో అత్యధిక వికెట్లు; ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ బౌలర్
జేడన్ సీల్స్
వికెట్లు- 27
సగటు- 18.14
పాకిస్తాన్‌పై 6-18
అషిత ఫెర్నాండో
వికెట్లు- 23 వికెట్లు
సగటు- 21.30


