టీ20 ప్రపంచకప్: అమెరికాపై గెలిచిన పాకిస్తాన్ | T20 World Cup Pakistan vs Usa Result And Details | Sakshi
Sakshi News home page

Pak Vs Usa: అమెరికా అద్భుత పోరాటం.. కానీ పాక్‌దే గెలుపు

Feb 10 2026 10:35 PM | Updated on Feb 10 2026 10:35 PM

T20 World Cup Pakistan vs Usa Result And Details

కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. అమెరికాపై 32 పరుగుల తేడాతో గెలిచింది. కొన్నిరోజుల క్రితం టీమిండియాపై అద్బుతంగా ఆడిన అమెరికా జట్టు.. ఇప్పుడు పాక్‌పై కూడా అదే జోరు ప్రదర్శించింది. కానీ గెలుపు రుచిచూడలేకపోయింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన పాక్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోరు చేసింది. ఫర్హాన్ 73 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బాబల్ ఆజమ్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు.

అనంతరం అమెరికా జట్టు.. దూకుడుతో ఛేదన మొదలుపెట్టింది. కానీ వరస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లన్నీ పూర్తి చేసినప్పటికీ.. 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభం రంజనే 51, షయన్ జహంగీర్ 49 పరుగులతో మెప్పించారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారీఖ్ 3, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement