T20 WC 2026: పసికూనతో పోరు.. టీమిండియాలో రెండు మార్పులు | T20 WC 2026: India won the toss and choose to bat against Netherlands | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పసికూనతో పోరు.. టీమిండియాలో రెండు మార్పులు

Feb 18 2026 6:52 PM | Updated on Feb 18 2026 7:04 PM

T20 WC 2026: India won the toss and choose to bat against Netherlands

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ ఇవాళ (ఫిబ్రవరి 18) తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

నామమాత్రపు ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ స్థానాల్లో అర్షదీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టులోకి వచ్చారు. 

మరోవైపు నెదర్లాండ్స్‌ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫ్రెడ్‌ క్లాసెన్‌ స్థానంలో నోవా క్రాస్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చాడు. కాగా, ఈ మెగా టోర్నీలో భారత్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించి, సూపర్‌-8కు చేరగా.. నెదర్లాండ్స్‌ 3 మ్యాచ్‌ల్లో రెండిట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తుది జట్లు..
నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), జాచ్ లయన్-కాచెట్, నోహ్ క్రోస్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్

భారత్: ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

Advertisement
 
Advertisement
Advertisement