India vs Netherlands
-
T20 WC: ఐసీసీకి డచ్ క్రికెటర్ డిమాండ్.. కనీసం..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. నాలుగు గ్రూపుల నుంచి సత్తా చాటి టాపర్లుగా నిలిచిన జట్లు సూపర్-8లో అడుగుపెట్టాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి జింబాబ్వే, శ్రీలంక.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ రేసులో నిలిచాయి.పసికూనలతో పాటు ఆసీస్ కూడా.. ఇక మిగిలిన జట్లు గ్రూప్-ఎ నుంచి అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా.. ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్.. ‘సి’ నుంచి స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్.. ‘డి’ నుంచి అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ బాస్ డి లీడె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీకి డిమాండ్భారత్, ఆస్ట్రేలియాలాంటి జట్లతో ముక్కోణపు సిరీస్‌లు ఆడే భాగ్యమైతే దక్కనే దక్కదు... కనీసం ఇలాంటి మేటి ప్రత్యర్థులతో వార్మప్ మ్యాచ్‌లైనా ఏర్పాటు చేయండని అతడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని కోరాడు. అసోసియేట్ జట్ల ఆట ఎప్పుడో ఒకసారి అది కూడా ఐసీసీ ప్రపంచకప్‌ల వరకే పరిమితమవుతోందని అన్నాడు.గట్టి ప్రత్యర్థులతో ఆడే అవకాశం తరచు దక్కడం లేదని లీడె వాపోయాడు. నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టిమ్ డి లీడె కుమారుడైన బాస్ డి లీడె ప్రస్తుతం డచ్ తరఫున టీ20 వరల్డ్‌కప్ ఆడాడు. గ్రూప్ దశలో భారత్‌తో చివరి మ్యాచ్ ఆడిన నెదర్లాండ్స్ ఓటమితో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.కనీసం వార్మప్ మ్యాచ్‌లైనా ఆడండి‘ప్రస్తుత ఐసీసీ భవిష్యత్ పర్యటనల కార్యక్రమం, ప్రపంచ వ్యాప్త టి20 లీగ్‌లతో భారత్, ఆసీస్ లాంటి శాశ్వత దేశాలు, ఆటగాళ్లు ఊపిరి సలపని బిజీ షెడ్యూల్‌తో ఉంటారని మాకు తెలుసు. ఈ నేపథ్యంలో ఘనాపాఠిలతో మాకు ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణపు సిరీస్‌లంటే అది అయ్యే పని కాదు. నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేక పోయినా... ఈ అంతర్జాతీయ మేటి ప్రత్యర్థులతో వార్మప్ మ్యాచ్‌లైనా ఆడిస్తే మా జట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పుడో ఓసారి జరిగే మెగా ఈవెంట్లో ఆడటం... అక్కడితో మా అంతర్జాతీయ క్రికెట్ (మేటి జట్లతో) అటకెక్కడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అని లీడె అన్నాడు. చదవండి: T20 WC: సిగ్గులేకుండా అబద్ధాలు.. మా ఆటగాళ్లకే నష్టం: బంగ్లాదేశ్ కోచ్ ఫైర్ -
అతడిని కావాలనే తొక్కేస్తున్నారా?: టీమిండియా మాజీ స్టార్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిలకడగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను తిప్పలు పెడుతూ మంచి ఎకానమీతో వికెట్లు తీస్తున్నాడు. ఇప్పటి వరకు లీగ్ దశలో భారత్ తరఫున నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లూ ఆడాడు వరుణ్ చక్రవర్తి.తొమ్మిది వికెట్లుఅమెరికా, నమీబియా, పాకిస్తాన్.. తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కలిపి మొత్తంగా 12 ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి.. 5.17 ఎకానమీతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అమెరికా బౌలర్ షాడ్లే వాన్ షాల్విక్ (13 వికెట్లు) తర్వాత.. రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీరును విమర్శించాడు. వరుణ్ చక్రవర్తి సేవలను సరిగ్గా వాడుకోవడంలో సూర్య విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు.వరుణ్ విషయంలోనే ఎందుకలా?‘‘వరుణ్ చక్రవర్తిని తన బౌలింగ్ కోటా ఎందుకు పూర్తి చేయనివ్వడం లేదు?.. అతడికి తగినన్ని ఓవర్లు ఇవ్వడమే లేదు. అమెరికాతో మ్యాచ్‌లో మాత్రమే వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయగలిగాడు.అప్పుడు సూర్య ఐదుగురు బౌలర్లను మాత్రమే ఉపయోగించాడు కాబట్టి వరుణ్‌కు ఆ అవకాశం దక్కింది. బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి విషయంలో వ్యవహరించినట్లే జట్టులోని ఏ బ్యాటర్ విషయంలోనైనా వ్యవహరించగలరా?ఓ బ్యాటర్ బాగా ఆడుతూ 50-60 పరుగులు సాధించిన తర్వాత.. ‘ఇక చాలు వెళ్లిపో’ అని చెప్పగలరా?.. అస్సలు అలా చేయలేరు కదా!.. ఓ బ్యాటర్ 60 బంతులు ఆడగా లేనిది.. ఓ బౌలర్ 24 బంతులు బౌల్ చేయకూడదా?నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అతడి చేతికి మరోసారి బంతి ఇచ్చి ఉంటే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసేవాడు. కానీ అతడిని మీరే ఆపారు’’ అని ఆకాశ్ చోప్రా.. సూర్యకుమార్ తీరును విమర్శించాడు. అతడిని కావాలనే తొక్కేస్తున్నారా అన్నట్లుగా ఫైర్ అయ్యాడు. కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అతడి ప్రదర్శన వల్లే భారత్ 17 పరుగుల తేడాతో గట్టెక్కగలిగింది. చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్ -
T20 WC: ‘డకౌట్ల’ అభిషేక్ శర్మ.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయి.. లీగ్ దశను అవమానకర రీతిలో ముగించాడు.గ్రూప్-ఎలో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేశాడు.ఎనిమిది బంతులు మాత్రమేకెరీర్లో తొలిసారి వరల్డ్‌కప్ టోర్నీ ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తంగా ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ ఇలా లీగ్ దశలో.. అది కూడా అమెరికా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కూడా సింగిల్ కూడా తీయలేకపోయాడు. తద్వారా చెత్త రికార్డుతో అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.తెలివిగా ఆడుఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యువ బ్యాటర్ ముందుగా ఒత్తిడి నుంచి బయటపడాలని సూచించాడు. తనకున్న ట్యాగ్‌లను మరచిపోయి స్వేచ్ఛగా ఆడినప్పుడే అనుకున్న ఫలితం రాబట్టగలడని అభిప్రాయపడ్డాడు. తొందరపడకుండా తెలివిగా షాట్లు ఆడాలని సూచించాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అంచనాల భారం అతడిపై ఒత్తిడిని పెంచుతోంది అనుకుంటున్నా!... అతడు మంచి బ్యాటర్. ఆట మొదలుపెట్టాడంటే తనదైన శైలిలో దూసుకుపోగలడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.ముందుగా సింగిల్ తీయాలిసిక్స్ హిట్టర్ అని పేరున్న అభిషేక్ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్ అతడు. అదే అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తుందేమో!.. ఏదేమైనా అభిషేక్ కాస్త ఓపికగా ఉండాలి. మొదటి బంతి నుంచే బౌండరీ, సిక్సర్ బాదాలని అనుకోవడం సరికాదు.ఆ ఫీలింగ్ నుంచి బయటపడుముందుగా సింగిల్ తీయాలి. స్మార్ట్‌గా ఆడాలి. ముఖ్యంగా తన కాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో అతడు అవుటైన విధానం అత్యంత సాధారణమైనది. అతడి షాట్ సెలక్షన్‌ను బట్టి ఎవరైనా ముందే పసిగట్టగలరు. ‘200కు పైగా స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేసే ఆటగాడిగానే నన్ను చూస్తారు’ అన్న భావన నుంచి బయటకు రావాలి.మెదడు నుంచి అలాంటి ఆలోచనను తీసివేయాలి. నీ సహజశైలిలో ఆడు.. అప్పుడు తప్పక భారీ స్కోరు సాధించగలవు’’ అని సునిల్ గావస్కర్ అభిషేక్ శర్మకు కీలక సూచనలు చేశాడు. కాగా గ్రూప్-ఎలో భాగంగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్లను ఓడించిన టీమిండియా.. ఆఖరిగా నెదర్లాండ్స్‌పై గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించింది.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ -
సిక్సర్లతో విరుచుకుపడిన శివమ్ దూబే.. టీమిండియా భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.శివమ్ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ ఓ సిక్సర్ బాది అజేయంగా నిలిచాడు.అంతకుముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) నిదానంగా ఆడి విసుగు తెప్పించారు. వారికి ముందు ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఈ మెగా టోర్నీలో దారుణమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు.నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ (4-0-56-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్యన్ దత్ (4-0-19-2) కెరీర్లోనే అత్యుత్తమ స్పెల్ వేశాడు. బాస్ డి లీడ్ (4-0-28-0) పొదుపుగా బౌలింగ్ చేసి పర్వాలేదనిపించాడు. 19వ ఓవర్లో మాత్రమే 21 పరుగులిచ్చిన కైల్ క్లెయిన్ (4-0-38-1) అంతకుముందు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు. కొలిన్ ఆకెర్మన్ (3-0-36-0), వాన్ డర్ మెర్వ్ (1-0-15-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌కు సైతం ఈ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ఉపయోగం లేదు. ఈ జట్టు ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
T20 WC 2026: కొనసాగుతున్న అభిషేక్ శర్మ చెత్త ప్రదర్శన
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తానాడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్ఏ, పాకిస్తాన్) డకౌట్లైన అభిషేక్.. ఇవాళ (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ తన తొలి టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడినా ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. అభిషేక్‌కు చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో ఇది ఐదో డకౌట్ కావడం మరింత శోచనీయం.ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ను జెర్సీ మార్పు కూడా కాపాడలేకపోయింది. అభిషేక్ తన రెగ్యులర్ జెర్సీ కాకుండా సిరాజ్ వేసుకునే 73వ నంబర్ జెర్సీ ధరించి బరిలోకి దిగినా ఖాతా తెరవలేకపోయాడు.తాజా డకౌట్ తర్వాత అభిషేక్ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ కష్టాల్లో ఉంది. పవర్ ప్లేలోనే (తొలి 6 ఓవర్లలో) ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్ (18) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 51-2గా ఉంది. తిలక్ వర్మ (26), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా కోల్పోయిన రెండు వికెట్లు స్పిన్నర్ ఆర్మన్ దత్కే దక్కాయి. అభిషేక్, ఇషాన్‌లను దత్ క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. -
T20 WC 2026: పసికూనతో పోరు.. టీమిండియాలో రెండు మార్పులు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 18) తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నామమాత్రపు ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్థానాల్లో అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు నెదర్లాండ్స్ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫ్రెడ్ క్లాసెన్ స్థానంలో నోవా క్రాస్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చాడు. కాగా, ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించి, సూపర్-8కు చేరగా.. నెదర్లాండ్స్ 3 మ్యాచ్‌ల్లో రెండిట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), జాచ్ లయన్-కాచెట్, నోహ్ క్రోస్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్భారత్: ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉంది. గ్రూప్-ఎ నుంచి అమెరికా, నమీబియా వంటి పసికూనలపై గెలుపొందిన భారత్.. చివరగా దాయాది పాకిస్తాన్‌ను మట్టికరిపించిది.‘చిరకాల ప్రత్యర్థి’ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి.. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు అర్హత సాధించింది. ఇక గ్రూప్-ఎలో భాగంగా నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బుధవారం రాత్రి (ఫిబ్రవరి 18) మరో పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.అభిషేక్ శర్మ డకౌట్ అయినా..కాగా ఇప్పటికే సూపర్-8కు చేరిన తరుణంలో నెదర్లాండ్స్‌తో ఆడే తుదిజట్టులో భారత్ మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్‌గా అభిషేక్ శర్మ (0,0) రెండు మ్యాచ్‌లు ఆడి డకౌట్ అయినా.. అతడిని కొనసాగించడం ఖాయమే. దీంతో మరోసారి సంజూ శాంసన్‌కు మొండిచేయి తప్పదు.ఇక ఇప్పటికే ఓపెనర్‌గా ఇరగదీస్తూ.. పాక్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ స్థానానికి ఢోకా లేదు. సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కొనసాగటం లాంఛనమే.బుమ్రాకు రెస్ట్.. అతడిపై వేటుఅయితే, పాక్‌తో మ్యాచ్ ఆడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు నెదర్లాండ్స్ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ రావడం పక్కా. అదే విధంగా.. కుల్దీప్ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులో ఆడించే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం.కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు గాయపడిన వాషీ.. నమీబియాతో మ్యాచ్ నుంచి అందుబాటులోకి వచ్చాడు. పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికీ అతడి విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోలేదు. అయితే, నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఆడించి తదుపరి మ్యాచ్‌లకు అతడిని సన్నద్ధం చేయనున్నట్లు సమాచారం.నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్.UPDATE: T20 World Cup 2026: అజేయంగా... అగ్రస్థానంతోచదవండి: T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వే -
పటిష్ట స్థితిలో అమెరికా.. పాక్ సూపర్-8 చేరాలంటే?
టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్‌పై తమదే పైచేయి అని టీమిండియా మరోసారి నిరూపించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సల్మాన్ ఆఘా బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తాజా ఎడిషన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసిన టీమిండియా.. గ్రూప్-ఎ నుంచి సూపర్-8కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.తదుపరి నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా తలపడుతుంది. మరోవైపు.. గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్‌తో అమెరికా పోటీ పడుతోంది. కాగా లీగ్ దశలో అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.పటిష్ట స్థితిలో అమెరికాఇందులో భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా జట్టు.. నెదర్లాండ్స్, నమీబియా జట్లపై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లు సాధించింది. నెట్‌రన్‌రేటు +0.787గా ఉంది. ఇక టీమిండియా చేతిలో భారీ తేడాతో పాక్ ఓడిపోవడంతో అమెరికా సూపర్-8 ఆశలు సజీవమయ్యాయి.ఈ నేపథ్యంలో అమెరికాను దాటి సూపర్-8కు చేరాలంటే పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. కొలంబో వేదికగా నమీబియాపై పాక్ గెలిస్తేనే సూపర్-8కు చేరుతుంది. అయితే, ఇరుజట్లలో పాక్ పటిష్టమైనదే అయినా.. అత్యంత నిలకడలేని జట్టుగా పాకిస్తాన్‌కు చెడ్డపేరు ఉంది.పాక్ సూపర్-8 చేరాలంటే?మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికా, జింబాబ్వే, ఇటలీ, నేపాల్ వంటి పసికూన జట్లు పటిష్ట జట్లకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అమెరికా టీమిండియాకు గట్టి పోటీనివ్వగా.. జింబాబ్వే మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. నేపాల్.. రెండుసార్లు చాంపియన్ అయిన ఇంగ్లండ్‌ను వణికించగా.. తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్న ఇటలీ నేపాల్‌ను చిత్తు చేసింది.కాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో పాక్ జాగ్రత్తగా ఆడితేనే సజావుగా సూపర్-8కు చేరుతుంది. లేదంటే.. గత ఎడిషన్ మాదిరే ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. కాగా పాక్ తమ తొలి రెండు మ్యాచ్‌లలో నెదర్లాండ్స్, అమెరికాలను ఓడించి నాలుగు పాయింట్లు సంపాదించింది. నెట్‌రన్‌రేటు -0.403.నెట్‌రన్‌రేటు పరంగాకాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఆరు పాయింట్లతో పాక్ అమెరికాను దాటి సూపర్-8లో అడుగుపెట్టగలదు. ఒకవేళ నమీబియా చేతిలో ఓడితే గనుక అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు పరంగా యూఎస్ మెరుగ్గా ఉంది. కాబట్టి అక్కడా పాకిస్తాన్‌కు ప్రమాదమే పొంచి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి వెస్టిండీస్, టీమిండియా మాత్రమే సూపర్-8 బెర్తులను అధికారికంగా ఖరారు చేసుకున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు -
‘కోలుకుంటున్నాను’
బెంగళూరు: తుంటి గాయం నుంచి కోలుకుంటున్నానని... భారత టెన్నిస్ నంబర్‌వన్ ప్లేయర్ సుమిత్ నగాల్ తెలిపాడు. రెండు రోజుల్లో మొదలయ్యే డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఈనెల 7, 8 తేదీల్లో బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ ఆడనుంది. ముఖాముఖి రికార్డులో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. గత ఏడాది తనకు అంతగా కలిసి రాలేదని, కొత్త ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రపంచ 281వ ర్యాంకర్ సుమిత్ తెలిపాడు. గత సంవత్సరం సుమిత్ రెండు ఏటీపీ టూర్ టోర్నీలలో ఆడగా... ఏడు చాలెంజర్ సిరీస్ టోర్నీల్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పృథ్వీకి రజతం మోదీ నగర్ (ఉత్తరప్రదేశ్): జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రజత పతకం లభించింది. గురువారం జరిగిన పురుషుల యూత్ 56 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అప్పినేని పృథ్వీ రెండో స్థానంలో నిలిచాడు. పృథ్వీ మొత్తం 215 కేజీలు బరువెత్తి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) వెయిట్‌లిఫ్టర్ ధర్మజ్యోతి దేవ్ఘరియా 230 కేజీలు బరువెత్తి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అర్ష్లాన్ (ఉత్తరాఖండ్; 212 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు. -
T20 WC: జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడేలా షెడ్యూల్ రూపొందించారు.ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉండగా.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో పడుతున్నాయి. మరి టోర్నీకి ఖరారైన ఇరవై జట్లలో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్ టైమింగ్స్... ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర విషయాలు తెలుసుకుందామా?!గ్రూప్-ఎభారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.యూఎస్ఏమోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభం రంజానే.నమీబియాగెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, బెర్నార్డ్ షాల్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్ల్యుపి మైబర్, మాక్స్ హీంగోరిజర్వు ప్లేయర్: అలెగ్జాండర్ వోల్షెంక్నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాచ్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్మ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్‌డెర్ మెర్వే, పాల్ వాన్ మెకరెన్, సకీబ్ జుల్ఫికర్పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్.గ్రూప్-బిఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాశ్రీలంకదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఇషాన్ మలింగజింబాబ్వేసికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స, రిచర్డ్ ఎంగరవ, బ్రెండన్ టేలర్ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రామనంది, అమీర్ కలీమ్గ్రూప్-సిఇంగ్లండ్హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్వెస్టిండీస్షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.ఇటలీవేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్ కలుగమాగే, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకానేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్స్: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్గ్రూప్-డిసౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదీఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్ రహీమి, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, డార్విష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్, జియా ఉర్ రెహమాన్ షరీఫీరిజర్వ్స్: AM గజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్కెనడాదిల్ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్‌దీప్ సింగ్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధలీవాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వా, యువ్‌రాజ్ సమ్రాయూఏఈముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిద్ ఖాన్, సోహైబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్.వేదికలు👉భారత్- కోల్‌కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ 👉శ్రీలంక- కొలంబో, పల్లకెలె👉ఫైనల్- అహ్మదాబాద్మ్యాచ్ ఆరంభ సమయం👉ఉదయం మ్యాచ్‌లు: 11 గంటలకు ఆరంభం👉మధ్యాహ్నం మ్యాచ్‌లు: 3 గంటలకు ఆరంభం👉రాత్రి మ్యాచ్‌లు: 7 గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ వివరాలు👉టీవీలో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం👉డిజిటల్ మీడియాలో జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం👉తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లిష్, కన్నడ భాషల్లో జియో స్టార్ టీవీలో కామెంట్రీ👉జియోహాట్‌స్టార్‌లో పై భాషలతో పాటు బెంగాలీ, భోజ్‌పురి, హర్యాన్వీ భాషల్లోనూ వ్యాఖ్యానం.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్


