టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
శివమ్ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్‌లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ ఓ సిక్సర్ బాది అజేయంగా నిలిచాడు.
అంతకుముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) నిదానంగా ఆడి విసుగు తెప్పించారు. వారికి ముందు ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
ఈ మెగా టోర్నీలో దారుణమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు.
నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ (4-0-56-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్యన్ దత్ (4-0-19-2) కెరీర్‌లోనే అత్యుత్తమ స్పెల్ వేశాడు.
బాస్ డి లీడ్ (4-0-28-0) పొదుపుగా బౌలింగ్ చేసి పర్వాలేదనిపించాడు. 19వ ఓవర్‌లో మాత్రమే 21 పరుగులిచ్చిన కైల్ క్లెయిన్ (4-0-38-1) అంతకుముందు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు. కొలిన్ ఆకెర్‌మన్ (3-0-36-0), వాన్ డర్ మెర్వ్ (1-0-15-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌కు సైతం ఈ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ఉపయోగం లేదు. ఈ జట్టు ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.


