
ఓవల్‌లో టెస్టులో ఇంగ్లండ్‌పై అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై పాక్ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ ఇక సపోర్ట్ బౌలర్ కాదని, ప్రధాన పేసర్ అని అక్రమ్ కొనియాడాడు.
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో సిరాజ్ అద్బుతం చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో భారత్ సమం చేసింది. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో సిరాజ్(23) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సిరాజ్ సిరీస్ మొత్తంగా 1000 పైగా బంతులను బౌలింగ్ చేసి తన ఫిట్‌నెస్ ఎంటో చాటిచెప్పాడు.
"సిరాజ్‌కు తపన, పట్టుదల ఎక్కువ. ఓవల్ టెస్టులో సిరాజ్ ప్రదర్శన గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే అవుతోంది. నిజంగా అతడు అద్బుతం చేశాడు. ఐదు టెస్టుల్లో దాదాపు 186 ఓవర్లు బౌలింగ్ చేసి, ఆఖరి రోజు కూడా అంతే ఉత్సాహంగా ఉండటం నిజంగా గ్రేట్. అతడు శారీరకంగా, మానసికంగా శారీరకంగా చాలా దృడంగా ఉన్నాడు.
సిరాజ్ ఇకపై కేవలం సపోర్ట్ బౌలర్ కాదు. బుమ్రా గైర్హజరీలో భారత పేసర్ పేస్ ఎటాక్‌ను సిరాజ్ లీడ్ చేస్తున్నాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను సిరాజ్ విడిచిపెట్టినప్పటికి, తన ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోలేదు. అది ఒక పోరాట యోధుడి లక్షణం.
టెస్ట్ క్రికెట్ ఎప్పటికీ తన ఉనికిని కోల్పోదు. నేను పనిలో ఉన్నప్పుడు క్రికెట్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాను. కానీ ఆఖరి రోజు ఆటను చూసేందుకు టీవీకి అతుక్కుపోయాను" అని టెలికాం ఆసియా స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆక్రమ్ పేర్కొన్నాడు.
చదవండి: ఆసియాకప్-2025కు శుబ్‌మన్ గిల్ దూరం!?