బెంగళూరు: బాల్యంలో ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఉపాధ్యాయుల ప్రేరణ చాలా ఉంటుంది. తల్లి దండ్రుల తరువాత పిల్లలపై తమ ప్రేమ అప్యాయతలను కురిపించేది టీచర్లు మాత్రమే. అందుకే గొప్ప గొప్ప నాయకులు, సెలబ్రిటీల జీవితాలపై టీచర్ల ప్రభావం ఉంటుంది. తాజాగా కర్ణాటకలోని కొప్పల్ జిల్లా బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యుడి చేసిన పని నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.
విమానం ఎక్కాలనే విద్యార్థులకలను సాకారం చేసేందుకు కర్ణాటకకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు దాతృత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలిచింది. బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప అందగి 24 మంది విద్యార్థులను తొలి సారి విమానం ఎక్కించారు. తన సొంత ఖర్చులతో రూ. 5 లక్షలు వెచ్చించి మరీ తన విద్యార్థులను లైఫ్‌లో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చారు. 5-8 తరగతుల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, పాఠశాల అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు మొత్తం 40 మంది విమానంలో ప్రయాణించారు. వీరి కోసం తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుండి బెంగళూరుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.ప్రతీ క్లాస్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి ఆరుగుర్ని ఈ జర్నీకి ఎంపిక చేశారు.
A truly heartwarming gesture 🙏✈️
Twenty-four government school students from a village in Koppal experienced their first-ever flight, made possible by the selfless generosity of their headmaster, who personally funded the journey. Two enriching days in Bengaluru, learning,… pic.twitter.com/6E28SKHQVv— Ravi Boseraju (@raviboseraju) December 31, 2025
కొప్పల్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులు తమ తొలివిమాన ప్రయాణాన్ని అనుభవించారు, వారి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి సంతోషం పడే వారు తొలిసారి విమానం ఎక్కి తెగ సంతోష పడిపోయారు. బెంగళూరులో రెండు రోజులు ఉండి అనేక పర్యాటక ప్రదేశాలను, పాఠశాలలను సందర్శించి తమ అభిమాన హెడ్మాస్టర్‌కి శతకోటి అభివందనాలు కొప్పల్‌కు తిరిగొచ్చారు. ఎన్నో మధురమైన,సంతోషకరమైన క్షణాలను, అనుభవాలను మూటగట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగామారింది. ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఇదీ చదవండి: నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ!


