హల్దిరామ్ వివాహం: వేదికగా ప్యాలెస్‌ సెట్‌, భారీ కేక్‌.. | Haldiram wedding in Nagpur Goes Viral | Sakshi
Sakshi News home page

హల్దిరామ్ వివాహం: వేదికగా ప్యాలెస్‌ సెట్‌, భారీ కేక్‌..

Feb 15 2026 12:21 PM | Updated on Jun 18 2026 12:55 PM

 Haldiram wedding in Nagpur Goes Viral

అత్యంత విలావంతసమైన వివాహా వేడుక. చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నంత రేంజ్‌లో హంగుఆర్భాటంగా జరుగుతోంది. ఓ పక్క బాణసంచాతో దద్దర్లిపోతున్న ఆకాశం, మరోవైపు ప్యాలెస్‌ రేంజ్‌ వేదిక సెట్‌, బారీ కేక్‌లు, మంచు విగ్రహాలు..ఎన్నో అబ్బురపరిచే...దృశ్యాలతో మిరుమిట్లు గొలిపేలా పెళ్లి వేడుక జరుగుతుంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..

అది బిలియనీర్ శివకిషన్ అగర్వాల్ వివాహ వేడుక. నాగపూర్‌లో అట్టహాసంగా జరిగింది. అత్యంత విలాసవంతమైన వివాహ వేడుకలో ఒకటిగా నిలిచింది కూడా. ప్యాలెస్‌లాంటి వివాహ సెట్‌, ఎత్తైన పూల అలంకరణలు, మెరిసే మంచు శిల్పాలు, ప్రతిది కనుతిప్పుకోనివ్వతంగా అందంగా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. ఈ వేడుకలో సంగీత్‌లో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ డ్యాన్స్‌ హైలెట్‌గా నిలిచింది. 

 

అంతేగాదు బారీ కేక్‌, అడుగడుగున రాజదర్పం ఉట్టిపడేలే అత్యంత గ్రాండ్‌గా జరిగింది ఆ వివాహ తంతు. ఈ వివాహానికి బిజెపి నాయకుడు హన్స్‌రాజ్ అహిర్ హాజరై నూతన వధువరులకు పూలబొకేని బహుకరించారు. అంతేగాదు ఆయన వారి వైవాహిక జీవితం అత్యంత సంతోషభరితంగా సాగిపోవాలంటూ ఆ జంటను దీవించారు కూడా

 

 

ఎవరీ శివకిషన్‌..?
హల్దిరామ్ వ్యవస్థాపక కుటుంబంలోని మూడవ తరం శివకిషన్ అగర్వాల్. ఆయన నాగ్‌పూర్ ఆధారిత వ్యాపార విభాగానికి నాయకత్వం వహిస్తారు. హల్దిరామ్ బ్రాండ్ రాజస్థాన్‌లోని బికనీర్‌లోని ఒక చిన్న దుకాణంలో మూలాలు ఉన్నాయి. 

దీనిని శివకిషన్ అగర్వాల్ తాత గంగా బిషన్ అగర్వాల్ ప్రారంభించారు. కాగా ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ స్నాక్స్, మిఠాయి బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ఏప్రిల్ 2023లో ఢిల్లీ, నాగ్‌పూర్‌కు చెందిన కుటుంబంలోని రెండు విభాగాలు కలిసి హల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ లిమిటెడ్‌ను సృష్టించాయి. ఈ వ్యాపారంలో ఆయన వాటా ఏకంగా రూ. 27 వేల కోట్లు. 

(చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్‌..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement