Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి గాసిప్స్‌పై మృణాల్ ఠాకూర్ క్లారిటీ | Mrunal Thakur clarifies on marriage gossip with Dhanush | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి గాసిప్స్‌పై మృణాల్ ఠాకూర్ క్లారిటీ

Feb 12 2026 11:47 PM | Updated on Feb 12 2026 11:49 PM

Mrunal Thakur clarifies on marriage gossip with Dhanush

సినీ ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో తరచూ వినిపించే ఓ వార్త ఏమిటంటే.. హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది. అయితే ఈ వార్తలు కొత్తవి కావు. గతంలో ఒక ఫంక్షన్‌లో వీరిద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. కొంతమంది మేధావులు ఫిబ్రవరి 14న వీరి వివాహం జరుగుతుందని కథనాలు ప్రచారం చేశారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఈ పుకార్లపై స్పందింది. “ఫిబ్రవరి 14 కాస్తా ఏప్రిల్ 1గా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 1 ఫూల్స్ డే కదా. ఇదంతా ఎవరు మొదలుపెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను అధికారికంగా చెప్పినట్టు కొంతమంది ఇలాంటి గాసిప్స్‌ వ్యాపింపజేస్తున్నారు. ఇది తనకు చాలా భయంకరంగా ఉందని వ్యాఖ్యానించింది.  

ఇంతకుముందు పలుమార్లు ఈ విషయంపై ఆమె స్పందించినప్పటికీ, ఆ మాటలు పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టే అయ్యాయి. ఈసారి మాత్రం మృణాల్ స్పష్టంగా తనకు ధనుష్‌తో ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. అయితే ఆమె ఇచ్చిన క్లారిటీతో ఈ గాసిప్స్‌కు ముగింపు లభిస్తాయేమో చూడాలి. మొత్తానికి ధనుష్‌తో వస్తున్న పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని మృణాల్ ఠాకూర్ తేల్చి చెప్పింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement