అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్ర సంతే 2026 | Chitra Santhe 2026 will be held on January 4 at the Karnataka | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్ర సంతే 2026

Dec 31 2025 5:27 PM | Updated on Dec 31 2025 6:05 PM

Chitra Santhe 2026 will be held on January 4 at the Karnataka

భారతదేశంలోనే అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్ర సంతే. ఈ ఫెస్టివల్ ఈ న్య ఇయర్‌లో జనవరి 4, 2026న  ఆదివారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో సుమారు 22 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా కళాకారులు పాల్గొంటారు. అంతేగాదు ఏడు లక్షలకు పైగా సందర్శకులు ఆకర్షిస్తారనేది అంచనా. ఈ ఏడాది ఈ ఫెస్టివల్‌ థీమ్‌ పర్యావరణంపై దృష్టి సారించడం. ఇంతకీ ఏంటి చిత్ర సంతే అంటే..

చిత్ర సంతే అంటే 
చిత్ర అంటే కన్నడలో పెయింటింగ్/డ్రాయింగ్, సంతే అంటే గ్రామ మార్కెట్‌. ప్రొఫెసనల్‌ కళాకారులు, విద్యార్థులు, అభిరుచి గలవారు తమ రచనలను ప్రదర్శించి, విక్రయించే వీధి కళా ఉత్సవం. ఈ రోజున బెంగళూరు వీధులు భారీ ఓపెన్‌ ఎయిర్‌ ఆర్ట్‌ గ్యాలరీగా మారిపోతుంది. దీన్ని బెంగళూరులోని ఒక ప్రముఖ కళా సంస్థ కర్ణాటక చిత్రకళా పరిషత్ (CKP) దీన్ని నిర్వహిస్తోంది. 

(చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement