అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి  | Indian Student Saket Sreenivasaiah Found Dead in US Lake | Sakshi
Sakshi News home page

అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి 

Feb 16 2026 6:03 AM | Updated on Feb 16 2026 6:03 AM

Indian Student Saket Sreenivasaiah Found Dead in US Lake

న్యూయార్క్‌: అమెరికాలో అదృశ్యమైన కర్నాటకకు చెందిన విద్యార్థి సాకేత్‌ శ్రీనివాసయ్య మృతి చెందారు. 22 ఏళ్ల సాకేత్‌ మృతదేహం శనివారం పోలీసులకు లభించినట్లు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ ధ్రువీకరించింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.

 సాకేత్‌ బర్కిలీ యూనివర్సిటీలో కెమికల్‌ అండ్‌ బయోమాలిక్యులర్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చదువుతున్నారు. ఆయన ఫిబ్రవరి 9  నుంచి కనిపించకుండా పోయారు. మంగళవారం టిల్టెన్‌ రీజనల్‌ పార్క్‌లోని లేక్‌ అంజా దగ్గర కనిపించినట్టు పోలీసులు తెలిపారు. పార్క్‌ హిల్స్‌ పరిసరాల్లోని ఒక ఇంటి సమీపంలో ఆయన పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాక్‌పాక్‌ పోలీసులకు లభించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement