రాహుల్‌ చెప్పేవన్నీ అసత్యాలు | Rahul Gandhi Spreading Lies Over India Trade Deals With US, EU says Amit Shah | Sakshi
Sakshi News home page

రాహుల్‌ చెప్పేవన్నీ అసత్యాలు

Feb 16 2026 5:53 AM | Updated on Feb 16 2026 9:01 AM

Rahul Gandhi Spreading Lies Over India Trade Deals With US, EU says Amit Shah

హోం మంత్రి అమిత్‌ షా విమర్శ

బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్‌

గాంధీనగర్‌: అమెరికా, యూకే, ఈయూతో వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం తీవ్రంగా ఖండించారు. రాహుల్‌ రైతులను తప్పుదోవ పట్టించడంతో పాటు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనకు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. చర్చా వేదికను ఆయనే నిర్ణయించుకోవచ్చన్నారు.

 మన రైతులు, డెయిరీ ఉత్ప త్తులకు కేంద్రం పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ‘‘వాణిజ్య ఒప్పందాలు మన రైతులకు హాని చేస్తాయన్న కాంగ్రెస్‌ ఆరోపణలు హాస్యాస్పదం. ప్రజలను తప్పుదోవపట్టించడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు. నిజానికి యూపీఏ హయాంలో కుదుర్చుకున్న పలు ఒప్పందాలు మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వాటిలోని ప్రమాదకరమైన అంశాలను మోదీ ప్రభుత్వం రాగానే తొలగించింది’’ అని అమిత్‌ షా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement