ఆయన ‘నరేంద్ర సరెండర్‌ మోదీ’ | India-US deal will destroy textile industry Says Congress leader Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఆయన ‘నరేంద్ర సరెండర్‌ మోదీ’

Feb 15 2026 6:24 AM | Updated on Feb 15 2026 6:24 AM

India-US deal will destroy textile industry Says Congress leader Rahul Gandhi

పత్తి రైతులకు, జౌళి ఎగుమతిదారులకు తీవ్ర నష్టం: రాహుల్‌ 

న్యూఢిల్లీ:  దేశంలో పత్తి రైతులు, జౌళి ఎగుమతిదారులను మోదీ ప్రభుత్వం నిలువునా దగా చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల ఆయా రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఇది అమల్లోకి వస్తే మనదేశంలో పత్తి సాగు పూర్తిగా నిలిచిపోతుందని, ఎగుమతులు ఆగిపోతాయని, కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని పేర్కొన్నారు. 

ఈ మేరకు రాహుల్‌ శనివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. అమెరికా ప్రభుత్వం మన ఉత్పత్తులపై 18 శాతం టారిఫ్‌లు ప్రకటించిందని, మోదీ సర్కార్‌ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సున్నా టారిఫ్‌లకు అంగీకరించిందని వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన రైతులు, ఎగుమతిదారులు కచి్చతంగా నష్టపోతారని తేలి్చచెప్పారు.

 అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలన్న షరతుతో బంగ్లాదేశ్‌ వ్రస్తాలపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సున్నా టారిఫ్‌లు ప్రకటించిందని గుర్తుచేశారు. భారతీయ వ్రస్తాలపై 18 శాతం టారిఫ్‌లను ఖరారు చేసిందని పేర్కొన్నారు. మన వ్రస్తాలపై కూడా సున్నా టారిఫ్‌లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం దాచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మన వ్రస్తాలపై సున్నా టారిఫ్‌లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలని, దానివల్ల మన రైతులు నష్టపోతారని తెలిపారు. అమెరికా ఎదుట ప్రధాని మోదీ లొంగిపోయారని రాహుల్‌ విమర్శించారు. ప్రధానమంత్రిని ‘నరేంద్ర సరెండర్‌ మోదీ’గా అభివరి్ణంచారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement