ఇండియా ఏఐ సదస్సు రేపటి నుంచే  | India will host the India AI Impact Summit 2026 in New Delhi | Sakshi
Sakshi News home page

ఇండియా ఏఐ సదస్సు రేపటి నుంచే 

Feb 15 2026 6:03 AM | Updated on Feb 15 2026 6:03 AM

India will host the India AI Impact Summit 2026 in New Delhi

40 మంది సీఈఓలతో మోదీ భేటీ

న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ సదస్సు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, ముఖ్య నేతలతో పాటు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు పాల్గొంటున్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 40 మందికి పైగా సీఈఓలతో భేటీ కానున్నారు. వీరిలో శామ్‌ ఆల్టమన్‌ (ఓపెన్‌ఏఐ), బిల్‌ గేట్స్, డేరియో అమొదెయ్‌ (ఆంత్రోపిక్‌) తదితరులున్నారు. భారత్‌లో పెట్టుబడి ప్రణాళికలను గురించి వీరంతా తమ ఆలోచనలను ప్రధానితో పంచుకోనున్నారు. 

ఈ సదస్సు సందర్భంగా పలు రంగాల్లో ఏకంగా 100 బిలియన్‌ డాలర్ల మేరకు ఏఐ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురతాయని అంచనా. వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి ప్రణాళికలను మైక్రోసాఫ్ట్‌ గత డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే. ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్‌ సామర్థ్య పెంపు, అత్యాధునిక డిజిటల్‌ నైపుణ్యాల్లో లక్షలాది మంది యువతకు శిక్షణ తదితరాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏఐ సదస్సులు పారిస్, సియోల్‌ తదితర నగరాల్లో జరిగాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement