ఇక మలేసియాలోనూ యూపీఐ పేమెంట్స్‌  | UPI payments now available in Malaysia | Sakshi
Sakshi News home page

ఇక మలేసియాలోనూ యూపీఐ పేమెంట్స్‌ 

Feb 15 2026 4:51 AM | Updated on Feb 15 2026 4:51 AM

UPI payments now available in Malaysia

న్యూఢిల్లీ: ఇకపై భారత్, మలేసియా మధ్య క్యూఆర్‌ మర్చంట్‌ చెల్లింపులకు తెరలేవనుంది. ఇందుకు అనుగుణంగా ఎన్‌పీసీఐ అంతర్జాతీయ విభాగం ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఐపీఎల్‌) తాజాగా పేమెంట్స్‌ నెట్‌వర్క్‌ మలేసియా ఎస్‌డీఎన్‌ బీహెచ్‌డీ(పేనెట్‌)తో చేతులు కలిపింది. పేనెట్‌.. మలేసియావ్యాప్త పేమెంట్స్‌ నెట్‌వర్క్‌ సంస్థకావడంతో రెండు దేశాల మధ్య క్యూఆర్‌ ఆధారిత చెల్లింపులకు వీలు చిక్కనుంది. అయితే దశలవారీగా ఇందుకు తెరతీయనున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది. 

తొలి దశలో భాగంగా మలేసియా సందర్శించే దేశీ ప్రయాణికులు తమ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు వీలు కలి్పంచనున్నట్లు తెలియజేసింది. డూయిట్‌నౌ క్యూఆర్‌ అనుమతించే టచ్‌పాయింట్ల ద్వారా ఇందుకు వీలుంటుందని పేర్కొంది. పేనెట్‌ నిర్వహించే డూయిట్‌నౌ మలేసియాలో ప్రామాణిక క్యూఆర్‌గా తెలియజేసింది. తదుపరి దశలో మలేసియన్లు సైతం భారత్‌ సందర్శనలో డూయిట్‌నౌ యాప్స్‌ ద్వారా యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ సేవలను వినియోగించుకోవచ్చని వివరించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement