బంగారం ధరల తారుమారు.. వారం రోజుల్లో ఇలా.. | Gold And Silver Prices In India From 2026 Feb 8th To 14th In India Hyderabad And Other Cities, Check Out Weekly Review Inside | Sakshi
Sakshi News home page

బంగారం ధరల తారుమారు.. వారం రోజుల్లో ఇలా..

Feb 14 2026 6:27 PM | Updated on Feb 14 2026 6:38 PM

Gold and Silver Price in India From 2026 Feb 8 to 14th

బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ నేడు (శనివారం) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో.. గోల్డ్ రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది?, సిల్వర్ రేటు ఎలా ఉంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో.. ఫిబ్రవరి 8న రూ. 1,56,600 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి 1,57,750 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ. 1150 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,43,550 రూపాయల దగ్గర నుంచి రూ. 1,44,600 వద్దకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు వారం రోజుల్లో 1,56,750 రూపాయల దగ్గర నుంచి రూ. 1,57,900 వద్దకు (1150 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,700 నుంచి 1,44,750 రూపాయలకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది.

చెన్నైలో ధరల విషయానికి వస్తే.. ఇక్కడ ఫిబ్రవరి 8న 1,57,310 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (శనివారం) 1,58,840 రూపాయల (రూ. 1530 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల రేటు 1,44,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,45,600 (1400 రూపాయలు పెరిగింది) వద్దకు చేరింది.

సిల్వర్ ధరలు
గత ఆదివారం (ఫిబ్రవరి 8) కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షల దగ్గర ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో కేజీ మీద రూ. 5000 తగ్గిందన్నమాట. సిల్వర్ ధరలు ఒక్కో నగరం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఢిల్లీలో.. రేటు కొంత తక్కువగా ఉంటుంది.

ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement