రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా? | RBI May Introduce Security Upgrades To ₹100 And ₹500 Notes Amid Ongoing Currency Reforms, Check More Details Inside | Sakshi
Sakshi News home page

రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?

Feb 14 2026 3:23 PM | Updated on Feb 14 2026 4:21 PM

RBI Currency Update 2026 Rs100 and Rs500 Notes Get Security Upgrade No Demonetisation

కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ తరువాత 2013లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్‌బీఐకు చేరాల్సిన పెద్ద నోట్లు ఇంకా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.100, రూ.500 నోట్లలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినప్పటికీ నోట్ల అవసరం కూడా ఉంది. ఇప్పటికీ రిటైల్ మార్కెట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో కరెన్సీ నోట్లు కీలకంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లలో మార్పులు చేయనుంది. ఈ మార్పులలో వాటర్‌మార్క్‌లు, మైక్రోప్రింటింగ్, మెరుగైన ఇంక్ వంటివి ఉన్నాయి.

నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్‌బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళా ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో ఏమైనా మార్పులు చేస్తే.. పాత నోట్లు రద్దు అవుతాయా? అనేది ఇప్పుడొక ప్రశ్నగా మిగిలింది.

కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగు పరుస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement