breaking news
Rs.100
-
రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?
కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ తరువాత 2013లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్బీఐకు చేరాల్సిన పెద్ద నోట్లు ఇంకా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.100, రూ.500 నోట్లలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినప్పటికీ నోట్ల అవసరం కూడా ఉంది. ఇప్పటికీ రిటైల్ మార్కెట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో కరెన్సీ నోట్లు కీలకంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లలో మార్పులు చేయనుంది. ఈ మార్పులలో వాటర్‌మార్క్‌లు, మైక్రోప్రింటింగ్, మెరుగైన ఇంక్ వంటివి ఉన్నాయి.నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళా ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో ఏమైనా మార్పులు చేస్తే.. పాత నోట్లు రద్దు అవుతాయా? అనేది ఇప్పుడొక ప్రశ్నగా మిగిలింది.కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగు పరుస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం? -
రూ.100 కోసం ఎంతపని చేశాడు..!
ఇల్లెందు: వంద రూపాయల అప్పు.. ఓ నిండు ప్రాణం బలైపోవడానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని సంజయ్‌నగర్‌లో ఉన్న ఓ బెల్టుషాపు నిర్వాహకుడికి హమీద్(45) అనే వ్యక్తి వంద రూపాయలు అప్పు ఉన్నాడు. ఆ అప్పు గురించి ఇద్దరి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం బెల్టు షాపు నిర్వాహకుడి స్నేహితుడు ఒకరు.. హమీద్‌పై దాడిచేశాడు. బలంగా కొట్టడంతో హమీద్ అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. సీఐ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. -
'రూ.100, రూ.50 నోట్లను రద్దు చేయం'
న్యూఢిల్లీ: రూ.100, రూ.50 నోట్లు రద్దు కాబోతున్నాయనే పుకార్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం కొట్టిపారేసింది. రూ.100, రూ.50 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి మరలా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు చెప్పింది. బ్యాంకుల్లోని బంగారం లాకర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఈ సందర్భంగా పేర్కొంది. రూ.2వేల నోటు రంగు కోల్పోతుందని చెప్పుకొచ్చిన కేంద్రం.. రంగు కోల్పోయినా నోటు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. రూ.2వేల నోటులో ఎలాంటి చిప్ ను అమర్చలేదని చెప్పింది. ప్రజలకు తప్పుడు సమాచారం అందించేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.


