రూ.100 కోసం ఎంతపని చేశాడు..! | quarrel for Rs.100: man killed | Sakshi
Sakshi News home page

రూ.100 కోసం ఎంతపని చేశాడు..!

Feb 3 2017 1:42 PM | Updated on Aug 29 2018 8:36 PM

రూ.100 కోసం ఎంతపని చేశాడు..! - Sakshi

రూ.100 కోసం ఎంతపని చేశాడు..!

వంద రూపాయల అప్పు.. ఓ నిండు ప్రాణం బలైపోవడానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది.

ఇల్లెందు: వంద రూపాయల అప్పు.. ఓ నిండు ప్రాణం బలైపోవడానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

పట్టణంలోని సంజయ్‌నగర్‌లో ఉన్న ఓ బెల్టుషాపు నిర్వాహకుడికి హమీద్‌(45) అనే వ్యక్తి వంద రూపాయలు అప్పు ఉన్నాడు. ఆ అప్పు గురించి ఇద్దరి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం బెల్టు షాపు నిర్వాహకుడి స్నేహితుడు ఒకరు.. హమీద్‌పై దాడిచేశాడు. బలంగా కొట్టడంతో హమీద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. సీఐ నరేందర్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement