సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని కాల్‌గర్ల్‌గా చూపిస్తూ పోస్టులు! | Woman Software Engineer Instagram In Hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని కాల్‌గర్ల్‌గా చూపిస్తూ పోస్టులు!

Nov 19 2026 9:00 AM | Updated on Nov 19 2026 9:00 AM

Woman Software Engineer Instagram In Hyderabad

సాక్షి, హైదరాబాద్:  ఓ యువతిని లక్ష్యంగా చేసుకుని ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలు సృష్టించి, ఆమె వ్యభిచారం చేస్తున్నట్లు అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న వ్యవహారంపై సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  కేసు నమోదు  చేశారు. ఈ–కేటుగాళ్లు ఆమె ఫొటోలు, వ్యక్తిగత మొబైల్‌ నంబర్‌తో పాటు పనిచేస్తున్న సంస్థ వివరాలను సైతం ఆయా సోషల్‌మీడియా ఖాతాల్లో పొందుపరిచారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎదురవుతున్న  ఈ వేధింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఓ యువతి (29) గడ్డిఅన్నారం ప్రాంతంలోని ఓ మహిళా హాస్టల్‌లో ఉంటున్నారు. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఈమె పేరు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలతో ఈ ఏడాది జూన్‌ నుంచి కొందరు నకిలీ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలు సృష్టించినట్లు గుర్తించింది. వాటిల్లో తనను హైదరాబాద్‌లో కాల్‌గర్ల్‌గా, వ్యభిచార సేవలు అందించే మహిళగా చిత్రీకరిస్తూ పోస్టులు పెట్టినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను పనిచేస్తున్న ప్రముఖ సంస్థ పేరు... రెండు ప్రాంతాల్లోని కార్యాలయాల ప్రస్తావన కూడా వాటిలో పొందుపరిచారని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే నకిలీ ఖాతాలను నిర్వహిస్తున్నట్లు బాధితురాలు అనుమానం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement