హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనంపై పెండింగ్‌లో ఉన్న భారీ సంఖ్యలో చలాన్లను వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలలో గుర్తించారు. ఏపి 28ఎస్ 6114 నంబర్ గల ద్విచక్రవాహనంపై మొత్తం 107 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి జరిమానా మొత్తం రూ. 24,645 ఉందని.. ఈ వాహనాన్ని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. చలాన్లు ఉన్న వాహనం యజమాని నగరంలోని చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన అజహర్‌గా గుర్తించామని వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ వెల్లడించారు.


