కైకలూరు: చలికాలం వచ్చిందంటే చాలు.. జీవవైవిధ్య కేంద్రమైన కొల్లేరు సరస్సు విదేశీ, స్వదేశీ పక్షుల రెక్కల చప్పుళ్లతో కళకళలాడుతోంది.
ఎటువంటి రాడార్ వ్యవస్థతో సంబంధం లేకుండా వేలాది కిలోమీటర్లు ప్రయాణించి అరుదైన వలస పక్షులు కొల్లేరుకు చేరుతాయి.
ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ప్రపంచంలోనే అత్యధిక రికార్డులు కలిగిన పక్షులు సైతం కొల్లేరు విడిదికి వచ్చేశాయి.
ఏలూరు జిల్లా పరిధిలో కొల్లేరు సరస్సులో విహరిస్తున్నా పక్షులు రారమ్మని పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి.
రష్యా, సైబీరియా, మధ్య ఆసియా, ఉత్తర యూరప్, నైజీరియా, ఆ్రస్టేలియా తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగినప్పుడు ఆహారం, ఆవాసం కోసం పక్షుల దక్షణ దిశగా ప్రయాణిస్తాయి.


