నాలుగంతస్తుల భవనం పైనుంచి దూకిన మహిళ | Woman jumps from five storey building stirs up a commotion in Nirmal! | Sakshi
Sakshi News home page

నాలుగంతస్తుల భవనం పైనుంచి దూకిన మహిళ

Nov 19 2026 8:48 AM | Updated on Nov 19 2026 8:50 AM

Woman jumps from five storey building stirs up a commotion in Nirmal!

నిర్మల్‌టౌన్‌: ‘అమ్మా.. అమ్మా.. కిందికి దిగిరా..’ అంటూ ఆ చిన్నారులు ఎంతగా వేడుకున్నా ఆమె మనసు కరగలేదు. చుట్టూ ఉన్నవారు నచ్చజెప్పినా, పోలీసులు ధైర్యం చెప్పినా వెనక్కి తగ్గలేదు. చివరకు నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకింది. ఈ విషాద ఘటన బుధవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన సంగీత(30)కు ఎనిమిదేళ్ల క్రితం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన రవితో వివాహమెంది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. 

కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగినట్లు సమాచారం. భర్తతో గొడవల విషయమై ఆమె తన తల్లికి చెప్పడంతో కరీంనగర్‌ నుంచి వచ్చింది. ఈ క్రమంలో కుటుంబ సమస్యల పరిష్కారానికి తల్లితో కలిసి సఖి కేంద్రానికి వెళ్లారు. అక్కడ కౌన్సెలింగ్‌ అనంతరం బయటకు వచ్చి మరోసారి గొడవ జరగడంతో సంగీత తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. అనంతరం శివాజీ చౌక్‌లోని షాపింగ్‌ మాల్‌ పక్కన నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనంపైకి ఎక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చినా ఆమె కిందికి దిగేందుకు అంగీకరించలేదు. 

పక్కనే పనిచేస్తున్న కొందరు వ్యక్తులు భవనంపైకి చేరుకుని ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా సంగీత ఒక్కసారిగా భవనం పైనుంచి దూకింది. రెండు కాళ్ల ఎముకలు విరగడంతోపాటు తలకు బలమైన గాయంకావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సమ్మయ్య పేర్కొన్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement