వెంటనే రావాలి.. లేదంటే ప్రాణాలు తీసుకుంటా! | Young Woman Ends Life In Love Incident at visakhapatnam | Sakshi
Sakshi News home page

వెంటనే రావాలి.. లేదంటే ప్రాణాలు తీసుకుంటా!

Nov 18 2026 9:38 AM | Updated on Nov 18 2026 9:44 AM

Young Woman Ends Life In Love Incident at visakhapatnam

విశాఖపట్నం: సహజీవనంలో ఉంటూ యువకుడు పెళ్లిని వాయిదా వేస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దోనుబాయి గ్రామానికి చెందిన సవర త్రివేణి(26) బ్యూటీషియన్‌గా పనిచేస్తూ కొమ్మాది టీచర్స్‌ లేఔట్‌లోని టీజీఆర్‌ టవర్స్‌ ఫ్లాట్‌ నంబర్‌ 102లో ఆరు మాసాలుగా నివసిస్తోంది. 

తల్లిదండ్రులు గతంలోనే మరణించారు. ఆమె రమేష్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, రమేష్‌ పెళ్లి విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వారం రోజుల క్రితం రమేష్‌ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లడంతో, అప్పటినుంచి ఆమె ఫ్లాట్‌లో ఒంటరిగానే ఉంటోంది. 

ఇరువురి మధ్య వాట్సాప్‌ చాట్‌లో వాదనలు జరిగాయి. వెంటనే బయల్దేరి రాకపోతే చచ్చిపోతానంటూ త్రివేణి బెదిరించింది. అయినా రమేష్‌ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన త్రివేణి, సోమవారం అర్ధరాత్రి తన గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి సోదరుడు వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement