కోస్తాలోని ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆక్వాన్ తుపాను’ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ఏడు జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా వేసింది. కాకినాడ–యానాం, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురు, శుక్ర వారాల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నెమ్మదిగా కదులుతున్న తుపాను
గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతున్న తుపాను
మచిలీపట్నానికి, విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు
చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం
తుపాను ప్రభావంతో కోస్తాలోని ఏడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
ఆక్వాన్ తుపానుపై వాతావరణ శాఖ హెచ్చరిక
గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
20న నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం
భారీ వర్షాలు కురిసే జిల్లాలివే ..
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో..
గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
అల్లూరి, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలను ఎల్లో నుంచి ఆరెంజ్ జాబితాలోకి చేర్చింది


