హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. భార్యను కడతేర్చి, చిన్నారిని.. | Hyderabad Old City Wife Murder Case In Telangana | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. భార్యను కడతేర్చి, చిన్నారిని..

Nov 18 2026 4:54 AM | Updated on Nov 18 2026 4:54 AM

Hyderabad Old City Wife Murder Case In Telangana

కట్టుకున్న భార్యను కడతేర్చి, కన్నబిడ్డకు తల్లి ప్రేమను దూరం చేసి, మూడేళ్ల చిన్నారిని తీసుకుని భర్త పరారైన విషాద ఘటన హైదరాబాద్‌ పాతబస్తీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హసన్‌నగర్‌లో అస్మా బేగం (30)ను ఆమె భర్త ధర్మేందర్‌ గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడికక‍్కడే ప్రాణాలను వదిలింది. అయితే, 15 ఏళ్ల క్రితం బీహార్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ ప్రేమజంట నగరంలోనే స్థిరపడింది. ఈ క్రమంలో, ఏమైందో తెలియదు కానీ భార్యను హత్య చేసిన భర్త ధర్మేందర్‌.. మూడేళ్ల కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టడంతోపాటు పరారీలో ఉన్న నిందితుడికై గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు, తండ్రి వెంట ఉన్న చిన్నారిని సురక్షితంగా గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే, హత్యకు గల మిగతా కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: గూఢచర్యం ఆరోపణలు.. అమెరికా సైనిక అధికారి అరెస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement