సాక్షి, మంచిర్యాల: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే.. బాధ్యతలను విస్మరించి మద్యం మత్తులో చిందులేస్తే అంతకన్నా శోచనీయం ఇంకేముంటుంది? విధుల్లో ఉన్నట్లు పోలీస్ స్టేషన్ రికార్డుల్లో నమోదు చేసుకుని.. ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో మద్యం మత్తులో హల్‌చల్ చేసిన బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ ఘటనపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘనతో పాటు పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడంపై సీరియస్ అయ్యారు. దీంతో ఐదుగురు పోలీసు సిబ్బందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం!


