సాక్షి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ పరిసరాల్లో ఎలుగుబంటి రోడ్డు మీదకు రావడంతో విద్యార్థులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. ఎలుగుబంటి సంచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇటీవల శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అడవిని ధ్వంసం చేయడమే ఈ పరిస్థితికి కారణమంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఎలుగుబంటి జనావాసాల వైపు వస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఎలుగుబంటి సంచారంపై చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: ఇందిరమ్మ బీమాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన...


