తెలంగాణపై సోనియా గాంధీకి ప్రేమ లేదు: కేటీఆర్ | KTR Comments On Congress Party And Sonia Gandhi | Sakshi
Sakshi News home page

తెలంగాణపై సోనియా గాంధీకి ప్రేమ లేదు: కేటీఆర్

Nov 17 2026 4:48 PM | Updated on Nov 17 2026 4:53 PM

KTR Comments On Congress Party And Sonia Gandhi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. డిసెంబర్‌ 7 నాటికి మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిపోతోందని, ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపించారు. అవినీతి, బంధుప్రీతి, నేరాల్లో మాత్రం తెలంగాణ రైజింగ్‌ అవుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మూడేళ్లలో వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోయిందని, బిల్డర్లను బెదిరిస్తూ కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ నడుస్తోందని విమర్శించారు.

కరువు పరిస్థితుల్లో కొడంగల్‌కు రూ.9 వేల కోట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. కృష్ణా నదిలో 250 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ పాలమూరుకు నీళ్లు ఎందుకు అందించడం లేదని నిలదీశారు. కరువు సమయంలో మూసీ సుందరీకరణ అవసరమా? అని ప్రశ్నించారు. రైతులకు కరువు సాయం అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంత లబ్ధి చేకూర్చారో ప్రభుత్వం వెల్లడించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రైతుల సంక్షేమం కంటే కమిషన్లపైనే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆసక్తి ఉందని విమర్శించారు.

సోనియాగాంధీ పుస్తకంపై స్పంధించిన కేటీఆర్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నేతపై కూడా కేటీఆర్‌ మండిపడ్డారు. సోనియాగాంధీ తన జీవిత విశేషాలతో రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే జ్ఞాపకాల పుస్తకంపై స్పంధిస్తూ..  "సోనియాగాంధీకి తెలంగాణపై నిజమైన ప్రేమ లేదని, సోనియమ్మ ఆత్మలో తెలంగాణ ఉంటే, ఆత్మకథ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదు? సోనియాగాంధీ ఆత్మలో, గుండెలో తెలంగాణలో లేదు. తెలంగాణపై సోనియాగాంధీకి అసలు ఏ మాత్రం ప్రేమ లేదు" అని కేటీఆర్‌ అన్నారు.

ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గూండాగిరి..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement