టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గూండాగిరి.. మాజీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం | TDP MLA Kavya Krishna Reddy creates a stir at Nellore | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గూండాగిరి.. మాజీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం

Nov 17 2026 3:28 PM | Updated on Nov 17 2026 3:43 PM

TDP MLA Kavya Krishna Reddy creates a stir at Nellore

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్వో కార్యాలయంలోకి వెళ్లడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కావలి ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై దాడికి యత్నించినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలోనే ఆమె అనుచరులు దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు. నామినేషన్ల పరిశీలనలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరిస్తున్నారని విమర్శించారు.

సమస్యను ఓపికగా పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతో అనుచరులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక అధికార పార్టీ అండతో సాగుతున్న రౌడీయిజమా? అంటూ ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కావలి మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి: కోచ్‌లు లేకుండా పతకాలు ఎలా సాధిస్తాం?.. శాట్ కోచ్‌ల మెరుపు ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement