మోదీ తల్లికి ఆలయం | Temple to be built for PM Modi’s mother in Andhra's Gudikal village | Sakshi
Sakshi News home page

మోదీ తల్లికి ఆలయం

Nov 17 2026 12:51 PM | Updated on Nov 17 2026 12:51 PM

Temple to be built for PM Modi’s mother in Andhra's Gudikal village

ఎమ్మిగనూరు(కర్నూలు ): భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి దివంగత హీరాబెన్‌ మోదీ పేరిట ఆలయ నిర్మాణానికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌ గ్రామంలో జరిగిన భూమి పూజ కార్యక్రమం అనేక అంతుచిక్కని ప్రశ్నలకు తావిస్తోంది. ఆ భూమికి సంబంధించి వివాదం ఉందని, వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని స్థానికంగా కొందరు చర్చించుకుంటున్నారు. అయితే తాము న్యాయస్థానంలోనే విజయం సాధించామని, అందుకే అక్కడ ఆలయ నిర్మాణం చేపడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నట్టు సమాచారం. 

కార్యక్రమానికి కూటమిలో భాగస్వామి అయిన ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి ఆహ్వానం అందింది. కానీ స్థానిక ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి అందకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. మాతా శ్రీ మందిరం చారిటబుల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతున్నట్ల చెబుతున్నా అసలు నిర్వాహకులు ఎవరు? నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి? ట్రస్టుకు, రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలేమిటి? అనే అంశాలపై చర్చ   కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement