సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. సొంత పార్టీ మద్దతుదారులనూ కూడా రాంప్రసాద్‌రెడ్డి అనుచరులు వదలలేదు. తమ అనుమతి లేకుండా నామినేషన్ వేయడానికి వచ్చిన టీడీపీ సానుభూతిపరుడిపైనే దాడి చేశారు. సంబేపల్లి మండలం ప్రకాష్‌నగర్ కాలనీలో ఘటన జరిగింది సర్పంచ్ చేస్తామని ఆశజూపి.. తీరా నామినేషన్ పత్రాలను మంత్రి అనుచరులు చించేశారు.
పరిటాల సునీత వర్గీయుల దాష్టీకం
శ్రీసత్యసాయి జిల్లా: రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు దాష్టీకం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ బలపరిచిన నసనకోట సర్పంచ్ అభ్యర్థిపై దౌర్జన్యం చేశారు. నసనకోట పంచాయతీ ఏకగ్రీవం చేసుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరలేపింది. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ పత్రాలను పరిటాల వర్గీయులు చించేశారు. పరిటాల వర్గీయుల గూండాగిరి దారుణం అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఓటమి భయంతోనే నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: జనసేన నేతల వసూళ్ల కేసులో మరో ట్విస్ట్


